Thursday, July 12, 2018

ఏ నదికి ఎప్పుడు పుష్కరం..

ఏ నదికి ఎప్పుడు పుష్కరం..
1. తామ్రపర్ణి - 2018అక్టోబర్  12నుంచి 23వరకూ
2. పుష్కర్ - 2019 మార్చి 29నుంచి ఏప్రియల్ 9వరకూ
3. తుంగభద్ర - 2020 మార్చి 30నుంచి ఏప్రియల్ 10వరకూ
4. సింధు - 2021 ఏప్రియల్ 6నుంచి 17వరకూ
5. ప్రాణహిత - 2022 ఏప్రియల్ 13నుంచి 24వరకూ
6. గంగ - 2023 ఏప్రియల్ 22నుంచి మే3వరకూ
7. నర్మద- 2024ఏప్రియల్ 22నుంచి మే3వరకూ
8. సరస్వతి - 2025 మే15నుంచి 26వరకూ
9. యమున - 2026 జూన్ 2నుంచి 13వరకూ
10. గోదావరి - 2027
11. కృష్ణ - 2028 
12 కావేరి  2029
పుష్కరాలు ఇలా వచ్చాయట.!
ఇందుకు సంబంధించి ఓ కధనం ప్రచారంలో వుంది. అదేమిటంటే, సృష్టి ఆరంభ సమయంలో తుందిలుడు అనే గంధర్వుడు ఘోరతపస్సు ఆచరించి, పరమేశ్వరుని ప్రసన్నం చేసుకున్నాడు.
ఈశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. తుందిలుడు పరమానందభరితుడై తనకు ఈశ్వరుడిలో శాశ్వత స్థానం కల్పించమని అర్థించాడు. అందుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు తన అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో తుందిలునికి శాశ్వతస్థానం కల్పించాడు.
ఆవిధంగా మూడున్నర కోట్ల తీర్థాలకు తుందిలుడు అధిపతి అయ్యాడు. కావున పుష్కరుడయ్యాడు. పుష్కరుడు అంటే పుణ్యజలం మరియు పోషించేవాడని కూడా అర్థం ఉంది.
సృష్టి నిర్మాణక్రమంలో బ్రహ్మదేవునికి జలంతో అవసరం ఏర్పడగా, జలాధికారియైన పుష్కరుని తనకు ఇవ్వాల్సిందిగా పరమేశ్వరుని చతుర్ముఖుడు కోరుకున్నాడు. శివుడు అందుకు అంగీకరించడంతో పుష్కరుడు బ్రహ్మదేవుని కమండలంలో ప్రవేశించాడు.
ఒక సందర్భంలో సకల జీవరాశిని పునీతం చేసేందుకు ప్రాణులకు జీవనాధారమైన జలాన్ని ఇవ్వాల్సిందిగా బృహస్పతి బ్రహ్మదేవుడిని అర్థించాడు. కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలివెళ్ళనని అన్నాడు.
అప్పుడు బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు. గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషరాశి మొదలు 12 రాశుల్లో ప్రవేశించినపుడు మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు పూర్తిగాను, మిగతా రోజుల్లో మధ్యాహ్న సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదిలో పుష్కరుడు కొలువై ఉంటాడు.
అందుకే  బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినపుడు ఒక్కో నదికి పుష్కరాలు వస్తుంటాయి. ఈ సమయంలో బ్రహ్మ, బృహస్పతి, పుష్కరుడు, నదీ దేవతతో పాటు ముక్కోటి దేవతలు ఆ నదీజలంలో కొలువై ఉంటారని ప్రతీతి.
ఇక శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి శక్తి ఉంటుందని తేల్చారని చెబుతారు.
తామ్రపర్ణి పుష్కరాలు..
పుష్కర యోగం గల నదుల్లో తమిళనాడులోని తిరునల్వేలి పట్టణానికి ఆనుకుని ఉన్న తామ్రపర్ణి నది ఒకటి. ఇక్కడ నెళియప్పార్ (పరమేశ్వర ఆలయం) ఆలయం ప్రసిద్ధి చెందింది.
ఇక్కడకు సమీపంలోని వైష్ణవ సంప్రదాయంలో పేర్కొనబడిన 108దివ్య క్షేత్రాల్లో నవ తిరుపతులు అనే ఆలయాలు ప్రసిద్ధి గాంచాయి 12.10. 2018 నుంచి.23.10.2018వరకూ పుష్కర పర్వం.
అది దివ్య క్షేత్ర  దర్శనం.  పుష్కర తీర్ధంలో స్నానం సర్వ పాప హరణం. ధర్మ కర్మ విధులు మోక్షకరం.
ఇంతటి మహత్తరమైన తామ్రపర్ణి పుష్కరాలకు వచ్చే తెలుగువారికి భోజన వసతి సదుపాయాలు కల్పించడానికి నిర్ణయించాం..
శ్రీదేవి ప్యాలస్ (కల్యాణ మండపం),
120-సి పెరుమాళ్ ఈస్ట్ కార్ స్ట్రీట్,
పివిటి థియేటర్ పక్కన,
తిరునల్వేలి (తిరునల్వేలి జిల్లా),
తమిళనాడు స్టేట్,
ఫోన్ : 0462-2334800 అనే చిరునామాలో ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం
శ్రీ దేవి ఆర్య వైశ్య కళ్యాణ మండప పుష్కర కమిటి,రాజమండ్రి -4,తూర్పు గోదావరి జిల్లా.
అందుబాటులో గల  ఇతర  వసతులు.
శ్రీ భరణి హోటల్స్
29ఏ,మధురై రోడ్,
తిరునల్వేలి - 627001
2. శ్రీ జానకిరామ్  హోటల్స్
(క్యాబ్ బుకింగ్ సదుపాయం కలదు)
#30,మధురై రోడ్,
తిరునల్వేలి - 627001
ఫోన్స్: 914622331941(10లైన్స్)
3. న్యూ అనంత్ లాడ్జి
67/2,3,4,5,మధురై రోడ్,
తిరునల్వేలి జంక్షన్
ఫోన్స్ : 0462 2321641,2334865
4.షణ్ముగ  లాడ్జి
67ఏ ,మధురై రోడ్,
తిరునల్వేలి జంక్షన్
ఫోన్స్ : 0462 2329025,2329026
5.సయ్యద్ టూరిస్ట్ హోమ్,
108ఎబిసిడి, మధురై రోడ్,
తిరునల్వేలి జంక్షన్
ఫోన్స్ : 0462 233304,2335422
ఏ నదికి ఈ సారి పుష్కరాలు..
ఈ సంవత్సరం భీమా నదికి పుష్కరమని పంచాంగాలలో వ్రాశారు. దీన్ని బట్టి వివిధ ట్రావెల్స్ సంస్థలు ప్రోపగాండా మొదలెట్టేశారు.అప్పుడే రైల్వే టిక్కెట్లన్నీ బ్లాక్ చేసేసారు.
భీమానది మహారాష్ట్రలోని భీమశంకర్ నుంచి కర్నాటక మీదుగా తెలంగాణ వరకు వచ్చి కృష్ణలో కలసిపోతుంది. ఈ నదికే పుష్కరమని నిర్ణయించేసి పైన చెప్పినట్లు టిక్కెట్లు బుక్ చేసేసారు.
కానీ భీమానది కి అసలు పుష్కరమే లేదు.
పుష్కర నిర్ణయం మూలశ్లోకం చూడండి.
"శ్లొ//మేషే గంగా వృషే రేవా మిథునేతు సరస్వతీ
కర్కటే యమునా ప్రోక్తా సింహే గోదావరీ స్మ్రతా
కన్యాయాం కృష్ణవేణీచ కావేరీ ధటకే స్మ్రతా
వృశ్చికే తామ్రపర్ణీచ చాపే పుష్కర వాహినీ
మకరే తుంగభద్రాచ కుంభే సింధునదీ స్మ్రతా
మీనే ప్రణీతా నదీచ గురోస్సంక్రమణే స్మ్రతా
పుష్కరాఖ్యౌ మునీనాంహి బుధై స్మ్రతా....."
దీన్ని బట్టి చూస్తే ఈ జాబితాలో"భీమానది"లేదు.తామ్రపర్ణి మాత్రమే ఉంది.ఈ తామ్రపర్ణి నది ఒకప్పుడు శివునికి రథంగా ఉండడం చేత దీనికి "భీమరథి"అనే పేరు ఉంది.అంతే కానీ ఇది భీమానది మాత్రం కాదు.
ఈ తామ్రపర్ణి నది తమిళనాడు లోని తిరునల్వేలి తూత్తుకూడి జిల్లాల్లో ప్రవహిస్తుంది. శాస్త్రప్రకారం 'బాణతీర్థం'లో పుష్కర స్నానం చేయాలి.బాణతీర్థం దగ్గరలోని రైల్వేస్టేషన్'అంబాసముద్రం'.
కాబట్టి దయచేసి అందరూ గమనించండి.మనం పుష్కర స్నానం చేయవలసింది తామ్రపర్ణి నదిలో!!!!
అంతే కానీ 'భీమానది'లో కాదు..స్వస్తి..!!
లోకా సమస్తా సుఖినోభవంతు..!!
                        శ్రీ మాత్రే నమః

No comments:

Post a Comment

RECENT POST

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు

కాణిపాకం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు ప్రతీరోజు ఈ స్తోత్రం కనీసం 4 సార్లుపఠిస్తేచాలామంచిది ఇంకా ఎక్కువ సార్లు పఠించే సమయము, శక్తి...

POPULAR POSTS