Saturday, March 31, 2018

ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)

తనకి కలలో వానరము కనపడిందనుకొని సీతమ్మ భయపడి( స్వప్నంలో వానరము కనపడితే కీడు జెరుగుతుందని అంటారు) " లక్ష్మణుడితో కూడిన రాముడికి మంగళం కలగాలి, నా తండ్రి జనక మహారాజు క్షేమంగా ఉండాలి " అని అన్నాక సీతమ్మ అనుకుంటుంది ' అసలు నాకు నిద్ర వస్తేకద కల రావడానికి, నేను అసలు నిద్రేపోలేదు. కాబట్టి ఇదంతా నేను నిరంతరం రాముడిని తలుచుకుంటూ ఉండడం వలన రామ కథని విన్నానన్న భ్రాంతికి లోనయ్యాను ' అనుకుని మళ్ళి పైకి చూసింది. చూసేసరికి  హనుమంతుడు అక్కడే ఉన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " ఇంద్రుడితో కూడుకుని ఉన్న బృహస్పతికి నమస్కారం, అగ్నిదేవుడికి నమస్కారం, బ్రహ్మగారికి నమస్కారం, ఈ వానరుడు చెప్పిన మాటలు సత్యమగుగాక " అని సీతమ్మ దేవతలని ప్రార్ధన చేసింది.
అప్పుడు హనుమంతుడు మెల్లగా కొన్ని కొమ్మల కిందకి వచ్చి " అమ్మా! నేను అబద్ధం చెప్పలేదు. నేను యదార్ధం చెప్పాను. నేను రామదూతని, సుగ్రీవుడి సచివుడిని, నన్ను నమ్మమ్మా " అన్నాడు.
సీతమ్మ అనింది " ఎవడు 100 సంవత్సరముల జీవితాన్ని పండించుకుంటాడో, ఉత్సాహంతో నిలబడతాడో, వాడు ఏదో ఒకనాటికి జీవితంలో శుభవార్త వింటాడు. నేను బహుశా ప్రాణములు విడిచిపెట్టకుండా నిలబడినందుకు ఈ శుభవార్త విన్నాను " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు దేవతలకి చెందినదానివా, యక్షులకు చెందినదానివా, గంధర్వులకు చెందినదానివా, కిన్నెరులకు చెందినదానివా, వశిష్ఠుడి మీద అలిగి వచ్చిన అరుంధతివా, అగస్త్యుడి మీద అలిగి వచ్చిన లోపాముద్రవా. నీ పాదములు భూమి మీద ఆనుతున్నాయి, కనుక నువ్వు దేవతా స్త్రీవి కావు. నీలో రాజలక్షణాలు కనపడుతున్నాయి కనుక నువ్వు కచ్చితంగా క్షత్రియ వంశానికి సంబంధించిన ఒక రాజు ఇల్లాలివి అయ్యి ఉంటావు అని నేను అనుకుంటున్నాను. నువ్వు కాని జనస్థానంలో రావణుడి చేత అపహరింపబడ్డ సీతమ్మవి కాదు కదా? " అన్నాడు.
సీతమ్మ " ఈ పృథ్వీ మండలాన్ని ఏలిన రాజులలో చాలా గొప్పవాడైన, శత్రుసైన్యాలని చీల్చి చెండాడగల దశరథ మహారాజు పెద్ద కోడలని నేను. విదేహ వంశంలో జన్మించిన జనక మహారాజుకి కూతురిని, నన్ను సీత అంటారు. బుద్ధిమంతుడైన రాముడికి ఇల్లాలిని. నేను అయోధ్యలో 12 సంవత్సరాలు హాయిగా గడిపాను. కాని 13వ సంవత్సరంలో దశరథుడి ఆజ్ఞ మేర దండకారణ్యానికి వచ్చాము. రాముడు లేనప్పుడు రావణుడు నన్ను అపహరించి ఇక్కడికి తీసుకొచ్చాడు " అనింది.
' సీతమ్మకి నా మీద నమ్మకం కలిగింది ' అని హనుమంతుడు అనుకొని ఆమె దెగ్గరికి గబగబా వెళ్ళాడు. అలా వస్తున్న హనుమని చూసి సీతమ్మ మళ్ళి మూర్చపోయింది. కొంతసేపటికి తేరుకొని అనింది " నువ్వు దుర్మార్గుడవైన రావణుడివి, మళ్ళి రూపం మార్చుకొని వచ్చావు " అనింది.
కాని సీతమ్మ మనస్సులో ' ఏంటో ఈ వానరాన్ని చూస్తే అలా అనిపించడం లేదు. మనస్సులోనుంచి ప్రీతి పొంగుతుంది. ఈయన అటువంటివాడు కాదు అనిపిస్తుంది. ఈయనని చూస్తే పుత్ర వాత్సల్యం కలుగుతుంది ' అని అనుకొని, " నాయనా! నువ్వు ఎవరివో యదార్ధంగా నాకు చెప్పు " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! నువ్వు అపహరించబడ్డాక రాముడు జటాయువుతో మాట్లాడాడు, తరువాత జటాయువు ప్రాణములు వదిలాడు. తరువాత కబంధుడు కనబడ్డాడు, ఆ తరువాత సుగ్రీవుడి దెగ్గరికి వచ్చారు. సుగ్రీవుడితో స్నేహం చేసిన రాముడు వాలి సంహారం చేసినతరువాత సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. నిన్ను వెతకడం కోసం సుగ్రీవుడు వర్షాకాలం వెళ్ళిపోయాక వానరాలని పంపించాడు. దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన వానరములు సముద్రాన్ని చేరుకొని ఉండిపోయాయి. నన్ను హనుమ అంటారు, సంభరాసురుడు అనే రాక్షసుడిని చంపిన కేసరి నా తండ్రి, మా తల్లి అంజనా దేవి క్షేత్రాముగా వాయుదేవుడికి ఔరస పుత్రుడిని నేను. నేను నీ కుమారుడివంటి వాడను. నేను రామ దూతని తల్లి. రాముడు నీకోసం బెంగపెట్టుకుని ఉన్నాడు తల్లి, నీ జాడ తెలియగానే రాముడు వచ్చి నిన్ను రక్షిస్తాడు. నన్ను నమ్ము తల్లీ " అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " నువ్వు వానరుడివి, రాముడు నరుడు. నరవానరములకి స్నేహం ఎలా కుదిరింది? నా శోకము పోవాలంటె నేను రాముడి గుణములు వినాలి. నువ్వు అంత రామ బక్తుడివి అయితే రాముడు ఎలా ఉంటాడో చెప్పు? " అనింది.
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా|
రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా ||
హనుమంతుడు అన్నాడు " రాముడంటే మూర్తీభవించిన ధర్మం, తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు, ఇతరుల ధర్మాన్ని కూడా రక్షిస్తాడు.
రామః కమల పత్రాక్షః సర్వసత్వ మనోహరః|
రూప దాక్షిణ్య సంపన్నః ప్రసూతో జనకాత్మజే ||
రాముడు పద్మముల వంటి కన్నులున్నవాడు, అన్ని ప్రాణులు ఆయనని చూసి ఆనందపడతాయి, ఆయనకి ఇవన్నీ పుట్టుకతో వచ్చాయి తల్లి.
తేజసా ఆదిత్య సంకాశః క్షమయా పృథివీ సమః|
బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో సమః ||
తేజస్సులో సూర్యుడితో సమానమైనవాడు, క్షమించడంలో భూమితో సమానమైనవాడు, బుద్ధియందు బృహస్పతితో సమానమైనవాడు, కీర్తినందు ఇంద్రుడితో సమానమైనవాడు. రాముడికి యజుర్వేదము, ధనుర్వేదము, వేదవేదాంగములు తెలుసు " అని చెపుతూ, రాముడి కాలిగోళ్ళ నుంచి శిరస్సు మీద ఉండే వెంట్రుకల వరకూ ఏ ఒక్క అవయవాన్ని విడిచి
పెట్టకుండా హనుమంతుడు వర్ణించాడు. (ఆ సమయంలోనే రాముడు 96 inches(8 feet) ఉంటాడని హనుమంతుడు చెప్పాడు.)
అలానే " అమ్మా! రాముడు మర్యాదా పురుషోత్తముడు. ఎవరిని, ఎప్పుడు, ఏ లోకంలో, ఎలా కాపాడాలో తెలిసున్నవాడు, నడువడి ప్రధానమైనవాడు రాముడంటె. ఆయన కర్త, కారణమై ఈ సమస్త జగత్తునందు నిండిపోయాడు.
వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః|
రామనామాంకితం చేదం పశ్య దేవ్యంహుళీయకం||
ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా|
సమాశ్వసిహి భద్రం తే క్షీణ దుఃఖఫలా హ్యసి||
( ఈ శ్లోకాలు పరమ పావనమైనవి, వీటిని సుందరకాండలో మంత్రం అంటారు. సీతమ్మకి ఉన్న బాధని హనుమ ఈ మాటల చేత పోగొట్టాడు, 10 నెలల తరువాత సీతమ్మ ఈ మాటలు విని ఆనందపడింది)
అమ్మా! నేను వానరుడిని, రాముడి పలుకున వచ్చిన రామదూతని. రామ రామనామాంకితమైన ఉంగరాన్ని నీకు తీసుకొచ్చాను, నీకు నమ్మకం కలగడం కోసమని రాముడు దీనిని నాకిచ్చి పంపించాడు. ఈ ఉంగరాన్ని తీసుకున్నాక ఇవ్వాల్టితో నీ కష్టాలన్నీ పోయాయి, ఇక నువ్వు ఉపశాంతిని పొందుతావు " అన్నాడు.
హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని ముట్టుకోగానే సీతమ్మ సిగ్గుపడింది. రాముడినే చూసినంత ఆనందాన్ని సీతమ్మ పొందినదై, ఆ ఉంగరాన్ని కన్నులకి అద్దుకొని పరవశించిపోయింది.
హనుమంతుడు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకున్న సీతమ్మ " నాయన హనుమ! లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల దేశంలో ఉన్న సమస్త జనులు, సుగ్రీవుడు, వానరములు కుశలమే కదా " అని పలు ప్రశ్నలు అగిగాక, " రాముడికి నాకన్నా ఎక్కువైనవారు ఎవరూ లేరు, నేను పక్కన లేకపోవడం వల్ల రాముడు తాను ఎలా ప్రవర్తించాలొ అలా ప్రవర్తించడంలొ వైక్లవ్యాన్ని పొందలేదు కదా?. రాముడు కేవలము తన పౌరుషము మీదనే ఆధారపడి, దైవమును తిరస్కరించి తిరుగుతున్నాడ, లేక తన పౌరుషాన్ని పూర్తిగా విడిచిపెట్టి కేవలం భగవంతుడిని మాత్రమే విశ్వసించి తిరుగుతున్నాడ? రాముడికి నేను జ్ఞాపకం ఉన్నాన, నన్ను తలుచుకుంటున్నాడ. రావణుడిని, రాక్షసులని నిగ్రహించాలంటే రాముడు అక్కడినుండి అస్త్రప్రయోగం చెయ్యలేడా? రాముడు అస్త్రప్రయోగం చెయ్యకుండా నాయందు ఎందుకు ఉపేక్ష వహించాడు? నాకు రావణుడు 12 నెలల గడువు ఇచ్చాడు, అందులో 10 నెలల కాలం పూర్తయిపోయింది. ఇంక 2 నెలలు మాత్రమే వాడు నన్ను బతకనిస్తాడు. కాని నేను ఒక నెల మాత్రమే బతికి ఉంటాను. ఈ ఒక నెల లోపల రాముడు వచ్చి నన్ను విడిపిస్తే సరి, ఒకవేళ రాముడు రాకపోతే నేను ప్రాణములను విడిచిపెట్టేస్తాను. నేను ఇంక ఒక నెల మాత్రమే జీవించి ఉంటాను అని రాముడికి నివేదించు " అనింది.
సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలని విన్న హనుమంతుడు శిరస్సు మీద చేతులు పెట్టుకొని " ఎందుకమ్మా అలా ఖేద పడతావు. మలయము, వింధ్యము, మేరు మొదలైన పర్వతముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, మా వానరములు తినే కందమూలముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, రాముడు నీయందు విశేషమైన ప్రేమతొ ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తుంటాడంటె, ఎక్కడైనా ఒక అందమైన పద్మము కనపడితే ' హ సీత, హ సీత' అంటున్నాడు. వానప్రస్థులలాగ రాముడు కూడా సూర్యాస్తమం అయ్యాక సాధ్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీగురించే ధ్యానము చేస్తున్నాడు, ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకుని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్ళు, జర్రులు, పాములు పాకినా కాని ఆయనకి స్పృహ ఉండడం లేదు. 100 యాగములు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి దెగ్గర సచీదేవి ఉన్నట్టు, ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దెగ్గరికి నిన్ను తీసుకెళ్ళి దింపుతానమ్మా. యజ్ఞంలో వేసిన హవిస్సుని హవ్యవాహనుడైన అగ్నిదేవుడ ఎంత పరమపవిత్రంగా తీసుకెళతాడొ, అలా నిన్ను తీసుకెళ్ళి రాముడి పాదాల దెగ్గర పెడతాను. అమ్మా! నువ్వు వచ్చి నా వీపు మీద కుర్చో " అన్నాడు.
కాని హనుమంతుడు అప్పటిదాక చాలా చిన్నగా ఉండడం వలన, సీతమ్మ హనుమని చూసి ఫక్కున నవ్వి " ఎంతమాట అన్నావోయి హనుమ. నువ్వే ఇంత స్వరూపం, ఆ వీపు మీద నేను కూర్చోన, నన్ను ఈ సముద్రాన్ని దాటించి తీసుకెళతావ. నీ వానర బుద్ధిని బయటపెట్టావు కదా " అనింది.
సీతమ్మ మాటకి అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకి చూపించాలి అనుకొని, మేరు పర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్టు ఎలా ఉంటాయో, అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పాదాలతొ, బలిసిన తొడలతొ, సన్నటి నడుముతొ, విశాలమైన వక్షస్థలంతొ, శంఖంలాంటి కంఠంతొ, కాల్చిన పెనంలాంటి ముఖంతో, పచ్చటి కన్నులతో, పెద్ద శిరోజములతొ, పరిఘలవంటి భుజములతొ నిలబడ్డాడు.
హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ  ఆశ్చర్యపోయి " నాయనా! నాకు తెలుసు నువ్వు ఎవరివో. 100 యోజనముల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వు ఎవరో గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుగ్మంతుడికి ఉంది, నీ తండ్రి వాయుదేవుడికి ఉంది, నీకు ఉంది. నువ్వు ఇంత సమర్ధుడవు కాకపోతె రాముడు నిన్ను నా దెగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతె రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జెరగచ్చు. ఆ సమయంలో నువ్వ
ు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావ. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళి రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దెగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి " ఆనింది.
అప్పుడు హనుమంతుడు " ఒక నరకాంతగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా ' నేను రాను ' అనడం నీకే చెల్లింది తల్లి. నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దెగ్గరికి నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యడానికి ఏదన్నా ఒక అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి " అన్నాడు.
అప్పుడు సీతమ్మ అనింది " ఒకానొకప్పుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు చిత్రకూట శిఖరాల మీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడున్న తపోభూములలో నేను, రాముడు విహరిస్తూ ఉండేవాళ్ళము. అటువంటి సమయంలో ఈశాన్య పర్వతానికి పక్కన ఉన్న ఒక చిన్న పర్వతం మీద మేము విహరిస్తున్నాము. అప్పుడు రామడు అక్కడున్న కొలనులోని నీళ్ళల్లో ఆడుకొని, తడిబట్టలతో పరిగెత్తుకుంటూ నా దెగ్గరికి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. (రాముడికి రావణుడికి అప్పటి వరకూ ఎటువంటి శత్రుత్వం లేదు. ఇంకా కొన్ని సంవత్సరాలలో అరణ్యవాసం పూర్తయ్యి రాముడు అయోధ్యకి వెళ్ళిపోతాడు. అవతార ప్రయోజనం కోసం రావణుడు సీతమ్మని ఎలాగు అపహరిస్తాడు, కాని సీతమ్మకి ఏదన్నా అపకారం జెరిగితే రాముడు ఎలా స్పందిస్తాడో చూద్దామని దేవతలు ఇంద్రుడి కొడుకైన కాకసురుడిని పంపారు. ఆ కాకాసురుడు కాకి రూపంలో పర్వతం మీద ఉంటాడు) ఆ సమయంలో నేను కొన్ని మాంసపు ఒరుగులు(వడియాలు) అక్కడ ఎండపెట్టాను. నా పక్కన కూర్చున్న రాముడు సంతోషంగా నాతో మాట్లాడుతున్నాడు.
అప్పుడు కాకసురుడనే కాకి అక్కడికి వచ్చి ఆ ఒరుగులని తినడం ప్రారంభించింది. అప్పుడు నేను ఒక మట్టిగడ్డని తీసి ఆ కాకి మీదకి విసిరాను. అప్పుడా పక్షి నా వక్షస్థలం మీద వాలి, తన ముక్కుతో గాడి వేసి నా మాంసం పీకింది. ఆ బాధలో నేను గిలగిలలాడడం వలన నా వడ్డాణం జారింది, నేను ఆ వడ్డాణాన్ని తీసి కాకి మీదకి విసరబోతే రాముడు నన్ను చూసి నవ్వి ' సీత! కాకి మీదకి బంగారు వడ్డాణం విసురుతావ ' అన్నాడు. తరువాత నేను ఆ బాధని ఓర్చుకొని రాముడి ఒడిలో తల పెట్టుకొని నిద్రపోయాను. నేను అలా రాముడి ఒడిలో తల పెట్టుకొని ఉన్నంతసేపు ఆ కాకి రాలేదు. మళ్ళి కొంతసేపటికి నేను నిద్రలేచాను, అప్పుడు రాముడు నా ఒడిలో తల పెట్టుకొని నిద్రపోతున్నాడు. అప్పుడు మళ్ళి ఆ కాకసురుడనే కాకి నా వక్షస్థలం మీద కూర్చుని, మళ్ళి గట్టిగా నా శరీరంలోకి పొడిచి నా మాంసాన్ని తినింది. అప్పుడు నా శరీరం నుండి నెత్తురుకారి రాముడి నుదిటి మీద పడింది. అప్పుడు రాముడు లేచి ఇంత నెత్తురు ఎక్కడిది అని చేసేసరికి, వక్షస్థలం నుండి నెత్తురు కారుతూ, ఏడుస్తూ నేను కనపడ్డాను. అప్పుడాయన నోటినుండి అప్రయత్నంగా ఒక మాట వచ్చింది ' ఎవడురా అయిదు తలల పాముతో ఆటలాడినవాడు ' అని గద్దించాడు. (సీతమ్మని పంచముఖ గాయత్రిగా రాముడు ఆనాడు లోకానికి చెప్పాడు) అప్పుడాయన చుట్టూ చూసేసరికి ముక్కుకి నెత్తురుతో, మాంసం ముక్కతో, కాళ్ళకి నెత్తురుతో ఒక కాకి కనపడింది.
అప్పుడు రాముడు అక్కడ ఉన్న ఒక దర్భని(గడ్డిని) తీసి, దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి(మంత్రపూరితమైన అస్త్రాలని ప్రయోగించేటప్పుడు బాణాలె అవసరంలేదు, దేనిమీదన్నా ఆ మంత్రాన్ని అభిమంత్రించి ప్రయోగించచ్చు) విడిచిపెట్టాడు. అప్పుడా బ్రహ్మాస్త్రం కాకిని తరిమింది, ఆ కాకి మూడు లోకములు తిరిగి అందరి దెగ్గరికి వెళ్ళింది, కాని అందరూ ' రాముడు చంపుతానని అస్త్ర ప్రయోగం చేస్తే మేము రక్షించలేము, నువ్వు వెళ్ళిపో ' అన్నారు. ఆ కాకి అన్ని చోట్లకి తిరిగి తిరిగి రాముడున్న చోటకి వచ్చి నమస్కారం చేస్తూ పడిపోయింది (మంత్రంతో అభిమంత్రించిన అస్త్రానికి ఒక మర్యాద ఉంటుంది. వెన్ను చూపించి పారిపోతున్నవాడిని ఆ అస్త్రం కొట్టదు, ఎదురుతిరిగి యుద్ధం చేసినవాడినే అది కొడుతుంది. కాకాసురుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఎదురుతిరగకుండా వెన్ను చూపించి పారిపోతున్నాడు కనుక అది ఆయనని సంహరించలేదు).
రాముడు ఆ కాకిని చూసి ' నా దెగ్గరికి వచ్చి పడిపోయావు కనుక నువ్వు నాకు శరణాగతి చేసినట్టె. అందుకని నేను నిన్ను విడిచిపెడుతున్నాను. కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చెయ్యాలి, మరి నువ్వు ఏమిస్తావు ' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు.
అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, దశరథుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు " అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది.
తరువాత సీతమ్మ అనింది " శత్రువులను సంహరి
ంచగలిగిన సమర్ధత కలిగిన ఓ హనుమా! నా వల్ల చిన్నదో పెద్దదో ఒక పొరపాటు జెరిగి ఉంటుంది. మా అత్తగారు కౌసల్య దేవి లోకమునంతటిని రక్షించే కొడుకుని కనింది, ఆ రాముడి పాదాలకు సాంజలి బంధకంగా నమస్కరించానని చెప్పు. దశరథ మహారాజు మరణించినా కూడా రాముడు ఆ బాధని పొందలేదు అంటె లక్ష్మణుడు పక్కన ఉండడమే కారణం. వదినని తల్లిలా చూసే స్వభావం ఉన్నవాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు నాకు కొడుకుతో సమానమైనవాడు, ఆ లక్ష్మణుడిని కుశలమడిగానని చెప్పు. సుగ్రీవుడిని కుశలమడిగానని చెప్పు. హనుమా! నీ యొక్క వాక్కుల ద్వారా రామచంద్రమూర్తి మనస్సులో నాయందు ఉన్నటువంటి ప్రేమని ఉద్దీపింప చేసి నన్ను తొందరలో తీసుకువెళ్లేటట్టు చెయ్యి " అనింది.
అప్పుడు హనుమంతుడు " అమ్మా! కాకాసుర వృత్తాంతం చెప్పావు, దీనితోపాటుగా ఇంకొక అభిజ్ఞానాన్ని ఇస్తావా, తీసుకువెళతాను " అన్నాడు.
అప్పుడు సీతమ్మ తన పవిట కొంగుకి కట్టి ఉన్న మూటని విప్పి, అందులో ఉన్న చూడామణిని ఇచ్చింది. (చూడమణి సముద్రజలాల నుండి పైకి వచ్చింది. దానిని దేవేంద్రుడు జనకుడికి ఒక యాగంలో బహూకరించాడు) ఈ చూడామణిని వివాహ సమయంలో నా శిరస్సుయందు మా అమ్మ అలంకరించింది. నువ్వు దీనిని రాముడికి ఇవ్వు, అప్పుడు రాముడికి ఏకకాలంలో ముగ్గురు జ్ఞాపకానికి వస్తారు, మా అమ్మ, దశరథుడు, నేను రాముడికి జ్ఞాపకం వస్తాము " అనింది.
హనుమంతుడు ఆ చూడామణిని కన్నులకి అద్దుకుని, రాముడు ఇచ్చిన ఉంగరాన్ని ఎలా భద్రపరుచుకున్నాడో, అలా చూడామణిని కూడా జాగ్రత్తగా భద్రపరుచుకున్నాడు. సీతమ్మ ఆభరణం చేతిలో పడగానే ఆయనకి విశేషమైన శక్తి, ధైర్యం కలిగింది.
మళ్ళి సీతమ్మ అనింది " ఒకనాడు నేను రాముడితో కలిసి విహరిస్తున్న సమయంలో నా నొసటన పెట్టుకున్న తిలకం మరుగునపడింది. అప్పుడు రాముడు అక్కడున్న ఒక కుంకుమ శిలని అరగదీసి నా బుగ్గమీద చుక్క పెట్టాడు. ఈ విషయాన్ని కూడా రాముడికి జ్ఞాపకం చెయ్యి " అనింది.
అప్పుడు హనుమంతుడు " నేను బయలుదేరతాను " అంటె, " నాయన! 10 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కాని ఒక్కనాడు రామనామం వినలేదు. ఇన్నాళ్ళకి నువ్వు వచ్చి రామ కథ చెప్పావు. నా మనస్సు పొంగిపోయింది. అంత తొందరగా నువ్వు వెళ్ళిపోతాను అంటె నాకు చాలా బెంగగా ఉంది. ఎక్కడైనా ఒక రహస్యమైన ప్రదేశంలో ఇవ్వాళ ఉండి, రేపు నాకు కనపడి మళ్ళి ఒక్కసారి ఆ రామకథ నాకు చెప్పవయ్యా. ఇవ్వాల్టికి ఉండిపోవా హనుమా " అని, ఇంటినుంచి దూరంగా వెళ్ళిపోతున్న కొడుకుని కన్నతల్లి అడిగినట్టు సీతమ్మ హనుమంతుడిని అడిగింది.
అప్పుడు హనుమంతుడు అన్నాడు " అమ్మ! నువ్వు బెంగపడవద్దు. రాముడు కూడా నీమీద బెంగ పెట్టుకుని శోకిస్తున్నాడు " అన్నాడు. 
అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పిన మాట నాకు మళ్ళి శోకం కలిగిస్తోంది. రాముడు నాకోసం శోకిస్తున్నాడన్న మాట చాలా బాధగా ఉంది. హనుమ! నువ్వు వస్తావు, గరుగ్మంతుడు వస్తాడు, వాయుదేవుడు వస్తాడు 100 యోజనముల సముద్రాన్ని దాటి. ఇంక ఎవరూ ఇక్కడికి రాలేరు, మరి రావణ సంహారం ఎలా జెరుగుతుంది? " అనింది.
మత్‌ విశిష్టాహ్‌ చ తుల్యాహ్‌ చ సంతి తత్ర వన ఒకసహ్‌ |
మత్తహ్‌ ప్రత్యవరహ్‌ కశ్చిన్‌ న అస్తి సుగ్రీవ సన్నిధౌ ||
హనుమంతుడు అన్నాడు " సుగ్రీవుడి దెగ్గర నాతో సమానమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, నాకన్నా అధికమైన బలం ఉన్నవాళ్లు ఉన్నారు, కాని నాకన్నా తక్కువ బలం ఉన్నవాడు సుగ్రీవుడి దెగ్గర లేడమ్మా. (ఈ మాట హనుమంతుడి వినయానికి నిదర్సనం) నేను వెళ్ళి రాముడికి చెప్పి తొందరలోనే వానర సైన్యంతో లంకా పట్టణానికి వచ్చి, రావణుడిని సంహరిస్తాము " అన్నాడు.

నరదృష్టి తొలగిపోవాలంటే..

నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.
అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు.
అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి.
ఈతిబాధలు తొలగిపోతాయి. శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

Friday, March 30, 2018

మీకు తెలుసా

మీకు తెలుసా
1.అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.
2.సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.
3.బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమాట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన  కోపమట.
4.శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రి ని చులకన చేసిన కోపమట. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.
5. పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.
6.శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.
7. అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.
8. జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.
9. రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట. ఈయన భ్రమ మాయ కి కారణము.                

వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు

వేంకటేశ్వరునికి ఆలయం కట్టించిన తొండమానుడు
ప్రస్తుతం కాంచీపురంగా పిల్చుకునే ఒకప్పటి తొండైమండలం సామ్రాజ్యానికి అధిపతి తొండమానుడు. ఒకరోజు తొండమానుడు ఓ మధుర స్వప్నాన్ని కన్నాడు. ఆ కలలో విష్ణుమూర్తి కనిపించి ఇలా చెప్పాడు.
''భక్తా, పూర్వజన్మలో నీ పేరు రంగదాసు. నీకు స్త్రీ వ్యామోహం లేకుండా చేసి, నిన్ను మహారాజుగా చేశాను. క్రమంగా మనమధ్య బాంధవ్యం పెరిగింది. అనుబంధం పెనవేసుకుంది. ప్రస్తుతం నేను వేంకటేశ్వరునిగా శేషాచలమున స్థిర నివాసం ఏర్పరచుకో దలచాను. కలియుగం అంతమయ్యేవరకు వేంకటేశ్వరుని అవతారంలో, కొండమీదే ఉంటాను. కనుక నువ్వు నాకోసం ఒక ఆలయాన్ని నిర్మించాలి. శ్రీ వరాహస్వామి పుష్కరిణి పక్కన ఆలయ నిర్మాణం కోసం స్థలం కేటాయించాడు. అక్కడ నువ్వు వెంటనే ఆలయాన్ని కట్టించు..'' అన్నాడు.
వేంకటేశ్వరుని మాటలు విన్న తొండమానుడు - ''సంతోషం స్వామీ, గొప్ప మాట సెలవిచ్చారు.. తమరు కోరిన విధంగా తక్షణం ఆలయం నిర్మిస్తాను...'' అని బదులిచ్చాడు.
అంతటితో తొండమానుడికి మెలకువ వచ్చేసింది. ఇక ఆతనికి ఆకాశంలో తెలిపోతున్నట్టుగా ఉంది. స్వామివారు తనకు స్వప్నదర్శనం ఇవ్వడం అంటే సామాన్యమైన సంగతి కాదు. పైగా తనకో గుడి కట్టించమంటూ బృహత్తర బాధ్యత అప్పజెప్పాడు. అది కేవలం కలగా అనిపించలేదు. వేంకటేశ్వరుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. స్వయంగా చెప్పిన భావనే కలిగింది. సంతోషంతో మురిసిపోయాడు. శ్రీనివాసుని కోసం ఆలయం నిర్మించేందుకు ఆప్తులతో చర్చించాడు, ప్రణాళిక రచించాడు.
తొండమానుడు వెంటనే విశ్వకర్మను రప్పించాడు. మంచి ముహూర్తం చూసి ఆలయ నిర్మాణం కోసం పునాదులు వేయించాడు. కేవలం దేవాలయం, గర్భగుడి, ధ్వజస్తంభంతో సరిపెట్టకుండా బ్రహ్మాండంగా కట్టించాలి అనుకున్నాడు. తొండమానుడు అనుకున్నట్టుగానే, అనతికాలంలోనే దేవాలయ నిర్మాణం పూర్తయింది. విశాలమైనపాకశాల, సువిశాలమైన గోశాల, గజశాల, అశ్వశాల, బంగారు బావి, మంటపాలు, ప్రాకారం, గోపురం - ఇలా అనేక గదులతో ఆలయం బహు గొప్పగా రూపొందింది.
ఆలయం అపురూపంగా ఉంటే సరిపోతుందా? గుడిని చేరడానికి మార్గం సుగమంగా ఉండాలి కదా. అందుకోసం కొందరు భక్తులు శేషాచలం చేరడానికి రెండువైపులా దారులు ఏర్పరిచారు. సోపానాలు నిర్మించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా మంటపాదులు నిర్మించారు.
ఆలయ నిర్మాణం, గుడికి వెళ్ళే రహదారి, సోపానాలు పూర్తయిన తర్వాత విషయాన్ని వేంకటేశ్వరునికి తెలియజేశాడు తొండమానుడు. వేంకటేశ్వరుడు ఈ వర్తమానాన్ని సవివరంగా ముల్లోకములకు తెలియపరిచాడు. అప్పుడు బ్రహ్మ, మహేశ్వరుడు, ఇతర దేవతలు అందరూ కలిసి శేషాచలం చేరుకున్నారు. శుభ ముహూర్తం చూసి వేంకటేశ్వరుడు పద్మావతీ సమేతుడై ఆలయమున ఆనంద నిలయంలో ప్రవేశించాడు. అది అద్భుతమైన, అపురూపమైన వేడుక. అత్యంత కమనీయంగా, రమణీయంగా జరిగింది. ఆ వేడుకను చూట్టానికి రెండు కళ్ళూ చాల్లేదు.
వేంకటేశ్వరుడు ఆలయంలో ప్రవేశించే సమయంలో దేవతలు పూవులు జల్లారు. అతిధులకు పంచభక్ష్య పరమాన్నాలతో విందుభోజనం ఏర్పాటు చేశారు. దక్షిణ, తాంబూలాలు ఇచ్చారు. వస్త్రాలు, ఆభరణాలు సమర్పించారు. ఆవిధంగా దేవతలందరినీ సగౌరవంగా సత్కరించి పంపారు.
తిరుమల వేంకటేశ్వరుని ఆలయ వివరాలు పురాణాల్లో ఈవిధంగా ఉన్నాయి. మొత్తానికి తొండమానుడు కట్టించిన దేవాలయాన్ని చోళులు అభివృద్ధి చేశారు. తర్వాత పల్లవరాజులు, తంజావూరు చోళులు, విజయనగర రాజులు దేవాలయాన్ని మరింత తీర్చిదిద్దారు.
 జై శ్రీమన్నారాయణ 


సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి

సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి
గోదావరి తీరంలోని ప్రసిద్ధ క్షేేత్రాలలో ధర్మపురిలోని లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రం ఒకటి. ఈ ప్రాంతాన్ని ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించడంతో ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. కరీంనగర్‌ జిల్లాలోని ఈ క్షేత్రము క్రీ.శ.850-928 సంవత్సరాల కాలం కంటే పురాతనమైనదని చరిత్ర చెబుతోంది. కాగా క్రీ.శ. 1422-1436 సంవత్సరముల మధ్యకాలంలో బహుమనీ సుల్తానుల దండయాత్రలో ధ్వంశమై తిరిగి 17వ శతాబ్దంలో ఈ ఆలయము పునరుద్ధరింపబడినట్లు క్షేత్ర చరిత్ర ఆధారముగా తెలుస్తోంది.
*సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్న స్వామివారు*
ఈ క్షేత్రములో ప్రధాన దేవత అయిన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి సాలగ్రామ శిలగా దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రానికి ఆనుకుని పవిత్ర గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహిస్తున్నందున ఈ క్షేత్రము దక్షిణకాశీగా, తీర్థరాజముగా, హరిహర క్షేత్రముగా వెలుగొందుతోంది. ఈ క్షేత్రములో శ్రీ బ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడైన శ్రీ నరసింహస్వామి మరియు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువైన క్షేత్రము కనుక ఈ క్షేత్రము త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలువబడుతున్నది.
ఈ క్షేత్రాన్ని మూడుసార్లు దర్శిస్తే మూడు జన్మల పాపాలూ దూరమవుతాయి.
ఈ ఆలయ ప్రాంగణములో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మరాజు వారి ఆలయము కూడా కలదు. అందుకే ‘ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు’ అనే నానుడి ప్రచారంలో ఉంది. ఈ ఆలయ ప్రాంగణములో ప్రధాన దేవాలయంతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ ఉగ్ర నరసింహస్వామి, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ వేణుగోపాలస్వామి, శ్రీ యమధర్మరాజు, శ్రీ రామలింగేశ్వరస్వామి మరియు సంకష్ట వినాయకస్వామి వార్ల ఆలయములు ఉన్నాయి.
ఇలాంటి క్షేత్రము ప్రాచీన పుణ్యక్షేత్రముగా, చారిత్రాత్మకముగా చాలా ప్రసిద్ధి గాంచినది. ఈ ధర్మపురి క్షేత్రము వేదములకు, ప్రాచీన సంస్కృతికి, సంగీతానికి, సాహిత్యానికి, కవిత్వానికి పుట్టినిల్లుగా ప్రసిద్ధిగాంచింది. ఈ ధర్మపురి క్షేత్రములో బ్రహ్మ పుష్కరిణితో పాటు అనేక ప్రాచీన దేవాలయాలు కూడా ఉన్నాయి.
ఈ క్షేత్రము నందు సత్యవతి ఆలయము(ఇసుకస్తంభం) నకు చాలా ప్రాశస్త్యము ఉంది. మరియు ఈ క్షేత్రమునందు ప్రవహిస్తున్న గోదావరి నదిలో బ్రహ్మగుండం, సత్యవతి గుండము, యమగుండం, పాలగుండములు, చక్రగుండం కలవు. మరియు ఈ క్షేత్రములో గోదావరి నది దక్షిణ దిశగా ప్రవహిస్తున్నందున ఇట్టి క్షేత్రమునకు భక్తులు మూడు పర్యాయములు వచ్చి గోదావరిలో స్నానమాచరించి శ్రీ స్వామి వారిని దర్శించినచో మూడు జన్మలలో చేసిన పాపములు తొలగుతాయని శ్రీ దత్తాత్రేయ పురాణములోఉంది. కావున భక్తులు ఈ క్షేత్రములోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నచో మానసిక, శారీరక ఋణబాధల నుండే కాక ఆయురారోగ్యములు అష్టైశ్వర్యములు ప్రసాదించునని భక్తులకు అపారమైన నమ్మకము.
ఈ దివ్య క్షేత్రములో శ్రీ స్వామివారి బ్రహ్మూెత్సవములు ప్రతి సంవత్సరము పాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి 13 రోజులపాటు అత్యంత వైభవముగా నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రతి సంవత్సరము వైశాఖ మాసములో 9 రోజులు శ్రీ నృసింహ జయంతి ఉత్సవముతో పాటు ధనుర్మాసములో ముక్కోటి ఏకాదశి ఉత్సవము అత్యంత వైభవముగా జరుగును. మరియు ప్రతి 12 సంవత్సరములకు ఒకమారు గోదావరికి పుష్కరాలు జరుగుతాయి.
*నిత్య సేవలు*
ఉదయం ఐదు గంటలకు ఆలయం తెరుస్తారు. ఏడు గంటలవరకూ సుప్రభాత సేవ నిర్వహిస్తారు. ఉదయం ఆరుగంటల నుంచి ఎనిమిది గంటల వరకూ అభిషేకం నిర్వహించిన అనంతరం 9.00గంటల నుంచీ 10.00 గంటల వరకూ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. ఆలయంలో ఉదయం 10.00 గంటల నుంచి 11.00 గంటల వరకూ నిత్యహోమం జరుగుతుంది. ఉదయం 11.00 గంటల నుంచి 12.00 గంటల వరకూ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మధ్యాహ్నం 12.00 నుంచి 2.00 గంటల వరకూ భక్తులను దర్శనానికి అనుమతిస్తూ మహార్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకూ ఆలయం మూసి ఉంటుంది.
సాయంత్రం 4.00 గంటల నుంచి 5.00 గంటల వరకూ భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పిస్తారు. అదే సమయంలో మహార్చన కూడా నిర్వహిస్తారు.
సాయంత్రం 5.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ నిత్యసేవల్లో భాగంగా పల్లకీసేవ ఉంటుంది. అనంతరం 7.00 గంటల వరకూ మహార్చన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 7.00 నుంచి 7.15 గంటల మధ్యకాలంలో మహానివేదన, హారతి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రాత్రి 8.00 గంటల వరకూ మహార్చనతోపాటు దర్శన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అనంతరం రాత్రి 8.00 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు.
*హిందూ దేవాలయాలకు వేదిక*
ధర్మపురి ప్రముఖ హిందూ దేవాలయాలకు వేదికగా కూడా భాసిల్లుతోంది.
ఇక్కడ బ్రహ్మ, యమధర్మరాజు, శివుడు, వెంకటేశ్వరస్వామి నిజరూపాల్లో దర్శనమిస్తారు. ధర్మపురిలో ఇంకా పలు సందర్శనీయ ప్రాంతాలు కూడా ఉన్నాయి. శ్రీయోగ నరసింహస్వామి, శ్రీఉగ్ర నరసింహస్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి, దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి, శ్రీ సంతోషిమాత దేవాలయం, శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం, శ్రీ గౌతమేశ్వరాలయం, శ్రీ మహాలక్ష్మి ఆలయం, శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వరి ఆలయం తదితరాలు చూడదగిన ప్రముఖ ప్రాంతాలు.
ధర్మపురికి 10 కిలోమీటర్ల దూరంలోని గూడెం గ్రామంలో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఒకటి ఉంది. 45 కిలోమీటర్ల దూరంలోని కొండగట్టు వద్ద ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయం ధర్మపురికి 70 కిలోమీటర్లదూరంలో ఉంది. ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని దర్శించడానికి వచ్చిన భక్తులు చూసి తరించవలసిన ప్రాంతాలే. యాత్రీకులు ధర్మపురి, బాసర రెండు ప్రాంతాలను ఒకేసారి దర్శించుకునేలా ప్రణాళిక వేసుకోవచ్చు.
బాసర ధర్మపురికి 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి బాసర సరస్వతి దర్శనం అనంతరం సాయంత్రం వేళల్లో ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవచ్చు.
*ఎలా చేరుకోవాలి*
ధర్మపురి న్యూఢిల్లీ, చెన్నై హైవే మీద ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రోడ్డుమార్గం గుండా చేరుకునేందుకు అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సు సదుపాయాలు ఉన్నాయి.
హైదరాబాద్‌, కరీంగనర్‌, జగిత్యాల, వేములవాడ, మంచిర్యాల, నాగపూర్‌, ముంబయి, నాందేడ్‌ తదితర ప్రాంతాల నుంచి ధర్మపురికి రోడ్డుమార్గం గుండా చేరుకోవచ్చు. దగ్గరలో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ ఉంది.
曆

రాత్రివేళల్లో పూజలందుకునే వారాహి దేవత



వారాహిమాత

రాత్రివేళల్లో పూజలందుకునే
వారాహి దేవత

*మన పురాణాల ప్రకారం* శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్తమాతృకాలు.
వీరే *బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి.*

కొన్ని నమ్మకాల ప్రకారం ఎనిమిదో మాతృకగా నారసింహినీ మరికొన్ని సంప్రదాయాలలో తొమ్మిదవ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది.
దుష్టశిక్షణ కోసమూ, భక్తులకు కాచేందుకు
*ఈ సప్తమాతృకలు సిద్ధంగా ఉంటారు.*

*వీరిలో ఒకరైన వారాహి విశేషాలు...*

వరాహుని స్త్రీతత్వం;
పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి, భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి.

*ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు.*
దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది.

ఆయా పురాణాలలో అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి *రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర సుస్పష్టంగా కనిపిస్తుంది.*

*రూపం*

*వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది.*

ఈమె శరీరఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు.

*సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో, ఎనిమిది చేతులతో కనిపిస్తుంది.*

అభయవరద హస్తాలతో... శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది.

*గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి* *వివిధ వాహనాల మీద*
*ఈ తల్లి సంచరిస్తుంది.*

*ఆరాధన*

*తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత.* అందుకే ఈమెను రాత్రివేళల్లో పూజించడం కద్దు.

*వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రివేళల్లోనో, తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది.*

దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి (ఒడిశా), వారణాసి, మైలాపుర్లలో ఉన్న ఈమె ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ.

*సైన్యాధ్యక్షురాలు*

*లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు.* అందుకే ఈమె ప్రస్తావన లలితాసహస్రనామంలో కూడా కనిపిస్తుంది.

ఆ లలితాదేవి తరఫున పోరాడేందుకే కాదు, *భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి.* *ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయనీ, శత్రుభయం ఉండదనీ, జ్ఞానం సిద్ధిస్తుందనీ, కుండలినీ శక్తి జాగృతమవుతుందనీ... తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం.*

వారాహిదేవి పేర ఉన్న మూలమంత్రాలను, *అష్టోత్తరాలనూ పఠిస్తే సకలజయాలూ సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం*

曆

Sunday, March 25, 2018

శ్రీ రామ శబ్దం లోని గొప్పదనాన్ని తెలుసుకుందాం.



శ్రీ రామ శబ్దం లోని గొప్పదనాన్ని తెలుసుకుందాం.

పార్వతి పరమ శివుణ్ణి ఇలా అడుగుతుంది. స్వామి !విష్ణు సహస్ర నామాల్ని సులభంగా ఎలాపలకవచ్చు అని.

"కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం,
పఠ్యతైర్పండితైర్నిత్యం శ్రోతుమిచ్చామి అహం ప్రభో "అని.

అపుడు శివుడు ఇల చెప్తాడు.

"శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే"

అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణుసహస్రనామాలుచదివిన ఫలితం వస్తుంది అని. పై శ్లోకంలో "రమే రామే,వరాననే,మనో
రమే"అన్న పదాలు,పార్వతిని ఉద్దేసించి తెల్పినవి.ఇంక మిగిలిన వాటిలో శ్రీరామ,రామ, రామేతి అన్న మూడుపదాలే సహస్ర నామాలికి సమానాలు అని. దీనిని గూర్చి పెద్దల చెప్పినవివరణ చుద్దాం.రామ పదంలో మొదటి అక్షరం'రా'ఇది య,ర,ల,వల్లో ర రెండవ
అక్షరం.రామ లో రెండవ అక్షరం మ ఇది ప,ఫ,బ,భ,మ వర్గలో మ ఐదవ అక్షరం.

సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత
ఐదుని గుణిస్తే 2*5=10 అవుతుంది .

అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10* 10 = 100 అవుతుంది. ఇప్పుడు
మూడవ రామ శబ్దాన్ని పది చేత వందని గుణిస్తే 10*100 = 1000 అవుతుంది .

ఇలా 'శ్రీ రామ ,రామ , రామ ఇతి అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .అని పరమ శివుడు పార్వతికి తేల్పేడు . ఇంకా రామనామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగామారుతాడు,రామ నామం వల్ల
శబరి,గుహుడు,హనుమ,సీతామాత,ఇలా ఎందరోపునీతులౌతారు.
ఇంకా 'రా' అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి.
అంటేమనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి,అన్నమాట.ఇక 'మా'పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి.బైటికి పోయిన
పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనా చెప్పవచ్హు.వశిష్టుడు

"ఓం నమో నారాయణాయ"

అన్న అష్టాక్షరి మంత్రం నుండీ’రా'అన్న అక్షరాన్ని,

"నమ శ్శివాయ"

అన్న పంచాక్షరి మంత్రం లోంచి 'మ'అన్న అక్షరాన్ని
గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు,అష్టాక్షరి,
పంచాక్షరి మంత్రాలు జపించినట్లే. ఈ విధంగా రామాయణంలో రత్నాల వంటి విషయాలు ఎన్నైనా
చెప్పుకోవచ్చును.

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!!
సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే !!

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!!
సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే !!

శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే!!
సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే !!

జై శ్రీరామ్ !!జపమనగా :

శ్లో// జకారో జన్మ విచ్ఛేదః పకారః పాపనాశకః/

తస్మాజ్జప ఇతి ప్రోక్తో జన్మ పాపవినాశకః //

‘జ’ కారము జన్మ నాశనమును ( మోక్షము ను ), ‘ప’ కారము పాపనాశనమును సూచించును. అనగా పాపములను నాశనము చేసి, మరల జనన మరణములు లేకుండా మోక్షమొసంగు నట్టిది గనుకనే " జపం" అని చెప్పబడినది.

శ్లో// ప్రణవో థనుః శరో హ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే/

అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయోభవేత్//

భగవన్నామమైన ‘ఓం’ కారము ధనుస్సు. ఆత్మయైన సాధకుడే బాణము. బ్రహ్మమును చేరుటే అతని లక్ష్యము. సాధకుడు అటువంటి ఓం కారము అనెడి థనస్సును ఊతము చేసుకుని, నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మమును గురిచూసి కొట్టిన యెడల ఆత్మ బ్రహ్మమునందు జేరి తానే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.

జపానికి ఇంతటి శక్తి ఉంటే!, ఇక " శ్రీ రామ" నామ జపానికి ఎంతటి శక్తి ఉన్నదో చెప్పుట మానవమాత్రుల వలన సాధ్యమా!?

శ్రీ రామ నామ మహిమ :

శ్లో// గాణాపత్యేషు శైవేషు శాక్త సౌరేష్వభీష్టశః

వైష్ణవేష్వపి సర్వేషు రామ మంత్రః ఫలాదికః//

తా: గణేశ, శైవ, శక్తి, సూర్య, వైష్ణవ మంత్రములన్నింటికంటెనూ అధిక ఫలము ఈ రామ నామ జపము వలన కలుగు తుంది.

రామ నామము జపించుచుండుట వలన గాని, ఈ రామ నామమునే మరణాసన్నులైన వారి కుడి చవిలో ఉపదేశించుట వలన గానీ, ఎవరయినను మోక్షము బొందెదరని శ్రీరాము శివునకు ఉపదేశించెనట.

"ర" అగ్ని బీజం - దహింప జేయునది,

" ఆ" వాయు బీజం - సర్వగతము, ఆకర్షకము,

"మ" ఆకాశ బీజం - శతృ మోహన కరము

ఇటువంటి అగ్ని బీజ, వాయుబీజ, ఆకాశ బీజ సమ్మిళితమైన " శ్రీ రామ" నామ మహిమ ఇంతా అంతా అని చెప్పనలవి కాదు.

శ్లో// చిద్వాచకో ర కారస్స్యాత్ సద్వాచ్యో2కార ఉద్యతే/

మకారానంద వాచస్స్యాత్ సచ్చిదానంద మవ్యయమ్//

"ర" కారము చిత్తు, "ఆ" కారము సత్తు, "మ" కారము ఆనందము. వీటి సంయోగముచే నాశరహితమైన "సచ్చిదానంద రూపమే శ్రీరామ"నామము.

అలాగే "ర" కారము వైరాగ్యమునకు హేతువు, "ఆ"కారము ఙ్ఞాన కారణము, "మ" కారము భక్తికి కారణము కనుక నిత్యము రామనామమను జపించు వారలకు భక్తి, ఙ్ఞాన, వైరాగ్యములు కలుగును.

శ్లో// "తర్జనం యమ దూతానాం రామ నామేతి గర్జనం//"

‘రామ రామ ’ అని క్షణ క్షణము జపించుచుండట వలన యమ దూతలు దరికి జేరుటకు కూడా భయపడి దూరముగా పారిపోవుదురు.

శ్లో// అఙ్ఞానాదధ వాఙ్ఞానా దుత్తమ శ్లోక నామయత్/

సంకీర్తిత మఘం పుంసోదహేత్యేవ యథానలః //

ప్రజ్వరిల్లెడి అగ్ని కట్టెలను కాల్చు చందమున, భగవన్నామ శక్తి తెలిసి కాని, తెలియక కాని ఏవిధంగా చేసినా మానవుల యొక్క పాపములను దహించి వేయును.

కనుక అటువంటి ‘రామ’ నామజపాన్ని మనము చేయుట వలన జన్మజన్మాంతరములలో చేసిన పాపములన్నీ నాశనమొంది ఇహమున సమస్త సంపదలూ పొందటమే కాక, పరమున మోక్ష ప్రాప్తిని పొందుదురు.

రామనామాన్ని గురించిన చక్కని కథ ఒకటి ఉంది...

త్రేతాయుగంలోనే శ్రీ రాములవారు రాజ్యం చేస్తున్నప్పుడు ఒక రామభక్తుడు ఉండేవాడు. నిరంతర ‘శ్రీ రామ’ నామ జపం చేసేవాడు. ఎక్కడ రామనామం, రామకథ చెప్పబడుతుందో అక్కడే హనుమ ఉంటారు కదా! అలా ఒకరోజు ఆ భక్తుని వెనక అదృశ్యంగా అతనితోపాటే తిరుగుతూ అరమోడ్పు కన్నులతో రామనామ పారవశ్యంలో మునిగితేలుతున్నారు హనుమ. ఐతే కొంత సమయానికి ఆ భక్తునికి లఘుశంక తీర్చుకోవలసి వచ్చి ఆ సమయంలో కూడా రామనామ జపం సాగిస్తూనే ఉన్నాడు. అది చూసిన హనుమంతులవారికి పట్టరాని ఆగ్రహం వచ్చి తన తోకతో ఆ భక్తుని వీపుమీద ఒక్క దెబ్బ కొట్టారు. ఆ భక్తుడు ఆ నొప్పికి తాళలేక ‘రామా’ అని ఆర్తితో అరిచాడు. అలా అనగానే ఆశ్చర్యంగా ఆనొప్పి తగ్గిపోయింది. అదే సమయంలో ఇటువంటి వాడి చుట్టూనా నేను రామనామం కోసం తిరిగింది!? అని హనుమ అక్కణ్ణుంచి తిరిగి రాజ ప్రసాదానికి చేరుకున్నారు.

రాజ ప్రాసాదంలో అంతా ఒకటే కోలాహలం గా ఉంది. రాములవారికి ఆరోగ్యం బాలేదు, ఉన్నట్టుండి విరుచుకు పడిపోయారు. వారిని శయనాగారంలోకి తీసుకెళ్ళి పడుక్కోపెట్టారు. ఎవ్వరినీ లోపలకి పంపట్లేదు. కేవలం సీతమ్మ, లక్ష్మణ భరత శత్రుఘ్నులే ఉన్నారు. రాముల వారు హంసతూలికా తల్పం మీద వెల్లకిల్లా పడుక్కుని ఉన్నారు. వారి వీపుమీద ఒక పెద్ద వాత ఉన్నది. సీతమ్మ ఆ వాత వల్ల కలిగిన నొప్పి, మంట తగ్గడానికి రకరకాల ఔషధాలతో కలిపిన నవనీతం రాస్తూఉన్నది. హనుమ వచ్చారని తెలియగానే లక్ష్మణాదులు సీతమ్మ "లోపలికి ప్రవేశపెట్టండి ఆయనే మళ్ళీ ఏ హిమాలయాలకో వెళ్ళి ఏ మూలికో తీసుకొచ్చి రాములవారి నొప్పి తగ్గించగలరు" అని చెప్పగా హనుమను లోపలకి అనుమతించారు. లోనికి వచ్చి చూసిన హనుమ ఆగ్రహోదగ్రుడై అసలెవరు ఈ పని చేసింది ఎవరు కొట్టారు స్వామిని అంటూ నరసింహావతారం ఎత్తి రుద్రుడై తాండవం చేయసాగారు. అప్పుడు నొప్పితోఉన్న శ్రీరాములవారు ’నువ్వే కదా హనుమా ఆ భక్తుని నీ తోకతో కొట్టావు. అతడు ఆ నొప్పి భరించలేక రామా అని అరిచాడు. ఒకవేళ అతని నొప్పి నేను తీసుకోకపోతే నీ దెబ్బకి బ్రతకగలిగేవాడా!? నేనే ఇంత బాధపడుతున్నాను’అని అనగా, హనుమ జరిగిన అనర్థాన్ని తెలుసుకుని క్షమించమని రామపాదాలని ఆశ్రయించి నమస్కరించి, స్వామీ మీ నొప్పికి మందుకూడా తెలిసింది అని ఒక్క క్షణంలో ఎగిరి ఆ భక్తుని దగ్గరికి వెళ్ళి ఆ భక్తుని జరిగింది సూక్ష్మంగా చెప్పి, ఆ భక్తుని నిరతిశయ భక్తికి మెచ్చి, అతనిని తీసుకుని వెంటనే స్వామి వద్దకు వచ్చి, అమ్మవారు వ్రాస్తున్న ఔషధపు నవనీతాన్ని తాను కొద్దిగా తీసుకుని, ఆ భక్తునికి కొద్దిగా ఇచ్చి శ్రీరాములవారికీ సీతమ్మకూ నమస్కరించిన తరవాత రామ నామ గానం చేస్తూ.. ఇద్దరూ కలిసి ఆ వాతకు ఆ వెన్నపూస పూత పూయగా రాములవారి నొప్పి మంట వారి వీపు మీద వాత అన్నీ పోయాయి.

ఇక హనుమ ఆ భక్తుని ఆనందంతో ఆలింగనం చేసుకుని "చూసావా నాయనా రామ నామ మహిమ! ఏ రామనామం భక్తుడు పలకడం వల్ల శ్రీరాముడు ఆ భక్తుని కష్టం తీసుకుని తానే బాధ పడ్డాడో, అటువంటి రాముని బాధనుకూడా పోగొట్టగలిగేది కూడా రామభక్తుల నోటియందుండే రామనామమే"అని చెప్పి అతనిని ఆశీర్వదించి పంపారు.

కనుక ఇటువంటి రామనామన్ని మనం చేస్తూ నలుగురి చేతా చేయిస్తూ పునీతులమౌదాం నూట ఎనిమిది నామాలలో సంపూర్ణ రామాయణం.

1.శుద్ధబ్రహ్మ పరాత్పర రామ
2.కాలాత్మక పరమేశ్వర రామ
3.శేషతల్ప సుఖనిద్రిత రామ
4.బ్రహ్మద్యమర ప్రార్ధిత రామ
5.చందకిరణ కులమండన రామ
6.శ్రీమద్దశరధనందన రామ
7.కౌసల్యాసుఖవర్ధన రామ
8.విశ్వామిత్రప్రియధన రామ
9.ఘోరతాటకఘాతక రామ
10.మారీచాదినిపాతక రామ
11.కౌశిక మఖసంరక్షక రామ
12.శ్రీ మదహల్యో ద్దారక రామ
13.గౌతమమునిసంపూజిత రామ
14.సురమునివరగణసంస్తుత రామ
15.నవికధావితమృదుపద రామ
16.మిధిలాపురజనమోదక రామ
17.విదేహమానసరంజక రామ
18.త్రయంబకకార్ముకభంజక రామ
19.సితార్పితవరమాలిక రామ
20.కృతవైవాహిక కౌతుక రామ
21.భార్గవదర్పవినాశక రామ
22.శ్రీ మాధయోద్యా పాలక రామ
23.ఆగణితగుణగణభూషిత రామ
24.అవనితనయాకామిత రామ
25.రాకాచంద్రసమానన రామ
26.పితృవాక్యాశ్రితకానన రామ
27.ప్రియగుహావినివేధితపద రామ
28.తత్ క్షాళితనిజమృదుపద రామ
29.భరద్వాజముఖానందక రామ
౩౦.చిత్రకూటాద్రినికేతన రామ
31.దశరధసంతతచింతిత రామ
32.కైకేయీతనయార్థిత రామ
౩౩.విరచితనిజపాదుక రామ
34.భారతార్పిత నిజపాదుక రామ
35.దండకవనజనపావన రామ
36.దుష్టవిరాధవినాశాన రామ
37.శరభoగసుతీక్షార్చిత రామ
38.అగస్త్యానుగ్రహవర్ధిత రామ
39.గృద్రాధిపగతిదాయక రామ
40.పంచవటీతటసుస్థిత రామ
41.శూర్పణఖార్తి విధాయక రామ
42.ఖరదూషణముఖసూదక రామ
43.సీతాప్రియహరిణానుగ రామ
44.మరిచార్తికృదాశుగా రామ
45.వినష్ట సేతాన్వేషక రామ
46. గృధ్రాధిపగతిదాయక రామ
47.శబరిదత్తఫలాశన రామ
48.కబంధభాహుచ్చేధన రామ
49.హనుమత్సేవితనిజపద రామ
50.నతసుగ్రివభిష్టద రామ
51.గర్వితవాలివిమోచక రామ
52. వానరదుతప్రేషక రామ
53.హితకరలక్ష్మణసంయుత రామ
54.కపివరసంతతసంస్మృత రామ
55.తద్గతి విఘ్నద్వంసక రామ
56.సీతాప్రాణాదారక రామ
57.దుష్టదశాన ధూషిత రామ
58. శిష్టహనూమద్భూషిత రామ
59.సీతూధితకాకావన రామ
60.కృతచూడామణిదర్శన రామ
61. కపివరవహనశ్వాసిత రామ
62.రావణధనప్రస్థిత రామ
63.వనరసైన్యసమావృత రామ
64.శొశితసరిధీశార్థిత రామ
65.విభిషణాభయదాయక రామ
66. సర్వతసేతునిభందక రామ
67.కుంబకర్ణ శిరశ్చెదక రామ
68.రాక్షససంఘవిమర్ధక రామ
69.ఆహిమహిరావణ ధారణ రామ
70.సంహ్రృతదశముఖరావణ రామ
71.విభావముఖసురసంస్తుత రామ
72.ఖస్థితధశరధవీక్షిత రామ
73.సీతాదర్శనమోదిత రామ
74.అభిషిక్త విభీషణ రామ
75.పుష్పకయానారోహణ రామ
76.భరధ్వజాభినిషేవణ రామ
77.భరతప్రాణప్రియకర రామ
78.సాకేత పురీభుషన రామ
79.సకలస్వీయసమానత రామ
80.రత్నలసత్పీఠాస్థిత రామ
81.పట్టాభిషేకాలంకృత రామ
82.పార్థివకులసమ్మానిత రామ
83.విభీషణార్పితరంగక రామ
84.కీశకులానుగ్రహకర రామ
85.సకలజీవసంరక్షక రామ
86.సమస్తలోకోద్ధారక రామ
87.అగణితమునిగాణసంస్తుత రామ
88.విశ్రుత రాక్షసఖండన రామ
89.సితాలింగననిర్వృత రామ
90.నీతిసురక్షితజనపద రామ
91.విపినత్యాజితజనకజ రామ
92.కారితలవణాసురవధ రామ
93.స్వర్గతశంబుక సంస్తుత రామ
94.స్వతనయకుశలవనందిత రామ
95.అశ్వమేధక్రతుదీక్షిత రామ
96.కాలావేదితసురపద రామ
97.ఆయోధ్యజనముక్తిద రామ
98.విధిముఖవిభుదానందక రామ
99.తేజోమయనిజరూపక రామ
100.సంసృతిబన్ధవిమోచక రామ
101.ధర్మస్థాపనతత్పర రామ
102.భక్తిపరాయణముక్తిద రామ
103.సర్వచరాచరపాలక రామ
104.సర్వభవామయవారక రామ
105.వైకుంఠలయసంస్ఠీత రామ
106.నిత్యనందపదస్ఠిత రామ
107.కరుణా నిధి జయ సీతా రామ
108.రామరామ జయరాజా రామ

రామ రామ జయసీతా రామ.*రాముడి వంశ వృక్షo*

*ఈ వంశ పరంపర విన్నా చదివినా , పుణ్యం*

*బ్రహ్మ కొడుకు మరీచి*

*మరీచి కొడుకు కాశ్యపుడు.*

*కాశ్యపుడు కొడుకు సూర్యుడు.*

*సూర్యుడు కొడుకు మనువు.*

*మనువు కొడుకు ఇక్ష్వాకువు.*

*ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.*

*కుక్షి కొడుకు వికుక్షి.*

*వికుక్షి కొడుకు బాణుడు.*

*బాణుడు కొడుకు అనరణ్యుడు.*

*అనరణ్యుడు కొడుకు పృధువు.*

*పృధువు కొడుకు త్రిశంఖుడు.*

*త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు.(లేదా యువనాశ్యుడు)*

*దుంధుమారుడు కొడుకు మాంధాత.*

*మాంధాత కొడుకు సుసంధి.*

*సుసంధి కొడుకు ధృవసంధి.*

*ధృవసంధి కొడుకు భరతుడు.*

*భరతుడు కొడుకు అశితుడు.*

*అశితుడు కొడుకు సగరుడు.*

*సగరుడు కొడుకు అసమంజసుడు.*

*అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.*

*అంశుమంతుడు కొడుకు దిలీపుడు.*

*దిలీపుడు కొడుకు భగీరధుడు.*

*భగీరధుడు కొడుకు కకుత్సుడు.*

*కకుత్సుడు కొడుకు రఘువు.*

*రఘువు కొడుకు ప్రవుర్ధుడు.*

*ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.*

*శంఖనుడు కొడుకు సుదర్శనుడు.*

*సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.*

*అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.*

*శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.*

*మరువు కొడుకు ప్రశిష్యకుడు.*

*ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.*

*అంబరీశుడు కొడుకు నహుషుడు.*

*నహుషుడు కొడుకు యయాతి.*

*యయాతి కొడుకు నాభాగుడు.*

*నాభాగుడు కొడుకు అజుడు.*

*అజుడు కొడుకు ధశరథుడు.*

*ధశరథుడు కొడుకు రాముడు.*

*రాముడి కొడుకులు లవ కుశలు . .*

*ఇది రాముడి వంశ వృక్షo ...*
***************

Friday, March 23, 2018

తారకమంత్రం పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు.



తారకమంత్రం

పరమేశ్వరుడు, ముక్కంటి అయిన శివుడే విష్ణు స్తోత్రమునకు శ్రీరామ మంత్రాన్ని జపించినట్లు శాస్త్రాలు చెబుతున్నారు. దుష్టశిక్షణ శిష్టరక్షణార్ధమై చైత్రశుద్ధ నవమిన ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం 'శ్రీరామనవమి' గా విశేషంగా జరుపుకుంటాం.'రామ' యనగా రమించుట అని అర్ధం. కావున మనము ఎల్లప్పుడు మన హృదయకమలమందు వెలుగొందుచున్న 'ఆ శ్రీరాముని' కనుగొంటూ వుండాలని పండితులు అంటున్నారు.ఒకసారి పార్వతీదేవి పరమశివుని 'కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం' అని, విష్ణు సహస్రనామ స్తోత్రంనకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది. దానికి పరమేశ్వరుడు, "ఓ పార్వతీ! నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా!" అని ఈ క్రింది శ్లోకంతో మంత్రోపాసనచేస్తాడు.శ్లో||శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవశంకరుడే ఈతారకమంత్రం వారి కుడి చెవిలో చెప్పి వార్కి సధ్గతి కలిగిస్తారన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం.శ్రీరామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు 'రా' అనగానే మన నోరు తెరచుకుని మనలోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయని విశ్వాసం. అలాగనే 'మ' అనే అక్షరం ఉచ్ఛరించినప్పుడు మననోరు మూసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలు ఏవీ మనలోకి ప్రవేశించలేవట. అందుచేత శ్రీరామనవమి నాడు శ్రీరాముని అనుగ్రహం పొందాలంటే ఈ ఒక్క మంత్రముతో జపిస్తే చాలునని పండితులు అంటున్నారు.

鹿 *"#శ్రీరామ" #తారక #మంత్రముతో శుభ ఫలితాలెన్నో..* 鹿

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయంసీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్ఆజానుబాహుమరవింద దళాయతాక్షంరామం నిశాచర వినాశకరం నమామి - అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. జన్మతహ:కిరాతకుడై పుట్టిన ఓ బోయవాడు వాల్మీకి మహర్షిగా అవతరించి "శ్రీమద్రామాయణం" రాసేంత స్థాయికి చేరుకోగలిగాడు.అడవుల్లో తిరుగుతూ వేటాడుతూ కిరాతకుడిగా తిరిగిన బోయవాడు వాల్మీకి మహర్షిగా మారేందుకు "రామ రామ రామ" అనే తారక మంత్రమే తోడ్పడింది. కిరాతకుడైన బోయవాడిని నారదుడు చూసి నీవు చేస్తున్న ఈ కిరాతకమైన పాప కార్యంలో నీ భార్యబిడ్డలు ఏమైనా పాలుపంచుకుంటారో తెలుసుకుని రా అని పంపుతాడు.వెంటనే ఆ కిరాతకుడు భార్యబిడ్డల వద్దకు వెళ్లి ఆ ప్రశ్న అడుగుతాడు. దానికివారు గృహస్తుడుగా మమ్ములను పెంచి పోషించే బాధ్యత నీది కానీ నీవు చేసే పుణ్యకార్యంలో భాగం పంచుకుంటామేతప్ప పాపకార్యంలో కాదు. అని నిష్కర్షగా పలుకుతారు. వారి పలుకులకు వైరాగ్యము చెందిన బోయవాడు మహర్షి నాకు చక్కని మోక్షమార్గానికి ఉపాయము చెప్పమని ప్రాధేయపడతాడు.కిరాతకుని విన్నపము మేరకు నారదుడు "రామ రామ రామ" అనే తారక మంత్రాన్ని చెవిలో ఉపదేశిస్తాడు. చివరకు నోరు తిరగక శరీరంపై పుట్టలు పోస్తున్నా "మర" అంటూనే ఆ తారకమంత్రాన్ని వీడలేదు. బ్రహ్మ అనుగ్రహముతో వల్మీకము నుండి పునర్జీవింపడి వాల్మీకి మహర్షిగా జ్ఞాన సంపదను ఈ తారకమంత్రముచే పొంది శ్రీమద్రారాయమణ అనుకమనీయకావ్యం రచించి కారణజన్ముడై ఊర్థ్వలోకమందు ఆ చంద్రతారార్కం తరగని నిధిని పొందిన మహాభాగ్యశాలి అయినాడు.అట్టి శ్రీమద్రారామాయణం మనకు ఎంతో ఆదర్శవంతమైంది. అందలి శ్రీ సీతారామచంద్రమూర్తి మూర్తీభవించిన ధర్మదేవతా స్వరూపం. ఆ కావ్యమే మనకు మనభావితరాలకు మార్గదర్శి కానుంది.కాబట్టి శ్రీరామ నవమి రోజున రామ నామ తారక మంత్రమును పఠించడంతో పాటు సీతారాముల కళ్యాణోత్సవం వీక్షించే వారికి సకల సంపదలు చేకూరుతాయి. అలాంటి మహిమాన్వితులపై శ్రీరామచంద్రులను శ్రీరామనవమి నాడు స్తుతించి వారి అనుగ్రహము పొందుదుము గాక..!.

త్రేతాయుగంలోని వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని అనేక పురాణాలు పేర్కొంటున్నాయి. రాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల సమయంలో జన్మించాడు. పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసం.

రామాయంలో కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు భార్యలు. వారికి సంతాన భాగ్యం లేకపోవడంత వశిష్ట మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు. దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్దికాలానికే వారు గర్భం దాల్చారు.

చైత్ర మాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్యకు రాముడు జన్మించాడు. ఆ తర్వాత భరతుడు కైకేయికి, లక్ష్మణ శతృఘ్నలు సుమిత్రకు జన్మించారు. ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహా విష్ణువు ఏడో అవతారం రాముడు. లంకాధిపతి రావణ సంహారం కోసం రాముడు అవతరించాడు

రామరాజ్యంలో ప్రజలంతా సిరిసంపదలతో, సుఖ సంతోషాలతో ఉన్నారనేది హిందువుల నమ్మకం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభా యాత్ర. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్థ గోళానికి చేరువగా వస్తాడు.

రాముడిని సూర్యవంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు. ఈ వంశానికి చెందిన ప్రముఖలు దిలీపుడు, రఘు. వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధి గాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. మాట కోసం నిలబడ్డాడు కాబట్టే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలుస్తారు.

 *శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే* అనే శ్లోకం మూడుసార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణ, శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని శ్రీరామనవమిగా జరుపుకుంటాం.

ఎవరైతే కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రంలోనే మరణిస్తారో వారు మరణించే కాలంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ తారక మంత్రాన్ని వారి కుడి చెవిలో చెప్పి సధ్గతి కలిగిస్తాడనేది ఐతిహసాలు ఘోషిస్తున్నాయి. ఇక భక్త రామదాసుగా పేరుగాంచిన కంచర్ల గోపన్న శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించాడు. శ్రీరామ నీ నామ మేమి రుచిరా ఎంతోరుచిరా; మరి ఎంతో రుచిరా; అని కీర్తించాడు.

రామనామాన్ని ఉచ్ఛరించేటప్పుడు

 *రా అనగానే మన నోరు తెరచుకుని లోపల పాపాలన్ని బయటకు వచ్చి ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట. అలాగే *మ అనే అక్షరం ఉచ్ఛరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవట. అందువల్లే మానవులకు రామనామ స్మరణ మిక్కిలి జ్ఞానాన్ని, జన్మరాహిత్యాన్ని కలిగిస్తుందట.* 

 *ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా* *మృగం కాంచనం ! వైదేహీ హరణం జటాయు మరణం* *సుగ్రీవనమ్భాషణం !*
*వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ* *దాహనం ! పశ్చాద్రావణ కుంభకర్ణ హననం యేతద్ది రామాయణ* *జయజానకినాయక* 

 *రామాయ రామభద్రాయ రామచంద్రయ వేధసే !* *రఘునాదాయ నాధాయ సీతాయాః పతయే నమః !*
*రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ! రాజా సర్వస్య లోకస్య దేవానాం మాఘ వానివ !* 

రాముడు మూర్తీభవించిన ధర్మం, సత్పురుషుడు, సత్యపరాక్రముడు, దేవతలకు ఇంద్రుడు ప్రభువైతే, రాముడు సకలలోకాలకు ప్రభువు.

ఈ వాక్యం అన్నది ఒక రాక్షసుడు -- రెండు సార్లు రాముడి చేతిలో పరాజితుడై, మూడవ సారి అతని చేతిలో మరణించిన మారీచుడు.

శ్రీరాముడు చక్రవర్తికి లేక లేక పుట్టిన కొదుకు. అల్లారుముద్దుగా పెంచారు. 16 సంవత్సరాల ప్రాయానికే సకలవిద్యా పారంగతుడయ్యాడు, తీర్ధయాత్రలు,లోకసంచారము చేసి వచ్చాడు. తండ్రి కుమారుడికి పెండ్లి చేద్దాం అనే ఆలోచనలోకి వచ్చారు. ఎందుకో రామచంద్రుల వదనం లో ప్రశాంతత కనిపించలేదు. తండ్రిగారు కంగారు పడి విషయం అడిగారు. శ్రీరాముడు ఈ విధంగా అన్నారు " తండ్రి, లోకం అంతా, ఈ సకలచరాచర జీవరాసి అశాశ్వతం, నశించి పోతోంది, శాశ్వతమైనది, ఆనందకరమైనది ఏమిటి ? నేనెవరు ? ఈ సృష్టి రహస్యం ఏమిటి ? ఇది విని దశరధుడు కంగారు పడ్డాడు, పెళ్లి చేద్దాం అంటే వైరాగ్యం లోకి వెళ్ళాడేమిటని, వశిష్టుల వారికి విన్నవించాడు. ఈ లోపు యాగరక్షణార్థమై రామ,లక్ష్మనులను తీసుకు వెళ్ళటానికి విశ్వామిత్రులవారు సభకి వచ్చారు. అప్పుడు రాముడి లోని చింతలకన్నిటికి సమాధానాలు ( యోగవాసిష్టం ) వశిష్టుల వారు వివరించి రాముణ్ణి కార్యోన్ముఖుడిని చేశారు. ఇదే మొట్టమొదటిమైలురాయి రాముడి ఆత్మసంయమనానికి.

విశ్వామిత్రుడి వెంట యాగరక్షణ కి వెళ్లిన రాముడి కి, ఋషి బల , అతిబల విద్యలు, అనేకదివ్యాస్త్రా లు అనుగ్రహించాడు. సీతను వివాహం చేసుకొని అయోధ్య కు తిరిగి వచ్చాడు రాముడు. దశరధుడు, శ్రీరాముని పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి రాముడికి చెప్పారు. రాముడు సరే అన్నారు. తెల్లవారింది, ఇంక పట్టాభిషేకం జరుగుతుంది అనగా అది రద్ధయింది . తండ్రిమాటకోసం సీత, లక్ష్మను లతో అరణ్యాలకి వెళ్ళాడు. దశరధుడు క్రుంగి పోయాడు, రాణివాసం, అయోధ్య విలపించాయి , కానీ రాముడి నిగ్రహం మాత్రం చెదరలేదు.

సీతారామలక్ష్మణులు అరణ్యం లో శరభంగ మహర్షి ఆశ్రమానికి వచ్చారు. ఆ మహర్షి జరిగిందంతా తెలుసుకొని, నేను తపశక్తి వల్ల స్వర్గలోకాన్ని, బ్రహ్మలోకాన్ని జయించానని అది రాముడికి ఇస్తానని చెప్పారు . అప్పుడు రాముడు - ఓ మునివర్యా - మీరు చెప్పిన వన్నీ నేను సంపాదించుకోగలను, కాని అవి నాకు వద్దు, ఈ అరణ్యం లో నివాసయోగ్యమయిన ప్రదేశం చెప్పండి అని అడుగుతారు. . ఇతరులనుంచి ఏది ఆశించని గుణం రాముడిది.

అరణ్యం లో రాక్షసు లందరు, ఋషులను చాలా భాదలు పెడుతున్నారు. మమ్మల్ని కాపాడమని ఋషులు రాముడిని అడుగుతారు. రాముడు సరే అని మాట ఇస్తారు. అప్పుడు సీతాదేవి అంటుంది - ఆ రాక్షసు లెవరు మనజోలికి రాలేదు కదా - వాళ్లతో అకారణ వైరం ఎందుకు అని - శ్రీరాముడికి కోపం వచ్చింది - చాలా తీవ్రంగా ఇలా అన్నారు - క్షత్రియుడు ధనుర్భాణాలు ధరించింది ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి, నిరాయుధు లైన యీ మునులను హింసించే రాక్షసులను వధించటం నా విధి. రాముడికి ధర్మం పట్ల అంత త్రీవ్రమైన నిష్ట ఉంది.

తల్లి కైకేయి చేసిన పనికి భరతుడు కుమిలిపోయి, రాముణ్ణి తిరిగి అయోధ్య కు తిసుకువెళ్ళటానికి అరణ్యానికి వస్తాడు రాముణ్ణి ఎంతో బ్రతిమాలుతాడు. రాముడు ఆడినమాట తప్పను అని - రాజ్య పరిపాలనకి అవసరమైన అన్ని రాజనీతి భొదలు చేస్తాడు. భరతుడు ప్రాయోపవేశం చేస్తానని గట్టి పట్టు పడితే పాదుకలు ఇచ్చి పంపిస్తాడు.

పంచవటిలో మారీచుడు బంగారు లేడి గా సీత దృష్టి ని ఆకర్షిస్తాడు. ఆ లేడి కావాలని ఆమె రాముణ్ణి కోరుతుంది. లక్ష్మణుడు ఇది మాయా మృగం అని అన్నగారితో అంటాడు. అప్పుడు రాముడు - లక్ష్మణా భార్య కోరిన కోరికను వీరుడైన భర్త ఎలా కాదనగలడు. శక్తి సామర్థ్యాలు ఉన్న సాహసి సంపాదించినదే అసలైన సంపద. ఒకవేళ ఈ లేడి రాక్షస మాయ ఐతే దాన్ని వధించటం క్షత్రియుడిగా నా కర్తవ్యం .

సీతను రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయాడు. తీరని దుఖం తో చలించిపోయాడు. కోపం కట్టలుతెంచుకొని వచ్చింది, లక్ష్మణుడి అజాగ్రత్తని తిట్టాడు. దేవతలను నిందించాడు - లక్ష్మణా - నేను దేవతా ప్రీతి కోసం ఎన్ని పుణ్యకార్యాలు చేసాను , కష్ట నస్టాలు ఎదురైనా ధర్మ మార్గం వదలలేదు. ఇంద్రియాలను జయించి, దయామూర్తినై లోకాలకి మేలు చేయటమే లక్ష్యం గా పెట్టుకున్నాను అయినా కష్టం మీద కష్టం ఎలా వచ్చి పడుతోందో చూడు అని నిర్వేదానికి లోను అయ్యాడు.

కొంతదూరం, వెళ్ళగానే కబందుడు అనే రాక్షసుడు అడ్డగించటం తో అతడిని సంహరించి అతని ద్వారా తనలాగే దుర్దశ లో ఉన్న సుగ్రీవుడి గురించి తెలుసుకుంటాడు. ఆపదలు బలవంతుడైన శత్రువు వల్ల కలిగినప్పుడు వాటిని అధిగమించటానికి ఆరు ఉపాయాలు ఉన్నాయి, అందులో సమశ్రాయణం అంటే ఇంకొక బలవంతుడయి ఆపదలో ఉన్న వారి సహాయం తీసుకోవటం. ఇదే రాముడు ఎన్ను కొన్న మార్గం. రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయారు. రాముడు వాలి ని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. ఆకాశమార్గం లో వెడుతూ సీత వదిలిన నగలమూట చూపించారు. సీతాన్వేషణ మొదలైంది. సీత లంకలో రావణాసురుడి దగ్గర ఉంది అని లంకకు చేరటానికి నూరు యోజనాలు సముద్రం దాటాలని హనుమంతుడు చెప్పాడు. రాముడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. వ్యూహ రచన మొదలుపెట్టాడు. శత్రువు బలాబలాల గురించి ఆలోచించలేదు, తన పరాక్రమం పై నమ్మకం, భార్యను రక్షించు కోవాలన్న తపన.

లంకలో విభీషణుడు, రావణునికి మంచి చెప్పటానికి ప్రయత్నించాడు, అతడు వినలేదు, విభీషణుడికి కోపం వచ్చింది - రావణా, రాజు మెచ్చే మాటలు చెప్పేవాళ్ళు చాల మంది ఉంటారు, వాళ్ళ మాటలు వినటం వాల్ల వచ్చే ప్రమాదం తరువాత తెలుస్తుంది, తమ్ముడిగా నీ మేలుకోరి మాట్లాడాను - నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని అక్కడ నుంచి రాముడి దగ్గరికి వచ్చి రాముడి శరణు పొందేడు . రామరావణ యుద్ధం జరిగింది , రావణుడు మరణించాడు. ఇక్కడ వాల్మీకి ఒక ఉపమానం చెపుతారు = సముద్రాన్ని వర్ణించటానికి సముద్రమే ఉపమానం - అలాగే రామరావణ యుద్ధం వర్ణించటానికి మరో ఉపమానం లేదు దానికదే పోలిక. రావణ సంహారానంతరం దేవతలు అందరు ప్రత్యక్షమై రాముడిని అభినందించి వరం కోరుకోమంటారు - అప్పుడు రాముడు యుద్ధం లో మరణించిన వానరులందరినీ బ్రతికించమంటాడు. దుష్టుడైన రావణుని చెరలో ఉన్నందుకు, ఉత్తరోత్రా ప్రజా విమర్శలకు అవకాశం రాకూడదని సీతాదేవిని అగ్ని ప్రవేశం చేయమంటాడు. విభీషణుడిని పట్టాభిషక్తుడిని చేసి రాముడు అయోధ్య కు వచ్చి పట్టాభిషక్తుడై పరిపాలించాడు. ధర్మం కోసం బ్రతికి, ధర్మాన్ని బ్రతికించి మానవాళికి మార్గదర్శకుడయ్యాడు.

ఇలా రామాయణం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందులోని ప్రతి పాత్ర ఉదాత్తమైనవే. అలాగే శ్రీరాముడి కంటే రామ నామం ఇంకా గొప్పది - ఈ నామం తో తరించిన వాళ్ళు ఏంతో మంది - శబరి, త్యాగయ్య, రామదాసు మొదలైనవారు.
రామ రసం ప్రాముఖ్యత

దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.

శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.

ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.

జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.

పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .

శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.

శ్రీరామ ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.

సీతాదేవి ప్రవర:-

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...

ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
శ్రీరామ నవమి
అయనము = బాట
రామాయణము = రాముడు నడచిన బాట

పానకం
తురిమిన బెల్లం --- 6 టీ స్పూన్లు
మిరియాల పొడి -- అర టీ స్పూను
యాలకుల పొడి -ఒక టీ స్పూను
అల్లం తురుము -- ఒక టీ స్పూను
నీళ్ళు --- రెండు గ్లాసులు

ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని బెల్లం వేసి కరిగించాలి. దానిలో మిగిలిన పదార్ధాలను కలపాలి.
దీనితో సహజ పదార్ధాలతో పానకం తయారవుతుంది.
ఇది పానీయమే కాదు ఒక ఔషధం కూడా

వడపప్పు

నానబెట్టిన పెసరపప్పు --- ఒక కప్పు ( అన్నింటి కంటే ఉత్తమమైనది)
పచ్చి మిర్చి తురుము --- ఒక టీ స్పూను
సైంధవ లవణం లేదా ఉప్పు --- చిటికెడు
కొబ్బరి తురుము --- నాలుగు టీ స్పూన్లు
నిమ్మ రసం --- ఒక టీ స్పూను
తురిమిన కొత్తిమీర

మొదట పెసర పప్పు ను ఒక గిన్నెలో వేసి దానికి మిగిలిన పదార్ధాలను ఒక్కొక్కటిగా కలపాలి.

పప్పులన్నింటిలోకి పెసరపప్పు శ్రేష్టమైనది.

వేసవి కాలంలో ఆకలి తగ్గడం అనేది ముఖ్యమైన సమస్య . దీనికి పానకం చాలా అద్భుతమైన
ఔషధం.

వడపప్పు యొక్క ఉపయోగాలు :-- దీనిలోని పెసరపప్పు రక్తస్రావాలను ఆపుతుంది. దప్పికను తగ్గిస్తుంది. వాంతులను తగ్గిస్తుంది మరియు నివారిస్తుంది. నిద్రను కలిగిస్తుంది. దద్దుర్లను
తగ్గిస్తుంది. పొడి దగ్గును నివారిస్తుంది.

పానకం యొక్క ఉపయోగాలు :-- దీనిని తాగితే ఎన్ని నీళ్ళు తాగినా తగ్గని దాహం తగ్గుతుంది.
తక్షణం శక్తిని ఇస్తుంది. కఫాన్ని తొలగిస్తుంది. దుమ్ము, ధూళి వ లన వచ్చే జలుబును నివారిస్తుంది.
ఆకలిని పెంచుతుంది. ఇది ద్రవాహారం కాబట్టి నిర్జలీయతను రానివ్వదు. వడదెబ్బ నుండి
కాపాడుతుంది.

అరికాళ్ళ మంటలు :-- పెసర పప్పును నానబెట్టి నూరి కర్పూరం కలిపి పాదాలకు పూయాలి.

శిరోవేదన, మంటలు :-- పెసరపప్పును నానబెట్టి నూరి మాడు మీద అంటించాలి.

సేకరణ..
పి. రామ ప్రసాద్.

Sunday, March 18, 2018

సూర్యభగవానుడు సూర్యోపనిషత్ ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు



సూర్యభగవానుడు
సూర్యోపనిషత్
ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు



ప్రతిరోజూ ఆకాశంలో ఉదయించే సూర్యుడిని మునులు, రుషులు, పండితులు చాలామంది అర్చిస్తుంటారు. వీరేకాక దేవతలు, సిద్ధులు, చారణులులాంటివారు కూడా నిత్యం ఆయన్ను ఆరాధిస్తూనే ఉంటారు. దీనికి కారణం ఏమిటి? అనే విషయం పూర్వం వైశంపాయనుడికి కలిగింది. ఆ సందేహాలను తీరుస్తూ వ్యాసమహర్షి సూర్యభగవానుడి మాహాత్మ్యాన్ని పేర్కొన్న కథాసందర్భం పద్మపురాణంలో మనకు కనిపిస్తుంది.



సూర్యుడు బ్రహ్మస్వరూపం నుంచి ప్రకటితమయ్యాడు. ఆయన బ్రహ్మ తేజోరూపుడు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మమే ఆయన. ఆ భగవానుడు ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలను తనను అర్చించినవారికి ప్రసాదిస్తాడు. సర్వలోకాల ఉత్పత్తి, పాలన ఈయన రూపంగానే జరుగుతుంటుంది. లోకాలన్నిటికీ రక్షకుడు కూడా సూర్యభగవానుడే. ఈ భగవానుడిని ఆరాధిస్తే దేవతలందరినీ ఆరాధించినట్లే లెక్క. సూర్య మండలంలో ఉన్న సంధ్యాదేవిని ఉపాసించి స్వర్గాన్ని, మోక్షాన్ని ఎందరెందరో పొందుతూ ఉంటారు.

రోగాల నుంచీ విముక్తి..
సూర్యోపాసనవల్ల రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. అంధత్వం, దారిద్య్రం, దుఃఖం అనే వాటి నుంచి తన భక్తులను సూర్యుడు తప్పిస్తుంటాడు. సూర్యభగవానుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడి ప్రతిరూపమే. అందుకే ఆయనకు సూర్యనారాయణుడు అనే పేరు వచ్చింది. ఇంతటి సూర్య భగవానుడికి నిత్యం దోవ చూపిస్తూ ఉంటుంది సూర్యుడి భక్తురాలైన ఉషాసుందరి. ఈమె రాత్రికి అక్క, ఆకాశానికి కూతురు, వరుణదేవుడికి చెల్లెలు. కాంతులను విరజిమ్ముతూ నిత్యం యువతిలా శోభిల్లుతూ ఉంటుంది. ఈ ఉష సకల జంతుజాలానికి చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈమె ముందుగా చూపించిన మార్గంలో సూర్యభగవానుడు ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఈ జగత్తులో జరిగే సంఘటలన్నీ సూర్యభగవానుడి లీలా విలాసాలే. సూర్యుడిని అంతా ఆరాధించటంలో మరో మహత్తర విషయం కూడా ఉంది. ఆయన ప్రాతఃకాల సమయంలో బ్రహ్మదేవుడిలా ప్రకృతి అంతటా జీవాన్ని నింపుతుంటాడు. మధ్యాహ్న వేళల్లో మహేశ్వరుడిలా తమోగుణ లీలలను ప్రదర్శిస్తుంటాడు. రుద్రుడిలా ప్రకృతి రజోగుణాన్ని శుష్కింపచేస్తుంటాడు. ఇలా దినమంతా ఆ దినకరుడు ప్రకృతికి చేసే మేలు ఇంతా అంతా కాదు.



సూర్యుడు కేవలం ఒక్కడుగా కాక పన్నెండు రూపాలుగా అంటే ద్వాదశాదిత్యులుగా ఉండటం విశేషం. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనేవారే ద్వాదశాదిత్యులు. సూర్యభగవానుడు నిజంగా అంత మేలు చేస్తాడు. తనను ఉపాసించినవారికి కొంగుబంగారమై ఆదుకుంటాడు


సూర్యోపనిషత్


ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: !
భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా: !
స్థిరైరఙ్గైస్తుష్టువాగం సస్తనూభి: !
వ్యశేమ దేవహితం యదాయు: !
స్వస్తి న ఇన్ద్రో వృద్ధశ్రవా: !
స్వస్తి న పూషా విశ్వవేదా: !
స్వస్తినస్తార్ష్క్యో అరిష్టనేమి: !
స్వస్తి నో బృహస్పతిర్దధాతు !!
ఓం శాంతి: శాంతి: శాంతి: !!!



ఓ దేవతలార ! మా చెవులు శుభాన్నే వినుగాక ! యజ్ణకోవిదులైన మేము మా కళ్ళతో శుభాన్నే చూచెదముగాక ! మీ స్తోత్రాలను గానం చేస్తూ మాకు
నియమిత్తమైన ఆయుష్కాలాన్ని పరిపూర్ణమైన ఆరోగ్యంతో, బలముతో గడిపెదముగాక ! శాస్త్ర ప్రసంశితుడైన ఇండ్రుడు, సర్వజ్ణుడైన సూర్యుడు,
ఆపదలనుండి రక్షించే గరుత్మంతుడు, మా బ్రహ్మవర్చస్సును పాలించే బృహస్పతి, మాకు శాస్త్రాధ్యయనంలో, సత్యానుష్టానంలో అభ్యుధయాన్ని
ఒసగెదరుగాక !



ఓం అథ సూర్యాథర్వాఙ్గిరసం వ్యాఖ్యాస్యామ: !

ఓం! అథర్వణవేదంలోని అంగిరసుల సూర్యోపనిషత్ చెబుతాము



బ్రహ్మా ఋషి: !
గాయత్రీ ఛన్ద: !
ఆదిత్యో దేవతా !
హంస: సోఁహమగ్ని నారాయణయుక్తం బీజమ్ !
హృల్లేఖా శక్తి: !
వియదాదిసర్గసంయుక్తం కీలకమ్ !
చతుర్విధపురుషార్థ సిద్ధ్యర్థే వినియోగ: !



బ్రహ్మయే ఋషి... ఆదిత్యుడే దేవత... అగ్ని,నారాయణులు బీజం... హృల్లేఖ శక్తి... సృష్టి యావత్తూ కీలకం... చతుర్విధ పురుషార్థాలు సాధించడానికి ఈ
సాధన !



షట్ స్వరారూఢేన బీజేన షడఙ్గం రక్తామ్బుజ సంస్థితం
సప్తాశ్వరథినం హిరణ్యవర్ణం చతుర్భుజం పద్మద్వయాఁభయవరదహస్తం
కాలచక్రప్రణేతారం శ్రీసూర్యనారాయణ య ఏవం వేద స వై బ్రాహ్మణ: !!



ఆరు స్వరాల బీజం కారణంగా ఆరు అంశాలు కలవాడు. ఎర్ర తామర మీద ఉండేవాడు, ఏడు గుఱ్ఱాల రథం గలవాడు, బంగారు వర్ణం కలవాడు, నాలుగు
భుజాలవాడు, రెండు పద్మాలతో అభయ వరద ముద్రలు కలిగినవాడు, కాలచక్రాన్ని నడిపేవాడు అయిన శ్రీ సూర్యనారాయణుని తెలిసినవాడే బ్రాహ్మణుడు.



ఓ భూర్భువ సువ: !
తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి !
ధి యో యో న: ప్రచోదయాత్ !



ప్రణవరూపమైన నిరాకారమైన "భూ, భువః, సువః" అనే మూడులోకాల రూపమైనడి, సృజన కర్తయొక్క దివ్యమైన ఆరాధనీయమైన ఏ కాంతి ఉన్నదో
దానిని ధ్యానించుతాము. అది మా బుధ్థులను ఉత్తేజపరచు గాక !



సూర్య ఆత్మా జగతస్తస్థుషశ్చ !
సూర్యాద్వై ఖల్విమాని భూతాని జాయస్తే !
సూర్యాద్యజ్ఞ: పర్జన్యోఁన్నమాత్మా !



మారిపోయే ప్రపంచంయొక్క మార్పులేని తత్వానికి సూర్యుడే ఆత్మ. సూర్యుడు నుండే ప్రాణులు జనిస్తారు. సూర్యుడు నుండి యజ్ఞము, మేఘము,
అన్నము, పురుషుడు జనిస్తాయి.



నమస్తే ఆదిత్య !
త్వమేవ ప్రత్యక్షం కర్మ కర్తాసి !
త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి !
త్వమేవ ప్రత్యక్షం విష్ణురసి !
త్వమేవ ప్రత్యక్షం రుద్రోఁసి !
త్వమేవ ప్రత్యక్షం ఋగసి !
త్వమేవ ప్రత్యక్షం యజురసి !
త్వమేవ ప్రత్యక్షం సామాసి !
త్వమేవ ప్రత్యక్షమథర్వాసి !
త్వమేవ సర్వం ఛన్దోఁసి !



ఓ ఆదిత్యుడా! నీకు నమస్కారం. నీవే ప్రత్యక్షంగా కర్మ చేసే కర్తవు. నీవే ప్రత్యక్షంగా ఉన్న ఋక్సామ యజురధర్వణ వేదాలవు. అన్ని వేద సూక్తాలు నీవే!



ఆదిత్యాద్వాయుర్జాయతే !
ఆదిత్యాద్భూమిర్జాయతే !
ఆదిత్యాదాపోజాయస్తే !
ఆదిత్యాజ్జ్యోతిర్జాయతే !
ఆదిత్యాద్యోమ దిశో జాయస్తే !
ఆదిత్యాద్దేవాః జాయస్తే !
ఆదిత్యాద్వేదాః జాయస్తే !



ఆదిత్యుడినుండి వాయువు, భూమి, నీరు, అన్నీ పుడతాయి. ఆదిత్యుడినుండి వ్యోమం దిక్కులు పుడతాయి. ఆదిత్యుని వల్లనే దేవతలు పుడతారు.
ఆదిత్యుని వల్లనే వేదాలు పుడతాయి.



ఆదిత్యో వా ఏష ఏతన్మణ్డలం తపతి !
అసావాదిత్యో బ్రహ్మా !

ప్రకాశించే, తపించే ఈ మండలం ఆదిత్యుడే. ఆదిత్యుడు బ్రహ్మము!



ఆదిత్యోంత:కరణ - మనోబుద్ధి - చిత్తాహంకారా: !
ఆదిత్యో వై వ్యానస్సమానోదానోఁపాన: ప్రాణ: !
ఆదిత్యో వై శ్రోత్ర - త్వక్ చశౄరసనధ్రాణా: !
ఆదిత్యో వై వాక్పాణిపాదపాయుపస్థా: !
ఆదిత్యోవై శబ్దస్పర్శరూపరసగన్ధా: !
ఆదిత్యో వై వచనాదానాగమన విసర్గానన్దా: !
ఆనన్దమయో విజ్ఞానమయో విజ్ఞానఘన ఆదిత్య: !



ఆదిత్యుడే అంతః కారణాలైన మనోబుధ్థిచిత్తాహంకారాలు. ఆదిత్యుడే వ్యాన, సమాన, ఉదాన, అపాన, ప్రాణాలు. ఆదిత్యుడే శ్రోత్రత్వక్ రసనా ఘ్రాణాలు.
ఆదిత్యుడే వాక్కు, పాణి పాదాలు, పాయూవస్థలు. ఆదిత్యుడే శబ్ధ, స్పర్శ, రూప, రస, గంథాలు. ఆదిత్యుడే పలకడం, స్వీకరించడం, రావడం, విసర్జించడం,
ఆనందించడం. ఆనందమయుడై, విజ్ఞానమయుడైన, విజ్ఞాన ఘనస్వారూపుడు ఆదిత్యుడే.



నమో మిత్రాయ భానవే మృత్యోర్మా పాహి !
భ్రాజిష్ణవే విశ్వహేతవే నమ: !

మిత్రుడివన నీకు నమస్కారం! ప్రకాశ స్వరూపుడికి నమస్కారం! మృత్యువు నుండి నాన్ను రక్షించు. తేజోవంతునికి, విశ్వహేతువైన వానికి, నమస్కారం!



సూర్యాద్భవన్తి భూతాని సూర్యేణ పాలితాని తు !
సూర్యే లయం ప్రాప్నువన్తి య: సూర్య: సోఁహమేవ చ !



సూర్యుడినుండే ప్రాణులు పుడతాయి. సూర్యుడివల్ల పాలింపబడతాయి. సూర్యునిలో లయించుతాయి . ఎవరు సూర్యుడో అతడే నేను



చక్షుర్నో దేవ: సవితా చక్షుర్న ఉత పర్వత: !
చక్షు-ర్ధాతా దధాతు న: !



దివ్యమైన సూర్యుడే మా నేత్రం. నేత్రదృష్థి మాకు పరిపూర్ణతను ఇస్తుంది. ఈశ్వరుడు మాకు దృష్టి ప్రసాదించుకాక.



ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి !
తన్న: సూర్య: ప్రచోదయాత్ !



సహస్రకిరణుడైన ఆదిత్యునికోసం జ్ఞానార్జన చేస్తాము. ధ్యానిస్తాము. అట్టి సూర్యుడు మాకు ఉత్తేజాన్ని ఇచ్చును గాక!

J

సవితా పశ్చాత్తాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ !
సవితా న: సువతు సర్వతాతిఁ సవితా నో రాసతాం దీర్ఘమాయు: !



వెనుక, ఎదురుగా, పైన, క్రిందా అంతటా సవితృడే. ఆ సవితృడే మాకు అంతటా పూర్ణత్వాన్ని ప్రసవించును గాక! మాకు సవిత్రుడు దీర్ఘాయువును
ప్రసాదించును గాక!



ఓమిత్యేకాక్షరం బ్రహ్మా !
ఘృణిరితి ద్వే అక్షరే !
సూర్య ఇత్యక్షరద్వయమ్ !
ఆదిత్య ఇతి త్రీణ్యక్షరాణి !
ఏతస్వైవ సూర్యస్యాష్టాక్షరో మను: !



'ఓం' అనేది ఏకాక్షర బ్రహ్మము. 'ఘృణి' అనేది రెండు అక్షరాలు. 'ఆదిత్య' అనేది మూడు అక్షరాలు. "ఓం ఘృణిః సూర్యః ఆదిత్యః" అనేవి ఏకమైన సూర్యుని
అష్టాక్షరీ మంత్రం.



యస్సదాహ రహ ర్జపతి
స వై బ్రాహ్మణో భవతి
స వై బ్రాహ్మణో భవతి !



ఈ మంత్రాన్ని ఎవరు సదా దినదినమూ జపిస్తారో అతడే బ్రాహ్మణుడవుతాడు.



సూర్యాభిముఖో జప్త్వా, మహావ్యాధి భయాత్ ప్రముచ్యతే !
అలక్ష్మీర్నశ్యతి !
అభక్ష్య భక్షణాత్ పూతో భవతి !
అగమ్యాగమనాత్ పూతో భవతి !
పతిత సంభాషణాత్ పూతో భవతి !
అసత్ సంభాషనాత్ పూతో భవతి !



సూర్యునికి అభిముఖంగా నిలచి జపించడం వల్ల మహా వ్యాధి భయాన్నుండి విడివడుతాడు. దారిద్ర్యం నశిస్తుంది. తినకూడనిది తిన్న పాపం నుండి,
పతితులతో కలసి సంభాషించిన పాపం నుండి, అసత్య భాషణ పాపం నుండి విముక్తుడై పవిత్రుడౌతాడు.



మధ్యాహ్నే సూర్యాభిముఖ: పఠేత్ !
సద్యోత్పన్నఞ్చ మహాపాతకాత్ ప్రముచ్యతే !



మధ్యాహ్నం సూర్యాభిముఖుడై ఉపనిషత్ ను పఠించాలి. ఉత్పన్నమైన పంచమహా పాతకాలనుండి వెంటనే విముక్తుడౌతాడు.



సైషా సావిత్రీం విద్యాం న కించిదపి న కస్మైచిత్ప్రశంసయేత్ !

అదే సావిత్రీ విద్య. కొంచం కూడా, దేనికోసమూ ఎవరినీ పొగడడం కాని, నిందించడం కాని చేయరాదు.



య ఏతాం మహాభాగ: ప్రాత: పఠతి, స భాగ్యవాన్ జాయతే పశూన్విన్దతి !
వేదార్థం లభతే !



ఏ అదృష్టవంతుడు ఉదయమే దీనిని పఠిస్తాడో, అతడు భాగ్యవంతుడౌటాడు. పసు సంపద పొందుతాదు. వేదార్థాలను పొందుతాడు.



త్రికాలమేతజ్జప్త్వా, క్రతుశతఫలమవాప్నోతి !
హస్తాదిత్యే జపతి,
స మహామృత్యుం తరతి స మహామృత్యుం తరతి య ఏవం వేద ! ఇత్యుపనిషత్ !!



దీనిని మూడు కాలాలలోనూ జపించడం వల్ల నూరు యాగాల ఫలాన్ని పొందుతాడు. ఆదిత్యుడు హస్తలో ఉండగా జపించినప్పుడు, అతడు
మహామృత్యువును దాటుతాదు ఇలా ఎవరు తెలుసుకొంటారో! ఇదే ఉపనిషత్తు.

ఓం శాంతి: శాంతి: శాంతి:!!



మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి



తుంబురు తీర్థ ముక్కోటి

మార్చి 31న తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఏడున్నర మైళ్ళ దూరములో వెలసివున్న ప్రముఖ పుణ్యతీర్థమగు శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం ఈ నెల 31వ తారీఖున అత్యంత వైభవంగా తిరుమలలో జరుగనుంది.

పురాణప్రాశస్త్యం ప్రకారం తిరుమలలోని శేషగిరులలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నవని ప్రతీతి. ఈ తీర్థాలలో ధర్మ, జ్ఞాన, భక్తి, వైరాగ్య, ముక్తి ప్రదములు కలిగించేవి, ప్రధానమైనవి 7 తీర్థములు. అవి స్వామివారి పుష్కరిణి, కుమారధార, తుంబురు, రామకృష్ణ, ఆకాశగంగ, పాపవినాశనం మరియు పాండవ తీర్థములు. ఈ తీర్థాలలో ఆయా పుణ్యఘడియల్లో స్నానమాచరించిన యెడల సర్వపాపాలు తొలగి ముక్తి సమకూరునని పురాణ వైశిష్ట్యం.

పాల్గుణమాసమున ఉత్తరఫల్గుణీ నక్షత్రముతో కూడిన పౌర్ణమినాడు తుంబురు తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ పర్వదినాన తీర్థస్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని భక్తులు దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ నిర్వహించే తుంబురు తీర్థ ముక్కోటిని దర్శించి, స్నానమాచరించడం ఒక ప్రత్యేక అనుభూతిగా భావిస్తారు. ఈ ముక్కోటిలో టిటిడి అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

 జై శ్రీమన్నారాయణ 



శ్రీరామ నామ మహిమ



శ్రీరామ నామ మహిమ

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
అజానుబాహుం మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

లక్ష్మీ సహితుడైన రాఘవుని, దశరథుని కుమారుని, అప్రమేయుని (కొలతలకు అందనివానిని) సీతాపతిని, రఘువంశంలో రత్నదీపంలా ప్రకాశించే వానిని, ఆజానుబాహుని, పద్మదళాలవలె విశలమైన కన్నులు గలవానిని, రాక్షసులను నశింపజేసినవానిని, శ్రీరామచంద్రునికి నమస్కరించుకుంటున్నాను.

శ్రీరామచంద్రముర్తి చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నాలుగవ పాదాన కర్కాటకలగ్నంలో మధ్యాహ్నం పూట శ్రీమహావిష్ణువు అవతారంగా జన్మించాడు. అసలు శ్రీమహావిష్ణువు దశావతారాలను పరిశీలించినపుడు, ఆయన ధరించిన పది అవతారాల్లో, మూడు అవతారాలు చైత్రమాసంలోనే ప్రాదుర్భవించినట్లు తెలుస్తోంది. మత్స్య, వరాహ, శ్రీరామ అవతార జయంతులు చైత్రమాసంలోనే వస్తుంటాయి. అలాగే దశావతారాలలో శ్రీరామావతారం ఏడవది అయినప్పటికీ, ప్రతి సంవత్సరం పది జయంతులు ముగిసిన పిదప, మరలా సంవత్సర ప్రారంభంలో మొదటగా వచ్చే జయంతి పండుగ శ్రీరామనవమే!

 *దశావతార జయంతులు:* 

 *1. మత్స్య - చైత్రబహుళ పంచమి,*
*2. కూర్మ - వైశాఖ శుద్ధ పూర్ణిమ,*
*3. వరాహ - చైత్ర బహుళ త్రయోదశి,*
*4. నారసింహ - వైశాఖ శుద్ధ ద్వాదశి,*
*5. వామన - భాద్రపద శుద్ధ చతుర్దశి,*
*6. పరశురామ - వైశాఖ శుద్ధ ద్వాదశి,*
*7. శ్రీరామ - చైత్రశుద్ధ నవమి,*
*8. శ్రీకృష్ణ - శ్రావణ బహుళ అష్టమి,*
*9. బుద్ధ - వైశాఖ శుద్ధ పౌర్ణమి,*
*10. కల్కి - భాద్రపద శుద్ధ విదియ* 

శ్రీరాముడు పుట్టినరోజునే శ్రీరామ కల్యాణోత్సవాన్ని జరుపుకుంటుంటాం. ఈ విషయమై కొంతమంది, పుట్టినరోజునే కల్యాణోత్సవం ఏమిటన్న వితండవాదం చేస్తుంటారు. అవతార పురుషుడు శ్రీరాముడు ఈ లోకాన అవతరించడమే మంగళప్రదం. అందుకే ఆనందదాయకమైన ఆరోజున లోక కల్యాణాన్ని ఉద్దేశించి సీతారాముల కల్యాణోత్సవం జరపాలని పెద్దలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆ కల్యాణరాముని చరితను ఊరూరా, వాడవాడలా పారాయణం చేస్తూ ధన్యులవుతుంటారు. ఆనందోత్సాహంలో తేలిపోతుంటాము.

అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక. అందుకే పార్వతీ వల్లభుడు కూడ,

 *శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే*
*సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే* 

అంటూ శ్రీరామనామం విష్ణుసహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు. విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైంది. అటువంటివి వేయినామాలు ఒక్క రామనామానికి సమం. రామనామం బ్రహ్మహత్యాది అనేక పాతకముల నుండి రక్షిస్తుంది.

'రామ నామాత్పరో మంత్రః నభూతో న భవిష్యతి' అని అన్నారు. అంటే, రామనామాని కంటే గొప్పమంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో కూడా ఉండబోదని చెప్పబడింది. మంత్రాలలోకెల్లా గొప్పదైన గాయత్రీ మంత్రానికి, రామమంత్రానికి మధ్య భేదమేమీ లేదు. 'రామ' నామాన్ని చెబితే గాయత్రీమంత్రాన్ని చెప్పినట్లే.

ఆ, ఉ, మ ల సంగమమే ఓంకారమని మనకు తెల్సిందే. అ= విష్ణువు, ఉ= మహాలక్ష్మీ, మ= జీవుడు. రామనామం ప్రణవం నుంచే ఉద్భవించిందని రామాయణం పేర్కొంది. శ్రీరామనామ మహిమను తెలియజేసే ఎన్నో ఉదాంతాలు మనకు కనబడుతున్నాయి. అందులో ఓ ఉదాంతం:

రావణ వధానంతరం సీతాసమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు, నీండుసభలో కొలువైయుండగా నారదమహర్షి ప్రవేశించాడు. నారదమునితో పాటు విశ్వామిత్రుడు, వశిష్ఠాదిమహర్షులు విచ్చేశారు. అక్కడ ఒక దార్మిక విషయమంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు, సభాసదులందరినీ ఉద్ధేశించి, "సభకు వందనం, ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను. భగవంతుని నామం గొప్పదా? భగవంతుడు గొప్పవాడా? ఈ విషయమై అభిప్రాయాన్ని చెప్పండి" అని పలికాడు. నారదుని అభ్యర్థన విన్నవెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయు. ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికి రాజసభలోని ఋషిగణం ఓ నిర్ణయానికి రాలేకపోయింది. కలకలం చెలరేగింది. చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ, ఖశ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్ఠమైనదని చెప్పాడు. సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం ఋజువవుతుందని పలికాడు.

అనంతరం నారదుడు, ఆంజనేయునితో, "హనుమా! నువ్వు మాములుగానే ఋషులకూ, శ్రీరామునికీ నమస్కరించు. విశ్వామిత్రునికి తప్ప" అని చెప్పాడు. అందుకు హనుమంతుడు అంగీకరించాడు. ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కరించాడు గాని, విశ్వామిత్రునికి మాత్రం నమస్కరించలేదు. దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు. అప్పుడు నారదుడు విశ్వామిత్రుని సమీపించి, "మునీశ్వరా! హనుమంతుని పొగరును గమనించారా? నిండుసభలో మీకు తప్ప అందరికీ నమస్కరించాడు. మీరు అతన్ని తప్పక శిక్షించాలి. అతనికి ఎంత గర్వాతిశయమో చూశారా? " అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి, "రాజా! నీ సేవకుడైన హనుమంతుడు అందరికి నమస్కరించి, నన్ను అవమానించాడు. కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా, నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి" అన్నాడు. విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు. కనుక, రాముడు అతని అదేశాన్ని పాలించవలసిందే. ఆ క్షణంలో శ్రీరాముడు నిశ్చేష్టుడైపోయాడు. కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామిభక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి. ఈ విషయం క్షణకాలంలో నగరం అంతా వ్యాపించిపోయింది.

హనుమంతునికి కూడా మహాదుఃఖం కలిగింది. అతడు నారదమునిని సమీపించి "దేవర్షీ! నన్ను రక్షించండి. శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు. నేను మీరు చెప్పినట్లే చేసినందులకు ఫలం అనుభవించినాను. ఇప్పుడు నేనేమి చేయాఅలి?" అనగా దేవర్షి, "ఓ హనుమంతా! నిరాశపడకు. నేను చెప్పినట్లు చేయి. బ్రహ్మ ముహూర్తంలో లేచి సరయూనదిలో స్నానమాచరించి చేతులు జోడించి, "ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ" అన్న మంత్రాన్ని జపించు. అంతే. విశ్వాస పూర్వకంగా చెబుతున్నాను. నీకే భయం రాదు" అన్నాడు.

మరునాడు తెల్లవారింది. సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరాడు. స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం, చేతులుజోడించి భగవంతుని నామాన్ని జరిపించసాగాడు. ప్రాతఃకాలం కావడంతో హనుమంతుని కఠినపరీక్షను తిలకించాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు. శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్ధ్ర దృష్ఠితో చూడసాగాడు. కాలం ఆసన్నం కావడంతో అనిచ్చా పూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపజేయసాగాడు. కాని, ఒక్క బాణం కూడా హనుమంతుని బాధించలేకపోయింది. ఆ రోజల్లా బాణాలు వర్షింపబడుతున్నాయి. కాని, అవి హనుమంతునిపై పడడం లేదు. కుంభకర్ణాది రాక్షసుల్ని వధించటంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు. అంతంలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు. హనుమంతుడు ఆత్మసమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రముగా జపిస్తున్నాడు. అతడు రామునివైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. స్థిరభావంతో నిలబడిపోయాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ హనుమంతునికి జయజయకారాలు పలుకసాగారు. అట్టిస్థితిలో నారదమహర్షి విశ్వామిత్రుని సమీపించి - "ఓ మహర్షీ! ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకొనెదరు గాక! శ్రీరామచంద్రుడు అలసివున్నాడు. విభిన్న ప్రకారాలైన బాణాలు కూడ హనుమంతుని ఏమీ చేయలేకపోయాయి. హనుమంతుడు మీకు నమస్కరించక పోతే పోయినదేమున్నది? ఈ సంఘర్షణ నుండి శ్రీరాముని రక్షించండి. ఈ ప్రయాస నుండి అతణ్ణి నివృత్తుణ్ణి చేయండి. మీరంతా శ్రీరామ నామ మహత్త్యాన్ని చూచినారు కదా!" ఆ మాటలకు విశ్వామిత్రమహర్షి ప్రభావితుడైపోయాడు. "రామా! బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు" అని ఆదేశించాడు. దానితో హనుమంతుడు వచ్చి, తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వ్రాలిపోయాడు. విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుని అనన్య భక్తిని గురించి విశేషంగా ప్రశంసించాడు.

హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారదమహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు.

'శ్రీరామ' - ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు. "జయరామ" ఇది అతని స్తుతి. 'జయజయరామ'- ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ. మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే వుండాలి. ఓ రామా! నేను నిన్ను స్తుతిస్తున్నాను. నీ శరణుజొచ్చినానన్న భక్తులకు శ్రీఘ్రమే శ్రీరామభగవద్దర్శనం జరుగుతుంది.

సమర్థ రామదాసస్వామి ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి, శ్రీరాముని ప్రత్యక్షదర్శనాన్ని పొందాడు. రామనామ శక్తి ప్రభావం అమితమైనది. అందుకే రామనామాన్ని నిత్యం భక్తులు జపించి తరిస్తుంటారు. స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో, ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది. రామనామాన్ని నిత్యం జపించేవాడు, తులసీమాలను ధరించినవాడు, రామా అని స్వామి వారిని నోరార పిలిచినవాడు ధన్యుడు. ఈ రామనామము తారకమంత్రమని చెప్పబడుతోంది. వేరొక మంత్రాన్నితారకమంత్రమని అనరు. అంత్యకాలంలో మరణం సమీపించినపుడు, స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.

ఎలాగైతే అత్యంత సూక్ష్మమైన మర్రివిత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో, అలాగే రాం అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే. మట్టి నుండి ఏర్పడిన కుండ, పిడత, బుంగ, తొట్టి, ప్రమిద ఎలాగ మృత్తికాస్వరూపమో, అలాగే ఈ జగమంతా రామ స్వరూపమే. శ్రీరామ నామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు. నిత్యం రామ నామామృతంతో వారి జీవితాలు పునీతమయి, సర్వ సుఖాలు లభిస్తాయి.

జై శ్రీమన్నారాయణ

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS