పద్మనాభం
సింహాచలం నకు ఈశాన్యంగా సుమారు 30 కీ.మీ దూరాన పద్మనాభం అను గ్రామం కలదు. స్ధానికులు రేవడి పద్మనాభం గా పిలుస్తారు. గ్రామం నందలి ఎత్తైన కొండ పైన శ్రీ అనంత పద్మనాభుడు స్వయంభూవుగా వెలిసియున్నాడు. మూలవిరాట్టు అవ్యక్తం గా ఉంటాడు. కొండ రాతి పైన లీలగా మాత్రమే దర్శనమిస్తాడు. ఆదిశేషుని పైన స్వామి శంఖు, చక్రధారియై లక్ష్మీ సమేతంగా కొలువైయ్యాడు. స్వామి వారికి నిత్య అర్చనలు, నైవేద్యం సేవలు జరుగుతాయి. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు వార్షిక కళ్యాణం నిర్వహించుతారు. భాద్రపద శుద్ధ చతుర్ధశి నాడు శ్రీ అనంత జయంతి ఉత్సవం జరుగుతుంది. కార్తీక అమావాస్య రాత్రి సందర్భముగా కొండ మెట్లుకు దీపోత్సవం వైభవంగా జరుపుతారు. నాటి జ్యోతుల వెలుగు చాల దూరం వరకు కనిపిస్తాయి. కొండ పైకి చేరుటకు సుమారు 1278 మెట్లును అధిరోహించాలి. మార్గ మధ్యలో విశ్రాంతి పందిళ్ళున్నాయి. కొండపై నుంచి చుట్టుపక్కల పచ్చని ప్రకృతి సౌందర్యం చూడగలం. కొండ క్రింద, మెట్లుకు సమీపంలో గల
శ్రీ నారాయణేశ్వరాలయం (శివాలయం) దర్శనీయం.
శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖ ద్వారం నకు కొంత దూరాన (సింహాచలం వైపు), కొండకు దిగువ భాగంలో శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం కలదు. ఇది కూడ ప్రాచీనమైనది.
శ్రీ నారాయణేశ్వరాలయం (శివాలయం) దర్శనీయం.
శ్రీ అనంత పద్మనాభ స్వామి ముఖ ద్వారం నకు కొంత దూరాన (సింహాచలం వైపు), కొండకు దిగువ భాగంలో శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం కలదు. ఇది కూడ ప్రాచీనమైనది.
శ్రీ కుంతీ మాధవస్వామి ఆలయం నందు ద్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం, అంతరాళయం, గర్భాలయం కలవు. గర్భాలయం నందు శ్రీ దేవి సమేతంగా శ్రీ కుంతీ మాధవస్వామి కొలువైనాడు. అంతరాళయంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి, శ్రీ రుక్మీణి సత్యభామల సమేతంగా శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ సీతా సమేతంగా శ్రీ రామచంద్రుడు ఉత్సవ మూర్తులు కలరు. ముఖ మండపం నందు శ్రీ మహాలక్ష్మీ దేవికి ప్రత్యేక సన్నిధి ఉంది. భోగి రోజున గోదాదేవి కళ్యాణం వైభవంగా జరుపుతారు. నాగుల చవితి సందర్భముగా పద్మనాభం లో జాతరోత్సవాలు జరుగుతాయి.
కొండ దిగువన గల శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయానికి సంబంధించి ఓ స్థలపురాణం ఉంది. కుంతీ దేవి ఇక్కడ మాధవుని విగ్రహ ప్రతిష్ట చేసినందువల్ల స్వామికి కుంతీమాధవస్వామి అనే పేరు వచ్చినట్లు చెబుతారు. భక్తులు ముందుగా కుంతీ మాధవస్వామిని దర్శించుకుని, అనంతరం కొండపైనున్న అనంత పద్మనాభస్వామిని దర్శించు కుంటారు. ఇది అనాదిగా కొనసాగుతున్న ఆచారం.
పద్మనాభ యుద్ధం:
పద్మనాభం చారిత్రాత్మకంగా ఖ్యాతి పొందినది. బ్రిటిష్ నిరంకుశ ధోరణులు సహించలేక విజయనగరం (ఉత్తరాంధ్ర) సంస్ధానాదీశుల రెండో విజయరామ గజపతి రాజు యుద్ధం సన్నాహాలు ప్రారభించాడు. బ్రిటిష్ పాలకులు విజయనగరం కోటను ముట్టడించగా, రాజ కుటుంబం గుట్టుగా సింహాచలం చేరుకున్నారు. పిమ్మట యుద్ధ సైన్యాని సేకరించని విజయరామ గజపతి రాజు, 1874 జూలై 9వ తేది రాత్రి సమయంలో యుద్ధ కార్యాచరణ ప్రణాలికను శ్రీ కుంతీమాధవ స్వామి ఆలయంలో తయారు చేశాడు. ఒక రాజద్రోహి ఇచ్చిన సమాచారంతో బ్రిటిష్ సైన్యం పద్మనాభం చేరుకుంది. 10వ తేది తెల్లవార జామున శ్రీ పద్మనాభస్వామి ఆలయ సాక్షిగా బ్రిటిష్ సైన్యంతో జరిగిన యుద్ధంలో విజయరామ గజపతి రాజు మృతి చెందాడు.

సింహాచలం RTC బస్ స్టాండ్ నుంచి విజయనగరం నకు బస్సులు (వయా) శొంఠ్యాం, పద్మనాభం, జామి మీదగా ప్రతి 40 నిముషాలుకు బయలు దేరుతాయి. ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు ఆలయం వద్ద ఆగుతాయి. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం నకు పోవు జాతీయ రహదారి (NH - 16) నందు తగరపువలస అను చిరు పట్నం ఉంది. విశాఖపట్నం నుంచి బస్సలు, సిట్టి బస్సలు, షేరింగ్ ఆటోలు/వేన్లు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 30 కీ.మీ గా ఉంటుంది. తగరపువలస నుంచి పద్మనాభం నకు (వయా) రేవడి మీదగా Private బస్సలు & షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 15 కీ.మీ గా ఉంటుంది. విజయనగరం నుంచి పద్మనాభం నకు (వయా) జామి మీదగా బస్సలు & షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం 16 కీ.మీ గా ఉంటుంది. యాత్రికులుకు వసతులు విశాఖపట్నం, సింహాచలం, విజయనగరం లో దొరుకుతాయి.
కె. కె. మంగపతి
Yatra - Telugu
Yatra - Telugu
No comments:
Post a Comment