Saturday, April 27, 2019

పద్మనాభం

పద్మనాభం

     సింహాచలం నకు ఈశాన్యంగా సుమారు 30 కీ.మీ దూరాన పద్మనాభం అను గ్రామం కలదు.  స్ధానికులు రేవడి పద్మనాభం గా పిలుస్తారు.  గ్రామం నందలి ఎత్తైన కొండ పైన శ్రీ అనంత పద్మనాభుడు స్వయంభూవుగా వెలిసియున్నాడు.  మూలవిరాట్టు అవ్యక్తం గా ఉంటాడు. కొండ రాతి పైన లీలగా మాత్రమే దర్శనమిస్తాడు.  ఆదిశేషుని పైన స్వామి శంఖు, చక్రధారియై లక్ష్మీ సమేతంగా కొలువైయ్యాడు.  స్వామి వారికి నిత్య అర్చనలు, నైవేద్యం సేవలు జరుగుతాయి.  ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణం నిర్వహించుతారు.  భాద్రపద శుద్ధ చతుర్ధశి నాడు శ్రీ అనంత జయంతి ఉత్సవం జరుగుతుంది.  కార్తీక అమావాస్య రాత్రి సందర్భముగా కొండ మెట్లుకు దీపోత్సవం వైభవంగా జరుపుతారు.  నాటి  జ్యోతుల వెలుగు చాల దూరం వరకు కనిపిస్తాయి.  కొండ పైకి చేరుటకు సుమారు 1278 మెట్లును అధిరోహించాలి.  మార్గ మధ్యలో విశ్రాంతి పందిళ్ళున్నాయి. కొండపై నుంచి చుట్టుపక్కల పచ్చని ప్రకృతి సౌందర్యం చూడగలం.  కొండ క్రింద, మెట్లుకు సమీపంలో గల
శ్రీ నారాయణేశ్వరాలయం (శివాలయం) దర్శనీయం.
శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖ ద్వారం నకు కొంత దూరాన (సింహాచలం వైపు), కొండకు దిగువ భాగంలో శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం కలదు. ఇది కూడ ప్రాచీనమైనది.
     శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం నందు ద్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం కలవు.  గర్భాలయం నందు శ్రీ దేవి సమేతంగా శ్రీ కుంతీ మాధవస్వామి కొలువైనాడు.  అంతరాళయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ రుక్మీణి సత్యభామల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సీతా సమేతంగా శ్రీ రామచంద్రుడు ఉత్సవ మూర్తులు కలరు.  ముఖ మండపం నందు శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక సన్నిధి ఉంది.  భోగి రోజున గోదాదేవి కళ్యాణం వైభవంగా జరుపుతారు.  నాగుల చవితి సందర్భముగా పద్మనాభం లో జాతరోత్సవాలు జరుగుతాయి.
     కొండ దిగువన గల శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయానికి సంబంధించి ఓ స్థలపురాణం ఉంది. కుంతీ దేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామికి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, అనంతరం కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించు కుంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం.
పద్మనాభ యుద్ధం: 
    
     పద్మనాభం చారిత్రాత్మకంగా ఖ్యాతి పొందినది. బ్రిటిష్ నిరంకుశ ధోరణులు సహించలేక  విజయనగరం (ఉత్తరాంధ్ర) సంస్ధానాదీశుల రెండో విజయరామ గజపతి రాజు యుద్ధం  సన్నాహాలు ప్రారభించాడు.  బ్రిటిష్ పాలకులు విజయనగరం కోటను ముట్టడించగా,  రాజ కుటుంబం గుట్టుగా సింహాచలం చేరుకున్నారు. పిమ్మట యుద్ధ సైన్యాని సేకరించని  విజయరామ గజపతి రాజు,  1874 జూలై  9వ తేది రాత్రి సమయంలో యుద్ధ కార్యాచరణ ప్రణాలికను  శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంలో తయారు చేశాడు. ఒక రాజద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ సైన్యం పద్మనాభం  చేరుకుంది.  10వ తేది తెల్లవార జామున శ్రీ పద్మనాభస్వామి  ఆలయ సాక్షిగా బ్రిటిష్ సైన్యంతో జరిగిన యుద్ధంలో విజయరామ గజపతి రాజు మృతి చెందాడు.
     సింహాచలం RTC బస్ స్టాండ్ నుంచి విజయనగరం నకు బస్సులు (వయా) శొంఠ్యాం, పద్మనాభం, జామి  మీదగా ప్రతి 40 నిముషాలుకు బయలు దేరుతాయి.  ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు ఆలయం వద్ద ఆగుతాయి.  విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నకు పోవు జాతీయ రహదారి (NH - 16) నందు తగరపువలస అను చిరు పట్నం ఉంది.  విశాఖపట్నం నుంచి బస్సలు, సిట్టి బస్సలు, షేరింగ్ ఆటోలు/వేన్లు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 30 కీ.మీ గా ఉంటుంది.  తగరపువలస నుంచి పద్మనాభం నకు (వయా) రేవడి మీదగా Private బస్సలు & షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 15 కీ.మీ గా ఉంటుంది. విజయనగరం నుంచి పద్మనాభం నకు (వయా) జామి మీదగా బస్సలు & షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 16 కీ.మీ గా ఉంటుంది.  యాత్రికులుకు వసతులు విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం లో దొరుకుతాయి.
                                          కె. కె. మంగపతి
                                          Yatra - Telugu

జ్యోతిషం ---- విష్ణుఅవతారము .

జ్యోతిషం ---- విష్ణుఅవతారము .
విష్ణుమూర్తి అవతారములు- గ్రహములు, గుణములు.
విశ్వంలో జీవాంశ  మరియు పరమాత్మ అంశ  అని రెండు ముఖ్యసారాంశాలు కలగలసి ఉంటాయి. మామూలు మానవుని దృష్టికి కనిపించేదంతా జీవాంశ అవుతే కంటికి కనబడని ఖచ్చితమైన పరమ శ్రేష్టమైనది పరమాత్మఅంశ. ఈ రెండింటి సారాంశాన్ని మనకు గ్రహములు స్పష్టంగా తేటతెల్లంగా అందిస్తూ ఉంటాయి..
నవగ్రహాలని అనుసంధానిస్తూ విష్ణుమూర్తి అవతారాలు మనకి అందుబాటులో ఉండి ఈ అతి ముఖ్యమైన విషయాలను అర్థం చేసుకోవడానికి సహకరిస్తున్నాయి.
కేతు గ్రహానికి సంబంధించి వివరణను మీన లేదా మత్స్య అవతారం సూచిస్తుంది .
శని గ్రహానికి సంబంధించిన ఓర్పు ను, ఒరిమిని సూచించేది కానీ, నెమ్మదిగా అయినా ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేది అయినా శని గ్రహమునకు సంబంధించిన గుణాలను చూపించే అవతారం కూర్మావతారం.
రాహు గుణాలు సూచించే అవతారం వరాహ అవతారం.
కుజుని ప్రభావాన్ని చూపించే అవతారం నృసింహ అవతారం.
జ్ఞానము కలిగిన వామనమూర్తి గురుని అవతారమే.
అసుర గురువు శుక్రాచార్యులు పరశురాముని గుణములు కలిగిన వారే.
రామో విగ్రహాన్ ధర్మః అని  మనం కొలిచే, నడిచే దేవుడు సూర్యుని అవతారం.
అందరినీ చల్లగా ఆకర్షించి మనోవికాసాన్ని బోధించిన కృష్ణుడు చంద్ర స్వరూపుడే.
తెలివి తేటలు కలిగిన బుధుడు బౌద్ధ స్వరూపమే అని పెద్ద వాళ్ళ నమ్మకం.
పరమాత్మ తన అంశను మన జీవాంశ తో అనుసంధానం చేసి వెలసిన ఈ అవతారాలన్నీ కూడా మనకు ఆదర్శమైన పాత్రలే.
ఎక్కువగా పరమాత్మ అంశ కలిగినవి రాముడు ,కృష్ణుడు, నరసింహుడు మరియు వరాహ అవతారములు.
మిగిలిన అవతారములు ఎక్కువగా జీవాంశ  శాతం  కలిగి పరమాత్మ అంశ ప్రభావం శాతం తక్కువగా ఉన్న గ్రహము ల నుండి ఏర్పడినవే.
మానవుని జీవితంలో జరిగే పరిస్థితులను ప్రభావితం చేస్తూ  రాశులు ఉంటాయి. ఈ 12 రాసులలో ఉండే నవగ్రహాలు మనిషి జీవితాన్ని తమ అదుపులోకి తీసుకు ప్రయత్నిస్తుంటాయి. కనుకనే ఈ రాశి చక్రాన్ని విష్ణుమూర్తి తోటి పోలుస్తారు కాలపురుష చక్రం గా పిలుస్తారు . రాశులు విష్ణుమూర్తి అవయవాలనీ, గ్రహములను విష్ణుమూర్తి అవతారాలు అని అంటారు.
ఆత్మని నియంత్రించేది సూర్యుడు అవుతే, మనసును తన అదుపులో పెట్టుకునేది చంద్రుడు. కుజుని నియంత్రణలో శక్తి ఉంటుంది వాక్కు బుద్ధుని ఆధిపత్యంలో ఉంటుంది. జ్ఞానము సంతోషమునకు కారణము గురుడు అవుతే, శుక్రుడు ఇతరులను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాడు . శని బాధలన్నిటినీ  నియంత్రిస్తూ ఉంటాడు.
రవి చంద్రులను  రాజులతో పోల్చారు.
రాజకుమారుడు లేదా యువరాజు బుధుడు అవుతే, గురుడు మరియు శుక్రుడు మంత్రులుగా  ఉంటారు.
కుజుడు సైన్యాధిపతి అవుతే రాహుకేతువులు సేనలు తయారు చేసే వారు అవుతారు. శని సేవకుడిలా గా పనిచేస్తాడు.
విద్యలకు అధిపతులుగా జ్ఞానము కలిగిన వారుగా బ్రాహ్మణులుగా గురుశుక్రులు గౌరవించబడతారు. పోరాట యోధులైన క్షత్రియులుగా రవి కుజులు గుర్తించబడ్డారు.
ఎదుటివారి మనసును గెలిచి తెలివితేటలు కలిగిన వర్తక వ్యాపారస్తులైన వైశ్యులుగా చంద్ర బుధులు, పనిచేసే కార్మికుడు , కర్మాధిపతి శూద్రునిగా శని పిలవబడతారు.
జ్ఞాన సముపార్జనే ధ్యేయం జ్ఞానం కలిగిన తరగతికి, ధైర్యమే ధ్యేయముగా పోరాటయోధులకు, ఇతరుల మనోభావాలు తెలుసుకొనడం, వారి సంక్షేమాన్ని ఆశించడం వ్యాపారస్తులకు, కష్టపడి పనిచేయడం కార్మికులకు కావలసిన ముఖ్యమైన విషయములు మరియు గుణములు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కుల వ్యవస్థ లేదు ఈ విధముగా వర్ణములు ఒక వ్యక్తి గుణములను నిర్ణయిస్తూ ఉంటాయి దీనిని తప్పుగా అర్థం చేసుకో కూడదు. ఈ విధమైన వర్ణ భేదము ప్రతి కుటుంబంలోనూ ఉంటుంది. అనుభవజ్ఞులైన తల్లిదండ్రులను రాజు , మంత్రులతో పోల్చి, సంపాదన పరులైన వారిని వైశ్యుల తో పోల్చి, ఇంటిపనిని చక్క పెట్టేవారని కార్మికులతో పోల్చడమే వర్ణ వ్యవస్థ గా చెప్పు కొనగలము.
చంద్రుని రాజు మరియు వైశ్యుని లాగా కూడా గుర్తిస్తూ ఉంటారు .అలాగే సూర్యుని కూడా రాజు  మరియు పోరాట యోధుడైన క్షత్రియుని లా కూడా గుర్తించారు. తన రక్షించుకునే వాడు, ఇతరులను రక్షించే ధైర్యవంతుడైన రాజుగా సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు. అందరినీ అనుసంధానం చేసుకుంటూ కలుపుకుపోయే రాజు లా చంద్రుడు ఉంటాడు.
రవి చంద్ర గురులు సాత్విక గుణాలు కలిగిన గ్రహములు. శుక్ర,బుధులు రాజసిక గుణములు కలిగిన గ్రహములు. కుజ శనులు తామసిక ప్రవృత్తి కలిగిన గ్రహములు.
సాత్విక గుణము అనగా ఎవరినీ నొప్పించని వారు అనే ఒక అపోహ ఉంది. అలాగే అవసరం లేకపోయినా అందరినీ మూర్ఖంగా ఎదిరించే వాడు అని రాజస ప్రవృత్తికి అర్థం చేసుకుంటున్నారు. నిజానికి సత్వము అనగా నిజాయితీగా ఉండటం అని చెప్తారు అంతేకాని ఎదుటి వారిని మెప్పించడం కోసం లేని మంచితనాన్ని చూపించడం సత్వగుణం కాబోదు అదేవిధంగా ఎదుటి వారి తప్పులు ఎత్తి చూపి శిక్షించడం రజోగుణం కాదు శక్తివంతంగా ఎదుటివారిని ఎదుర్కోవడమే రజోగుణ ముఖ్యోద్దేశము.
ఎదుటివారిలో మంచిని కోరుతూ ఎదుటివారిని మంచి దారి మళ్ళించడం చిన్న శిక్ష ద్వారా వారిలో పరివర్తన తీసుకురావడం సాత్విక గుణం కింద చెప్పబడుతుంది గాని రజోగుణము కాదు. శ్రీరాముడు మరియు సూర్యుడు , వీరిని ఈ విధమైన సత్వగుణానికి ఉదాహరణగా చెప్పు కొనగలము.
సూర్యుడు పోరాట యోధుడైన రాజు కింద గుర్తించబడినప్పటికీ సాత్విక గుణములు కలిగినవాడు అలాగే శ్రీరాముడు పరమాత్మ అంశతో జన్మించి, రావణుని వధించినా కూడా ,స్వచ్ఛమైన మనసు కలిగి, ఆలోచనలకి ఎదుటి వారికి ఉపయోగపడే లాగా ,ఆనందాన్ని ఇచ్చే లాగా ఉంటారు గనుక సత్వగుణానికి చెందిన ధర్మమూర్తి అయ్యారు .
రజోగుణము కొంత కోరికతో కూడినశక్తిని కలిగి పోరాట పటిమ కలిగి ఉంటుంది. ఆలోచనలన్నీ సంకుచితంగా చేసే పనులన్నీ ఎదుటివారినీ బాధపెట్టే లాగా ఉండే గుణమే తామస గుణం.
ఈ విధంగా సత్వ రజో తమో గుణములు గ్రహముల వర్ణబేధము అనుసరించి, రాశుల భావములను ప్రకారం నిర్ణయించబడి నక్షత్రాలతో జత కూడి జాతకుని మీద ప్రభావం చూపిస్తాయి..

*"పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు"*

*"పుత్రులు ఏడు రకాలుగా జన్మిస్తారు"*
1) పూర్వ జన్మలో తన సొమ్మును దాచమని ఒక వ్యక్తికి ఇచ్చి, అది తీసుకోకుండానే మరణించినవాడు, తాను దాచిన సొమ్ము తీసుకోవడానికి ఆ ఇంట్లో పుత్రుడుగా జన్మిస్తాడు.
2) తాను పూర్వ జన్మయందు బాకీపడిన అప్పును (ఋణాన్ని) చెల్లించుటకు పుత్రుడుగా జన్మిస్తాడు.
3) పూర్వ జన్మలోని శత్రుత్వం తీర్చుకోవడానికి ఈ జన్మలో పుత్రునిగా జన్మిస్తాడు.
4) పూర్వ జన్మలో తనకు ఒకడు అపకారం చేసాడు. దానికి ప్రతీకారం తీర్చుకోలేదు. ఈ జన్మలో ప్రతీకారం తీర్చుకోవడానికి అపకారం చేసినవాడికి పుత్రునిగా జన్మిస్తాడు.
5) పూర్వ జన్మలో తాను అనుభవించిన సేవ - సుఖములకు బదులు తీర్చడానికి పుత్రునిగా జన్మించి తల్లిదండ్రులకు సేవ చేస్తాడు.
6) పూర్వ జన్మలో తాను ఏ వ్యక్తి నుండి ఉపకారం పొందుతాడో, ఆ ఉపకారానికి బదులుగా ఉపకారం చేయుటకు పుత్రునిగా జన్మిస్తాడు.
7) ఏమీ ఆపేక్షించనివాడు కూడా పుత్రునిగా జన్మించి, తన విధులను తీరుస్తాడు.
ఇలా పుత్రులుగా జన్మించినవారు కర్మానుసారముగా తమ పనులు పూర్తికాగానే మరణిస్తారు, లేదా దీర్ఘకాలం జీవించి ఉపకారం చేయడమో, ప్రతీకారం తీర్చుకోవడమో చేస్తారు. కేవలం పుత్రులే కాదు, భార్య - భర్త - సోదరుడు - పనిమనిషి - ఆవు - కుక్క మొదలైన పశువులు కూడా కర్మరుణం తీర్చుకోవడానికి మనతో ఉంటారు. ఋణము తీరగానే వదిలి వెళ్ళడమో, పరలోకానికి చేరడమో జరుగుతుంది.


సర్ప{నాగ} దోషం

సర్ప{నాగ} దోషం
  
జన్మ జాతకమునందు కాల సర్పదోషం ఉన్నటువంటి వారు.., పూర్వజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపినవారు.., లేదా వివిధ మంత్ర ఔషదులతో సర్పముల బందించినవారు.., పుట్టలను త్రవ్వినవారు.. పుట్టలను తొలగించి వాటిపై గృహాలు కట్టినివసించేవారు.., జన్మ జాతకమందు రాహు కేతువుల మద్య గ్రహాలు ఉన్న ,పంచమంలో రాహువు ఉన్న నాగదోషం అంటారు. "కాల సర్పదోషం"(నాగదోషం) కలవారై ఉంటారు.

ఈ దోషం కలవారు వివాహం .., సంతానం.., కుటుంభం.., అభివృద్ధి ..,ఆరోగ్య.., విషయాల్లో అత్యధిక ప్రభావం చూపి భాదించును.
జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది.  జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని 1, 2, 5, 7, 8 స్ధానాలలో ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకుండా అశుభ స్ధానాలలో ఉన్న నాగదోషం (సర్పదోషం) అంటారు. 
జాతకచక్రంలో రాహువు గాని కేతువు గాని లగ్నంలో గాని ద్వితీయంలో గాని ఉన్న ఉండి శుభగ్రహ దృష్టి లేకున్న ఆలస్య వివాహాలు, ఎప్పుడు ఏదో విధమైన వైరాగ్యం, మోసపోవటం, ఇతరుల ప్రలోభాలకు లొంగిపోవటం, కుటుంబంలో కలతలు, మంచిగా చెప్పిన తప్పుగా అర్ధం చేసుకోవటం, భార్య భర్తల మధ్య తగాదాలు, విడిపోవటం కూడా జరుగుతాయి.
జాతకచక్రంలో పంచమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న సంతానం ఆలస్యం కావటం, సంతానం లేకపోవటం, అబార్షన్స్ కావటం జరుగుతుంది. పంచమంలో రాహువు ఉంటే నాగ దోషం ఉంటుంది. దీని నివారణకు నిత్య పూజలు జరిగే ఆలయంలో నాగ దేవతా ప్రతిష్టాపన చేస్తే దోష నివారణ కలుగుతుంది. వ్యామోహాలకు లొంగిపోతారు. ప్రేమలో మోసపోతారు. 
  
జాతకచక్రంలో సప్తమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న బార్యా భర్తల మధ్య అనవసరమైన అపోహలు, కుటుంబంలో కలతలు, అనారోగ్యాలు, భార్యా భర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుంటాయి.

జాతకచక్రంలో అష్టమ స్ధానంలో రాహువు గాని కేతువు గాని ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేకున్న అనారోగ్య సమస్యలు, తిండి సరిగా తినకపోవటం, దురుసుగా మాట్లాడ్తం, పాము కలలు రావటం జరుగుతుంది.   
"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః 
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్ సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"

నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి.సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.
నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు, శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు. 
అయితే పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుందని పురోహితులు అంటున్నారు.

దోష ప్రభావాన్ని బట్టి మాత్రమే పరిష్కారం చేస్కోవలసి ఉంటుంది..
*నాగ దోషం తీవ్రమైనది అయినట్లయితే ఎక్కడైనా దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్రచేసి మరుసటి దినమున శివదర్శనం చేసుకొని రాహుకేతువుల పూజా ధానదికములు చేసిన నివారణ జరుగును.

*ఆరు ముఖాలు గాని,గణేశ్ రుద్రాక్ష గాని,ఎనిమిది ముఖాల రుద్రాక్షలను ధరించుటతో పాటు ఏనుగు వెంట్రుకల తో చేసిన రింగ్ గాని  చేతికి కడియం గాని  ధరించుట శుభమగును.
*ప్రతీ శుక్లపక్ష పాడ్యమి అమావాస్య తిధులల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిళ్లు పెట్టుట,పక్షులకు ఆహారం పెట్టుట వలన కూడా నివారన కలుగును.
*నాగ ప్రతిమ(సుబ్రహ్మణ్య) 27రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానము చేయట చేత నివారణ మగును.
*ప్రతీ సోమవారం రాహుకాలమందు నాగదేవతకు పాలతో అభిషేకించి క్షీరాన్నం నివేదించి పాలను దానం చేయుట వలన కూడా నివారణమగును.
*నవగ్రహములకు ఇరవైఒక దినములు ప్రదక్షిణలు చేయుటచేత శుభమగును.రాహు కాలంలో రాహుకాల దీపాలు పెట్టటం వలన కూడా నివారణ జరుగును.
*ప్రతీ ఆదివారం ఉపవాసముంటు నాగదేవతాలయం చుట్టు ప్రదక్షినలు చేస్తు లలితా సహస్రనామావలి గాని,దుర్గా సప్త శ్లోకి పఠించిన శుభమగును.
*అధిక ప్రభావం కలవారు దేవాలయమునందు సుబ్రహ్మణ్య లేదా నాగదేవతా విగ్రహ ప్రతిష్ఠాపన చేయుట వలన పూర్తి దోష నివృత్తి అగును.
*అప్పుడప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేపించటం వలన కూడా దోషం నివారణ అగును.
*నిత్యం దేవి సప్తశతి పారాయణం చేయట కూడా శాంతి కలిగించును.మంగళవారం రోజు గాని,ఆదివారం రోజు గాని ఉపవాసం ఉన్న దోషం నివారణ అగును.
*రాహు కేతువులకు మూలమంత్ర జపములు తర్పనములు హోమము దానము చేయుటచేత కూడా దోష నివారణయగును.
*ప్రతీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించుట అభిషేకించుట కూడా సత్ఫలితాలనిచ్చును.
*వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినములు మూలమంత్ర సహితముగా పూజించి బ్రాహ్మణునకు దానము చేయుట వలన కూడా దోష నివారణయగును.
*మినుములు.నువ్వులు.ఉలువలు.. ప్రతీ మంగళవారం దానము చేయుచు ఉన్న దోష నివృత్తియగును. 
పైన చెప్పిన అన్ని చేయలేకపోయిన కొన్ని అయిన శ్రద్దగా చేసిన దోష నివృతి అగును.

మానసదేవి

#మానసదేవి
త్రినేత్రుడైన పరమేశ్వరుని మానస పుత్రిక శ్రీ మాతా మానసదేవి. ఆమెను మనసారా పూజిస్తే భయంకరమైన కాల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై వెలసిన ఆమె యుగయుగాలుగా భక్తులను తన చల్లనిచూపులతో సంరక్షిస్తున్నారు. ఆమె దయ వుంటే చాలు ఏమైనా సాధించవచ్చని కోట్లాదిమంది భక్తుల నమ్మకం. సర్పాలకు మానవులు తెలిసిగానీ తెలియక గానీ చేసిన పాపాలను అమ్మను స్మరిస్తేనే పొగొడుతుంది. అందుకనే కాలసర్ప దోష నివారణకు ఆ మాతను ప్రార్థించాలి. అమ్మవారిని నిత్యం కొలిస్తే సకల సంపదలకు ఎటువంటి లోటు వుండదని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
సర్పరక్షకురాలు
మాతా మానసదేవి అన్న వాసుకి. ఆమెను జరత్కారువు అనే మహర్షికిచ్చి వివాహం చేస్తారు. ఆమెకు మరోపేరు కూడా జరత్కారువు కావడం గమనార్హం. ఈ దంపతులకు అస్తీకుడు అనే పుత్రుడు జన్మిస్తాడు. ఒక రోజున జనమజేయ రాజు సర్పయాగం ప్రారంభిస్తాడు. తన తండ్రైన పరీక్షిత్తు మహారాజును తక్షకుడు అనే నాగు చంపడంతో ఆయన ఆగ్రహం చెంది ఈ యాగం నిర్వహిస్తాడు. రుత్వికుల మంత్ర పఠనంతో భూమండలం మీద వున్న వేలాది నాగులు వచ్చి యాగంలో పడిపోవడం ప్రారంభించాయి. నాగులలో శ్రేష్టుడైన వాసుకి భీతిల్లితుండటంతో సోదరి మానసదేవి తన కుమారుడైన అస్తీకుడిని యజ్ఞం నిలిపివేసేందుకు పంపుతుంది. అస్తీకుని తల్లి నాగ స్త్రీ, తండ్రి బ్రాహ్మణ మహర్షి. ఒకే పేరుతో వున్న దంపతుల పిల్లలే యాగాన్ని నిలిపివేసేందుకు అర్హులు అని తెలియడంతో అస్తీకుడు ఆ కార్యాన్ని నెరవేర్చగలడని తల్లి భావించింది. యాగ ప్రదేశానికి వెళ్లిన అస్తీకునికి జనమజేయుడు సాదరంగా స్వాగతం పలుకుతాడు. ఏం కావాలో కోరుకోమన్న రాజును ఆయన తక్షణమే యాగాన్ని నిలిపివేయమని విన్నవిస్తాడు. దీంతో మాటకు కట్టుబడిన జనమజేయుడు వెంటనే యాగాన్ని నిలిపివేయడంతో సర్పసంహారం నిలిచిపోయింది. దీంతో నాగజాతి అస్తీకునికి కృతజ్ఞతలు తెలిపింది. అందరూ ఆయన తల్లి మానసదేవి సమక్షానికి చేరుకొని నాగులను కాపాడినందుకు భక్తితో ప్రణమిల్లారు. సర్పజాతిని సంరక్షించిన మాతా మానసాదేవి అంటే నాగులకు విశిష్టమైన గౌరవం. అందుకే ఆమెను పూజిస్తే అన్ని సర్పదోషాలు తొలగిపోతాయి.సంతానలేమికి కూడా కాలసర్పదోషం కారణమని చెబుతారు. అందుకనే ఆ మాతను పూజిస్తే సంతానఫలం కలుగుతుంది.
బిల్వ పర్వతంపై ఆలయం
హరిద్వార్‌లోని బిల్వపర్వతంపై అమ్మవారి ఆలయం వుంది. ఆలయాన్ని సిద్ధపీఠంగా వ్యవహరిస్తారు. సమీపంలోనే మాయాదేవి ఆలయం, చండీదేవి ఆలయాలు వున్నాయి. మూడు ఆలయాలు శక్తిపీఠాలు కావడం విశేషం. పర్వతంపై వున్న అమ్మవారి సన్నిధికి చేరుకోవాలంటే మెట్ల మార్గం లేదా రోప్‌వే వుంది. రోప్‌వేలో వెళ్లే సమయంలో గంగానది పరివాహక సుందరదృశ్యం మనకు అలౌకిక దివ్యానుభూతిని మిగుల్చుతుంది. సన్నిధానంలో మాత మానసదేవిని సందర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో వున్న వృక్షానికి దారాలు కట్టి తమ కోరిక నెరవేర్చాలని వేడుకోవాలి. అమ్మవారి అభీష్టంతో కోరికలు నెరవేరిన అనంతరం తిరిగిఆలయాన్ని దర్శించుకోవాలి.
ఎలా చేరుకోవాలి
* ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ పట్టణానికి దేశంలోని అన్ని ప్రాంతాలనుంచి రవాణా సౌకర్యాలున్నాయి.
* డెహ్రాడూన్‌లో విమానాశ్రయముంది. అక్కడ నుంచి హరిద్వార్‌ 35 కి.మీ. దూరం. ప్రైవేటు వాహనాల ద్వారా హరిద్వార్‌ చేరుకోవచ్చు.
* హరిద్వార్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఆలయం 2.5 కి.మీ.దూరంలో వుంది.
* రోప్‌వే ద్వారా వెళితే హిమాలయపర్వతశ్రేణిలోని శివాలిక్‌ అందాలు, గంగానది ప్రవాహాన్ని వీక్షించవచ

ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !

ఈ గుడికి వెళ్ళాలంటే ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే !
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి మీకు తెలియని రహస్యాలు.
మరణించిన వారిని బ్రతికించగలిగే మహా శక్తి ఉన్న సంజీవని పర్వతం ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ?
గుడి అంటే రోజూ పూజలు,నైవేద్యాలు ఇవన్నీ రోజూ మామూలే! కానీ ఓ దేవాలయం రోజులో కేవలం 5 రోజులు మాత్రమే తెరచివుంటుంది. ఆ 5 రోజులులూ దేవుడికి పూజలు చేసి గుడిని మూసేస్తారు. మళ్ళీ తెరిచేది యాడాది తర్వాతే. ఎందుకంటే ఈ గుడికి వెళ్ళటం ఆషామాషీ వ్యవహారం కాదు. అక్కడికి వెళ్ళాలంటే గుండెలు అరచేత్తో పట్టుకుని అడుగులు వేయాల్సిందే. అడుగడుగునా పొంచివున్న ప్రమాదాలతో ఓ సాహసయాత్రను తలపించే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే భక్తి ఒక్కటే చాలదు.గుండె ధైర్యం కూడా పుష్కలంగా వుండాలి.
ఇంతకీ ఆ గుడి ఎక్కడ వుంది?అక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకోవాలని వుంది కదూ!
సలేశ్వరం శ్రీశైలం దగ్గరలోని ఒక యత్రా స్థలము. ఇది ప్రకృతి రమణీయతతో అలరారుతున్న అందమైన ప్రదేశం, చారిత్రిక ప్రాముఖ్యత గల ప్రదేశం, ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది శ్రీశైలం అడవులలొని ఒక ఆదిమవాసి యాత్రా స్థలము. ఇక్కడ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ జాతర ఉగాది వెళ్ళిన తరువాత తోలి పౌర్ణమికి మొదలగుతుంది.
శ్రీశైలానికి 40 కిలొమిటర్ల దూరంలో వుంటుంది సలేశ్వరం. అడవిలో నుండి 25 కిలోమీటర్ల ప్రయాణం వుంటుంది. ఇందులో 20 కిలొమిటర్ల వాహన ప్రయాణం సాధ్యపడుతుంది అక్కడి నుండి 5 కిలొమిటర్ల కాలినడక తప్పదు. ఇక్కడ ఈశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ శంకరుడు లోయలో వున్న గుహలో దర్శనమిస్తాడు. ఇక్కడ సంవత్సరంలో 4 రోజులు మాత్రమే ఈ అడవిలోనికి అనుమతి వుంటుంది. ఇక్కడ జలపాతానికి సందర్శకులు అందరూ ముగ్ధులు అవుతారు.
కలియుగ అంతానికి కారణమయ్యే గుడి !
వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే !
1. ఆలవాలం
అదో దట్టమైన కీకారణ్యం. ఎత్తైన కొండలు, పాలనురుగులా జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయదృశ్యాలు, అక్కడి ప్రతి అణువూ నిండి వుంటుంది. దీనితో పాటు కారడివి ఆధ్యాత్మికతకు కూడా ఆలవాలంగా వుంటుంది.
2. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం
తెలంగాణా రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా నల్లమల అడవులలో కొలువైవున్న సలేశ్వర క్షేత్రం వెళ్ళాలంటే ఎవరికైనా ఒణుకు పుట్టాల్సిందే. హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గంలో 150కి.మీ రాయి దగ్గర పరహాబాద్ గేటు వుంటుంది. అక్కడినుంచి 32కిమీ ల దూరం దట్టమైన అడవిలో వెళ్ళాలంటే ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోవాల్సిందే.
3. జాగ్రత్త !!
గుట్ట కొనను చేరుకొన్నాక మళ్ళీ ఉత్తరవైపునకు తిరిగి గుట్టల మధ్య లోయ లోనికి దిగాలి. ఆ దారిలో ఎన్నెనో గుహలు గుహలు, సన్నని జలధారలు కనిపిస్తాయి. గుండం కొంత దూరంలో ఉందనగా లోయ అడుగు బాగానికి చేరు కుంటాం.
4. లోయలో జాగ్రత్తగా నడవాలి
గుండం నుండి పారె నీటి ప్రవాహం వెంబడి రెండు గుట్టల మధ్య గల ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాలి. ఒక్కోచోట బెత్తెడు దారిలో నడవాల్సి వుంటుంది. ఏమరు పాటుగా కాలు జారితె ఇక కైలాసానికే.
5. నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా
గుండం చేరిన తర్వాత అక్కడి దృశ్యం చాల అందంగా కనిపిస్తుంది. తల పైకెత్తి ఆకాశం వైపు చూస్తే చుట్టు ఎత్తైన కొండలు, దట్టమైన అడవి మధ్యలోనుండి ఆకాశం కుండ మూతి లోపలి నుండి ఆకాశం కనబడినట్లు కనబడుతుంది. గుండంలోని నీరు అతి చల్లగా, స్వచ్ఛంగా వుంటుంది. అనేక వనమూలికలతో కలిసిన ఆనీరు ఆరోగ్యానికి చాల మంచిది.
పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు ప్రయాణం
6. లింగమయ్య స్వామి లింగం
గుండం ఒడ్డు పైన తూర్పు ముఖంగా రెండు గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. పై గుహనే ముందు చేరుకోవచ్చు. ఆ గుహలోనె ప్రధాన దైవ మైన లింగమయ్య స్వామి లింగం ఉంది. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులు. క్రింద గుహలో కూడా లింగమే ఉంది. గుడి ముందు మాత్రం వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలున్నాయి.
7. సలేశ్వరం జాతర సంవత్సరాని కొకసారి చైత్ర పౌర్ణ్మికి రెండు రోజులు ముందు, రెండు రోజులు వెనుక మొత్తం ఐదు రోజులు జరుగుతుంది. ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది గాన కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. భక్తులు వచ్చేటప్పుడు 'వత్తన్నం వత్తన్నం లింగమయ్యో' అంటూ వస్తారు. వెళ్లేటప్పుడు 'పోతున్నం పోతున్నం లింగమయ్యొ' అని అరుస్తూ నడుస్తుంటారు.
8. శిధిలావస్థ
10కి.మీ లు వెళ్ళగానే రోడ్డుకు ఎడమప్రక్కన నిజాం కాలపు శిధిలావస్థలో వున్న భవనాలు కనిపిస్తాయి. నిజాం రాజు అక్కడి ప్రకృతి అందాలకు ముగ్ధుడై వందేళ్ళకు పూర్వమే అక్కడ వేసవి విడిది నిర్మించుకున్నాడు. అందుకే ఆ ప్రదేశాన్ని పరహాబాద్ అంటారు.
9. నడకదారులు
అంటే అందమైన ప్రదేశమని అర్థం. ఈ ప్రాంతంలో పులులు ఎక్కువగా సంచరిస్తుండడంతో 1973 లో కేంద్రప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఇక్కడ ఏర్పాటుచేసింది. అక్కడ నుంచి సలేశ్వరానికి 3 నడకదారులున్నాయి. దట్టమైన అడవిలో వున్న సలేశ్వర ఆలయంలో చెంచులే పూజాకార్యక్రమాలు నిర్వహిస్తూవుంటారు.
కొలను భారతి - ఎపి లో ఉన్న ఒకేఒక సరస్వతి దేవాలయం !!
10. చైత్రపౌర్ణమి
సలేశ్వరంలో సంవత్సరానికి ఒక్క సారి జాతర జరుగుతుంది. చైత్రపౌర్ణమికి రెండు రోజుల ముందు రెండు రోజుల తరువాత అంటే మొత్తం 5 రోజులపాటు జాతర జరిగే సమయంలోనే ఆ గుడిని తెరచివుంచుతారు. ఈ 5రోజులలో దేవుడి దర్శనానికి వచ్చే భక్తులు సాహసయాత్ర చేయాల్సి వుంటుంది.
11. జలపాతాలు
ఇరుకైన లోయల్లో కేవలం కాలు మాత్రమే పట్టే దారి మాత్రమే వుంటుంది. పొరపాటున అక్కడ కాలు జారితే అంతే సంగతులు. కనీసం శవం కూడా దొరికే పరిస్థితి వుండదు. అక్కడికి వెళ్ళే దారిలో వుండే జలపాతాలు మండు వేసవిలో ఎంతో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
12. భక్తులతో కిటకిటలాడుతూ
నీటి గుండాలు చూపులు తిప్పుకోనివ్వవు. గుడి తెరచి వుండే 5రోజులు భక్తులతో కిటకిటలాడుతూ వుంటుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి, సలేశ్వర లింగామయ స్వామి, లుగ్దీ మల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలుసు. ఐదో లింగం నల్లమల అడవులలో ఎక్కడ వుందో ఇప్పటికీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు.
13. చరిత్రకారులు
సలేశ్వర ఆలయాన్ని 6వశతాబ్దిలో నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతారు. 13వ శతాబ్దంలోని మల్లికార్జునపండితారాజ్య చరిత్ర, శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలను పాల్పురి సోమనాధుడు వర్ణించాడు. ఆలయం నిర్మించిన నాటి నుంచి ఏడాదిలో 5 రోజులు మాత్రమే తెరచివుంచటం ఆనవాయితీగా వస్తోంది. 17వ శతాబ్దం చివరిలో ఛత్రపతి శివాజీ సలేశ్వరం క్షేత్రంలో ఆశ్రమం పొందినట్లు చరిత్ర చెబుతుంది.
14. అక్కడి పకృతి అందాలకు ముగ్దుడైన నిజాం
వంద సంవత్సరాలకు ముందే అక్కడ ఒక వేసవి విడిదిని నిర్మించాడు. అదిప్పుడు శిథిలావస్థలో వుంది. ఆ ప్రదేశానికి ఫరాహబాద్ అనిపేరు. అనగా అందమైన ప్రదేశం అని ఆర్థం.
15. ఎలా చేరుకోవాలి ?
హైదరాబాద్ - శ్రీశైలం వెళ్ళే దారిలో మన్ననూర్ అనే ఊరు వస్తుంది. అక్కడి నుండి 10 -12 KM దూరం శ్రీశైలం వెళ్ళే మార్గంలో వెళ్తే ... సలేశ్వరం అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు చూపించే గుర్తు వైపు 10 కిలోమీటర్లు వెళ్తే ... సలేశ్వరం లోయ కనిపిస్తుంది. అక్కడే వాహనాలు, బస్సులు ఆపాలి. లోయలో ఐదు కిలోమీటర్లు నడిస్తే ... ఆకాశ గంగను తలపించే జలపాతం, గుహలు కనిపిస్తాయి. అదే సలేశ్వర క్షేత్రం.
నిజాం విడిది నుండి ఎడమ వైపున 22 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత సలేశ్వరం బేస్ క్యాంపు వస్తుంది. అక్కడే వాహనాలను ఆపుకోవచ్చు. అక్కడినుండి సలేశ్వరం అనే జలపాతం చేరుకోడానికి రెండు కిలొమీటర్ల దూరం నడవాలి.

*దంపతులు - ఆది దంపతులు*

*దంపతులు - ఆది దంపతులు*
శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ పక్కన కూర్చున్న పేరంటాలితో గుసగుసగా ఈ మాటలు అంది..
ఇదేం విడ్డూరం అమ్మాయ్!
పార్వతి దేవి *ఎండకన్నెరుగని పిల్ల*, పరమేశ్వరుడేమో  *ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం*!

ఆమె తనువంతా *సుగంధ లేపనాలు*, అతడి శరీరమంతా *బూడిద గీతలు*.
ఆమె చేతులకు *వంకీలు*,
అతడి చేతులకు *పాము పిల్లలు*.
ఎక్కడా పొంతనే లేదు చూస్తూ ఉండూ...నాలుగు రోజులైతే పెళ్ళి పెటాకులవుతుంది! అంది.

నాలుగు రోజులు కాదు, నాలుగు యుగాలు గడిచిపోయాయి... 
కానీ వారు *ఆదిప్రేమికులు*, *ఆదిదంపతులు* గా 
వర్ధిల్లుతూనే ఉన్నారు.  
"బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుని *అంతః సౌందర్యాన్ని* చూసింది పార్వతి దేవి"
అతడు *విష్ణువు* అయితే ఆమె *లక్ష్మీ దేవీ*.
అతడు *సూర్యడైతే* ఆమె *నీడ*. 
అతడు *పదం* అయితే ఆమె *అర్థం*.
అలా అని ఆ దంపతుల మధ్య
*విభేదాలు* రాలేదా అంటే వచ్చాయి,
ఆ కాపురంలో *సమస్యలు* తలెత్తలేదా అంటే తలెత్తాయి.    
*ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది.*
*ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు*.
ఏ ఆలుమగలైనా *పట్టువిడుపుల* పాఠాల్ని
శివపార్వతుల నుంచే నేర్చుకోవాలి!

ఒకసారి శివుడు *మాట చెల్లించుకుంటే*,
మరోసారి పార్వతి *పంతం నెగ్గించుకుంటుంది*!

మధురలో *అమ్మవారిదే పెత్తనం*!
సుందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మకు మొగుడే.  
నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి.  
                
అదే చిదంబరంలో నటరాజస్వామి మాటే శాసనం.  
శివకామసుందరి *తలుపుచాటు ఇల్లాలు*.
  
ఒక్క మధురై, ఒక్క చిదంబరం ఏంటి!
ఇలా *ఎన్నోచోట్ల భార్య పెత్తనం*
అలానే *భర్త పెత్తనం మరి కొన్నిచోట్ల*.
అందుకే వారు ఇద్దరూ జగత్తును ఏలే *ఆదిదంపతులు* అయినారు *పార్వతీపరమేశ్వరులు*.
అందుకే ఏ జంటను దీవించాలన్నా *పార్వతి పరమేశ్వరులు గా కలకాలం ఉండండి* అని దీవిస్తారు.

శని__శని__శని__అని__పిలువకూడదు... శనీశ్వరుడు_అనే_పిలవాలి_ఎందుకు?

శని__శని__శని__అని__పిలువకూడదు...
శనీశ్వరుడు_అనే_పిలవాలి_ఎందుకు?

శనీశ్వరుడి ప్రభావం వద్దే వద్దు అనుకునే వారే అధికంగా ఉంటారు. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అనే ఈ పేర్లు వింటేనే చాలామంది వణికి పోతారు. కానీ శనీశ్వరుడు ఇచ్చే విశేషాలను గురించి తెలుసుకుంటే.. శనిప్రభావంతో ఏర్పడే నష్టాలను చూసి జడుసుకోం. శనీశ్వరుడిని ఆరాధిస్తాం. అదెలాగంటే? ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం'' అంటారు.
నీలాంజనం- అంటే నల్లటి కాటుక రూపంలో ఉండే వాడని, రవిపుత్రం అంటే.. సూర్యుని పుత్రుడని, యమాగ్రజం-అంటే యమునికి సోదరుడని, ఛాయా మార్తాండ సంభూతం- ఛాయాదేవికి మార్తాండుడికి అంటే సూర్యునికి జన్మించిన వాడైన శనీకి నమస్కరిస్తున్నానని అర్థం.
ఈ శ్లోకాన్ని స్మరిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. శనీశ్వరుడిని మనం ఎప్పుడు శని శని శని అని పిలవకూడదు. "శనీశ్వరుడు" అని మాత్రమే అనాలి.
ఈశ్వర శబ్ధం ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శివుడిని ఈశ్వరుడు అంటాం. మహేశ్వరుడు అని కూడా అంటాం. అలాగే వేంకటేశ్వర స్వామి వారి పేరులో కూడా వెంకట ఈశ్వరుడు అని వుంది. ఈశ్వర శబ్ధం ఉండబట్టే వెంకన్న కలియుగ దైవంగా మారాడు. కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు. అలాగే శనినామధేయంలోనూ ఈశ్వరుడు (శనీశ్వరుడు) అనే శబ్ధం రావడంతో శనీశ్వరుడు కూడా శివునిలా, వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని విశ్వాసం. శనీశ్వరుడంటే భయపడాల్సిన అవసరం లేదు.
నవగ్రహాలను పూజించేటప్పుడు శనీశ్వరుడిని భక్తిగా నమస్కరించుకుంటే సరిపోతుంది. అలాగే ఆయనకు నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించడం.. శనీశ్వరునికి ప్రీతికరమైన చిమ్మిలి నివేదనం చేయడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చు. తద్వారా శనిగ్రహ ప్రభావంతో ఏర్పడే దోషాలు.. యోగ ఫలితాలను ఇస్తాయి. శనీశ్వరుని ప్రభావంతో కొన్ని కష్టాలు కలిగినా.. ఆయనను పూజించడం, గౌరవించడం ద్వారా ఆయన అనుగ్రహం లభిస్తుంది.
కానీ శనిప్రభావం రావాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కొద్దిగా పీడించాంటే దానికి వందరెట్లు యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగించి వెళ్తాడు. శనీశ్వరుడి ప్రభావం వద్దనుకుంటే.. యోగం, ఐశ్వర్యం కూడా వద్దనుకోవాల్సిందే. శనీశ్వరుడిని చక్కగా నీలిరంగు పుష్పాలతో అలంకరణ చేయించి.. పూజించండి. శివారాధన చేయాలి. హనుమంతారాధన, అయ్యప్ప స్వామి ఆరాధన చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS