ధనాకర్షణ యంత్రం
ఆర్ధిక సమస్యలను పారద్రోలుటకు చేయుచున్న పనులయందు ధనలాభం చేకుర్చుటకు అప్పుల ఊభి నుండి మానవులను బయటకు తీసి ప్రసాంతత చేకుర్చుటకు ధనలక్ష్మి కటాక్షం పొందుటకు ఆర్ధిక సమస్యలనుండి కాపాడి లక్ష్మీకటాక్షం పొందుదురు ఈ యంత్రము వలన ధనలాభం చేకూరును మానవులకువ్యాపార అభివృద్దికి కలుగ జేసి దినదినాభివృద్ది తో మానవులు ఆర్దికభాధలు లేకుండా చేసి కుటుంబము ఆనందముగా జీవించుటకు ఉపయోగపడి ఇంటిలోనవారందరికి వర్చస్సు ఆరోగ్యము ఆర్ధిక పుష్టి కలుగజేసి ఆనందమయ జీవితం గడుపుటకు దోహదపడును.
ఈ యంత్రం ఇంటిలో దేముని మందిరం నందు ఉంచి ప్రతీ రోజు ఈ మంత్రంజపించవలెను.
ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం మహాలక్ష్మి నమః
అని కనీసం 11 సార్లు యంత్రమును చుస్తూ పఠించి మనసున మీరు కోరిన కోరికను యంత్రములో ఉన్న మహాలక్ష్మి దేవికి విన్నవించుకోవలెను.
మీ ఏకాగ్రత శ్రద్ధ భక్తి తో మీరు అమోఘమైన ఆర్ధిక విజయాలు సాదింతురు ఈ యంత్రం వ్యాపార స్థలం లో తూర్పు ఈశాన్యం లేక ఉత్తరము ను చూచునట్లు గా యజమాని కుర్చునున్న కుర్చీ వెనుక గోడకు స్తాపన చేసిన యెడల యంత్రము నుంచి ప్రసరించు అద్భుతమైన శక్తీ కిరణములు ల వలన యజమానికి మంచి తేజస్సు ఆకర్షణ శక్తీ లభించి మంచి ప్రశాంత చిత్తము కలిగి వ్యాపారాభివ్రుది జరుగును సమస్త జనులకు ధనాకర్షణ యంత్రం ఆకర్షణకు గురిచేసి వ్యాపారాభివ్రుదికి పూర్తిగా ఉపకరించును ప్రతిరోజూ దుకాణం తెరచిన వెంటనే మనః పూర్వకముగా యంత్రమునకు నమస్కరించవలెను దుకాణం మూసేటప్పుడు యంత్రమునకు నమస్కరించవలెను.
ఈ యంత్రమువలన (1) ధనలాభం (2) ధాన్యం (3) వాహనం (4) సువర్ణములు మణి మాణిక్యాలు (5) పుత్రులు (6) సేవకదాసిజనం (7) బంధువులు (8) మిత్రులు అనబడే అష్ట ఐ స్వర్యాలు సిద్దించును.
*శ్రీ చక్రం*
హిందూమత చింతన ప్రకారం ఈ లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి నుండి ఉద్భవించాయి. ఈ విశ్వజననికి ఒక నిర్ధిష్ట రూపంలేదు. అయితే ధ్యానశక్తితో ఆ రూపాన్ని దర్శించిన రుషులు ఒక యంత్రరూపం మనకు ప్రసాదించారు. ఈ యంత్రం రేఖలు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్రతిబింబంగా రూపొందించారు. అటువంటి యంత్రరూపాల్లో అద్భుతమైనది శ్రీచక్రం. శ్రీ చక్ర పరిలేఖన విధి అతిపురాతన అధర్వణవేదము, ఉపనిషత్తులు, పరమానంద తంత్రము, నామకేశ్వర తంత్రము మొదలగు మంత్రతంత్ర శాస్త్రములలో చెప్పబడి వున్నది. శ్రీ చక్రంలో సమస్తమూలాలు, మూలకాలు, మహిమాన్వితులైన దేవతలు, మంత్రోచ్ఛారణలు, కేంద్రంలో ఒక బిందువు వున్నాయి. ఆ కేంద్రంలో వున్న బిందువు, విచ్చుకుని మొలకెత్తేందుకు సిద్ధంగా వున్న విత్తనాన్ని సూచిస్తుంది. తనలో నుండి కొత్తశక్తి ఇవ్వగలటాన్ని తెలియజేయడం ఆ బిందువు యొక్క ఉద్దేశం. మొదట బిందువు, ఆ కేంద్ర బిందువు చుట్టూ త్రికోణము ఆ పైన అష్టకోణము తరువాత దశకోణముల యగ్మము ఆ పైన పదునాల్గు కోణాలు. ఆ తరువాత అష్టాదశ కోణములు (పదునెనిమిది) యుగ్మము, ఆపైన అష్టదళకమలము, దానిపైన షోడశదళకమలము, దానిని బట్టి మూడు వృత్తాలు, దాని చుట్టూ చతురస్రాకారముగా నాలుగు ద్వారాలు గల భూపురత్రయము అదియే పరదేవత యొక్క శ్రీ చక్రము. బ్రహ్మ విద్యను శ్రీ విద్యగాను, దాని రూపమును శ్రీ చక్రముగాను భావిస్తారు. ఛాందోగ్యోపనిషత్ నుండి సృష్టికి ముందు సత్ అనే చిదగ్నిగా భావింపబడే బ్రహ్మ పదార్ధము వున్నది. అది మహాబిందువు. మొదటిది అది అనేకముగా అగుదును అని సంకల్పించి మహాకారణ రూపమైంది. దాని శక్తి యొక్క క్షేత్రరూపమే శ్రీ చక్రము అని తెలుస్తోంది. కేంద్రబిందువు చుట్టూ మొత్తం తొమ్మిది త్రిభుజాలుంటాయి. వీటిలో ఐదు త్రిభుజాలుపైన, మొనదేలిన భాగం కిందివైపున వుంటాయి. మిగిలిన నాలుగు త్రిభుజాల మొనదేలిన భాగంపై వైపున వుంటాయి. ఈ త్రికోణాల భుజాలు ఒకదానిని మరొకటి దాటుకుంటూ చేసే ప్రయాణంలో మొత్తం మరో 43 త్రిభుజాలు ఏర్పడతాయి. ఈ త్రిభుజరూపాల చుట్టూ మూడు వృత్తాలుంటాయి. వీటిలో లోపలి ఐదు త్రిభుజాలుపైన, మొనదేలిన భాగం కిందివైపున వుంటాయి. మిగిలిన నాలుగు త్రిభుజాల మొనదేలిన భాగంపై వైపున వుంటాయి. ఈ త్రికోణాల భుజాలు ఒకదానిని మరొకటి దాటుకుంటు చేసే ప్రయాణంలో మొత్తం మరో 43 త్రిభుజాలు ఏర్పడతాయి. ఈ త్రిభుజరూపాల చుట్టూ మూడు వృత్తాలుంటాయి. వీటిలో లోపలి వృత్తానికి 8 రేకులు, వెలుపల వృత్తానికి 16 రేకులు వుంటాయి. వీటిని చుట్టి రెండు మందమైన గీతలు వుంటాయి. ఈ గీతలన్నీ నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలలాగే తెరుచుకుంటాయి. శ్రీచక్రం భౌతిక, మానసిక, జీవశక్తుల కలయికతో కూడినది. ఈ శక్తులు బాహ్య అంతరంగశక్తులు రెండిటిని కలిగినది. దీనినే కుండలిని శక్తి అంటారు. ఇదే సర్వశక్తి రూపం. జగజ్జనని మానవ శరీరంలోని వృత్తంలో నిద్రిస్తుంటుంది. దీనిని తట్టి బైటకు తీసేందుకు ఉద్దేశించినవే ధ్యానం, ప్రాణాయామాలు, లోపలి వృత్తంలోని కుండలిని శక్తి, బయటి వృత్తం లేదా అత్యున్నత వృత్తంలోకి తీసుకురాగలిగేందుకు మనిషి తన ఆత్మశక్తిని తెలుసుకొనడం జరుగుతుంది. అది భగవంతుని రూపాన్ని కాంచటం అంటారు. దీనిని సాధించడం కోసం మనిషి సాధన చేయాలి.
*శ్రీ సుదర్శన చక్ర మహాయంత్రము*
ఈ యంత్రము రాగి లేక వెండి రేకు మీద దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార, ప్రాణప్రతిష్ఠ, జీవకళాన్యాసాదులను గావించి, శుభముహూర్తమున పూజా స్థానమందుంచి పూజాదులు ప్రారంభించవలయును.
పూజావిధి ఈ సుదర్శనము – శ్రీ మహా విష్ణువు యొక్క ప్రధాన ఆయుధము. ఈ స్వరూపము – సర్వులకు రక్షణ కల్గించుటలో అమోఘమైనది.
సర్వజన్మల పాపములనుహరించి సుఖశాంతులను చేకూర్చునట్టి – ఈ యంత్రమును దీక్ష, నియమ, నిష్ఠలతో 40 రోజులు నిత్యషోడశోపచార పూజలు జరుపుచుండవలెను. ఓం ఆం హ్రీం క్రోం సహస్రార హుం ఫట్ స్వాహా అనే మూల మంత్రాన్ని ప్రతిరోజు 2500 సార్లు జపించుచూ, మొత్తము ఒక లక్ష జపము చేయవలెను. జప ఫలమును యంత్రమునకు ధారబోయవలెను. అప్పుడు యంత్రము శక్తివంతమగును. పిదవ ఈ యంత్రమును శుభముహూర్తమున గృహమునందు స్థాపించుటయో లేక పూజా మందిరము నందుంచి నిత్యపూజాదులు చేయవలెను.
ఈ క్రింద చెప్పబడిన సుదర్శన మంత్రంతో ఈ యంత్రముకు 41 రోజులలో 3,00,000 జపం, తర్పణం చేయించి అధివాసములు చేయించి దీనికి సుదర్శన హోమం చేయించి వ్యాపార సంస్థలో కానీ, గృహము నందు కానీ ప్రతిష్ఠించిన ఎడల ఈ యంత్ర ప్రభావంతో నరఘోషపోయి శతృసంహారం జరగగలదు అని ప్రాచీన సాంప్రదాయము. అయితే ఈ యంత్రం ఉన్న ఇంట అశౌచము కలిసిన ఎడల దీని ప్రభావం సరిగా పనిచేయదు. తత్ర్పభావంగా ప్రతికూల ఫలితములు కూడా వచ్చే అవకాశం ఉన్నది. దీనిని ప్రతిష్ఠా విధానంగా ప్రతిష్ఠ చేయవలెను. దీనిని బ్రాహ్మణ ముఖతః జపం చేయించి హోమ తర్పణాదులు చేయించి ప్రతిష్ఠించవలెను.
*శ్రీ మత్స్య మహాయంత్ర రాజము*
యంత్ర విశిష్టత శ్రీ మహా విష్ణువు యొక్క దశావతారములలో మొట్టమొదటి అవతారమే మత్స్యావతారము వేద సముద్ధరణకై అవతరించిన శ్రీ మహావిష్ణువు రూపము. ఈ యంత్రము, ఇతర యంత్రముల కన్నా చలా విశిష్టమైనది. సమస్త వాస్తు దోష నివారణ యంత్ర రాజము ముఖ్యముగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థారము నందు గల సప్తావరణలలోను అతి ముఖ్యము శక్తివంతమైన బీజాక్షరములతో రూపొందించబడి, సర్వ సాంప్రదాయాను కూలముగా నిర్మించబడినదీ యంత్రము. పూజా విధి ఈ మత్స్య యంత్రమును శాస్త్రానుసారముగా దైవజ్ఞులచే తయారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ కళాన్యాస, ప్రాణప్రతిష్టాదులను జరిపించి, శుభ సమయమున యంత్ర పూజ, జపాదులను ప్రారంభించవలెను. ఈ యంత్రమును శక్తివంతముగా చేయుటకై విధి విధానమును మిగిలిన యంత్రముల కన్న కొంచెము ఎక్కువగానే నిర్ధేశింపబడినది. గావున ఆ విధముగా సర్వము దీక్షతో నిర్వహించి శుభంబులబడయవలసిదిగా ప్రార్థన.
*శ్రీ వాస్తు పురుష మహా యంత్రము*
ఈ వాస్తు పురుష మహా యంత్రమును గృహ నిర్మాణ సమయమునందు, శంకుస్థాపనల యందు లేదా మీరు నివసించు నివాస గృహమునందుగాని ఈ యంత్రమును స్థాపించిన మీ గృహములలో గల సమస్త వాస్తు దోషాలు తొలగిపోయి ఆ ఇంటి యజమానికి అందులో కాపురముంటున్న వారికి ఆయురారోగ్య భాగ్యములు మరెన్నో శుభాలు కలుగును. ఈ వాస్తు పురుష మహాయంత్రము గృహమునందు, షాపింగ్ కాంప్లెక్స్‌నందు, రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలు, సినిమాహాళ్లు మొదలైన అన్ని నిర్మాణముల యందు స్థాపించిన ఎడల ఆ కట్టడములలో గల వాస్తు దోషములు తొలగిపోవును.
ఈ యంత్రము రాగితో గాని, వెండితోగాని తయారు చేయించి నూతన కట్టడాలు ప్రారంభించే ముందు ఈ యంత్రమును పసుపు కుంకుమలతో పూజించి కొబ్బరియాకాయ కొట్టి సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ మహాయంత్రమును పూజామందిరంలో వుంచి, నిత్యము ఏదో ఒక పండుగాని, పటికబెల్లం చిప్స్‌గాని నైవేద్యంగా పెట్టి రెండు అగరుబత్తిలు వెలిగించి వాస్తు పురుషుని మనసున తలచి మూల మంత్రమైన ఓం వేదాత్మనాయ విద్యహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించి నమస్కరించాలి. ఈ విధంగా ప్రతినిత్యము చేయాలి. ఈ విధంగా యంత్రమును స్థాపించిన మీ గృహములో గల వాస్తు దోషాలు తొలగిపోయి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగును.
యంత్రములు తయారీ, విశిష్టత
యంత్రము పూర్వకాలమున నిష్ఠాగరిష్టులైన వారు ద్విజత్వం పొందినవారు మంచి గురువును ఆశ్రయించి సేవ చేసి గురువు అనుగ్రహం చేత మంత్రోపదేశం పొంది ఆ మంత్రమును త్రికరణ శుద్ధిగా కొన్ని లక్షల, కోట్ల సార్లు ప్రయత్నపూర్వకంగా జపము చేసి మంత్రసిద్ధి పొందిన తరువాత శాస్త్రోక్తంగా వాటి తిధి, వార, నక్షత్ర కాలములకు అనుగుణంగా బంధువుల నుండి మొదలుకొని వుండే కోణాలను త్రికోణ, చతుఃకోణ, పంచకోణ, అష్ఠకోణ మరియు అష్ఠదళ, అష్ఠదళములు మొదలుగా గల వాటి ఆకారములు హెచ్చుతగ్గులు లేకుండా వాటిలో బీజమంత్రములు లిఖించి, వాటిని తగిన రీతిలో యంత్రము నందు శక్తిని నింపి ఇచ్చేవారు. కానీ ప్రస్తుత కాలంలో మంత్ర సిద్ధి పొందిన వారు తక్కువగా వుండి అందుబాటులో లేకపోవడంతో యంత్రమును పంచలోహములతో తయారు చేయుట జరుగుతుంది. మంత్రశక్తిని బీజశక్తిని పంచలోహములు సులువుగా గ్రహించగలనందున యంత్రమును పంచలోహములతో తయారు చేసి, భక్తులకు అందించుట జరుగుతున్నది. ఏఏ లోహము ఎంతెంత మోతాదులో వుండాలో వాటిని సమానంగా సరిపడు మోతాదులో కలిపి కాలధర్మానుగుణంగా శక్తి యంత్రంలో కేంద్రీకృతమగునట్లుగా నిక్షిప్తం చేసి ముద్రించి వాటికి వుండే యంత్రాధిష్టాన దేవతా కళను ఆవాహన చేసి యంత్రం వెనుక బ్రహ్మకమలం రేకు గజరేశ పుంజము9ను అమర్చి ప్రతిష్టించి ఇవ్వబడును. ఈ యంత్రము నందు సంస్కృత బీజమంత్రములను నిక్షిప్తం చేసి యంత్ర కోణాలు బీజములు ఊర్ధ్వముఖ దీపనమై వెలుగొందుతూ దోషరహితముగా శక్తి ప్రవాహాలుగా మారి ఆ శక్తి చుట్టుపక్కల ప్రసరించి ఆ ప్రాంతమును పవిత్రంగా, చైతన్యముగా చేయును. దేవాలయంలో వున్న మూలవిరాట్ విగ్రహమునకు ఎంత ప్రాధాన్యత వుంటుందో అలాగే పంచలోహ విగ్రహమూర్తులకు కూడా అంతే ప్రాధాన్యత వుండును. ఉదాహరణ తిరుపతిలో వెంకటేశ్వరస్వామికి చేసే సేవలు అన్ని ఉత్సవ విగ్రహములకు కూడా చేయుదురు. ఉత్సవ మూర్తులు మానవనిర్మిత విగ్రహములు, పంచలోహములతో తయారు చేయబడినవి. చాలా విశిష్టత కలిగినవి. శ్రీశ్రీశ్రీ లలితా త్రిపుర సుందరీ పీఠం వారిచే తయారు చేయబడిన యంత్రములకు కూడా పరిపూర్ణ శక్తి వుండును అనుటలో సందేహం లేదు. ఈ యంత్రములు చాలా శక్తివంతమైనవి. ప్రత్యేక నియమ, నిష్టలను, భద్రతలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో లోకకళ్యాణము కొరకు తయారు చేయుట జరుగుతున్నది. యంత్రము తయారు చేయుటకు అయిన ఖర్చును మాత్రమే దీనికి ధరగా నిర్ణయించడం జరుగుతున్నది. కానీ దీని ధర నిర్ణయింపరానిది. అమోఘమైనది. ఏ యంత్రము వ్యాపార కాంక్షతో ఇచ్చుచున్నది కావు. సనాతన ధర్మంనందు విధితమైన తంత్ర, మంత్ర, యంత్ర రహస్య విద్య యొక్క ప్రాముఖ్యత ప్రయోజనం ప్రజలు అందరూ అనుభవించి ఈ కలియుగంలో వారి ఇష్టమైన కోరికలను నెరవేర్చుకొని వారి జన్మను సార్ధకము చేసుకొని భగవంతుని మహిమావిశేషాలను అందరికి విశిధపరచగలరని మనసా, వాచా, కర్మణా, త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాము.
పంచలోహముల విశిష్ట
పంచలోహాలు అనగా రాగి, ఇత్తడి, వెండి, కంచు, బంగారం వీటిని పంచలోహాలు అని అందరు. ఇవి పంచభూతాలతో సమానంగా పనిచేయును. పంచభూతములు మానవ శరీరంలో పంచ ఇంద్రియాలకు సమానంగా పనిచేయును. పంచభూతములు మానవ శరీరంలో పంచ ఇంద్రియాలకు సమానంగా పనిచేయును. రాగి-అగ్ని-నేత్రము, కంచు-వాయువు-నాసికము, వెండి-నీరు-నాలుక, బంగారము-ఆకాశము-కర్ణం-, ఇత్తడి-భూమి-చర్మం. మానవునికి పంచ ఇంద్రియాల వల్ల నిత్యకర్మలు ఆచరణ జరుగుతున్నది. కావున మానవుడు చేసిన నిత్యకర్మలలో తనను కాపాడుటకు అనేక పాపములు చేయుచూ తన ఇంద్రియ శక్తిని కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంద్రియశక్తిని కోల్పోకుండా ఈ పంచలోహాలు దోహదపడతాయి. కావున యంత్రానికి పంచలోహాలను వాడుటకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. పంచభూతాలు అగ్ని, వాయువు, భూమి, ఆకాశం, నీరు ఇవి పంచభూతములు. ఇవి మానవునిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నిత్యజీవితంలో మానవుడు నిద్రావస్థలో తన శరీరంను చైతన్యపరుచుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి పంచేంద్రియ శక్తితో చూడగలుగుతూ, వినగలుగుతూ, మాట్లాడగలుగుతూ వాసన పీల్చగలుగుతూ, స్పర్శజ్ఞానంను అనుభవిస్తూ, రుచిని ఆశ్వాదిస్తూ మొదలుగా గల పంచజ్ఞానశక్తిని పంచభూతాల నుండి గ్రహించును. అక్కడ మానవునికి వున్న మనస్సును నియంత్రించుకోలేక అందరిని ఈ అయిదు శక్తులను దుర్వినియోగపరుస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నాడు. తీవ్రమైన మానసిక క్షోభకు గురై చైతన్యం కోల్పోతూ నిర్జీవమైన జీవితంను గడుపుతున్నాడు. పంచలోహాములకు కూడా ప్రకృతిలో వుండే పంచభూత శక్తి నిత్యచైతన్యమై వెలుగొందే శక్తిని నిరంతరం కల్పించుట వలన మానవుని జీవన మనుగడకు పంచలోహములు ప్రధాన మంత్ర, తంత్ర శక్తివాహకాలుగా పనిచేసి రక్షించి కాపాడును.
ప్రముఖ యంత్రములు – వాటి ఫలితాలు
1. శ్రీ పూర్ణ శ్రీ చక్ర మహామేర మహా యంత్రం : చుట్టుపక్కల పరిస్థితులను దైవశక్తితో కలుపుతూ పరిపూర్ణ ఆధ్యాత్మిక, ఆనందంతో పాటు అద్వితీయ మనశ్శాంతిని ప్రసాదించి, ఆజ్ఞానంను తొలగించి జ్ఞానశక్తిని పెంపొందించుచూ, పునఃజన్మలేకుండా చేయును. ప్రతీ ఇంటి దైవమందిరంలో వుండవలసిన యంత్రరాజం.
2. శ్రీ మహాగణపతి మహా యంత్రం : సర్వకార్యసాఫల్యత, ఆటంక దోషాలు తొలగుట, సంతోషము, ఐశ్వర్యం, ఈతిభాదలు నుండి విముక్తి, ఆలోచనాశక్తి పెరిగి, బుద్ధిశక్తితో ఏ కార్యమునైనను సర్వసిద్ధి సాధించగల ఏకైక యంత్రం.
3. శ్రీ చక్రం యంత్రం : మనశ్శాంతి, ఆకర్షణాశక్తి, సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందించుటలో సహాయపడగల మహాయంత్రం. ముఖవర్చస్సు పెరిగి సర్వజన వశీకరణ కలిగించే యంత్రం.
4. సర్వజన మన, ధన, ఆకర్షణ సామ్రాజ్య లక్ష్మీ మహా యంత్రం శ్రీ మహాసుదర్శన యంత్రం : ఇది మూడు యంత్రాలు కలిగిన యంత్రం. వ్యాపార
అభివృద్ధి, సమస్త కార్య, వ్యవహార జయం, సమస్త శత్రునాశనం, వాస్తు భూదోష నివృత్తి, అఖండ కీర్తి, అఖండ వ్యాపార దినదినాభివృద్ధి
కలిగించే ఏకైక యంత్రం.
5. శ్రీ శూలినీ శరభేశ్వర ప్రత్యంఘీరా యంత్రం రాజం : సర్వశత్రు నివారణ, సర్వ రోగనివారణ, చేతబడులు, బాణామతి, వశీకరణ, సకల తాంత్రిక బాధల నుండి పూర్తి విముక్తి కలిగించి, మనశ్శాంతి కలిగించును. ప్రయోగము చేసిన వారి ప్రయోగమునకు తిరిగి వారి వద్దకే పంపించగల మహిమాన్విత యంత్రం.
6. సమస్త వాస్తు దోష పరిహార యంత్రం : అన్ని రకాల వాస్తు దోషాల నుండి గృహమును కాపాడి, భూమిలో వుండే దోషం కూడా ప్రారద్రోలి, గృహమునకు
వైభవం తీసుకురాగల మహిమాన్విత వాస్తు యంత్రం. వీధి దోషాలు, శూల దోషాలు, గర్భదోషాలు ద్వారా దోషాలు నివృత్తి చేయగల యంత్రం.
7. సంతానగోపాల యంత్రం : శ్రీ కృష్ణుణ్ణి యొక్క తేజఃపూర్ణ యంత్రరాజం, స్త్రీ గర్భస్థ సంతాన దోషాలు, పురుష వీర్య దోషాలను పారద్రోలి ఎటువంటి జాతక దోషాలు వున్నను నివారించి సంతానప్రాప్తి అందించగల ఏకైక యంత్రం.
8. శత్రు జయ యంత్రం : మనచుట్టు వుండి మనము చేసిన పనులు కనిబెడుతూ మనకు ద్రోహం చేసిన లేదా చేయాలని తలపెట్టిన వారిని మట్టుపెట్టి శత్రు సంహారంగావించి అజాతశత్రువుగా కీర్తిప్రతిష్టలు పెంపొందించే మహిమాన్విత యంత్రం.
9. వివాహ సౌభాగ్య యంత్రం : సమస్త కుజదోషాలను, నాగదోషాలను, కాలసర్ప దోషాలను, పారద్రోలి ఆలస్య వివాహమును త్వరితగతిన చేయగల సమస్త వివాహ దోష పరిహర యంత్రం.
10. ధనాకర్షణ యంత్రం : ఐశ్వర్యప్రాప్తి, ధనయోగం కలిగించును. వ్యక్తిగతంగా చేయు పనుల యందు విజయాలను కలుగజేయును.
11. మహామత్స్య యంత్రం : వాస్తుదోషాలను తొలగించి, గృహమునకు పునర్జీవనం కలుగజేయును. గృహంలో సకల శుభాలు, సకల మంగళములను,
సర్వాభిష్ఠసిద్ధిని కలుగజేయును.
12. లక్ష్మీ కుభేర యంత్రం : సమస్త వ్యాపార ఆర్ధిక, సమస్యలను సరిచేసి నిత్యం వ్యాపారంలో ధనలాభం కలిగేలా చేసి వ్యాపార సంబంధిత సమస్త బాధలను తీర్చగల మహాయంత్రం. వ్యాపార అభివృద్ధికి సంపూర్ణ తోడ్పాటు కలిగించి, వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేర్చి చాలా మందికి ఉపాధి కలిగించే స్థాయి కలుగజేయును.
13. సకల ఐశ్వర్య సామ్రాజ్య లక్ష్మీ కటాక్ష మహాయంత్రం : నాలుగైదు రకాలుగా పనిచేయగల యంత్రం. శత్రు సంహారం, ధనము, ధాన్యము, వాహనము, సువర్ణ మాణిమయ మాణిక్యాదులు, పుత్రులు సేవక దాసీ జనము, బంధువులు అనేడి అష్ఠ ఐశ్వర్యాలు కలుగజేయగల వర్ణణాతీత మహిమాన్విత యంత్రం.
14. దశమహావిద్య మహాయంత్రం : పది యంత్రాలు దశమహాశక్తి దేవీ దేవతల యొక్క శక్తి స్వరూపమైన మహిమాన్విత యంత్రం. కాళీ, తార, భగలాముఖి, రాజమాతంగి, త్రిపురసుందరీ, భువనేశ్వరి, చిన్మయ, కమలాశిష్ఠ, దుర్మావతి దేవీల యొక్క పది రకాల ప్రయోజనాలు కలిగించే అద్భుత యంత్రం.
15. సకల రోగ నివారణ యంత్రం : వాత, పిత్త, కప, జ్వర, పాండు, వ్రణ, చర్మ, గర్భ, నేత్ర, కర్ణ, నాసిక, హస్తి సంబంధ సకల రోగ నివారణ యంత్రం.
16. సర్వరక్షాకర మహాయంత్రం : పూర్ణ కుటుంబానికి రక్షణ కల్పించి శత్రువులను లేకుండా చేసి ఊహించని ఉపద్రవాలను ఉపఘాతాలను తొలగించి ఉద్యోగముల రిత్యా భార్యభర్తలు వేరువేరుగా వున్నవారికి ఎవరికి ఆపదలు కలగకుండా రక్షించగల మహా యంత్రం. వాహనాల ప్రమాదాల నుండి రక్షణ కల్పించే యంత్రం.
17. లక్ష్మీ నారాయణ యంత్రం : సంతోషం, సత్‌ప్రవర్తన కలిగించి ఇచ్చిన మాటలను నిలుపుకునే శక్తిని కలిగించి పరువు ప్రతిష్ఠలను పెంచుతూ కుటుంబంలో వున్నవారికి వర్చస్సును శ్రేయస్సును కలిగించి నిరంతరం సంతోషం ఆనందాలను కలిగించే మహామాన్విత యంత్రం.
18. సర్వాభీష్ఠ సిద్ధి యంత్రం : కుటుంబంలో వున్న వారి అందరి కోరికలను నెరవేరుస్తూ సకల దోషాలను పోగొట్టి గృహమునకు వైభవం కలిగించి మహాలక్ష్మీ అనుగ్రహంను, పూర్తిగా ఇంటిలో వున్నవారికి కుభేర అనుగ్రహంను కలిగించి, మనస్సులో వున్న ధర్మబద్దమైన కోరికలను నేరవేర్చుకోగలిగిన శక్తిని పూర్తిగా అందించే అనుగ్రహ యంత్రం.
19. దృష్టినివారణ యంత్రం : నరఘోషను పొగొట్టును, చెడు దృష్టిని పొగొట్టును, కుటుంబంలో వున్నవారికి మనస్పర్థలు తొలగించి ఐశ్వర్యంకలిగించి గృహంలో వున్నవారికి సుఖసంతోషాలు అందించును.
20. అమృతవర్షిణి మహా యంత్రం : దర్శన మాత్రముచే సకల అభిష్టములు సిద్ధింపచేసి, ఆవిచ్చిన సంతతని కలిగించి కుటుంబ శ్రేయస్సును కలిగించి నిత్యసంతోషాలను కలిగించి ఇంద్రాద్రి అష్టదిక్పాలక అనుగ్రహముచే అజేయసిద్ధి కలుగజేయగల కుటుంబ క్షేమకర యంత్రం.
21. సర్వకావ్యసిద్ధి యంత్రం : ధారణశక్తిని పెంపొందించి, విశేష జ్ఞాపకశక్తిని అందించి కావ్య, నాటక అలంకార న్యాయ వైశేషిక పూర్ణప్రజ్ఞను అందించి స్థిర కీర్తి ప్రతిష్ఠలను అందించగల యంత్రం. శ్రద్ధ, ఆసక్తిని అనురక్తిని అందించగల యంత్రం. శ్రీవిద్య పరావిద్యాలను అందించగల అద్వితీయ యంత్రరాజం.
22. ధన్వంతరీ మహాయంత్రం : వైద్యులు ఉంచుకోదగ్గ మహిమాన్విత యంత్రం. ఈ యంత్రం వున్నచోట సమస్త వ్యాధులు దూరంగా పారిపోవును. ధన్వంతరీ అనుగ్రహంచే మందులు వాడవలసిన పనిలేకుండానే వ్యాధులు నశించును. వైద్యులు వైద్యాలయాలలో, గృహంలో వుంచుకొన్న వారు చేయు వైద్యం ఫలించి పరిపూర్ణ సంతృప్తి కలిగి తద్వారా ఐశ్వర్యసిద్ధి కలుగును.
23. మంగళమూర్తి మహా యంత్రం : వంశపారంపర్యంగా రావాల్సినఆస్తిపాస్తులను రప్పించి న్యాయస్థాన తగువులను మనకు అనుకూలంగా
తీర్చు వచ్చినట్లు చేసి అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల, తల్లిదండ్రుల, భార్యభర్తల బంధములను కాపాడుతూ కుటుంబంలో వున్నవారందరికీ ఐశ్వర్యవృద్ధిని కలిగించి వంశకీర్తిప్రతిష్టలను నలుదిక్కుల చాటింపచేసి, రాజకీయ లబ్ధిని నూతన వ్యాపార లబ్ధిని కలుగజేసి, కీర్తిప్రతిష్ఠలు కలుగచేయగల అద్భుత మహాయంత్రం.
24. కుటుంబ క్షేమకర యంత్రం : రాధాకృష్ణుల భీజసంపుటిత వైభవం యంత్రం. కుటుంబంలో మనస్పర్థలు తొలగించి, భార్యభర్తలకు అన్యోన్యత కలిగించి మంచి సంతానం పొందుటకు కుటుంబం క్షేమంగా వుండుటకు, వంశాభివృద్ధి కొరకు, పిల్లల అభివృద్ధి కొరకు, గృహములో వుంచుకోదగ్గ వలసిన మహిమాన్విత యంత్రం.
25. నవావరణ యంత్రం : లలితా త్రిపుర సుందరి దేవి యొక్క స్వరూపమైన ఈ యంత్ర మహిమను వర్ణించుటకు సాధ్యముకాదు. అమ్మవారి లలితా
ఉపాసకులకు పూర్ణంగా ఉపయోగపడే అద్భుత యంత్రం. ఉపాసకుల వాక్‌సిద్ధి ఫలించే మహిమాన్విత యంత్రం. అమ్మవారి ఉపాసకులు నోటి నుంచి వచ్చే
ప్రతీ మాట వాస్తవరూపం దాల్చును.
26. శ్రీ సుబ్రమణ్య సడాక్షర యంత్రం : యంత్రము, నాగదోషములు, కాలసర్పదోషాలు నివారించి వివాహం త్వరగా జరుగును. మేధాశక్తి పెంపొందించి, జ్ఞాన శక్తిని కలిగించును. సకల విద్యాప్రాప్తి కలిగించును.
27. పంచముఖి ఆంజనేయ యంత్రం : భూత, ప్రేత పిశాచ బాధ నివారణ కలిగించి, కీర్తి, వాక్ ప్రతిభ బుద్ధి యశస్సు, ధైర్యం, జ్ఞానం కలిగించి గృహానికి రక్షణ కవచంగా వుండును. మనలో వుండే భయాలు, భ్రాంతులను తొలగించే దివ్య యంత్రం.
28. మహామృత్యుంజయ యంత్రం : మృత్యుభయాన్ని దూరం చేసి వ్యాధులను నాశనం చేసి దీర్ఘకాలం ఆయురారోగ్య ఐశ్వర్యంతో జీవించునటు్ల చేసి సుఖమయ జీవనంను నిర్భయ సుఖమును నిశ్చల భక్తిని సునాయాశ మరణంనుకలుగచేయును. మనలో భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపే మహా యంత్రం.
29. కాలభైరవ యంత్రం : మృత్యుభయాన్ని తొలగించును. సకల భయాలను తొలగించి, పీడ పరిహారదోషాలను తొలగించును. శత్రుభయం, అపమృత్యుభయంను తొలగించును.
30. సామ్రాజ్య విజయలక్ష్మీ యంత్రం : గృహంలో పూర్ణ మనశ్శాంతినికలుగజేసి, ఇంటిలో ప్రతీ మూలను కూడా ప్రశాంతతను నింపి,మనస్సునకు శాంతిని చేకూర్చును. స్త్రీ, పురుషుల వియోగ దోషాలను పారద్రోలి సౌభాగ్యసిద్ధిని కలుగజేయును. చేయవలసిన కార్యములలో విజయం సాధిస్తారు.
ధారణ యంత్రములు (డాలర్స్)
సరియగు తిధి, వార, నక్షత్రములు చూసి ఒక శుభముహూర్తమున రజితము (వెండి)ని అగ్నిలో శుద్ధిచేసి 41 పౌర్ణమి రోజులలో పూజ చేసి చంద్ర కళను ఆవాహన చేసిన డాలర్‌ను యంత్ర అధిష్ఠాన దేవత తిధి, నక్షత్రం ఉన్న రోజున దారణయంత్రం పవిత్రమైన యంత్ర పరికరములతో ముద్రించిన పిదప యంత్రంలో ఉన్న అధిష్టాన దేవత యొక్క కళావాహన చేసి పూజించి జపఫలమును దైవశక్తిని ఇమిడీకృతము చేసి ధరించుటకు ఇవ్వడం జరుగును. కావున ధారణ యంత్రమునందు దేవతాశక్తి మీలో ప్రవేశించి మిమ్మల్ని సర్వదా కాపాడుతూ సర్వకాల సర్వావస్థలనందు రక్షణ కలిగించి, కాపాడుటయే కాక వెనువెంటనే మీ కోరికలను నెరవేర్చుకొనుటకు దోహదపడుతూ శుభాలను చేకూర్చును.
ధారణ యంత్రాలు (డాలర్స్) – వాటి ఫలితాలు
1. సకల దృష్టినివారణ డాలర్ : చెడు దృష్టి నుంచి కాపాడును. సకల మలిన దోషాలను తొలగించును. నిరంత ప్రశాంతతను అందించును. ఎనిమిది
దిక్కుల నుంచి మనకు చేరే చెడు దృష్టిని నివారించి, సకల శ్రేయస్సును కలుగజేయును.
2. శ్రీ చక్ర కామాక్ష్మీ డాలర్ : కామాక్ష్మీదేవి అనుగ్రహం కలిగించి, ఐశ్వర్యం, అకర్షణ, ఉద్యోగప్రాప్తి కలిగించును.
3. శ్రీమహాలక్ష్మీ ధనాకర్షణ డాలర్ : అప్పులను తొలగించి ఐశ్వర్యప్రాప్తి కలిగించి నిరంతర ఐశ్వర్యజీవనం కలుగజేయును.
4. కాత్యాయనీ మంగల్యభాగ్య డాలర్ : భార్యాభర్తలు ధరించాలి. అన్యోన్యదాంపత్యంతో కూడిన ఎనలేని సుఖసంతోషాలను అందించి ఆదర్శమైన జీవనం కొనసాగించడానికి తోడ్పడును.
5. సరస్వతీ మహా డాలర్ : విద్యాబుద్ధులను ప్రసాదించి, సిద్ధిని అందించి పట్టుదలతో అనుకున్న విద్యను సాధించుటకు దోహదపడును. సమస్త పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధించుటకు సహాయపడును.
6. సంతానప్రాప్తి డాలర్ : భార్యభర్తలు ధరించాల్సిన డాలర్. సంతానలేమితో బాధపడేవారికి సంతానప్రాప్తిని కలుగజేయును.
7. ఐశ్వర్యలక్ష్మీ డాలర్ : అకస్మిక ధనలాభాలు కలుగజేసి, చేయు వ్యాపారాలను అభివృద్ధి చేసి, ఉద్యోగాల్లో ఉన్నత అభివృద్ధి కలుగజేసి, ఉన్నత స్థాయి గల వ్యక్తుల మధ్య పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చును.
8. బాలారిష్ట డాలర్ : చిన్న పిల్లలను దృష్టిదోషాల నుండి బాలారిష్ట దోషాలను కాపాడి, వ్యాధులు రాకుండా రక్షణ కల్పించి సుఖమయ నిద్ర,
సుఖమయ జీవనప్రాప్తి కలుగజేయును.
9. పంచముఖ హనుమాన్ డాలర్ : భూత ప్రేత పిశాచ బాధలను, శనిగ్రహదోషాలను తొలగించి, బుద్ధిబలం, యశస్సు, బ్రహ్మజ్ఞానంను కలిగించును.
10. శ్రీ త్రిపుర సుందరీ డాలర్ : సౌభాగ్యసిద్ధి, వశీకరణప్రాప్తి, సమీపవర్తి, సకల జనుల వశీకరణ, కుటుంబ శ్రేయస్సు కలిగించే మహిమాన్విత డాలర్.
11. కాలభైరవ డాలర్ : సకల భయాలను, మృత్యుభయాన్ని, పీడ పరిహార దోషాలను తొలగించి, అపమృత్యు భయంను తొలగించి, మనోధైర్యాన్ని
నింపుతుంది.
12. వాహనయంత్రం : ద్విచక్ర, చతుచక్ర, షట్‌చక్ర, అష్టచక్ర, ద్వాదశీచక్ర వాహనయోగం కలిగించును. వాహన ప్రమాదాల నుంచి రక్షణ కల్పించును. యజమానికి వాహన సౌఖ్యమును కలుగజేయును.
13. సర్వరక్ష డాలర్ : సమస్త ఈతిబాధల నుండి రక్షణ కల్పించి కీర్తిప్రతిష్టలు కలిగించి, చేయుచున్న పనుల్లో అభివృద్ధి దోహదపడును.
14. సుబ్రమణ్యం డాలర్ : కుజదోష నివారణ, జ్ఞాన సిద్ధి, కుటుంబ శ్రేయస్సు, విద్యాభివృద్ధి, సత్‌ప్రవర్తన కలిగించును.
15. గ్రహ డాలర్లు : ఆయా గ్రహవర్తమాన దశలో ధరించిన మంచి ఫలితాలుండును
రవిగ్రహ డాలర్ : రవిగ్రహదోషాలను పోగొట్టును. ఆరోగ్యం కీర్తిప్రతిష్టలను పెంపొందించును.చంద్రగ్రహ డాలర్ : చంద్రగ్రహ దోషాలను తొలగించి, మనశ్శాంతిని ప్రశాంతతను కలిగించును.కుజగ్రహ డాలర్ : కుజదోషాన్నితొలగించి శీఘ్ర వివాహము కలిగించును. అనుకూల భర్త, లేదా భార్య లభించును.రాహుగ్రహ డారల్ : దృష్టిదోషాలను తొలగించి, ఆకర్షణ కలిగించును.కేతుగ్రహ డాలర్ : చిత్తచాంచల్యమును తొలగించి, జ్ఞానశక్తిని పెంపొందించి, ఆనారోగ్యం నివారించును.బుధగ్రహ డాలర్ : బుద్ధిమాంధ్యంను తొలగించి, వ్యాపార అభివృద్ధిని కలిగించి, కుటుంబ శ్రేయస్సును కలిగించును.గురుగ్రహ డాలర్ : ఉద్యోగస్థలాల్లో అధికారుల అనుగ్రహం కలిగించును. నాయకత్వ లక్షణాలు కలిగించును.శుక్రగ్రహ డాలర్ : దాంపత్యదోషాలను తొలగించి, అన్యోన్యదాంపత్యం కలిగించి, విద్యా అధికార ప్రాప్తి కలిగించును.శనిగ్రహ డాలర్ : మృత్యుదోషాలను తొలగించి, అనారోగ్యం తొలగించి, భయనాశనం చేసి, ఆద్వితీయ అభివృద్ధని కలిగించును.
No comments:
Post a Comment