Tuesday, March 5, 2019

శ్రీకృష్ణ మంత్రసాధన

శ్రీకృష్ణ మంత్రసాధన సప్తాహం
కృష్ణాష్టమి మొదలు అమావాస్య వరకు 7 రోజులు మంత్రసాధనకు ఎంతో ముఖ్యమైనవి అని చెప్పవచ్చు. 

ఈ మంత్రసాధనకు ముందు ఒక్కసారి శ్రీకృష్ణుడు చేసిన ముఖ్యమైన లీలలు (మహిమలు) కొన్ని పరిశీలన చూద్దాం.
పసిబాలుడుగా ఉన్నప్పుడే  పూతన, శకటాసురుడు, తృనావర్తుడు మొదలైన వారిని, కొంచెం పెద్ద అయ్యాకా కంసుడు మొదలైనవారిని, కాళీయ మర్దనం , గోవర్ధన పర్వతం ఎత్తడం, గురుపుత్రుడిని తీసుకురావడం, తరువాత పౌండ్రకవాసుదేవుడు, శిశుపాలుడు, కాలయవనుడు మొదలైన వారిని సంహరించడం , తరువాత  ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో,  పాండవులు అరణ్యవాసంలో అనేకసార్లు, తరువాత కురుక్షేత్ర యద్ధంలో యద్ధం పూర్తి అయ్యాక అభిమన్య కుమారుడు అయిన పరీక్షిత్తుని ప్రాణాన్ని కాపాడడం, యద్ధం పూర్తి అయ్యాక ధ్రుతరాష్ట్ర కౌగలి నుంచి భీముని కాపాడడం వరకు  ఆయన లీలలు అనేకం.
వీటిలో కొన్నిటిని తీసుకుని వాటిని మంత్రశాస్త్ర పరంగా అనుసంధానం చేసి మంత్రసాధన చేసి మనకు ఉన్న ఇబ్బందులు తొలిగించుకోవచ్చు.  మనం ముందే అనుకున్నట్టు శ్రీకృష్ణుడు జగద్గురువు.  గురువు అనగా అంధకారం తొలిగించేవాడు.  భౌతిక జీవితంలో మన మనసుకు కమ్మిన మాయవల్ల సమస్యాపరిష్కార శక్తి కోల్పోయినప్పుడు  గురురూపంలో ఆ మాయను తొలిగిస్తాడు.(అర్జునునికి భగవద్గీత చెప్పి కరవ్య బోధ చేసినట్టు).

అయితే కృష్ణ మంత్రం ఎలా సాధన చెయ్యాలో కొంచెం వివరంగా చూద్దాం.
ఏదైనా మంత్రం జపం చేస్తున్నప్పుడు  ముందుగా ధ్యాన శ్లోకం చెబుతాం.  ఆ ధ్యాన శ్లోకంలో దేవత యొక్క రూపం
దేవతాతత్త్వం, ఆ దేవత ఆయుధ విన్యాసం ఉంటాయి.
మానవుడు పూర్వజన్మ కర్మలవల్ల ఈ జన్మల్లో కర్మలు అనుభవిస్తారు అని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.  వీటివల్ల మానవులకు  చిన్నతనంలో  ఆరోగ్యం, చదువు, తరువాత వివాహం, సంతానం, ఇల్లు, వాహనం, వృద్ధులైన తల్లితండ్రులు,  తరువాత జాతకుని అతని భార్య కు ఆరోగ్యం ఇలా సమస్యలు ఉంటాయి.

శ్రీకృష్ణ మంత్రం అనుష్టానం ఎలా చెయ్యాలో చూద్దాం.
1. జాతకంలో కాల సర్పదోషం వల్ల ఇబ్బందులు ఉన్నప్పుడు  కాళీయుని మర్ధించే కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.

2. తీవ్రమైన ఆపదలు వచ్చినప్పుడు గోవర్ధనగిరి ఎత్తిపెట్టిన కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.
3. శత్రువువల్ల బాధలు పడుతున్నప్పుడు చక్రహస్తుడైన కృష్ణరూపంలో ధ్యానం చెయ్యాలి.
4. పరువు మర్యాదలకు భంగం వచ్చినప్పుడు ద్రౌపది రక్షకుడి రూపంలో ధ్యానం చెయ్యాలి.
5. సమస్యాపరిష్కార శక్తి లోపించినప్పుడు శంఖ నాదం చేసున్న కృష్ణుడిని లేదా భగవద్గీత భోదించే కృష్ణ రూపంలో ధ్యానం చెయ్యాలి.
6. అనారోగ్యం లేదా అపమృత్యు బాధలు కలిగినప్పుడు పరీక్షిత్ ను రక్షించిన కృష్ణుని ధ్యానం చెయ్యాలి.
7. గరుడ వాహనుడైన కృష్ణుని ధ్యానం చెయ్యడం మూలంగా ఆరోగ్యం బాగుంటుంది.
8. కుటుంబంలో అశాంతి కలిగినప్పుడు, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు రాధా సహితుడైన కృష్ణుని ఉపాసన చెయ్యాలి.
9. సంతానం కోసం సంతానగోపాలుడిని ఉపాసన చెయ్యాలి.
10. సకల కార్య సిధ్ధి కోసం శంఖ- చక్రాలు ధరించిన కృష్ణుని పూజించాలి.
ఇలా అనేక రూపాల్లో మంత్రాలతో శ్రీకృష్ణుడిని పూజ చేసి మన కోర్కెలు తీర్చుకోవచ్చు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS