డోలాయమానం గోవిందం… మంచస్తం మధుసూదనం.!
రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే…!
రథం లో విహరించే విష్ణువు ని దర్శిస్తే పునర్జన్మ ఉండదని శాస్త్ర వచనం.
పుణ్యక్షేత్రమైన “స్వర్ణగిరి” క్షేత్రం లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రం - శ్రవణ నక్షత్రం రోజున శ్రీవారి రధోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది.