అరకు (Araku)
ఆంధ్రా ఊటీ
విశాఖపట్నం నకు వాయువ్యం దిశగా, సుమారు 115 కీ.మీ దూరాన, ఆంధ్రా - ఒడిశా సరిహద్దు కు సమీప ప్రాంతములో అరకు అను గిరిజన గ్రామం కలదు. విశాఖపట్నం జిల్లా, డుంబ్రిగుడ మండలం పరిధి లోనికి వస్తుంది. అరకు ప్రాంతము చల్లని వాతావరణం, పచ్చని పరిసరాలు, ఎత్తైన కొండలు,లోతైన లోయలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలు మరియు ప్రకృతి ప్రసాదించిన ఎన్నెన్నో అందాలు తో బహు సుందరము గా ఉంటుంది. ఊటీ, కొడైకెనాల్. సిమ్లా, కులు, మనాలి, డార్జీలింగ్ మొదలగు వేసవి విడిది ప్రదేశాలకు ఏమాత్రం తీసిపోని అందాలతో పాటు, గ్రామీణ గిరిజన సంస్కృతికి సజీవ సాక్ష్యంగా అరకు ప్రాంతము మన కన్నులముందు ఒకమ అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంది. నిత్యము సినిమా షూటింగులతో బిజీగా ఉండే ఈ ప్రాంతము చూడదగ్గ పర్యాటక ప్రదేశం.
అరకు లోయ అందమైన అడవులతో కూడిన కొండల ప్రాంతం. సముద్ర మట్టము నుండి 900 మీటర్ల ఎత్తున ఉండి అణువణువున ప్రకృతి రమణీయతతో విలసిల్లుతున్న అద్భుత పర్వతపంక్తి. కొండజాతులు వారు ఈ ప్రాంతముపై ఆధారపడి జీవనము సాగిస్తున్నారు. అరకు లోయ నందు పర్యాటకులుకు మంచి వసతులున్నాయి. అన్ని తరగతులు వారికి లాడ్జీలు, హోటల్స్ దొరుకుతాయి. బస్ స్టాప్ కు సమీపంలో హరిత హిల్ల్ రిసార్ట్ (మయూరి) ఉంది. వీరి పోన్ నెం. 08936 249204 & 249393 వీటితో పాటు Tribal cottage, Sun N Shine Resort, యాపిలి రిసార్ట్ మొదలగు పెక్కు వసతులు అరకు లోయ ప్రాంతములో దొరుకుతాయి. చుట్టూ ప్రక్కల ప్రాంతములు సందర్శించుటకు వాహనములు, భోజన హోటల్స్ ఉన్నాయి.
అరకు చుట్టూ ప్రక్కల చూడవలసిన ప్రదేశాలు:
ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం,
శ్రీ వేంకటేశ్వరాలయం, పద్మాపురం గార్డెన్స్
రణజిల్లెడ వాటర్ ఫాల్స్, చాపరాయి జలపాతం
మత్స్యగుండం, అనంత గిరి మౌంటెన్
బొర్రా గుహలు, కవిటి వాటర్ ఫాల్స్
అనంత గిరి వాటర్ ఫాల్స్, తాడిగుడ వాటర్ ఫాల్స్
టైడా (Tyada) జంగిల్ బెల్స్ మొదలగునవి చాడదగినవి. అనంత గిరి మౌంటెన్ వద్ద కూడ మంచి వసతులున్నాయి.
అరకు బస్ స్టాండ్ కు సమీపంలో ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం, శ్రీ వేంకటేశ్వర ఆలయం ఉంటాయి. అరకు లోయ కు వాయువ్యం దిశగా, సుమారు మూడు కీ.మీ. దూరాన, పాడువా (ఒడిశా) వైపు అరకు రైల్వే స్టేషన్ & రైల్వే కాలనీ ఉంటాయి. అరకు బస్సులు రైల్వే స్టేషన్ వరకు వస్తాయి. ఇక్కడ కూడ భోజన హోటల్స్ ఉన్నాయి. ఆటో సర్వీసులు ఉంటాయి. అరకు లోయ - అరకు రైల్వే స్టేషన్ రోడ్డు కు సుమారు మూడు కీ.మీ లోపలకి
పద్మాపురం ఉద్యాన వనం ఉంది. ఉద్యాన వనంలో వివిధ రకాల పుష్పజాతులు, వృక్ష జాతులకు సంబంధించిన చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ల్యాండ్ స్కేపింగ్ తదితరాలు ఉన్నాయి. ఇక్కడి చెట్లపై నిర్మించిన హట్స్ పర్యాటకులకు మరువలేని అనుభూతిని అందిస్తున్నాయి. చల్లని వాతావరణం మధ్య హట్స్‌లో బస చేసే సౌకర్యం ఉంది. గార్డెన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గిరిజన మహిళ, మత్స్యకన్య, అల్లూరి సీతారామరాజు, శివపార్వతుల విగ్రహాలు, టాయ్ ట్రైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గార్డెన్‌లో గులాబీ మొక్కలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఉద్యాన వనాన్ని దర్శించేందుకు ప్రవేశ రుసుము ఉంది.
అరకు లోయ కు ఉత్తరం దిశగా. సుమారు ఏడు కీ.మీ దూరాన రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కలవు.
అరకు - పాడేరు రోడ్డు మార్గం లో చాపరాయి జలపాతం ఉంది. అరకు గిరిజన మ్యాజియం నుంచి 16 కిమీ. దూరంలో గల చాపరాయి జలపాతం చూడగలం. బండరాయి వంటి చాపరాతి మీదగా నీటి ప్రవాహం జాలువారుతుంది. సందర్శకులు నీటిలో తేలియాడవచ్చు. ప్రవేశ రుసుము ఉండును. స్థానికలు జలపాతం ప్రాంతములో బొంగులో చికెన్ విక్రయించుతారు. మాంసాహార ప్రియులు బొంగులో చికెన్‌ను భుజించుతారు. తిరుగు ప్రయణం లో అనంతగిరి కాఫీ తోటలు, బొర్రా గుహలు, త్యాడ/టైడా (Tyada) లో జంగిల్ బెల్స్ లాంటివి చూడవచ్చును. అరకు లోయ ప్రాంతమను నవంబర్ నుండి మే నెల వరకు సందర్శించవచ్చు. ఆగస్టు లో కూడా వాతావరణం ఆహ్లాదకరంగానే ఉంటుంది. శీతాకాలంలో అరకు అందాలు వీక్షిచడంతో ఒక గొప్ప అనుభూతిని పొందవచ్చును. జలపాతములుకు పోవు మార్గములు అసౌకర్యం గా ఉండును.
""""""
బొర్రా గుహలు (Boers Caves):
ప్రకృతిలో ఎన్నో వింతలు, అద్భుతాలున్నాయి. వీటిలో సహజసిద్ధమైన బొర్రాగుహలు ఒకటిగా చెప్పవచ్చును. తూర్పు కనుమలో ప్రకృతి ప్రసాదించిన వింత అద్భుత ప్రదేశం బొర్రా గుహలు. AP టూరిజం శాఖ వారు అరకు & బొర్రా గుహలు టూర్స్ (Train cum Road) నిర్వహించుచున్నారు. విశాఖపట్నం నుంచి Train లో బొర్రా గుహలు చేరుకొంటారు. పిమ్మట బొర్రా గుహలు నుంచి అరకు వరకు టూరిజం బస్సులో ప్రయాణం. తిరుగు ప్రయాణం లో అరకు నుంచి విశాఖపట్నం వరకు టూరిజం బస్ ప్రయాణం. కొంత మంది పర్యాటకులు విశాఖపట్నం నుంచి Train లో అరకు చేరి, పిదప Private vehicles సహాయంతో బొర్రా గుహలు సందర్శించి తిరిగి అరకు చేరుకొంటారు. అరకు నుంచి
విశాఖపట్నం నకు RTC బస్ ప్రయాణం చేస్తారు.
అరకు కు సుమారు 26 కీ.మీ దూరాన (విశాఖపట్నం రోడ్) అనంతగిరి Police station కలదు. సుంకర మెట్ట దాటిన తరువాత అనంతగిరి PS వస్తుంది. దీనికి సమీపంలో అనంత గిరి మౌంటెన్ కలదు. ఇచ్చట హరిత హిల్ల్ రిసార్ట్ ఉంది. పర్యాటకులుకు వసతులు దొరుకుతాయి. Ph. No. 08936 - 231898 & Mobile: 7382982574. అరకు - విశాఖ రోడ్డుకు దక్షిణ దిశగా ఒక కీ.మీ దూరాన అనంత గిరి వాటర్ ఫాల్స్ కలవు. హరిత హిల్ల్ రిసార్ట్ కు సుమారు 4 కీ.మీ దూరాన, అరకు - విశాఖపట్నం రోడ్ (Y - Junction) నుంచి బొర్రా గుహలు పోవు దారి విడిపోతుంది. ఇక్కడ నుంచి రవాణా సౌకర్యములు ఉండవు. Way to Borra caves నుంచి సుమారు 6 కీ.మీ దూరంలో బొర్రా గుహలు రైల్వే స్టేషన్ ఉంటుంది. దీనికి సుమారు
1 కీ.మీ దూరంలో గుహలున్నాయి. అనంతగిరి ప్రాంతం విశాఖ జిల్లా మరియు బొర్రా గుహలు ప్రాంతం విజయనగరం జిల్లా పరిధి లోనికి వస్తాయి.
బొర్రా గుహలను 1807 లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు. సహజంగా ఏర్పడిన ఈ గుహలు 10 లక్షల ఏళ్ళ క్రితంనాటివని భావిస్తున్నారు. నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపురాయిలోని కాల్షియమ్ బై కార్బోనేట్‌తో రసాయన చర్యకు గురైనప్పుడు ఖనిజాలను కరిగిస్తుంది. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతుంది. కొంతకాలం పాటు ఈ విధంగా నీరునిరంతరంగా ప్రవహిస్తూ ఉండటం వల్ల గుహలు ఏర్పడతాయి.
గోస్తనీ నది ఈ గుహ్గల్లో పుట్టి జలపాతంగా మారి తూర్పు దిశలో ప్రవహించి భీమునిపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కొండలపై నుంచి చిన్న చిన్న వాగులు గోస్తని నది వైపు ప్రవహించిట వల్ల బొర్రా గుహలు ఏర్పడ్డయి. కాల్షియమ్ బై కార్బోనేట్, ఇతర ఖనిజాలు కలిగిఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటివల్లే నేలపై దిబ్బల వంటివి ఏర్పడతాయి. వీటిని స్టాలగ్‌మైట్స్ అని అంటారు. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలక్టైట్స్ అనేవి కాడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలగ్‌మైట్స్ & స్టాలక్టైట్స్ వింతవింత ఆకృతులను సంతరించు కున్నాయి. స్థానిక గిరిజనులు బొర్రాగుహలను బోడో దేవుడి (పెద్ద దేవుడు) నివాసంగా ఆరాధించుతారు. వివిధ రూపాల్లో ఉన్న స్టాలగ్‌మైట్స్ మరియు స్టాలక్టైట్స్ లను శివ -పార్వతి, తల్లి-బిడ్డ, ఋషి గడ్డం, మానవ మెదడు, మొసలి, పులి-ఆవు వంటి పేర్లతో పిలుస్తూ గిరిజనులు పూజిస్తూoటారు.
బొర్రా గుహలకు వందమీటర్ల వ్యాసంతో ప్రవేశద్వారం ఉంది. కిలోమీటరు పొడవునా సొరంగం ఉంటుంది. ఇందులో చాలా చోట్ల మూడు అరలు కలిగిన సొరంగాలు ఉన్నాయి. పూర్వం స్ధానికులు కాగాడాల సహాయంతో గుహలను చూపించేవారు. 1990 దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బొర్రా గుహలను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల మొక్కలు నాటి పరిసరాలు చాలా అందంగా తీర్చినారు. గుహ లోపల ఆధునిక దీపాలంకరణ చేయటం, గుహ లోపలి వింత వింత ఆకారాలపై, రాళ్ళపై రకరకాల రంగులు, నీడలు పడేవిధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చటం జరిగింది. బొర్రా గుహలు కు సుమారు 3 కి.మీ. దూరంలో ఉన్న కటికి జలపాతాన్ని, అక్కడి నుంచి అనంతగిరి చేరుకుని తాడిగుడ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లవచ్చును. సుమారు 80 అడుగుల ఎత్తు నుంచి నీరు అంచెలంచెలగా తాడిగుడ జలపాతం పారుతుంది.
"""""""
రైలు ప్రయాణం (Train journey)
విశాఖపట్నం నుంచి అరకు మీదగా ప్రతి రోజు ఒక ప్యాసింజర్ రైలు సర్వీసు కలదు. Train No. 58501 విశాఖపట్టణం నుంచి ఉదయం 06:50 బయిలు దేరుతుంది. దీనిని కిరండూల్ ప్యాసింజర్ గా పిలుస్తారు. కిరండూల్ రైలు మార్గములో కొత్తవలస, ఎస్. కోట, బొర్రా గుహలు, అరకు, కోరాపుట్, జైపూర్, జగదలపూర్, దంతేవాడ మొదలగు రైల్వే స్టేషన్స్ ఉంటాయి. విశాఖపట్టణం - హౌరా రైలు మార్గములో కొత్తవలస జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. కొత్తవలస జంక్షన్ నుంచి కిరండుల్ వరకు బ్రాంచి రైలు మార్గము ఉంది.
కొత్తవలస - కిరండుల్ రైలు మార్గం ను ఇనుప ఖనిజం జపాన్ దేశం నకు ఎగుమతి చేయుటకు నిర్మించారు. రైల్వే సంస్ధ "KK Line" గా పిలుస్తుంది. ఎస్ . కోట రైల్వే స్టేషన్ దాటగానే రైలు బండి భూమి ఉపరితలం నుంచి కొండ అంచులకు చేరుతుంది. బొడ్డవర - శిమిలగుడ రైల్వే స్టేషన్స్ మధ్య గల కొండలను తొలుచుకుంటూ సొరంగ రైలు మార్గం (టన్నెల్స్) ఏర్పార్చినారు. పర్వతల మధ్యన గల లోయల పైన వంతెనలు నిర్శించారు. ఒకటి, రెండు చోట్ల తుళ్ళింత నాట్యాలతో జారిపడే జలపాతాలు వర్షాకాలం లో నయనానందకరం గా దర్శనమిస్తాయి. ఘాట్ రైలు మార్గం అకస్మిక మలుపులు, సుందర గిరిజన ప్రాంతాలు మీదగా సాగుతుంది. ఇది యాత్రిక మన్యులకు దృశ్యమానం గా కనిపించుతుంది. అసక్తి గల ప్రకృతి సౌందర్యాధకులకు ఘాట్ రైలు ప్రయాణం బహు తమాషా గా ఉంటుంది. రైలు బండి బొర్రా గుహల కొండ పై నుంచి సాగుతూ బొర్రా గుహలు రైల్వే స్టేషన్స్ చేరుతుంది.
విశాఖపట్నం - కిరండూల్ వెళ్లే పాసింజరు రైలుకు అద్దాల బోగీని జత చేసి అరకు వరకు మాత్రమే రైల్వే శాఖ నడుపుతోంది. కిరండూల్ పాసింజరు అరకు స్టేషన్‌కు 10.45 గంటలకు చేరుతుంది. అక్కడ అద్దాల బోగీని కిరండూల్ పాసింజరు నుంచి వేరు చేస్తారు. తిరుగు ప్రయాణం లో Train No. 58502 కిరండూల్ పాసింజరు కు అద్దాల బోగీని కలుపుతారు. Train No. 58502 కిరండూల్ పాసింజరుఅరకు స్టేషన్ నుంచి 14:55 బయులు దేరుతుంది. బొర్రా గుహలు 15:54 & విశాఖపట్నం 20:30 చేరుతుంది. అద్దాల బోగీలో 40 సీట్లు మాత్రమే ఉంటాయి. ప్రయణికులు సీట్లును ముందుగా రిజర్వేషన్ చేయించుకోవటం అవసరం. అద్దాల బోగీలో నుంచి సొరంగ మార్గాలు, ఇరువైపులా గల ప్రకృతిరమణీయ దృశ్యాలు, కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను చక్కగా చూడవచ్చును.
విశాఖపట్నం నుంచి 06:50 బయులు దేరిన
కిరండూల్ పాసింజర్ బొర్రా గుహలు స్టేషన్ కు 09:40 చేరుకుంటుంది. బొర్రా నుంచి బయలుదేరిన రైలు బండి అరకు స్టేషన్‌కు 10.45 గంటలకు చేరుతుంది. ప్రయాణంలో " సిమిలిగుడ " అనే స్టేషను వస్తుంది. ఇది భారతదేశంలో అతి ఎత్తులో వున్న Broad gauge స్టేషను అంటారు. అరకు ముందున గల అరకులోయ లో ఒక నిముషం ఆగుతుంది. సమీపంలో హరిత హిల్ల్ రిసార్ట్ (మయూరి) ఉంది. ఇది un-official halt. అరకు రైల్వేస్టేషన్ నుంచి అరకులోయ వెళ్ళుటకు ప్రైవేటు వాహనాలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అరకులోయ లో యాత్రికులుకు మంచి వసతులు దొరుకుతాయి.
"""""
బస్ ప్రయాణం (Bus journey)
విశాఖపట్నం ద్వారకా RTC Bus Complex నుంచి బస్సులు ప్రతి 45 నిముషాలకు అరకు కు బయులు దేరుతాయి. ఉదయం 5:00 గంటలు నుంచి రాత్రి 07:30 వరకు దొరుకుతాయి. బస్సులు (వయా) కొత్తవలస, ఎస్. కోట, కాశీపట్నం, అనంతగిరి మౌంటెన్, సుంకర మెట్ట, అరకు లోయ మీదగా ఉంటాయి. ఎస్. కోట దాటిన తరువాత ఘాట్ రోడ్డు మొదలవుతుంది. మార్గ మద్యన పర్వతార్యణాలు, చిన్న చిన్న గిరిజన గ్రామీణ ప్రాంతములు, లోయలు, కొండ మలుపులు మొదలగునవి దర్శనమిస్తాయి. అనంతగిరి మౌంటెన్
దాటిన తరువాత ' Y " జంక్షన్ వద్ద బొర్రా గుహలు రోడ్డు విడిపోతుంది. అరకు లోయ ప్రాంతములో RTC bus stand ఉంటుంది. కొన్ని బస్ సర్వీసులు అరకు రైల్వే స్టేషన్ వరకు ఉంటాయి . అరకు లోయ ప్రాంతములో వసతులు, భోజన శాలలు, Private వాహనములు, స్ధానిక గైడ్స్ మొదలగు సౌకర్యములు దొరుకుతాయి. విశాఖ - అరకు బస్ ప్రయాణం కూడ ఆహ్లోదకరంగా ఉంటుంది.
"""""
Train services: Train No. 58501
Visakhapatnam - Kirandual passenger
Visakhapatnam Dep: 06:50
Araku Arvl: 10:45
Distance = 129 Kms.
Total seats : 40
FARE: General Sleeper * Executive AC
coach coach coach 2 Tier
Adult 45 100 665 700
Child 15 40 300 325
Sr.Cit (F) 30 60 365 380
Sr.Cit (M) 35 70 425 445
Sr.Cit (F) : Sr. Citizen (Female)
* Executive coach : Vistadome (Glass) coach charges. (Train No. 00501)
Reservatio: Advance Reservation Period for booking accommodation in trains 120 days (excluding the date of journey).
Visakhapatnam Reservation Office
and Online booking also.
""""
aptdc : (Andhra Pradesh Development Corporation Ltd.)/Visakhapatnam.
On line booking: www.aptdc.in
Central Reservation Office, Behind Lalitha Jewellery, RTC Complex, Visakhapatnam's Ph. No. 0891 - 2788820 & Mobile: 9848813584.
Reservation Centre: Visakhapatnam Railway Statiin's Ph: 0891 - 2788821 & 9848813585.
Package Details
Road Package Tour: (Daily Non A/c Coach) Mobile: 9848813584.
Adult 956/- Child 765/- (Including Breakfast, Mineral water, Lunch, Tea, Snaks & Borra caves entrance Fee)
Places covered:
Borra caves, Padmapuram gardens, Tribal Museum, Ananthagiri coffee plantations, Gali konda, View point, Jungle Bells-Tyda.
** రైలు బండి సంద్శకులును బొర్రా గుహలు నుంచి pick up చేసే సౌకర్యం కూడ కలదు. aptdc టూర్జిం శాఖ బస్సులు ద్వారా పై package ఉపయోగించు కోవచ్చును.
ARAKU RAIL CUM ROAD TOUR: (One day) Mobile : 9848813585.
⭐ No services available present.
Daily (one day tour) Araku by Train Borra Caves, Dep. 6.00am Arr. 8.30pm
FARE: Adult Rs. 983/- Child: Rs. 787/- (including Breakfast, Lunch, Tea, Snaks & Borra caves entrance Fee)
ARAKU RAIL CUM ROAD TOUR: (Two days) Mobile : 9848813585.
⭐ No services
Daily (Two days tour) Araku via Borra Caves, Rail cum road. Dep. 6.00am Arr. 8.30pm (Next day) (including one day accommodation at Araku, Breakfast, Lunch, Tea, Snaks & Nin-A/c Transportation)
31-08-2018 కె. కె. మంగపతి
Yatra - Telugu
------------------------------------------------------------------ మీకు నచ్చితే షేర్ చేయండి లేదా ఒక లైక్ ఇవ్వండి
No comments:
Post a Comment