Sunday, March 31, 2024

*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*

*అన్నానికి దోషం అంటడమంటే ఏమిటి ? అదెలా పోగొట్టుకోవాలి ?*

ఎడమ చేతితో తినే తిండికి ,నిలబడి తినే తిండికి రాక్షస శక్తులు వస్తాయి . ఒకరి ఎంగిలి ఒకరు పంచుకు తింటే అది కూడా దోషాన్నమే . అన్నానికి జాతి దోషం , ఆశ్రయ దోషం , నిమిత్త దోషం అని మూడు రకాల దోషాలుంటాయి . 

జాతి దోషం అంటే సహజంగానే ఆ పదార్థానికి ఉన్న దోషము . అవి ఉల్లి , వెల్లుల్లి , ముల్లంగి లాంటివి . వీటిలో తామస గుణములు ఉంటాయి కనుక ఇవి వర్జనీయములు . సాత్త్విక సాధన చేసి భగవంతుడు కావాలి అనుకునే వారు వీటిని వదిలేయాలి . 
ఆశ్రయ దోషం అంటే పాత్రను బట్టి దోషము . పాలు శ్రేష్టమైనవి . కాని అవి రాగి పాత్రలో పోసి భగవంతునికి నివేదిస్తే అవి కల్లుతో సమానం . అది పాత్ర దోషం . 

నిమిత్త దోషం అంటే అవి పుట్టే చోటు బాగుండాలి . మారేడు దళాలు శివునికి ప్రీతి . కాని ఆ చెట్టు శ్మశానంలో ఉంటే అది దోషం . అంటే దుష్టమైన ప్రాంతంలో పెరిగినా దోషమే . కాకి , పిల్లి , కుక్క మొదలైనవి ముట్టుకున్న భోజనము కూడా దోషమే . 

మనము బయట నుంచి తెచ్చిన వస్తువులు ఎలా పండిస్తున్నారో , ఎక్కడ నుంచి తెస్తున్నారో తెలీదు . అందుకని భగవంతునికి నివేదించి భోజనం చెయ్యాలి . మన దగ్గరకు రాక మునుపు అవి ఏమైనా మన దాకా వచ్చాక జాగ్రత్త అవసరం కనుక భగవంతునికి నివేదించడం వలన ఆ దోషాలు పోతాయి . అందుకే దోషము లేని అన్నము ఇవ్వమ్మ అని వేడుకోవాలి . ప్రతి రోజు నీకు నివేదన చేసి తినే భాగ్యం కల్పించు తల్లీ అని కోరుకోవాలి .  బియ్యాన్ని రామ నామముతో ఏరుకోని ఆ బియ్యంతో వండుకొని తింటే ఇంక దానికి దోషము ఉండదు.

#కాలభైరవునికి బుధవారం పూజ కలకండ, అటుకుల పాయసాన్ని.... సమర్పిస్తే....!

#కాలభైరవునికి_నైవేద్యం 

#కాలభైరవునికి బుధవారం పూజ కలకండ, అటుకుల పాయసాన్ని.... సమర్పిస్తే....!

#కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు.

#ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే..?

#బుధవారం పూట చేయాలి.     కాలభైరవుడిని పూజించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. 

#కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి వుందంటున్నారు.. ఆధ్యాత్మిక పండితులు. 

#ఇక కాలభైరవుని పూజ ఎలా చేయాలంటే.. వరుసగా ఐదు బుధవారాలు నిష్ఠగా పూజించాలి. మాంసాహారం ముట్టకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి.

#బుధవారం రోజున సమీపంలోని కాలభైరవుడు లేదా స్వర్ణ ఆకర్షణ భైరవుని సన్నిధికి వెళ్లాలి. 

#రెండు నేతి దీపాలను ఆలయంలో వెలిగించి, పావు కేజీ డైమండ్ కలకండను సమర్పించుకోవాలి. తర్వాత కాలభైరవుని వద్దే కూర్చుని ప్రార్థన చేయాలి. 

#కాలభైరవుని తలచి ధ్యానించాలి. తర్వాత కలకండలోని సగభాగాన్ని ఆలయంలోని భక్తులకు పంచి పెట్టాలి. మిగిలిన సగభాగాన్ని ఇంటికి తీసుకెళ్లాలి. కుటుంబ సభ్యులకు పంచిపెట్టాలి. 

#ఇంకా శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజున కాలభైరవుని పూజించడం ద్వారా కూడా ఆయన అనుగ్రహం పొందవచ్చు. 

#కాలభైరవునికి అటుకుల పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు...స్వస్తి.

                🚩సర్వేజనాః సుఖినోభవంతు🚩

శివుడి"కి, అత్యంత ప్రీతికరమైనరోజు...సోమవారం...!*

*శివుడి"కి,  అత్యంత ప్రీతికరమైనరోజు...సోమవారం...!*

"సోమ" అంటే........,
        "స+ఉమ"
"ఉమ"తో కూడినవాడు అనే అర్థం .......!

 "శివుడు" శుభాలను ప్రసాదిస్తూ వుంటాడు....!
"పార్వతీ దేవి" సంతాన సౌభాగ్యాలను రక్షిస్తూ, వుంటుంది.......!

అందువలన "సోమవారం" రోజున "పార్వతీ "పరమేశ్వరులను అత్యత భక్తిశ్రద్ధలతో, ఆరాధించాలని "ఆధ్యాత్మిక గ్రంధాలు" చెబుతున్నాయి......!

           ఈ రోజున అంతా ఆ స్వామికి, "పూజాభిషేకాలు" జరుపుతుంటారు......!

ఇక కొంతమంది ఇంట్లో చిన్న పరిమాణంలో, గల "శివలింగాన్ని" ఏర్పాటు చేసుకుని,

 పూజామందిరంలోనే స్వామికి "పూజాభిషేకాలు" నిర్వహిస్తుంటారు....!
ఇక ఎవరిలోనైనా ఆ "సదాశివుడికి" కావలసినది అంకితభావమే.....!

 చిత్తశుద్ధితో పూజించాలేగాని, ఆయన అనుగ్రహించనిది లేదు......!!

          ఇలా "ఆదిదేవుడికి" సంతోషాన్ని కలిగించడం వలన, ఆ ఇంట ఎప్పటికీ "లేమి" అనే మాట వినిపించదని చెప్పబడుతోంది.....! 

అంటే ఆ "స్వామి" అనుగ్రహం వలన "దారిద్ర్యం" అనేది ఇక ఆ ఇంటి దరిదాపుల్లోకి, రాదు.....!

 ఈ కారణంగానే దారిద్ర్యాన్ని దహించేవాడిగా ఎంతోమంది భక్తులు ఆయనని సేవిస్తారు.....!

"సోమవారం" రోజున "పార్వతీ పరమేశ్వరులను" పూజించడం వలన "సమస్త పాపాలు" పటాపంచలై పోవడమే కాకుండా, "సంపదలు ......సౌఖ్యాలు" లభిస్తాయని స్పష్టం చేయబడుతోంది......!

             "శివపూజలో " ప్రధానమైన అంశం, అభిషేకం, శివుడు "అభిషేక ప్రియుడు". 

"హాలాహలాన్ని" కంఠమందు ధరించాడు...! "ప్రళయాగ్ని" సమానమైన మూడవ కన్ను కలవాడు.....! నిరంతరం "అభిషేక జలం" తో "నేత్రాగ్ని" చల్లబడుతుంది......!

అందుచేతనే "గంగను, చంద్రవంక" ను తలపై ధరించాడు శివుడు...🙏🌹
                                    
        🙏ఓం నమః శివాయ...🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

Thursday, March 28, 2024

శ్రీ లక్ష్మి దేవి నివాస స్థానాలు

   *శ్రీ లక్ష్మి దేవి నివాస స్థానాలు.*
                ➖➖➖✍️

*సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు?  ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మంగ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.*

*1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పడేయకూడదు.  గడప       లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మీద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.*

*2. ప్రధాన ద్వారం తలుపు మీద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.*

*3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.*

*4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.*

*5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.*

*6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.*

*7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవేశించదు.*

*8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.*

*9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.*

*10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసినచో మంచిదే.*

*11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.*

*12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.*

*13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.*

*14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.*

*15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Monday, March 25, 2024

శ్రీ లక్ష్మి దేవి నివాస స్థానాలు.

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
                     ➖▪️➖

Saturday, March 23, 2024

దక్షిణామూర్తి స్వరూపం

దక్షిణామూర్తి స్వరూపం

"దక్షిణామూర్తి" విగ్రహాన్ని పరిశీలిస్తే "కుడిచెవి"కి "మకరకుండలం"... ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. 

"మకరకుండలం" పురుషుల శ్రవణాలంకారం. "తాటంకం" స్త్రీల అలంకృతి...
దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది "శివశక్తుల" సమైక్య రూపమేనని తెలియజేస్తాయి... 
ఈ రెండు అలంకారాలు. 

సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే... ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. 

అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా..
ఈ విషయాన్నే "లలితాసహస్రం"లో దక్షిణామూర్తి రూపిణీ సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" 
అని వివరిస్తోంది.

స్వామి ఉత్తరాభిముఖులై ఉంటారు. 
ఉత్తరం జ్ఞానదశ.... ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి....

వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. 
అంటే యమ (మృత్యు) దిశ. 
దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో... వారు యముని ( మృత్యువుని ) చూడరు. 

యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. 
  
 ప్రమాదం వై మృత్యుమహం బ్రవీమి' 

యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి

దక్షిణ' అంటే 'దాక్షిణ్య భావం'.

ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలనం అవుతుందో ఆ 'దయ'ను 'దాక్షిణ్యం' అంటారు. 

ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి (దాక్షిణ్యం)... భగవంతునికి మాత్రమే ఉంది. 
ఆ దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే...    "దక్షిణామూర్తి"

అన్ని దుఃఖాలకీ కారణం అజ్ఞానం. 
అజ్ఞానం పూర్తిగా తొలగితేనే శాశ్వత దుఃఖ విమోచనం. 
ఆ అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించే...జ్ఞాన స్వరూపుని దాక్షిణ్య విగ్రహమే  "దక్షిణామూర్తి"

గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్  నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ:🙏

"దక్షిణామూర్తి" సకల జగద్గురు మూర్తి కనుక  స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది.   ఐహికంగా బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి...
పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం.

కాళీ_అమ్మ_సర్వవశంకరీ

కాళీ_అమ్మ_సర్వవశంకరీ 

కాళికా దేవి రూపం భయంకరమైనది.ఆమె నివాసం మహాశ్మశానం.ఆమె అక్కడ శవం మీద నిలిచి, ఆట్టహాసం చేస్తూ, నాలుక బయటకు, చాచి పుర్రెల హారాన్ని ధరించి, నాట్యమాడుతూ ఉంటుంది. ఆమె నాలుగు హస్తాలలో ఖండితమైన దైత్య శిరస్సునూ, ఖడ్గాన్ని, వరదాభయ ముద్రలనూ కలిగి ఉంటుంది. ఆమె దిగంబరి. ఏ ఆచ్చాదన లేని సనాతన క్రోధశక్తి. కాళి శబ్దం నలుపును తెలియజేస్తుంది.

భద్రకాళి...సర్వశుభంకరి

కాళి మూర్తులలో దక్షిణకాళి, భద్రకాళి అనే రెండు మూర్తులు ఉన్నాయి. దక్షిణ అంటే అంతర్బోధ వల్ల కలిగే క్రియాశీలత. భద్రశబ్దం అందరికీ మేలు కలిగించే అంశం. దక్షిణకాళి చేసే సంహార కృతం ప్రణాళికా రహితమైనది కాదు.నిరర్థకమైందీ కాదు. అది నిర్దిష్టమైన విశ్వపురోగమన శీలమైన కార్య నిర్వహణం.భవిష్య సృష్టి పురోగామి లక్షణం కలది కావాలి. భద్ర శబ్దం శుభదాయకమైంది. సర్వులకు క్షేమం కలిగించేదీ అయివుంటుంది. కాలం అనే పాకశాలలో వ్యక్తమైన జగత్తును ఆమె వండి దాన్ని రుచికరమైన పదార్థంగా పరిణమింపజేస్తుంది. అందుకే ఆమె పాచక శక్తి అవుతుంది.

యోగసాధకులకు మాత అనుగ్రహం

"నాయమాత్మా బలహీనేన లభ్య" అని వేదం అంటున్నది. బలం సాధించాలి. బలం ద్వారా పరమాత్మను సాధించాలి. మూలాన్ని ఎరుగటం కేవలం ధీరులకే సాధ్యం. కాళీ ఉపాసన వీరసాధన. శ్మశానంలో శవం మీద కూర్చుని, సామాన్యులకు భీతిని కలిగించే అస్థి కపాలము మొదలైన వాటిని ఉపకరణాలుగా సాధన చేసే విధానము ఉన్నది. ఈ క్రమంలో ఎన్నో పరీక్షలు, భాధలు భరించాల్సి ఉంటుంది. బ్రహ్మాండంలో మహాశక్తిగా సాక్షాత్కారం పొందే శక్తి శరీరంలో మూలాధారంలో కుండలనీ శక్తిగా నిద్రాదశలో ఉంటుంది.ఈ సాధన దశలో ఆమె మేల్కొని చుట్టుకుని ఉన్న తనను చేరరాని అనంత స్థుతులు, అంతస్తులు సులభంగా సాధకులకు అందుతాయి.ఏ యోగమార్గంలో సాగేవారికైనా కాళిమాత అనుగ్రహం తప్పనిసరి.

కాళికలు

మరికొన్ని సంప్రదాయాలలో అష్టవిధ కాళికా మూర్తుల వర్ణనం ఉన్నది. 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక. ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి ఈమె మూర్తి అనేక రూపాలలో అయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం లో మననం చూడవచ్చు.ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలులే కాక కామ్య సాధనలు కూడా  చెప్పబడ్డాయి.

దశ మహా విద్యలలో మొదటిది కాళి. సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది, అత్యంత కఠినతరమైన ఆమె ఉపాసనతో సాధకుల  మృత్యు భయాన్ని పోగొట్టి అనంత శుభ ఫలాలు అందించడమే అమ్మ అనుగ్రహం.

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS