Tuesday, December 10, 2024

గృహముకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే దిష్టి వివాద రకాలు దోషాలను.

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి.............!!

అమ్మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి.............!!

ప్రతి రోజు సాయంత్రం ప్రదోష కాలంలో అమ్మవారు, శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు.
ఈ సమయమంలో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇస్టం.

అవి ఆర్ద్రనతకరి అని, అనంత తృతీయ, రసకల్యని అని వ్రతములు చాలా ఇష్టం అని పురాణ వచనం.

ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం, వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీడలు ఉండవు, రోగ నివారణ, అప్పులు, రుణాలు తీరిపొతాయి అని, కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

ఎవర్ని అయితే అమ్మవారు కరుణిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట. 

పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపంగా చెపుతారు.

కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావాస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి కృపకి పాత్రులు కావచ్చు.

నవరాత్రి ద్వయం అంటే శరన్నవరాత్రులు (దుస్సేర నవరాత్రి), వసంత నవరాత్రులు (ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

వసంత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇస్టం అంటే దేవిభాగవతం లో..
 " శ్రీ రామో లలితంబికా, శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేశ్వరే... స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.

అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏరూపంలో అనుగ్రహిస్తుంది ?
కాలి, చండి, బాల, లలిత, దుర్గ అనేక రూపాలలో ఉండి మనల్ని నడిపిస్తుంది, కరుణిస్తుంది అని అనుమానం..
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది.

మాత్రు రూపం, 
శాంతి రూపం, 
ఆకలి రూపం లో, 
జాతి రూపం లో, 
చైతన్య స్వరూపం, 
నిద్ర రూపం లో, 
దయా రూపం లో, 
బుద్ది రూపం లో 
కూడా అమ్మవారు ఉండి మనల్ని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కోరుకోవాలి...

కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కోరతారు. కానీ ఏది కోరిన మళ్ళీ దాని వలన కలిగే సుఖం అల్పం , క్షణికం . అది తీరగానె మళ్ళీ ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? గురు శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు, నాతో ఉండు" మోక్షం వద్దు, విద్య వద్దు, సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు, నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి, ఎప్పుడు కరుణిస్తూ ఉండాలి, నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.అని అన్నారు..స్వస్తి.!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

Sunday, December 8, 2024

పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం....

పంచ మహాపాత కాలను పోగొట్టే పారిజాతపుష్పం....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌹పారిజాత పుష్పాలు 9రకాలు

🌿1.ఎర్ర(ముద్ద)పారిజాతం
2.రేకు పారిజాతం
3.తెల్లగా ఎర్ర కాడతో ఉండే పారిజాతం (ఎక్కువగా అందుబాటులో ఉన్నది)
4.పసుపు పారిజాతం
5.నీలం పారిజాతం
6.గన్నేరు రంగు పారిజాతం
7.గులాబీరంగు పారిజాతం
8.తెల్లని పాలరంగు పారిజాతం
9.ఎర్ర రంగు పారిజాత
ఎరుపు రంగు పారిజాతం తో విష్ణువును ఆరాధించరాదు.
ఎరుపు తమోగుణం
విష్ణువు సత్వగుణం.

🌸పారిజాత పుష్పాలు క్రింద పడిన వాటినే వాడాలి.
చెట్టు నుండి కోసి వాడరాదు.

🌿పారిజాత వృక్షం తపస్సు చేసి తన పూలను తాను ఇస్తేనే తప్ప తన నుండి ఎవరూ లాగు కోకూడదని వరం పొందినది.

🌸రంగు,..వైశాల్యం,..గుణం,..దేవతా స్వరూపాన్ని బట్టి దేవతలను ఆరాధించాలి.

🌿ఏ పూలను క్రింద పడ్డవి పూజకు వాడరాదు.
ఒక్క తెల్లగా ఎర్రని కాడతో పారిజాత పూవు తప్ప.

🌸భూ స్పర్శ,
మృత్తికా(మట్టి)స్పర్శ
జల స్పర్శ
హస్త స్పర్శ
తరువాత స్వామి
స్పర్శ...ఈ 5 స్పర్శల తోను
పంచ మహా పాతకాలను
పోగొట్టేదే పారిజాతం....🚩🌞🙏🌹🎻

🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

నవగ్రహాల ప్రదక్షిణ విధానం

అందరు తప్పక చదవాల్సిన నవగ్రహాల ప్రదక్షిణ విధానం |

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి..ఎన్నిసార్లు చేయాలి..

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు.

అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.

గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.

️ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

"ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ

గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:”

అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి.

ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి.

9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి

9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు.

అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.

మొదటి ప్రదక్షిణలో..

జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!

రెండో ప్రదక్షిణలో..

కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభగవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో..

బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాశులకు అధిపతి అయినవాడా.. భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా, మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో..

నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాశులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో, వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో..

అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాశులకు అధిపతుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో..

భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో..

కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ.. దీర్ఘాయువును ప్రసాదించేవాడూ, అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో..

సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా, మాకు సదా మంగళాలు కలిగించు!

️తొమ్మిదో ప్రదక్షిణలో..

జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా, మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయవలెను..స్వస్తి..!

లోకా సమస్తా సుఖినోభవంతు..!!

Tuesday, December 3, 2024

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.......!

పంచముఖ హనుమాన్‌ బొమ్మను మీ ఇంట్లో ఉంచితే.......!!

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో ఆంజనేయస్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలను జ్యోతిష్య నిపుణులు ఇలా చెబుతున్నారు.
మీ ఇంట్లో ఏ దిక్కున హనుమంతుడి బొమ్మను ఉంచాలంటే..?
•తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త సుధ్ధిని కలుగ చేస్తాడు.
•దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.
•పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.
•ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.
•ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, సంతానాన్ని ప్రసాదిస్తాడు.
ఇక.. శని, మంగళవారాల్లో ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల, వెన్న సమర్పించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాగే ఆంజనేయ స్వామికి "శ్రీరామజయం" అనే మంత్రాన్ని 108 సార్లు పేపర్‌పై రాసి మాలగా వేసిన వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు.

Monday, December 2, 2024

ఏ ఏ క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయి......!!

ఏ ఏ  క్షేత్రాలలో అన్ని రకాల చక్ర స్థితులు కలుగుతాయి......!!

మూలం : కపాల మోక్షం అను మోక్ష సాధనా గ్రంథం ...
1. *మూలాధార చక్రము* -  గణపతి క్షేత్రం (కాణిపాకం)
  
2. *స్వాధిష్ఠాన చక్రము* - నారాయణ క్షేత్రాలు, లక్ష్మీదేవి క్షేత్రాలు (కొల్హాపురం)

3. *మణిపూరక చక్రము* - 108 దివ్య విష్ణు క్షేత్రాలు,( పండరీపురం) శ్రీ కృష్ణ క్షేత్రాలు

4. *అనాహత చక్రం* -మహాకాళి క్షేత్రాలు, మహాకాలుడు క్షేత్రాలు (ఉజ్జయిని)

5. *విశుద్ధి చక్రము* -  మహా సరస్వతి క్షేత్రాలు , గాయత్రీ దేవి క్షేత్రాలు( బాసర)

6. *ఆజ్ఞా చక్రము* -  శివ శక్తి క్షేత్రాలు, శివ కేశవ శక్తి క్షేత్రాలు, రాధా కృష్ణ క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం ,బృందావనం)

7. *గుణ చక్రం* -  దత్త స్వామి క్షేత్రాలు( గాణ్గాపురం)

8. *కర్మచక్రం* -  శ్రీరామ క్షేత్రాలు (అయోధ్య)

9. *కాలచక్రం* -  కాలభైరవ, భైరవి క్షేత్రాలు (కాశీ, శ్రీశైలం, ఉజ్జయిని)

10. *బ్రహ్మ చక్రం* -  బ్రహ్మ దేవుడి క్షేత్రాలు
 ( పుష్కర్, చిదంబర క్షేత్రం)

11. *సహస్రార చక్రం* -  మహాశివుడు క్షేత్రాలు ,మహావిష్ణు క్షేత్రాలు, శ్రీ కృష్ణ క్షేత్రాలు (ద్వారక, బృందావనం)

12. *హృదయ చక్రం* -  అనంతపద్మనాభ క్షేత్రం (తిరువనంతపురం)
 హనుమ క్షేత్రాలు( కాశి) ఇష్టలింగం  క్షేత్రం(కర్ణాటక)

13. *బ్రహ్మరంధ్రము* -   ఆది పరాశక్తి క్షేత్రం - దీప దుర్గ క్షేత్రం(తుముకూరు) - దీప కాళికా క్షేత్రం - దీప ఛంఢి క్షేత్రం 

🕉 త్రి గ్రంధులు - త్రిమూర్తుల క్షేత్రాలు, త్రిశక్తుల క్షేత్రాలు

🔯మన యోగ చక్రాల మీద ప్రభావము చూపే గ్రహాలు :

1. మూలాధార చక్రము – ఎరుపు - కుజుడు

2.స్వాధిష్ఠాన చక్రము - పసుపు పచ్చ- బుధుడు

3.మణిపూరక చక్రము – కాషాయరంగు- గురువు

4.అనాహత చక్రం – ఆకుపచ్చరంగు- శుక్రుడు

5.విశుద్ధి చక్రము –నీలం- శని

6.ఆజ్ఞా చక్రము - ముదురు వంకాయ రంగు-అర్ధచంద్రుడు

7. గుణ చక్రం -   ముదురు వంకాయ రంగు- మధ్యస్ధ చంద్రుడు

8. కర్మచక్రం -   ముదురు వంకాయ రంగు- చంద్రుడు

9.కాలచక్రం- ముదురు వంకాయ రంగు- అమావాస్య చంద్రుడు

10. బ్రహ్మ చక్రం- ముదురు వంకాయ రంగు- పౌర్ణమి చంద్రుడు

11.సహస్రార చక్రం – లేత వంకాయ రంగు- సూర్యుడు

12.హృదయ చక్రం- లేతనీలం- గ్రహణ సూర్యచంద్రుడు

13.బ్రహ్మరంధ్రము - తెలుపు – అంతరిక్షం.....

సర్వేజనా సుఖినోభవంతు

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS