Sunday, March 11, 2018

కుజదోషం ఎఫెక్ట్ నుంచి ఎలా బయటపడాలి?

కుజదోషం ఎఫెక్ట్ నుంచి ఎలా బయటపడాలి?
  
ఎవరికైనా పెళ్ళికాలేదంటే కుజదోష కారణము, లేదా మాంగల్య దోషము కారణము కావచ్చు. వారికీ పరిహారము లేదనుకుంటారు.
కొన్ని కుజ దోష నివారణలు చూద్దాం:
కుజదోషం కల్గినవారికి పగడం ధరించుమని చెపుతుంటారు. కాని ఇది తర్క సహితమైనదికాదు దోషం కల్లించే గ్రహాన్ని బలపరిచి మరింత దోషప్రదునిగ చేయడం కన్నా దోషనివృత్తిచేసే శుభగ్రహాన్ని బలపర్చుట మంచిది. ఈ విషయం అనుభవజ్ఞ లందరూ అంగీకరించారు. దొంగకన్నా దొంగను పట్టుకొనే వానికి లేదా తరిమే వానికి బలం చేకూర్చుట మంచిది కదా!
కిందివాటిలో ఏదైనా ఒకటి లేదా అన్ని చేయవచ్చు.
ప్రతిరోజూ దక్షిణ దిక్కుగా మూడువత్తులదీపం పెట్టి, అంగారకస్తోత్రంకాని, జపంకాని చేయుటవల్ల కుజగ్రహదోష నివారణ జరుగును. శుక్లపక్ష మంగళవారం ప్రారంభించి పద్దెనిమిది వారాలు ఉపవాస నియమం పాటించాలి. పగలంతా ఉపవాసముండి అంగారకస్తోత్రం కాని, సుబ్రహ్మణ్య కవచంగాని పఠించాలి.
సాయంత్రం స్నానంచేసి దక్షిణదిక్కుగా దీపం పెట్టి తిరిగి పఠించి, రాత్రికి కందిపప్ప అన్నం తినవలెను. దీనివల్ల నివారణ జరుగును. వివాహం త్వరగా కాదలచుకొన్నవారు (ఆడపిల్లలు) ప్రతినెలా వారి జన్మ నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యస్వామికి పాలతో అభిషేకం చెయ్యాలి లేదా ఆయన యంత్రానికైనా చెయ్యాలి లేదా దుర్గాదేవికి సప్తశతిశ్లోకాలు పఠిస్తూ కుంకుమపూజ చేయుట వల్ల దోషనివారణ జరుగును.
పద్దెనిమిది మంగళవారాలు గౌరీదేవిని పూజించి, సుమంగుళులకు ఎరుపు జాకెట్టు బట్ట, ఎర్రరాగిదీపపు కుందులు లేదా పళ్లాలు లేదా చీరలు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి దీవెనలు పొందాలి.
కందిపప్పు నెయ్యితో అరటి ఆకులో భోజనం కూడా పెట్టుట మంచిది. ప్రతిమంగళవారం ఆరు అరటి ఆకుల్లో బియ్యంపోసి, ఆరు నేతి దీపాలు వెలిగించి, తూర్పుదిశగా పెట్టి కూర్చుని స్కందుని కవచం పారాయణచేసి, హారతి ఇవ్వవలెను. ఈ విధంగా పద్దెనిమిది మంగళవారాలు చేయవలెను.
పెండ్లికాని ఆడపిల్లలకు ఎర్రనిబట్టలు, మంగళసూత్రాలు లేదా కాలిమట్టెలు లేదా ఎర్రని గాజులు దానం చేయుట, నవగ్రహదేవాలయంలో 18 దీపాలు వెలిగించి నవగ్రహ స్తోత్రం చేయుటవల్ల నివారణ కల్గును. ఈ విధంగా 18 మంగళవారాలు చేయాలి.
ప్రతిమంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో స్వామి పాదాల సన్నిధిలో జాతకచక్రం పెట్టి పూజించాలి. లేదా ఇంటివద్దనే స్వామి అభయ హస్తమున్న పటము పెట్టి పూజించాలి. ఈ విధంగా 40 మంగళవారాలు చేయుటవల్ల ఫలితముంటుంది. ప్రతిరోజు రాహుకాలమందు నవగ్రహాలను పూజించి స్తోత్రం చేయాలి.
ఈ విధంగా 36 రోజులు చేయుటవల్ల నివారణ కల్గును. రోజుకు మూడుసార్లు కుజహోరలో కుజుని అష్ణోత్తర శతనామ స్తోత్రం చేసి తల్లి పాదాలకు నమస్కరించి దీవెన పొందాలి. ఈ విధంగా 18 దినాలు చేయుటవల్ల నివారణ జరుగును.
1 వస్తాన కుజుడు సుఖ స్థానమును సప్తమ స్థానమును అష్టమ మమును చూచును గాన ఆయా భావములపై చెడు గలుగుతుంది అటులనే 2 వభావమున కుజుడు 5 8 9 భావములను 4 వభావకుజుడు 7 10 11 భావములను అటులనే 7 భావ కుజుడు 1 2 10భావములను  8 కుజుడు 11 2 3 భావములను  10 కుజుడు 2 4 5 భావములను దృష్టి వలన తన స్థితి వలననూ తీక్షణ ఫలములను ఇచ్చును గాన కుజదోషము అని తెలుపబడింది

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS