ఈ దేవాలయంలో ఒకే పానపట్టం పై..శివుడు, యముడు వెలిశారు...
కాళేశ్వర క్షేత్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి.
ఇక్కడ ..గోదావరి,ప్రాణహిత నదులతో పాటు, అంతర్వాహినిగా
సరస్వతీనది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమై
దక్షిణకాశీగా ప్రసిద్ధిచెందినది.
శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో
ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచినది.
భారతదేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద..ఒకే లింగం ఉంటుంది.
కానీ ఇక్కడ మాత్రం ఒకే పానవట్టంపై ..రెండు లింగాలు ఉండటం విశేషం.
ఒకటి కాళేశ్వరలింగం..రెండవది ముక్తీశ్వర లింగం.
ముక్తీశ్వరలింగానికి రెండు నాశికారంధ్రాలున్నాయి.
అట్టి రంధ్రాలలో ఎంత నీరు పోసినా పైకి రావు.
త్రివేణిసంగమతీరంలో ఆ నీరు కలుస్తుంది.
ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీపురాణంలో కూడా పేర్కొన్నారు.
ఈ దేవాలయంలోని కాళేశ్వరునికి ముందు పూజచేసి..
అనంతరం ముక్తీశ్వరుని పూజిస్తే, స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.
మన దేశంలోప్రముఖ సరస్వతీ ఆలయాలు మూడు ఉన్నాయి.
కాళేశ్వరంలో మహాసరస్వతి,
అదిలాబాద్ జిల్లా బాసరలో జ్ఞానసరస్వతీ,
కాశ్మీరులో బాలసరస్వతీ ఆలయాలు..
అదే విధంగా
సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి.
కాళేశ్వరంలో ఒకటి కాగా ఒరిస్సాలోని కోణార్క్,
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యదేవాలయాలు
కాళేశ్వరంలో బ్రహ్మతీర్థం..నరసింహతీర్థం,..హనమత్ తీర్థం
జ్ఞానతీర్థం..వాయుసతీర్థం..సంగమతీర్థం,
ఇత్యాది తీర్థాలున్నాయి.
ఈ ఆలయం చుట్టుప్రక్కల ప్రకృతి సిద్ధంగా
విభూతి రాళ్లు లభించడం విశేషం.
ఆలయం లో ..
లోనికి వేళ్లే చోట యమకోణం ఉంది.. ఇందులో నుండి బయటకి వెళ్ళినట్లయితే
యమ దోషం పోతుంది ..అని భక్తులు విశ్వసిస్తారు..
ఇందులో నుండి వెళ్లుటకు దిక్సూచి ఉంటుంది
దానిని అనుసరించి వెళ్లాలి.... 🙏🙏🙏🌹

No comments:
Post a Comment