Thursday, August 27, 2020

నవగ్రహాలు,తల్లిదండ్రులు,భార్య, నక్షత్రాలు, నైవేద్యం, దానం, రాశి, వర్ణం, వాహనం, పూర్తి వివరాలు...

నవగ్రహాలు,తల్లిదండ్రులు,భార్య, నక్షత్రాలు, నైవేద్యం, దానం, రాశి, వర్ణం, వాహనం, పూర్తి వివరాలు...


ఆదిత్యుడు :
కశ్యపుని కుమారుడు సూర్యుడు.భార్య అదితి. అందుకేఆదిత్యుడు అని పిలుస్తాము. సప్తఅశ్వాలతో ఉన్న రధం అతనివాహనం. ఆ సప్త అశ్వాలు ఏడుచక్రాలకు ప్రతీకలు.
( మూలాధారం, స్వాదిష్టానం,మణిపూరకం, అనాహతం, విశుద్ధ,ఆఙ్ఞ చక్రం , సహస్రారం )
వివాహ పరిబంధన దోషం, పుత్రదోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా పరిబంధన దోషం,ఉద్యోగ పరిబంధన దోషం, సూర్య దోషం మొదలైనదోషాలతో బాధ పడే వారు సూర్యుని పూజించటం వలనఫలితం పొందుతారు.
సింహరాశి కి అధిష్టాన దేవుడు సూర్యుడు. నవగ్రహాలలోమద్య స్థానం ఆదిత్యుడిది. అధిదేవత అగ్ని, ప్రత్యధి దేవతరుద్రుడు. ఆదిత్యుడు ఎరుపు వర్ణం లో ఉంటాడు.
ఇష్టమైన ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
నైవేద్యం : గోధుమలు, రవ చక్కర పొంగలి

చంద్రుడు :
చాల అందమైన వాడిగామనం వర్ణిస్తూ ఉంటాం.వర్ణనలకు కంటే మిన్నగాచంద్రుడు చాల అందమైనవాడు. పది తెల్లటి గుర్రాలతోఉన్న రధాన్ని అధిరోహిస్తాడు.నిశాదిపతి ( రాత్రి కి రాజు),క్షుపరక (రాత్రిని కాంతివంతంచేసే వాడు) అని పేర్లు కూడా కలవు. ఇరవైఏడునక్షత్రాలను సూచిస్తునట్టు, ఇరవైఏడు మంది భార్యలనుకలిగి ఉన్నాడు. తండ్రి సోమ తల్లి తారక.
అనారోగ్యం తో బాధ పడుతూ ఉన్న తల్లి, చర్మ వ్యాధులుమొదలైన సమస్యలు కలవారు చంద్రుని పూజ వలనఫలితం పొందగలరు.
కర్కాటక రాశి కి అధిపతి చంద్రుడు. తూర్పు - దక్షిణఅభిముఖుడై ఉంటాడు.
అధిదేవత : నీరు.
ప్రత్యధిదేవత : గౌరి
వర్ణం : తెలుపు
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం

మంగళ :
అంగారకుడు ( ఎర్రని వర్ణంకలవాడు) అని కూడా పిలుస్తాం.ఇతను భూదేవి కుమారుడు.మేష, వృశ్చిక రాసులకి అధిపతి.దక్షినాభిముఖుడు. రుచకమహాపురుష యోగ విద్యనుభోదిస్తాడు. తమోగుణవంతుడు.
భార్య / పిల్లలు / అన్నదమ్ముల వల్ల సమస్యలుఉండేవారు, స్నేహితులతో శత్రుత్వం, సంపదనుకోల్పోయిన వారు మంగళ దేవుడిని పూజించటం వలనసత్ఫలితాలను పొందుతారు.
అధిదేవత : భూదేవి
ప్రత్యదిదేవత : క్షేత్ర పాలకుడు
వర్ణం: ఎరుపు
ధాన్యం : కందులు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం

బుధుడు :
తార, చంద్రుల పుత్రుడుబుధుడు. రజోగుణవంతుడు.పుత్ర దోషం, మంద విద్య,చంచలమైన మనసు కలవారుబుధుని పూజలు చేసిఉపసమనం పొందుతారు.తెలివితేటల వృద్ధి, సంగీతం,జ్యోతిష్యం, గణితం, వైద్యంవంటి వాటిలో రానిచాలంటేబుధుడి అనుగ్రహం పొందాలి.
మిధున మరియు కన్యారాశి కి అధిపతి బుధుడు. తూర్పు- ఉత్తర ముఖుడై ఉంటాడు.
అధిదేవత : విష్ణు
ప్రత్యధిదేవత : నారాయణుడు
వర్ణం : చిగురాకు పచ్చ
వాహనం : సింహం
ధాన్యం : పచ్చ పెసలు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసలతో కూడిన అన్నం

గురు :
బృహస్పతి అని కూడాఅంటాము.. దేవతలకు,దానవుల గురువైనశుక్రాచారుడికి గురువు ఇతను.సత్వగుణ సంపన్నుడు.పసుపుపచ్చ / బంగారు వర్ణంలో ఉంటాడు.
పేరు ప్రఖ్యాతులు, సంపద, తోడబుట్టినవారి క్షేమము కొరకు గురువు ని పూజించాలి 
ధన్నురాశి, మీనా రాశిలకు అధిపతి. ఉతరముఖుడైఉంటాడు.
అధిదేవత : బ్రహ్మ
ప్రత్యధిదేవత : ఇంద్రుడు
వర్ణం: పసుపు
వాహనం : గజరాజు
ధాన్యం : శెనగలు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : శెనగల తో కూడిన అన్నం

శుక్రుడు :
ఉషన, బృగు మహర్షి లసంతానం. అసురులకుగురువు ఇతను.రజోగుణ సంపన్నుడు.ధవళ వర్ణం తోమద్యవయస్కుడిగాఉంటాడు. ఒంటె /గుఱ్ఱము / మొసలివాహనంగా కల్గిఉంటాడు.
అనుకోని పరిస్థితులవల్లన కుటుంబాలు విడిపోవడం లేక తగాదాలు రావడం ,బాగా కలిసి ఉండేవారి మద్యలో శత్రుత్వం కలగడంమొదలైన విపత్కర పరిస్థితులనుండి శుక్రాచార్యుని పూజవలన బయట పడే అవకాశం ఉంది.
వృషభ, తులరాశులకు అధిపతి.
అదిదేవత : ఇంద్రుడు
వర్ణం : తెలుపు
వాహనం : మొసలి
ధాన్యం : బొబ్బర్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : బొబ్బర్లు తో కూడిన అన్నం

శని :
ఛాయా దేవి,సూర్యభగవానుడిపుత్రుడు శని. నల్లని వర్ణంతో, నలుపు వస్త్రధారణతో,కాకి వాహనంగా కలిగిఉంటాడు.
శని దేవుడిని అందరుతిడ్తూ ఉంటారు. నిజామేఅలాoటి బాధలుపెడతాడు శని. మనల్ని ఎంతగా బాధ పెట్టి కష్టాలుపెడతాడో, అంతకంటే ఎక్కువ మంచి చేసి వెళ్తాడు.
కుంభ, మకర రాసులకి అధిపతి. పడమటి వైపుముఖాసీనుడై ఉంటాడు.
అదిదేవత : యముడు
ప్రత్యధిదేవత : ప్రజాపతి
వర్ణం : నలుపు
ధాన్యం : నల్ల నువ్వులు
పుష్పం : నల్లని తామర
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం

రాహువు :
సూర్య చంద్ర గ్రహాణాలకుకారకుడు గా చెప్పబడేరాహువు ను ఒక పామురూపం లో వర్ణిస్తారు. ఒకకత్తి ని ఆయుధంగాచేసుకొని, ఎనిమిదినల్లటి గుర్రాలనుఅధిరోహిస్తూ ఉంటాడు.
పుత్ర దోషం, మానసికరోగాలు, కుష్టుమొదలైనవి రాహుప్రభావములే.
పడమర - దక్షినాభిముఖుడై ఉంటాడు.
అదిదేవత : దుర్గ
ప్రత్యధిదేవత : పాము
వర్ణం : నలుపు
వాహనం : నలుపు సింహం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం

కేతువు :
భార్య చిత్రలేఖ. ఆస్తి నష్టం, చెడుఅలవాట్లు, పుత్ర దోషం మొదలైనవితొలగాలంటే కేతు పూజలు చేయాలి.
ఉత్తరం - పడమటి ముఖాసీనుడైఉంటాడు.
అదిదేవత : చిత్రగుప్తుడు
ప్రత్యధిదేవత : బ్రహ్మ
వర్ణం : ఎరుపు
వాహనం : గద్ద
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.

No comments:

Post a Comment

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS