Thursday, May 5, 2022

ఆదిశంకరాచార్య జయంతి* *జగద్గురు ఆదిశంకరాచార్యులు*

*ఆదిశంకరాచార్య జయంతి*         

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

👉హిందూ  మత  పరిరక్షణ  కొరకు  అవతరించిన  సరళ సిద్ధాంతవేత్త ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరులు , శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. గురువు , మహాకవి. శంకరులు ప్రతిపాదించి సిద్ధాంతాన్ని అద్వైతం. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం.

👉 *శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ !*
*నమామి భగవత్పాదం శంకరం లోకశంకరమ్ !!*

 *ఆది శంకర జయంతి*

👉ఈ భారత ఖండంలో అనేకానేక కొత్త కొత్త సిద్ధాంతాలు , మతాలూ పుట్టుకొచ్చి , ప్రజలకి సనాతన ధర్మం పట్ల , భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో మన సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. శ్రౌత , స్మార్త  క్రియలను సుప్రతిష్టితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారని  భక్తుల  ప్రగాఢ విశ్వాసం

👉 *దుష్టాచార వినాశాయ ప్రాతుర్భూతో మహీతలే !*
*స ఏవ శంకరాచార్యః సాక్షాత్ కైవల్య నాయకః !!*

👉దుష్టాచారములను నశింపచేయటానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆది శంకరుని రూపంలో అవతరించాడు. (శివరహస్యము నుండి)

 *కరిష్యత్స్యవతారం స్వం శంకరో నీలలోహితః !*
*శ్రౌత స్మార్త ప్రతిష్ఠార్థం భక్తానాం హిత కామ్యాయా !!*

👉శ్రౌత , స్మార్త క్రియలను సుప్రతిష్ఠితం చేసి , వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు (శివుడు) స్వయంగా శంకరుల రూపంలో అవతరించారు. (కూర్మపురాణం నుండి)

👉జగద్గురు ఆది శంకరాచార్య క్రీ.పూ.509 (విభవ నామ సంవత్సరం) శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున కర్కాటక లగ్నమందు శివుడి జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు , శని , గురుడు , కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ , శివగురులకు కేరళ లోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పటి త్రిచూర్ కు కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ , శివగురులు త్రిచూర్ లోని వృషాచల పర్వతం పైన ఉన్న శివుడిని ప్రార్థించి , ఆయన అనుగ్రహంతో పుత్రుడ్ని పొందినారు. పార్వతీ దేవి , సుబ్రహ్మణ్య స్వామికి ఏవిధంగా జన్మనిచ్చిందో , ఆర్యమాంబ శంకరులకి అదే విధంగా జన్మనిచ్చింది అని శంకర విజయం చెబుతోంది. ఆయన జనన కాలం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నప్పటికీ , కంచి మున్నగు పీఠాలు అంగీకరించినవి మరియు మన హిందూ గ్రంథాల ప్రకారం , ఆయన జీవన కాలం క్రీ.పూ.509 – క్రీ.పూ. 477 అని తెలియవస్తోంది.

👉ఆయన తన రెండవ ఏటనే రాయడం , చదవడం  గ్రంథాలు చదివేవారు. ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయారు. ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేసారు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేసారు. కారణజన్ములైన శంకరాచార్యులవారు , సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదా చార్యులవారి చెంత శాస్త్రాధ్యాయనం చేశారు.

👉 ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించడానికి అమ్మవారు రాలేదని తీవ్రంగా విలపిస్తుండగా ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోనికి తీసుకుని ఆ పాలను త్రావించి తన కరుణాకటాక్షాలను ఆ చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది. 

👉  ఇంకొకసారి ఆయన వేదాభ్యసన సమయంలో భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా , ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరి కాయను ఆయనకు ఇచ్చివేసింది. ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధినేత అయిన లక్ష్మీదేవిని స్తుతిస్తూ. *“ కనకధారా స్తవం ”* ఆశువుగా పలికారు. దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది.

👉 శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజూ స్నానానికై వెళ్ళలేకపోవడం గమనించి
అప్పుడు శంకరులు పూర్ణానదిని ప్రార్థించి , నదిని ఇంటివద్దకు తెప్పించారు. ఆవిధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి గ్రామ ప్రజలు శంకరులు జరిపిన కార్యానికి ఆశ్చర్యచకితులయ్యారు. తన తపశ్శక్తి తో ఆ నదినే తన ఇంటి సమీపంగా ప్రవహించగలిగేటట్లు చేసారు. 

👉   ఆయన సన్యాసాశ్రమ స్వీకరణ కూడా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో శంకరులు తల్లి అనుమతి కోరారు. శంకరులు సన్యాసం తీసుకొంటే తాను ఒంటరినౌతానన్న కారణంతో తల్లి అందుకు అంగీకరించలేదు. ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తూండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది.  ఆయన తల్లిని తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుందని , అనుమతినివ్వమనీ ప్రార్థించారు. తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది. ఈ సంసారబంధాలు తనను మొసలిలాగా పట్టుకున్నయనీ , ఆ బంధాలనుండి తనను తప్పించమనీ ఆయన తల్లిని వేడుకున్నారు. దీనిని ఆతురన్యాసం అని అంటారు. సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తూండగానే ఆశ్చర్యకరంగా మొసలి శంకరులను మెసలి వదిలివేసింది.

👉  గురువు కోసం అన్వేషిస్తూ ఉత్తర భారత యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ , *"ప్రాత:కాలం , రాత్రి , సంధ్యాసమయాల్లో ఏసమయంలోనైనా , స్పృహలో ఉన్నపుడూ , స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే , నీవద్దకు వస్తాను"* అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంతిమ సమయంలో వచ్చి , అంతిమ సంస్కారాలు చేస్తాననీ చెప్పారు.

👉  ఆయన గురువు గురించి అన్వేషిస్తూ నర్మదా నదీ తీరంలో ఉన్న శ్రీ శ్రీ గోవింద భగవత్పాదులు ని దర్శించి ఆయనే తన గురువు అని తెలిసికొని తనను శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. గోవింద భగవత్పాదులు ఆయనను అనేక పరీక్షలకు గురిచేసి , శంకరుల అద్వైత సిద్ధాంతంతో సంతృప్తి చెంది ఆయనను శిష్యునిగా చేర్చుకున్నారు. ఆ తరువాత కొంతకాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ(వారణాసి) బయలుదేరారు.

👉   ఆయనలో అంతర్గతంగా ఉన్న అహాన్ని తొలగించుటకై పరమశివుడు చండాలుని వేషంలో వెంట నాలుగు కుక్కలతో వచ్చి ఆయన దారికి అడ్డుగా నిలబడతాడు. అప్పుడు శంకరులు చండాలుని ప్రక్కకి తొలగమని చెప్తారు. అప్పుడు శివుడు ఎవరిని తొలగమంటున్నావు , ఈ శరీరాన్నా లేక ఈ శరీరంలో ఉండే ఆత్మనా అని ప్రశ్నిస్తాడు. దానితో శంకరులకి ఆ వచ్చినవాడు పరమశివుడే తప్ప వేరుకాదని గ్రహించి ఆయనను స్తుతిస్తూ మనీషా పంచకం చదివారు.

👉  ఆయన బ్రహ్మసూత్రాలకి భాష్యాలే కాక అనేక దేవీదేవతల స్తుతులూ , అనేక , ఆధ్యాత్మ సిద్ధాంత గ్రంథాలూ రచించారు. వాటిలో బాగా ప్రాముఖ్యమైనవి సౌందర్యలహరి , శివానందలహరి , భజగోవిందం మొదలైనవి.

👉  ఆయన సన్యాసాశ్రమ నియమాలని పక్కన పెట్టి మరీ తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వర్తించారు. ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలనీ , ఆమెకు సేవ చేయడం బిడ్డల కర్తవ్యమనీ దానికి ఎలాంటి నియమాలు అడ్డురావనీ లోకానికి చాటిచెప్పారు. తల్లికిచ్చిన మాట  కోసం తల్లి అవసాన దశలో *" శ్రీకృష్ణభగవానుని "* లీలలను చూపించి సంతోష పరచాడు !!
ఆనాటి కట్టుబాటులను ఎదిరించి తాను సన్యాసి అయినా కన్నతల్లి అంత్యేష్ఠిని స్వయంగా నిర్వహించాడు !!

👉 ఆయన కాలినడకన దేశమంతా తిరిగి *అద్వైత సిద్ధాంతాన్ని* ప్రచారం చేస్తూ తన సిద్ధాంత వాదనలతో అనేక మంది పండితులని ఓడించారు. ఆ తరువాత వాళ్ళు ఆయనకి శిష్యులైనారు. వారిలో *కుమారిలభట్టు , మండవమిశ్రుడు* మొదలైన వారు కూడా ఉన్నారు. ఆయన ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతానికి ఆకర్షితులై ఆయన శిష్యులుగా మారిన వారిలో ముఖ్యులు *త్రోటకుడు , పద్మపాదుడు , సురేశ్వరుడు , పృధ్వీవరుడు* మొదలైన వారు.

👉 *వెయ్యి సంవత్సరాల పాటు బౌద్ధమతం ప్రచారంలోకి వచ్చాక , సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది*. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. *బౌద్ధ మతం ధర్మం గురించీ , సంఘం గురించీ చెప్పింది కాని దేవుడిని గుర్తించలేదు*. బౌద్ధమత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. *ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలచ గలిగినారు*.

👉  హిందూ ధర్మపరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన , ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. అందుకోసం తన శిష్యగణంతో కలిసి అనేక ప్రాంతాలలో పర్యటిస్తూ , అక్కడి పండితులను శాస్త్ర సంబంధమైన చర్చలో ఓడిస్తూ అద్వైత సిద్ధాంతాన్ని విశిష్టమైన రీతిలో వ్యాప్తిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో శతాధిక గ్రంధాలను రచించిన శంకరులవారు , ఉపనిషత్తులు .. బ్రహ్మసూత్రాలు .. భగవద్గీత .. విష్ణు సహస్రనాలకు భాష్యాలు రాసి భక్తి సమాజాన్ని తనదైన రీతిలో ప్రభావితం చేశారు. 

👉  గణేశ పంచరత్న స్తోత్రం , భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం , కనకథారా స్తోత్రం , శివానందలహరి , సౌందర్యలహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికీ ఉపయుక్తమవుతున్నాయి.ఈయన 108 గ్రంథాలు రచించారు.

👉  శృంగేరి .. బదరి .. పూరీ .. ద్వారక అనే అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో పీఠాలను స్థాపించారు. ఆదిశంకరులవారి శిష్యులే అద్భుతమైన రీతిలో మహిమలను ప్రదర్శించారంటే , ఇక శంకరులవారి శక్తులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. శంకరుల చిన్నతనంలో ఆయన అనన్యసామాన్యమైన భక్తిని చాటే అనేక సంఘటనలు జరిగాయి. 

👉  ధర్మ సంస్థాపన చేయడానికై ఆయన దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పు వైపున ఒడిశా లోని పూరీ లో గోవర్ధన మఠం , దక్షిణం వైపున కర్ణాటక లోని శృంగేరి లో శారదా మఠం , పశ్చిమ దిక్కున గుజరాత్ లోని ద్వారకలో ద్వారకా మఠం , ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ లో జ్యోతిర్మఠం స్థాపించారు. అవి ఈనాటికీ , ధర్మరక్షణకై పాటుపడుతున్నాయి.

*మఠము-పీఠము*

సన్యాసులు , బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం నాలుగు మూలలా నాలుగు మఠాలను స్ఠాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని , మఠామ్నాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థా నైపుణ్యానికి , కార్యనిర్వహణా దక్షతకూ తార్కాణం. హిందూధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి , సుస్థిరంచేయడానికి , వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ క్రమం , అప్పటి (వందల సంవత్సరాల) నుంచి నేటివరకూ అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తున్నది.

*" అధ్వైతసిద్ధాంతాన్ని " ప్రచారం  చేశారు* 

దేశంలో  నాలుగు  వైపుల  నాలుగు ప్రధానమైన  పీఠాల్ని  నెలకొల్పి దేశ సమగ్రత ను  ఆధ్యాత్మికతను కాపాడారు !!

*1 .తూర్పున  పూరీ  క్షేత్రంలో  గోవర్ధన  పీఠం రుగ్వేదం !!*

*2- దక్షిణాన శృంగేరీ క్షేత్రంలో  శారదా  పీఠం - యజుర్వేదం!!*

*3 - పశ్చిమాన ద్వారకలో  ద్వారక పీఠం - సామ వేదం !!*

*4 - ఉత్తరాన బదరిర క్షేత్రంలో జ్యోతిష్ పీఠం-యజుర్వేదం!!*

నలుగురు శిష్యులను  నాలుగు పీఠాలకు అధిపతులను చేసారు.
*'’కంచికామకోటి '’* పీఠాన్ని స్థాపించి తానే స్వయంగా కొన్ని
రోజులు పీఠాన్ని అధిరోహించి  హిమాలయాలకు వెల్లి చిన్న వయసులోనే 32 సంవత్సరాలకే తనువు చాలించారు !!
                        *చతుర్మఠాలు*

  *ద్వారకా మఠము :-*
ఈ మఠము శంకరులచే , దేశానికి పశ్చిమంగా , మొదటగా స్థాపించబడింది. దీనిని కాళికామఠమనీ , సిద్ధేశ్వరమఠమనీ , పశ్చిమామ్నాయ మఠమనీ అంటారు. 

  *గోవర్ధన మఠము:-*
దీనినే పూర్వామ్నాయ మఠము అని అంటారు. ఇది దేశానికి తూర్పున గలపూరీ పట్టణంలో

  *శృంగేరీ మఠము :-*
ఇది దక్షిణామ్నాయమఠమని , శారదాపీఠమనీ పిలువబడుతుంది. కర్ణాటక రాష్ట్రములోని శృంగేర(శృంగ లేక ఋష్యశృంగ)లో ఈ మఠము స్థాపించబడింది

  *జ్యోతిర్మఠము :-*
దీనిని ఉత్తరామ్నాయమనీ , బదరికాశ్రమమనీ కూడా అంటారు. ఈ పీఠ క్షేత్రం బదరికాశ్రమం , పీఠ దేవత నారాయణుడు.

☘  *శంకర మఠము(కంచికామకోటి పీఠము) :-*
సాక్షాత్తూ శంకరాచార్యుడు అద్వైత మత పరిరక్షణ కోసం దేశం నాలుగు దిక్కులా ఏర్పరచిన నాలుగు మఠాలు పైవి. ఇవి కాకుండా , శంకరుడు విదేహ ముక్తి పొందిన కంచి మఠం అయిదవది.

🌳 *ఉన్నది ఒక్కటే  పరబ్రహ్మస్వరూపం అనే అధ్వైతం    నుప్రభోధించారు  !!*  

🌳  *ఇది జ్ఞానమార్గంలో ఉత్కృష్ఠ స్థాయిలో  వున్న వారికే ఈ  సత్యం  అవగతమౌతుంది కనుక సామాన్య జనం కోసం అనేక  దేవీ  దేవతల పై అష్టకాలు స్తోత్రాలను రచించాడు ! ముందు విగ్రహారాధన  చేయమన్నారు !!*

🌳  *ప్రస్థాన త్రయం అంటే  భగవద్గీత - బ్రహ్మసూత్రాలు -*
*ఉపనిషత్తలు ! వీటికి  భాష్యం (వేదాంత- వ్యాఖ్యానం)రాశారు !*

🌳  *శివుడు - అంబిక - గణపతి - విష్ణువు - సూర్యులను ఆరాధించి తరించాలని వేదోక్త " పంచాయతన "పూజ పద్ధతిని ప్రవేశ పెట్టి విగ్రహారాధనకు ఆలంభనగా నిలిచారు !!*

☘  ఒకరోజు శంకరులు గంగానది ఒడ్డున శిష్యులకు తాను చేసే ప్రవచనం ముగించి వెళుతుండగా వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో అక్కడకు వచ్చాడు. శంకరులు వ్రాసిన  భాష్యాల మీద చర్చకు దిగాడు. ఎనిమిది రోజులపాటు చర్చ జరిగిన తరువాత వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో వచ్చింది సాక్షాత్తు వ్యాసుడే అని పద్మపాదుడు గ్రహించి ఆ విషయం శంకరులకు తెలిపగా , శంకరులు వ్యాసునికి సాష్టాంగ ప్రణామం చేసి , తన భాష్యాలపై ఆయన అభిప్రాయం కోరగా , వ్యాసుడు సంతోషించి బ్రహ్మ సూత్రాలు అసలు అర్థాన్ని గ్రహించింది శంకరులు మాత్రమే అని ప్రశంసించాడు. వేదవ్యాసుడు వెళ్ళిపోతుండడం చూసి శంకరులు *'నేను చెయ్యవలసిన పని అయిపొయింది. నాకు ఈ శరీరం నుండి విముక్తిని ప్రసాదించ'మని* వేడుకున్నాడు. అప్పుడు వ్యాసుడు *'లేదు , అప్పుడే నీవు జీవితాన్ని చాలించరాదు. ధర్మ వ్యతిరేకులు అనేకమందిని ఎదుర్కోవలసిన అవసరం ఉంది. లేకపోతే నీ కారణంగా రూపుదిద్దుకుని , ఇంకా శైశవ దశలోనే ఉన్న ఆధ్యాత్మిక స్వేచ్చానురక్తి అర్థాంతరంగా అంతరించే ప్రమాదం ఉంది. నీ భాష్యాలను చదవగా కలిగిన ఆనందంలో నీకు వరాన్ని ఇవ్వాలని అనిపిస్తోంది. బ్రహ్మ నీకు ఇచ్చిన ఎనిమిది సంవత్సరాల ఆయుర్థాయానికి అగస్త్యాది మునుల అనుగ్రహంతో మరో ఎనిమిది ఏళ్ళు తోడయింది. పరమశివుని కృప చేత నీకు మరొక 16 ఏళ్ళు ఆయుష్షు లభించుగాక అని దీవించి అంతర్థానం అయ్యాడు. ఆయన జన్మించినప్పుడు ఆయన ఆయుష్షు ఎనిమిది సంవత్సరాలు , తపస్సు వలన సాధించినది ఇంకొక ఎనిమిది సంవత్సరాలు , వ్యాసమహర్షి అనుగ్రహంవల్ల మరొక పదహారు సంవత్సరాలు జీవించి తన 32 వ ఏట ఉత్తరాఖండ్ కాశీలో దేహాన్ని త్యజించారు.
 
 *శంకరులు :-*

👉అలాంటి శంకరులవారిని ఆయన జయంతి సందర్భంగ స్మరించుకోవడంకన్నా పుణ్యమేముంటుంది ?

👉అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరులవారిని ఈ రోజున ఆరాధించాలి.

👉 పేద బ్రాహ్మణులకు శక్తి కొద్ది దానధర్మాలు చేయాలి.

👉 వారి పిల్లల ఉన్నత విద్యకు ... ఉపనయనాలకు ఆర్ధికపరమైన సహాయ సహకారాలను అందించాలి.

👉ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల అభివృద్ధికి పాటుపడాలి. 

*👉ఆదిశంకరులు అవతరణకుముందు దేశంలో ఏ పరిస్థితులుఉన్నాయో ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి*.

▪️ అప్పుడు శంకరుడు అవతరించారు. *ఇప్పుడుహిందువులందరూతమలో నిద్రాణమై ఉన్న ఆదిశంకరులను జాగృతం చేయాలి*.

▪️ *ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి*. ఆయన మనకు స్ఫూర్తి. ఆయన మనలోనే , మనతోనే ఉన్నారు. అందుకే మనము ఈ ధర్మంలో జన్మజన్మలుగా పుడుతూనే ఉన్నాం. *సనాతన ధర్మం మన తల్లి. తల్లి రుణం తీర్చుకో వలసిన సమయం ఆసన్నమైంది. సనాతన ధర్మాన్ని తెలుసుకొని , ఆచరించి , శక్తిని సంపాదించి , స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి*.

▪️ధర్మాన్ని కాపాడు. *ధర్మాన్ని విస్మరిస్తే జాతి అధోగతి పాలు కాక తప్పదు*. కలియుగంలో గురువైన శ్రీ ఆదిశంకరాచార్యులు
రక్ష సదా మనపై ఉంటుంది.

▪️ *ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని అనుసరించు. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. భారతదేశాన్ని ఒక ఆధ్యాత్మికవనంగా మార్చి , అడుగడుగునాభక్తిభావసుమాలనువికసింపజేసినఅపరశంకరులు.శ్రీఆదిశంకరులుఅలాంటిశంకరులవారినిఆయనజయంతిసందర్భంగాస్మరించుకోవడం కన్నా పుణ్యమే ముంటుంది ?అత్యంత భక్తిశ్రద్ధలతో శంకరులవారిని ఈరోజునఆరాధించాలి*.

▪️ఆధ్యాత్మిక పరమైన పవిత్రతను కాపాడుతూ , దేవాలయాల
అభివృద్ధికి పాటుపడాలి.
▪️ఈ విధంగా చేయడం వలన పాపాలు నశించి విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.

*" జయ  జయ  శంకర  హర  హర  శంకర "*

*" జయ జయ శంకర హర హర శంకర "*

Monday, May 2, 2022

అక్షయతృతీయ రోజున**బంగారం తప్పక కొనాలా?*నిజమైన అక్షయము???అక్షయతృతీయ అంటే ఏమిటి?వివరణ?

*అక్షయతృతీయ రోజున*
*బంగారం తప్పక కొనాలా?*
నిజమైన అక్షయము???
అక్షయతృతీయ 
అంటే ఏమిటి?వివరణ?
👇

👉ఈ రోజునే 
సింహాచల 
వరాహ నరసింహ 
స్వామి వారి  చందనోత్సవం.

👉అదే రోజున
పరశురామ  జయంతి .

మరిన్ని  అక్షయ తృతీయ ప్రాముఖ్యతలు.

అక్షయ తృతీయ ప్రాముఖ్యత

1. పరశురాముని 
     జన్మదినం

2. పవిత్ర గంగా నది
     భూమిని తాకిన
      పర్వదినం

3. త్రేతాయుగం 
    మొదలైన దినం

4. శ్రీకృష్ణుడు 
    తన బాల్యమిత్రుడైన
     కుచేలుని కలుసుకొన్న
     దినం

5. వ్యాస మహర్షి 
     “మహా భారతము”ను,
      వినాయకుని
      సహాయముతో,
      వ్రాయడం
      మొదలుపెట్టిన దినం

6. సూర్య భగవానుడు
     అజ్ఞాతవాసములో
     వున్న పాండవులకు
      *అక్షయ పాత్ర*
      ఇచ్చిన దినం

7. శివుని ప్రార్థించి
     కుబేరుడు
     శ్రీమహాలక్ష్మితో 
     సమస్త సంపదలకు
     సంరక్షకునిగా
     నియమింపబడిన దినం

8. ఆదిశంకరులు
     “కనకధారాస్తవం” ను
     చెప్పిన దినం

9. అన్నపూర్ణా దేవి 
     తన అవతారాన్ని
      స్వీకరించిన దినం

10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు
       దుశ్శాసనుని
       బారినుండి 
       కాపాడిన దినం.

*అక్షయ తృతీయ రోజున బంగారం తప్పక కొనాలా?*

అక్షయ తృతీయ అంటేనే
నేటికాలంలో 
బంగారం, వెండి లేదా
ఇతర ఏదేని విలువైన
వస్తువులు కొనడం 
అనేది ప్రచారంలో ఉంది.
ఈ రోజున కొన్నది 
అక్షయం అవుతుందని
చెప్పిన వ్యాపార ప్రచారాన్ని
వాస్తవంగా నమ్మి వాటిని
కొనుగోలు చేయడం
ఆనవాయితీగా మారింది.

అసలు అటువంటివి
కొనాలని అనుకుని 
డబ్బు లేకున్నా 
అప్పు చేసో, 
తప్పు చేసో కొంటే, 
కొన్న బంగారం అక్షయం
అవడం అటుంచి 
చేసిన అప్పులు, తప్పులు
తత్సంబంధ పాపాలు
అక్షయం అవుతాయని
శాస్త్రాలు వివరిస్తున్నాయి.

*అసలు ఈ రోజున బంగారం  కొనాలి అని శాస్త్రంలో ఎక్కడా చెప్పబడిలేదు*

👉ఇది కేవలం 
వ్యాపార జిమ్మిక్ మాత్రమే.

అక్షయ తృతీయ నాడు,
మనం  చేపట్టిన  
ఏ  కార్య  ఫలమైనా, 
[ అది  పుణ్యం కావచ్చు;
లేదా  పాపం  కావచ్చు.]
అక్షయంగా,  నిరంతరం, 
జన్మలతో  సంబంధం
లేకుండా,  మన  వెంట  వస్తూనే ఉంటుంది. 

పుణ్య  కర్మలన్నీ
 విహితమైనవే.  

అందునా,  ఆ రోజు  
ఓ  కొత్త  కుండలో గానీ,
కూజాలో గానీ,  మంచి నీరు  పోసి,దాహార్తులకు  శ్రధ్ధతో  సమర్పిస్తే,  ఎన్ని  జన్మలలోనూ,  మన జీవుడికి    
దాహంతో  గొంతు  ఎండి పోయే  పరిస్థితి  రాదు.

అతిధులకు,
అభ్యాగతులకు, 
పెరుగన్నంతో  కూడిన 
భోజనం  సమర్పిస్తే,  
ఏ  రోజూ  ఆకలితో  
మనం అలమటించవలసిన
రోజు  రాదు. 

👉వస్త్రదానం వల్ల 
తదనుగుణ 
ఫలితం లభిస్తుంది.

👉అర్హులకు  స్వయంపాకం,
దక్షిణ, తాంబూలాదులు   
సమర్పించుకుంటే,  
మన  ఉత్తర జన్మలలో, 
వాటికి  లోటు  రాదు.

👉గొడుగులు, 
👉చెప్పులు, 
👉విసన కర్రల లాటివి  
దానం  చేసుకోవచ్చు.

ముఖ్యంగా  ఆ  రోజు  నిషిధ్ధ  కర్మల జోలికి  వెళ్ళక పోవడం  ఎంతో  శ్రేయస్కరం. 

ఓ  సారి  పరిశీలిస్తే,
*భాగవతం* 
ప్రధమ స్కంధం ప్రకారం,  
పరీక్షిన్మహా రాజు  
కలి పురుషుడికి  
ఐదు  నివాస స్థానాలను 
కేటాయించాడు.  
అవి: 👇

1)జూదం,  
2)మద్య పానం, 
3)స్త్రీలు, 
4)ప్రాణి వధ,  
5)బంగారం.  

వీటితో పాటు 
కలి కి  లభించినవి 

👉 ఇంకో  ఐదు*👈

1)అసత్యం,
2)గర్వం, 
3)కామం, 
4)హింస, 
5)వైరం.  

జాగ్రత్తగా  పరిశీలిస్తే,  
ఆ పైన  ఉన్న  ఐదిటికీ  
ఇవి  అనుషంగికాలు.

ఆ  పై  ఐదిటినీ  
ఇవి  నీడలా  
వెన్నంటే  ఉంటాయి.

అక్షయ తృతీయ  రోజు 
ఎవరైనా,  
ఈ  ఐదిటిలో  
దేని  జోలికి  వెళ్ళినా,  
కలి పురుషుడి 
దుష్ప్రభావం
అక్షయంగా 
వెంటాడుతూనే  ఉంటుంది.

కర్తరి ప్రారంభ విశేషాలు

*కర్తరి  ప్రారంభ విశేషాలు*

      కర్తరి ప్రవేశం:  
మే 4 నుంచి 28వ తేదీ వరకు కర్తరి కొనసాగుతుంది. దీన్నే *వాస్తు కర్తరి* అంటారు. 

మే 4వ తేదీ రాత్రి 9గం.18 లకు రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో 
*చిన్న కర్తరి* ప్రారంభ మవుతుంది.

మే 11 రాత్రి  06గం.35 ని.లకు కృత్తికా నక్షత్రం లోకి రవి ప్రవేశించడంతో *పెద్ద కర్తరి* ప్రారంభ మగుతుంది.
 28. 05 న రాత్రి 8గం.05 ని త్యాగ మవుతుంది. 

చేయకూడనివి:

ఈ సమయంలో శంకుస్థాపనులు, చెక్కపనులు, తాపీ పనులు చేయరాదు. 
రాశులు.. నక్షత్రములు

 మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్న సంగతి తెలుసు! ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి.
 మొదటి రాశి మేషం, సాధారణంగా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు. 
దీనినే "సూర్య సంక్రమణం" అంటాం. *ఇది తమిళులకు  నూతన సంవత్స రారంభం*

డొళ్ళు కర్తరి.. అగ్ని కర్తరి

సూర్యుడు భరణి నక్షత్రంలో 3,4 పాదాలలో ఉన్నపుడు "డొల్లు కర్తరి" అంటారు.

 కృత్తిక నక్షత్రం లో ఉండగా "అగ్ని కర్తరి" అని అంటారు. 
కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేక పెద్ద కత్తిరి నడచేటప్పటికి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది.

నిర్వచనం

         *కర్తరి అంటే.... కర్త + అరి = కర్తరి అంటే పని చేసేవానికి శత్రువు అని అర్ధం.*
            ఈ కర్తరి సమయంలో వాతావరణ మార్పులు  ఎక్కువగా ఉంతాయి. ఇక అగ్ని కర్తరి వచ్చేసరికి ఎండలు ముదిరిడంతో అగ్నిప్రమాదాల  నీటి ఎద్ధడి ఉంటుంది. సుడిగాలుల తాకిడికి నిర్మాణాలు పడిపోవచ్చు. 
అందుకే ఏ పనులూ చేయవద్దన్నారు. 
చెట్లు నరకడం, వ్యవసాయ పనుల ప్రారంభం,నూతులు,బావులు,చెరువులు తవ్వడం మొదలైన పనులపై నిషేధం పెట్టారు. 

రోహిణి కార్తె

ఈ సంవత్సరం మే 11 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు.

 మరో సంగతి పెళ్ళిళ్ళు, గర్భాదానాలు,గృహ ప్రవేశాలకు సంబంధించి నిషేధాలు ఏమీ లేవు.

*జయ జయ శంకర!*
     *హర హర శంకర!*                          🙏🚩🚩🕉🕉

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?

అక్షయ తృతీయ , బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?



మన సంస్కృతిలో ప్రతి పండుగ వెనుకా ఓ కారణం కనిపిస్తుంది. కాకపోతే ఒక్కోసారి ఆ కారణాన్ని మర్చిపోయి , ఆచరణకే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాము. అందుకు ఉదాహరణే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాల్సిందే అన్న స్థాయిలో ఇప్పుడు ఆలోచిస్తున్నారు. నిజంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాల్సిందేనా ! అసలు బంగారానికీ అక్షయ తృతీయకీ సంబంధం ఏమిటి ?
 
అక్షయ తృతీయ రోజున బంగారం కొనితీరాలని ఏ శాస్త్రంలోనూ లేదు. కాకపోతే ఈ రోజున ఏ కార్యాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని , ఏ పుణ్య కర్మని ఆచరించినా కూడా దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు.
 
అక్షయ తృతీయనాడు విష్ణుమూర్తిని పూజించాలని మత్స్య పురాణం పేర్కొంటోంది. విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో అర్చించి , ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది. జపం , హోమం , వ్రతం , పుణ్యం , దానం... ఇలా అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనీ అనంతమైన ఫలితాన్నిస్తుందని మాత్రమే మతగ్రంథాలు పేర్కొంటున్నాయి. అక్షయ తృతీయనాడు వివాహం చేసుకుంటే ఆ బంధం చిరకాలం  నిలుస్తుందనీ , జాతకరీత్యా వివాహబంధంలో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని నమ్ముతారు.
 
అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా అక్షయమైన ఫలితం దక్కుతుంది కాబట్టి , ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే... మన సంపదలు కూడా అక్షయం అవుతాయన్న నమ్మకం మొదలైంది. అయితే కష్టపడో , అప్పుచేసో , తప్పు చేసో సంపదను కొనుగోలు చేస్తే మన కష్టాలు , అప్పులు , పాపాలు కూడా అక్షయంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు.

పరశురామ జయంతి

_*🚩పరశురామ జయంతి🚩*_



పరశురాముడు విష్ణుమూర్తి దశావతారములలో ఆరవది. ఈ అవతారాన్ని ఆవేశావతారం అంటారు... అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంతవరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నేరవేర్చగాలుగుతాడు. పరశురాముడు చిరంజీవుల్లో ఒకడిగా కుడా ప్రసిద్ధుడు. *పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించెనని స్కంద పురాణము మరియు బ్రహ్మాండ పురాణము* తెలుపుచున్నవి. 

పరశురామ జయంతి నాడు ఉపవసించి , పరశురాముని షోడశోపచారములతో పూజించి, *"జమదగ్నిసుత ! వీర ! క్షత్రియాంతక ప్రభో ! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర !"* అని అర్ఘ్యప్రదానము 
చేయవలెనని వ్రత గ్రంధాలు తెలుపుచున్నవి.
శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు , జామదగ్ని అని కూడా అంటారు.

*పరశురాముని జన్మవృత్తాంతం:*

కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు , తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు , రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి , మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని , రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి , అజేయ పరాక్రమవంతుడై , ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది , పరశురాముడైనాడు.

*కార్తవీర్యునితో వైరం:*

హైహయ వంశజుడైన కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సుచేసి , దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకొని , వేయి చేతులు పొంది , మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి , అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి , ఆయన పరివారానికి పంచభక్ష్యాలతొ భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి , దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్దంచేసి అతని వెయ్యిచేతులు , తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్దాలు సందర్శించి రమ్మంటాడు. ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు.

కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని , సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా , అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని , సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి , కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండేనికి అతికించి బ్రతికిస్తాడు.
ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియవంశాలను నాశనం చేస్తాడు. శ్యమంతక పంచకమనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథునివంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుకొని తప్పుకొన్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహా పరాక్రమవంతుడు.

*రామాయణంలో పరశురాముడు:*

సీతా స్వయంవరంలో శ్రీ రాముడు శివ ధనుస్సును విరచిన తరువాత సీతారాముల కల్యాణం జరిగింది. తన గురువైన శివుని విల్లు విరచినందుకు పరుశురాముడు కోపించి , రామునిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. దశరధుని అభ్యర్ధనలను , రాముని శాంత వచనాలనూ పట్టించుకొనలేదు. చేతనైతే ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టమని తన ధనస్సును రామునకిచ్చాడు. రాముడు దానిని అవలీలగా ఎక్కుపెట్టాడు. రామచంద్రమూర్తి ఎక్కుపెట్టిన బాణాన్ని ఎక్కడకు విడవాలి అని అడుగగా తన తపోశక్తిని కొట్టమని చెప్పి , తాను మహేంద్రగిరిపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ధనస్సును పరశురాముడు రామునకు అందించినపుడు పరశురామునికీ రామునికీ భేదం లేదని ఇద్దరికీ అవగతమైనది.

మహాభారతంలో పరశురాముడు
మహాభారతంలో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున భీష్ముడు అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది.
కర్ణుడు తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
ద్రోణాచార్యుడు కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. అర్జునుడు కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.

*మరికొన్ని విషయాలు:*

స్కాంద పురాణం ప్రకారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదియ నాడు జన్మించినట్లుగా పేర్కొనబడినది. అందువలన ఆ రోజు పరశురామ జయంతి జరుపుకుంటారు.

పరశురాముడు దత్తాత్రేయుని వద్ద శిష్యునిగా చేరి అనేక విద్యలను నేర్చుకొన్నాడు. ఈ అంశాలు స్కాంద పురాణం లో వివరించబడింది.

ఒకమారు పరశురాముడు శివుని దర్శించబోగా ద్వారం వద్ద వినాయకుడు అడ్డగించాడు. కోపంతో పరశురాముడు తన పరశువును విసిరేశాడు. తన తండ్రియైన శివుని ప్రసాదమైన పరశువుపై గౌరవంతో వినాయకుడు ఆ పరశువుతో తన దంతం విరిగేలా సమర్పించుకొన్నాడు.

పరశురాముడు చిరంజీవి. కల్క్యవతారమునకు విద్యలుపదేశిస్తాడనీ , తరువాతి మన్వంతరములో సప్తర్షులలో ఒకడవుతాడనీ కధ.

పరశురాముడు పూర్ణావతారము కాదనీ , అవశేషావతారమనీ అంటారు. కనుక పరశురాముని స్తోత్రాలూ , మందిరాలూ చాలా తక్కువ.

భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చిన తరువాత పరశురామునికి తపస్సు చేసికోవడానికి చోటు లేదు. ఆయన తన పరశువును సముద్రంలోకి విసిరేయగా , ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లొ గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు.

కేరళలో తిరువనంతపురం దగ్గర , తిరువళ్ళంలో కరమణ నది ఒడ్డున ఒక పురాతనమైన పరశురామ మందిరం ఉన్నది. ఇది 2 వేల సంవత్సరాలనాటిదంటారు. ఇక్కడ పితృదేవతలను పూజించడం ఆచారం

*పరశురామక్షేత్రాలు:*

ఈ క్రింద కల 7 క్షేత్రాలను పరశురామ ముక్తి క్షేత్రాలు అంటారు. పరశురాముడు తన పరశువు(గొడ్డలి) ను సముద్రంలోకి విసరివేయగా , ఆయనపై గౌరవంతో అంతవరకు సముద్రుడు వెనుకకు తగ్గాడు. అలా వెలువడిన భూభాగమే నేటి కేరళ అని నమ్మిక. ఇలా వెలువడ్డ భూమి లో గల 7 ప్రదేశాలను పరశురామక్షేత్రాలు అని అంటారు. ఈ క్షేత్రాలు అన్నీ కర్ణాటక రాష్ట్రం పశ్చిమ కనుమల లో ఉన్నాయి.

ఉడిపి

కొల్లూరు

గోకర్ణ

కుక్కే సుబ్రమణ్య /సుబ్రమణ్య

శంకరనారాయణ

కుంభాసి , ఆనేగడ్డ కోటేశ్వర మరి కొన్ని ఆలయాలు

భోపాల్ లో ఒక ఆలయం కలదు.

*పరశురామ గాయత్రి మంత్రం*

*ఓం జామదగ్న్యాయ విద్మహే మహావీరాయ ధీమహి తన్నో పరశురామః ప్రచోదయాత్ ॥*

Friday, March 18, 2022

దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి

 దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి



మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..


దుర్గామాత కోపంగా కనిపిస్తే..


మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.


శివుడిని కలలో చూస్తే..

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.


రాముడిని కలలో చూస్తే..

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.


కలలో శ్రీకృష్ణుని దర్శనం..

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.


కలలో విష్ణువు దర్శనం..

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.

గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.

 గ్రహ దోషాలను తొలగించే స్నానపు విధానం.



సూర్య దోషం తొలగడానికి : ఆదివారం 


మనం స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు గాని ఎర్రటి పూలు గాని ఆ బకెట్లో కొంచెం వేసి స్నానం చేసుకుంటే సూర్య దోషం తగ్గుతుంది


చంద్ర దోషం తొలగడానికి: సోమవారం


నీటిలో కొంచెం పాలు కానీ లేక పెరుగు గాని వేసుకుని స్నానం చేస్తే చంద్ర దోషం తగ్గుతుంది


కుజదోషం తొలగడానికి: మంగళవారం


నీటిలో బిల్వ ఆకులను గాని బిల్వ ఆకు పొడిని గాని వేసి స్నానం చేస్తే కుజదోషం తగ్గుతుంది


బుదదోషం తొలగడానికి: బుధవారం


నీటిలో సముద్రపు నీరు గానీ గంగా నది నీరు గాని లేక రాళ్ల ఉప్పు గాని వేసి స్నానం చేస్తే బుధ దోషం తగ్గుతుంది


గురు దోషం తొలగడానికి: గురువారం


నల్ల యాలకులను నీటిలో ఉడికించి వాటిని మనం స్నానం చేసే నీటిలో పోసి స్నానం చేస్తే గురు దోషం తగ్గుతుంది


శుక్ర దోషం తొలగడానికి: శుక్రవారం


యాలకులను నీటిలో ఉడికించి ఆ ఉడికించిన నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శుక్ర దోషం తగ్గుతుంది


శని దోషం తొలగడానికి: శనివారం


నీటిలో నల్ల నువ్వులను నేటి స్నానం చేస్తే శని దోషం తగ్గుతుంది


రాహు దోషం తొలగడానికి: శనివారం


(మహి షాసి, అనేది సామ్రాణి ఇది నాటు మందు షాపులో దొరుకుతుంది )ఈ మహిషా సి పొడిచేసి నీటిలో ఉడకబెట్టి స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే రాహు దోషం తగ్గుతుంది


కేతు దోషం తొలగడానికి: మంగళవారం


గరిక (గడ్డి) నీ ఉడకబెట్టి ఆ నీటిని మనం స్నానం చేసే నీటిలో కలుపుకుని స్నానం చేస్తే కేతు గ్రహ దోషం తగ్గుతుంది


పైన చెప్పిన విధంగా ఆయా రోజుల్లో స్నానాన్ని ఆచరించి గ్రహ దోషాలను తగ్గించుకోవాలి

అనారోగ్య నివారణకు శని దేవుని శాంతి మంత్రం

 అనారోగ్య నివారణకు

శని దేవుని శాంతి మంత్రం



శని వలన కలిగే ఒంటి నొప్పులకి, కీళ్ళ నొప్పులకి, మోకాళ్ళ నొప్పులకి కింద మంత్రం చదువుకోవాలి.


ఏల్నాటిశని,అష్టమ శని,కంటక శని,శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇలాంటి నొప్పులు ఉన్నప్పుడు నడుము నుండి క్రింది పాదాల వరకు నువ్వుల నూనె పట్టించి శని ఉపశమన మంత్రాన్ని పఠిస్తూ రెండు గంటల తరువాత వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.


నువ్వుల నూనె లో కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్'లను కలిగి ఉండటం వలన శక్తివంతంగా కీళ్ళ నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే మూలకాలు, మినరల్స్ రక్తనాళాలకు, కీళ్ళను దృడంగా ఉండేలా చేస్తాయి.


నువ్వుల నూనెతో ప్రతి రోజూ శరీరానికి మర్దన చేస్తే చర్మానికి నిగారింపే కాక చిన్నతనంలో వచ్చే వృద్ధాప్య ఛాయలను కూడా అరి కట్టవచ్చు. అలాగే, చిన్న పిల్లలకు నువ్వుల నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ప్రతిరోజూ నువ్వుల నూనెతో తలకు మాలిష్‌ చేయడం వల్ల జుట్టు బాగా పెరగడంతో పాటు మేధాశక్తి ఎక్కువవుతుంది. పిల్లలు పక్క తడపకుండా ఉండడానికి కూడా నువ్వుల నూనె పని చేస్తుంది.


ఏల్నాటిశని, అష్టమ శని, కంటక శని, శని మహార్దశ, అంతర్దశ జరుగుతున్నప్పుడు కొంతమందికి బద్దకం ఎక్కువగా ఉంటుంది. అలాంటివారు ప్రతిరోజు దేవాలయ ప్రదక్షిణలు గాని, వాకింగ్ గాని మేడిటేషన్ గాని చేస్తే శని తృప్తి పడి మన నిత్య కార్యక్రమాలు సవ్యంగా జరిగేటట్టు చేస్తాడు.


శనైశ్చరో మహాభాగో! సర్వారిష్ట నివారక: !

కాకధ్వజో రుద్రరూపో! కలికల్మష నాశక:!!


ధీరో గంభీరో !ధృడసంకల్ప కారక: !

దేవదేవో దుర్నిరీక్షో! దేవాసురవందిత:!!


కరాళో కంటకో క్రుద్ధో! కష్టనష్టకారక: !

పవిత్రో ప్రలోభో !ప్రారబ్ధకర్మ ఫలప్రద:!!


నిర్గుణో నిత్యతృత్పో! నిజతేజ ప్రకాశిత: !

నిరుపమో నిష్కళంకో! నీలాంజన సమప్రభ:!!


మందో మహావీరో! మదమాత్సర్య నాశక: !

ప్రసన్నో ప్రమోదో !శరణాగత వత్సల:!!


శనైశ్చర పంచకమిదం య: పఠేత్సతం నర:

సర్వకష్ట వినిర్ముక్తో శ్రీ శనైశ్చర కరుణాం లభేత్!!

కలశం పై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసుకుందాం...

 కలశం పై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో తెలుసుకుందాం...




సాధారణంగా కలశాన్ని నోములు,వ్రతాలు చేసుకొనే సమయంలో పెడుతూ ఉంటాం. వారి తాహతును బట్టి రాగిచెంబు లేదా వెండి చెంబును కలశంగా వుంచి, దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి, ఆ కలశంలో కొంచెం నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమలు , గంధం, పూలు వేస్తారు.


కలశంపై మావిడి ఆకులు చుట్టూఉండేలా పెట్టి, వస్త్రం చుట్టిన కొబ్బరికాయను పెట్టి పూజ చేస్తారు.


మన ఇంటిలో ఏదైనా పూజలు జరిగినప్పుడు కలశం పెట్టటం ఆచారంగా వస్తుంది. అయితే చాలా మందికి కలశంపై ఉంచిన కొబ్బరికాయను ఏమి చేయాలో అర్ధం కాదు. కలశం మీద పెట్టిన కొబ్బరికాయను పూజ చేయించటానికి వచ్చిన బ్రాహ్మణులకు ఇవ్వచ్చు. ఒకవేళ బ్రాహ్మణులు లేకపోతే పారే నీటిలో నిమజ్జనం చేయవచ్చు. కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇచ్చిన లేదా పారే నీటిలో నిమజ్జనం చేసినఎటువంటి దోషాలు ఉండవు..


దేవాలయంలో కలశాన్ని పెడితే పూర్ణాహుతి చేస్తారు. అదే ఇంటిలో కలశాన్ని పెడితే కొబ్బరికాయను బ్రాహ్మణులకు ఇవ్వడం లేదా పారే నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇది మన పూర్వీకుల నుంచి ఒక ఆచారంగా వస్తుంది. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను అనుసరించటం మన విధి.

గురు గ్రహ దోషాలు - నివారణ

 గురు గ్రహ దోషాలు - నివారణ



నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.


ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. ఇక ఈ గ్రహానికి సంబంధించిన వ్యాధులు, గురు గ్రహ దోషానికి పరిహార క్రియలను పరిశీలిస్తే.. కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుంది.


జాతకంలో గురువు బలహీనంగా ఉంటే.. సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.


వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట.లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును  ధరించవచ్చును

రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే..............!!

 రావి ఆకులపై ప్రమిదను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగిస్తే..............!!





రావిచెట్టు విశేషాలతో కూడుకున్నది.శాపాలు, దోషాలు, పూర్వ జన్మ కర్మలను ఈ రావిచెట్టు తొలగించగలదు. అందుకు మీరు చేయాల్సిందల్లా రావిచెట్టును పూజించడమే. 


అంతేగాకుండా ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప,దోష,కర్మ ఫలితాలు వుండవు.పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి.రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.


అలాగే ....సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు, 

శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు, 

ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి.


రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు వుండేలా,

ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. 


దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.


ఇంకా శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీ దేవిని పూజించడం...ఆమె అనుగ్రహం పొందాలంటే.. 

తమలపాకుపై ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం శుభప్రదం. ఇంకా తమలపాకుపై ప్రమిదను వుంచి నేతితో దీపమెలిగించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు వుండవని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు

దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'..కన్నుద్రుష్టి గణపతి ఫోటో ఉత్తర దిశలో వుంచితే

 దిష్టిని తొలగించే... 'శుభదృష్టి గణపతి'..కన్నుద్రుష్టి  గణపతి ఫోటో ఉత్తర దిశలో వుంచితే



ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకినమంచులాకరిగిపోతుంది


కీడు కలిగించే చెడు దృష్టిని ''దిష్టి'' అంటారు. 

దీని గురించి ఒక నానుడి కూడా మనకు తెలిసిందే. ''నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది'' అంటారు. దీని అనుభవం పొందిన వారికి దీని ప్రభావం ఎలా ఉంటుందో తెలుస్తుంది. 

 

దృష్టి అంటే చూపు. మనం చూసేది. సహజంగా దేనినైనా చూడటం వలన హాని ఉండదు. కానీ ఈర్ష్యా ద్వేషాలతో చూసే చెడు దృష్టి చాలా హాని చేస్తుంది.


 ఆ చెడుదృష్టి తాకే మనిషినైనా, మరిదేనినైనా మాడి మసి చేస్తుంది.పిడుగు పడినపుడు చెట్లు ఎలామాడిపోతాయో, అట్లే ఈ చెడు దృష్టి ప్రభావం వుంటుంది. అనుభవంలో ఇది చాలామందికి తెలిసిన సత్యం. 


ఈ వైజ్ఞానిక యుగంలో అనేక భయంకరమైన వ్యాధులను నయం చేసేందుకు ఎన్నో కొత్త కొత్త మందులు కనిపెట్టడం జరిగింది. జరుగుతోంది కూడా. కాని ఈ దిష్టి దుష్ప్ర భావాన్ని అణచి వేసేందుకు ఏ వైజ్ఞానికుడు ఏ విరుగుడు కనిపెట్టలేకపోయాడు. కనీసం ఈ విషయమై ఎలాంటి పరిశోధన చేయనులేదు. 

 

కానీ దిష్టిని సమూలంగా నాశనం చేసి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మహా శ్రేష్ఠుడైన అగస్త్య మహాముని దీనికి తగిన పరిహారం ఒక శక్తి అని ఆ మహాశక్తి పేరు సర్వశక్తి వంతుడైన ''శుభదృష్టి గణపతి'' అని కనుగొన్నాడు.


అశుభ దృష్టి అయిన దిష్టి రాక్షసుని సంహరించగల ఒకే ఒక్క దైవశక్తి మహాగణపతి యొక్క అనేక రూపాలలో 33వ రూపమే ఈ ''శుభదృష్టి గణపతి''. 

 

ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన దైవశక్తి. శ్రీమహేశ్వరునివలె ఈయన త్రినేత్రుడు. త్రిశూలధారిగా ఈయన జగన్మాత యొక్క అంశం. 


ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత వుంటుంది. మహా పరాక్రమశాలి రూపంతో ఈ మహాగణపతి పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహ వీరునిలా నిలబడి వుంటాడు. తొమ్మిది నాగదేవతలు ఈయన తలచుట్టూ తిరిగి వుంటారు. 

 

ప్రజ్వలించు అగ్ని జ్వాలలో ఏభై ఒక్క నేత్రాలతో తన సాధారణ స్వరూపానికి విరుద్ధంగా తన విశ్వరూపంతో రుద్ర స్వరూపుడు ''శుభదృష్టి గణపతి"గా ఉద్భవించుట జరిగింది. 


సర్వజనులకు మేలు చేకూర్చే ఈ శుభదృష్టి గణపతి ఒక్కడే దిష్టి అనే దృష్టిని సంహరించి.. సర్వజనాలను రక్షించి, శుభం, సుఖశాంతులు సమృద్ధిగా అందిస్తాడు. 


ఈ ''శుభదృష్టి గణపతి'' దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. 

 

ఈ శుభదృష్టి గణపతిని కంపెనీలు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, దుకాణాల్లో పూజించడం వల్ల దుష్ట శక్తుల ప్రభావాలు తొలగి మంచి లాభాలు, అభివృద్ధి చేకూరుతుంది. ప్రతీ ఒక్కరూ ఈ శుభదృష్టి గణపతిని ఆరాధించాలి. 


గృహంలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. 


ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి, యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా, విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు

శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..

 శ్రీ కాలభైరవస్వామి ప్రధాన క్షేత్రాలు..





1. వారణాసి (ఉత్తరప్రదేశ్) :


కాలభైరవునికి బ్రహ్మ హత్యాపాతకం తొలగించిన స్థలంగా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది.. అందుచే శివుని ఆజ్ఞ ప్రకారం వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడు..


2. ఉజ్జయిని (మధ్యప్రదేశ్ లో ఇండోర్) :


గర్బాలయంలోని శ్రీకాలభైరవుని విగ్రహం పూర్తిగా సింధూరంతో పూయబడి ఉంటుంది.. స్వామి విగ్రహం అల్కాహాల్ ను సేవించుట సైన్సుకు కూడా అంతుబట్టని విచిత్రము..


3. దంతేవాడ (చత్తిస్ ఘడ్ లో జగదల్ పూర్) :


ప్రాచీనాలయం ధ్వంసం కాగా భైరవమూర్తులు ఒక చిన్న పాకలో కొన్ని శతాబ్ధాలు అర్చించబడినాయి.. ప్రస్తుతం కన్పించే భైరవమందిరం ఇటుకలతో నిర్మించబడిన గోడలు, పై కప్పుగా పెంకులతో కన్పిస్తుంది..


ఈ మందిరంలో నాలుగు భైరవమూర్తులు దర్శినమిస్తాయి..


1. వనభైరవుడు

2. జటాభైరవుడు

3. గధాభైరవుడు

4. తాండవభైరవుడు.


4. తేజ్ పూర్ (అస్సాం లో గౌహతి) :


ఇచ్చటి ప్రాచీనాలయంలోని స్వామి పేరు 'మహాభైరవుడు' లింగరూపంలో పూజలందుకుంటాడు. సుమారు 5,500 సం.ల క్రితం శివభక్తుడైన బాణాసురుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి, పూజించినట్లు స్థలపురాణం.


నాగులు ఈ లింగాన్ని పూజించేవి అనుటకి నిదర్శనంగా ఆలయ ప్రాంగణంలో సర్పస్తంభాలు, ఆలయం ముందు ప్రవేశద్వారంపై భాగంలో సర్ప ప్రతిమలు కనిపిస్తాయి..


5. ఇసన్నపల్లి / రామారెడ్డి (తెలంగాణ లో కామారెడ్డి జిల్లా) :


సుమారు 11 వ శతాబ్దం లో స్వామి వారి ఆలయం నిర్మించబడింది..


దక్షిణ భారతదేశంలో ఏకైక భైరవక్షేత్రంగా, గ్రహాపీడలను తొలగించే క్షేత్రంగా ఇది చెందినది.


ప్రధాన గర్బాలయంలో 7 అడుగుల ఎత్తుతో ఉన్న కాలభైరవస్వామి వారి విగ్రహం నిల్చోని దిగంబరంగా దర్శనమిస్తుంది..


6. రామగిరి (ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లా) :


ఇచ్చట 9వ శతాబ్దంలో నిర్మించబడిన శ్రీ కాలభైరవాలయం, శ్రీ వాలేశ్వర స్వామి వారి ఆలయం ప్రక్కప్రక్కనే ఒకే ప్రాకారంలో అమరియున్నవి.  ఆలయంలో స్వామివారి విగ్రహం సుమారు ఐదు అడుగుల ఎత్తులో గంభీరంగా ఉంటుంది..


7. భైరవసెల (శ్రీశైల క్షేత్రం దగ్గర) :


ఎచ్చటా కానరాని సహజ సిదమైన 7 జలపాతాలతో, లోయలు, కొండలతో ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే ఈ క్షేత్రంలో ఒకేసారి పాతికమంది కూర్చోవడానికి వీలున్నట్లు భైరవగుహ, ఆ గుహలో శివస్వరూపుడైన భైరవుడు.. ఒక శివలింగం.. స్థానిక చెంచుల దేవుడైన నిరాకార 'బయన్న' దర్శనమిచ్చును..


8. అడవివరం (ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం) :


ప్రకృతి సౌందర్యం మధ్యలో ఆలయం, గోడలు ఏమిలేకుండా పైకి మెట్లు నఇర్మించబడి, చుట్టూ మండపంతో ఓపేన్ ఎయిర్ లో భైరవుడు దర్శనమిస్తాడు..


9. ఖాట్మండు (నేపాల్) :


నేపాల్ దేశ రాజధానిగా ఈ క్షేత్రం ఉన్నది.. నేపాలీయులందరూ కాలభైరవుని ఎక్కువగా ఆరాధిస్తారు..


అందుకే ఇచ్చట అనేక దేవీ దేవతల విగ్రహాలతో పాటు ప్రతిష్ఠించబడిన శ్రీకాలభైరవస్వామికి విశేషంగా పూజలు జరుగుతుంటాయి.. ఇక్కడ స్వామి చిత్రవిచిత్రంగా ఆలంకారాలు చేస్తారు..


10. భైరవకోన (భైరవకొండ) (ఆంధ్రప్రదేశ్ లో బంగోలు జిల్లా) :


ఇక్కడ త్రిముఖదుర్గ అమ్మవారు కొలువైఉంటారు.. అమ్మవారి శిరస్సు మాత్రమే ఉంటుంది.. కార్తికపూర్ణిమ నాటిరాత్రి 7 - 8 గం.ల మధ్య దేవీ ఏదురుగా ఉన్న జలాశయంలో చంద్రకిరణాలు ప్రసరించబడి అమ్మవారి ముఖం మీదికి పరావర్తనం చెందుట అపూర్వం.. క్షేత్రపాలకుడైన కాలభైరవస్వామి గుహాలయం శివాలయాలకు ఎదురుగా నిర్మించబడినది.


11. తిరువైసనల్లూరు (తమిళనాడు లో కుంబకోణం) :


ఇచ్చటి శివయోగినాథాలయంలోని గర్బగుడిలో యోగ భైరవుడు, జ్ఞాన భైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు, ఉన్మత్త భైరవుడు అను నాలుగు విగ్రహాలను ఒకేసారి దర్శించడానికి వీ‌లుగా ఉన్నవి.


12. న్యూడిల్లి :


ఈ క్షేత్రంలో పురాణాఖిల్లాకు దగ్గరగా అతిప్రాచీనమైన కాలభైరవస్వామి ఆలయం ఉన్నది. మహాభారత కాలంలో పాండవులు ఈ స్వామిని ఆరాధించినట్లు స్థల పురాణం.


13. ధున్నాస్ (ఉత్తరప్రదేశ్) :


ఇచట ధర్మశాలతో పాటుగా శ్రీకాలభైరవస్వామి ఆలయం ఉన్నది. ఇచట నుండి కొంచం దూరం ముందుకు వెల్తే ప్రధాన పీఠ రహదారిలో కాళీమాత మందిరాన్ని దర్శించవచ్చు..


14. మున్నంగి (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లాలో)  :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


15. భైరవపాడు (ఆంధ్రప్రదేశ్ లో గుంటూర్ జిల్లా) :


స్వయంభువులు గా వెలిసిన కాలభైరవుడిని చూడవచ్చు..


16. అధియమాన్ కొట్టాయ్ (కర్నాటక లోని ధర్మపురి జిల్లా) :


9వ శతాబ్దంలో అధియమాన్ అను చక్రవర్తిచే ఇచ్చట కాలభైరవాలయం నిర్మింపబడినది.


17. కచ్ఛాద్రి (కర్నాటక లోని కొల్లూర్ దగ్గర) :


ఇచ్చట గల కొండపై గల ఆలయంలో శ్రీకాలభైరవస్వామి తో పాటుగా ఉమాదేవిగా పిలువబడు అమ్మవారు దర్శనమిస్తారు

ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు ...!! వాటి వివరాలు తెలుసుకోండి...

 ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలా తినాలో చాలా మందికి తెలియదు ...!! 

వాటి వివరాలు తెలుసుకోండి...



 శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే 

వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు.

 

కొంతమంది స్వయం ఠీవిగా చేతిలో తీసుకుంటారు ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు 

అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి 


తీర్థం తీసుకోవాలి అంటే ఎడమచేతి పైన కుడిచేతిని పెట్టి తీర్థం తీసుకుని రెండు కళ్ళకు మొక్కుకుని ఆ తరువాత తాగాలి ,,

తాగేసాక ఆ అరచేతిని తలపైన తుడుచుకుంటారు ..

అలా చేయకండి !

రెండు చేతులలోకి తుడుచుకోండి .


స్త్రీలు తీర్థం ప్రసాదం గుడిలో తీసుకునేప్పుడు వారి పైట కొంగును చేతులతో పట్టుకుని ,పూలు అయితే పైటకొంగులోనే  తీసుకోవాలి 


అలాగే చక్కర పొంగలి లాంటివి ఇచ్చినప్పుడు కుడిచేత్తో తీసుకుని అలాగే నోట్లో వేసేసుకుంటుంటారు కొందరు .

పక్షులకు చేతులు లేవు కనుక అవి అలా తింటాయి , మనకు దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కనుక చక్కగా కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకుని ఎడమచేతిలోకి మార్చుకుని కుడిచేత్తో కొద్దికొద్దిగా తీసుకుని తినాలి ..


అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని చెబుతారు ...


మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు  అదే శాస్త్రం కూడా చెబుతున్నది .


తెలియని వారు ఇప్పుడైనా తెలుసుకుని నడుచుకుంటారుగా ..

దేవుడి ప్రసాదం తీసుకుని ఎలా తినాలో తెలుసుకున్నారు అని అనుకుంటున్న

శివుడు మనకు పదకొండు. ఏకాదశ రుద్రులు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు.

 శివుడు మనకు పదకొండు.    ఏకాదశ రుద్రులు   అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. 



ఓంనమస్తేస్తు భగవన్ 'విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః' అని రుద్రనమకంలో చెప్పబడినది.


దీనిప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు 1. విశ్వేశ్వరుడు, 2.మహాదేవుడు,3. త్రయంబకుడు , 4.త్రిపురాంతకుడు, 5.త్రికాగ్నికాలుడు, 6.కాలాగ్నిరుద్రుడు, 7.నీలకంఠుడు, 8.మృత్యుంజయుడు, 9.సర్వేశ్వరుడు,10. సదాశివుడు మరియు 11. శ్రీమన్మహాదేవుడు. 


ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడెక్కడ ప్రతిష్టించబడినారో వివరాలు మనం తెలుసుకుందాము.


1. విశ్వేశ్వర రుద్రుడు- వ్యాఘ్రేశ్వరం .(శ్రీబాలాత్రిపుర సుందరీ సమేత వ్యాఘ్రేశ్వర స్వామి):


పూర్వకాలంలో ఒకబ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని (పులి) శివునిగా భావించి బిళ్వపత్రాలతో అర్చన చేయటంవల్ల ఆ పులి శివలింగరూపాన్ని పొందిందని కధ కలదు. వ్యాఘ్రము శివునిగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను.


2. మహాదేవరుద్రుడు- కె. పెదపూడి (శ్రీపార్వతీ సమేత మేనకేశ్వర స్వామి):


విశ్వామిత్రుని తపోభంగముకొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు, మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అపుడు ఆమె శివుని ప్రార్ధించగా ఆయన ఒకశివలింగమును మేనకకు ఇచ్చి ఆప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అపుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి (కె.పెదపూడి) నందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయెనని కధ కలదు. మేనకచే ప్రతిష్ఠింప బడుటచే మేనకేశ్వరస్వామి అని పిలువబడెను. 


3. త్రయంబకేశ్వరుడు - ఇరుసుమండ (శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత ఆనందరామేశ్వర స్వామి):


రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పకవిమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పకవిమానం కదలకుండా నిలిచిపోయినది. అపుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్ధించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కధ కలదు. అపుడు వారి పుష్పకవిమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠింపబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 


4. త్రిపురాంతక రుద్రుడు - వక్కలంక (శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి):


తారకాసురుని పుత్రులు ముగ్గురు మూడుపురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్ధించగా వారిని శివుడు సంహరించి వక్కలంక గ్రామము నందు శివలింగరూపంలో ఆవిర్భవించెనని కధ కలదు. అపుడు ఆగ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠింపబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను. 


5. త్రికాగ్నికాల రుద్రుడు- నేదునూరు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి):


మూడు అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్ని కాలునిగా పిలువబడి అగస్త్యమహర్షిచే నేదునూరు గ్రామమున ఈశివలింగము ప్రతిష్ఠింపబడినది. శ్రీ ఉమాచెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలువబడుచున్నాడు.


6. కాలాగ్ని రుద్రుడు- ముక్కామల (బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి):


రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేసెను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను, ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠింపబడుట వల్ల రాఘవేశ్వరస్వామిగా పిలువబడెను.


పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతునివేషంలో అర్జునుని ధైర్యపరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్నిరుద్రుడని మరియొక కధ కలదు. 


7. నీలకంఠ రుద్రుడు - మొసలపల్లి ( శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అనంత భోగేశ్వర స్వామి )


దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మధన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హానికలిగించకుండా చేయుటకు శివుడు తనకంఠమునందు నిక్షిప్తముచేసికొని నీలకంఠుడైనాడు. 


ఆగరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. తనను కొలిచినవారికి అనంతభోగాలను అందించేవాడు, మరియు అనేక భోగులను (పాములను) ఆభరణములుగా ధరించినవాడు అగుటవల్ల అనంత భోగేశ్వరస్వామిగా పిలువబడెను.


8. మృత్యుంజయ రుద్రుడు- పాలగుమ్మి (శ్యామలాంబా సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):


శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖమునుండి రక్షించి, యముని జయించి "మృత్యుంజయుడు" అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్నమల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 


9. సర్వేశ్వర రుద్రుడు- గంగలకుర్రు అగ్రహారం (ఉమాపార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి):


దక్షుని యజ్ఞంలో సతీదేవి తనతండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తనకాలితో నేలపై వ్రాయుటవల్ల ఏర్పడిన అగ్నిజ్వాలలందు కాలిబూడిద అయినపుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యముచేసి తనజటాజూటములో ఒక జటను తీసి నేలపై కొట్టుటవల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అపుడు దక్షయజ్ఞమును ధ్వంసముచేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వరస్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


10. సదాశివ రుద్రుడు- గంగలకుర్రు (సర్వమంగళా పార్వతీ సమేత శ్రీచెన్నమల్లేశ్వర స్వామి):


పూర్వం బ్రహ్మవిష్ణులు తమలో ఎవరుగొప్పవారని వాదనకుదిగి శివుని వద్దకు వచ్చిరి. అపుడు శివుడు ఆద్యంతములులేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగివచ్చి చూడలేకపోయితినని చెప్పెను. కాని బ్రహ్మమాత్రము శివుని శిరస్సును చూడకపోయినను ఒకఆవును, మొగలిపువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహము వచ్చి బ్రహ్మకు పూజాపునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆలింగధారియైన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేదపండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠింపబడెను. 


11. శ్రీమన్మహాదేవ రుద్రుడు- పుల్లేటికుర్రు (శ్రీబాలాత్రిపురసుందరీ సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు):


పూర్వకాలంలో విష్ణుమూర్తి శివుని సహస్రకమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహూకరించెను. ఆమహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి 'పుండరీకపురము' అని పూర్వకాలంలో పేరు ఉండెడిది. పుండరీకము అనగా వ్యాఘ్రము(పులి) అని అర్ధము కలదు. వ్యాఘ్రేశ్వరమునందు వ్యాఘ్రేశ్వరస్వామి ఉండుటచేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అనుపేరుతో పిలువబడెను.

కొత్త తులసి మొక్కను పాతడానికి గానీ, మార్చివేయడానికి గానీ మంచి రోజులు చూడాలా? ఇంట్లో బిల్వవృక్షం (మారేడు) ఉండవచ్చా? దళాలు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?

 కొత్త తులసి మొక్కను పాతడానికి గానీ, మార్చివేయడానికి గానీ మంచి రోజులు చూడాలా? ఇంట్లో బిల్వవృక్షం (మారేడు) ఉండవచ్చా? దళాలు ఏ రోజుల్లో కోయాలి? ఎన్నాళ్ళు వాడవచ్చు?



శాస్త్రరీత్యా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యాలంటారు. ఆ రోజుల్లో కొత్తగా తులసి మొక్కను మార్చి పాతడం కూడదు. ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య, శుక్రవారాలలో తులసిని కోయరాదు.

ఇంట్లో బిల్వవృక్షం పెంచుకోవచ్చు. తగిన స్థలం ఉండి, చక్కగా వృద్ధిపొందే అవకాశం ఉన్నప్పుడు బిల్వాన్ని వేయవచ్చు. ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలలో బిల్వవృక్షాన్ని వేయవచ్చు. బిల్వంతో శివార్చన చేయడం మహా పుణ్యఫల ప్రదం. బుధ శని వారాల్లో మారేడు దళాలు కోయాలి. అప్పుడు కోసి భద్రపరచుకొని రోజూ వాడవచ్చు. నిన్న పూజించిన బిల్వాన్ని కడిగి ఇవాళ మళ్ళీ పూజించవచ్చు. అలా ముప్పది రోజుల వరకు పూజించవచ్చు. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, చతుర్ధి, అష్టమి తిథుల్లో బిల్వాలను కోయకూడదు. వాటికి ముందే కోసి దాచి వాడుకోవాలి.

1008 కూరలతో భోజనం!

 1008 కూరలతో భోజనం!


              


వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు ఉన్నాయా?అసలు మామూలు దినమైనా తినడానికి అన్ని రకాలు దొరుకుతాయా? 


ఒక వేళ ఉన్నా ఎవరైనా అన్ని కూరలు వంటలో వాడుతారా? వడ్డిస్తారా?ఒక వేళ వడ్డించినా అన్ని ఎవరు తినగలరు?.


ఒకసారి తమ పితరుల శ్రాద్ధము తిథి భోజనానికి భోక్తగా రమ్మని వశిష్ఠులు విశ్వామిత్రులను పిలిచినారు .


దానికి విశ్వామిత్రులు దానికేమి వస్తాను కాని నాదొక నిబంధన మీరు ఒకవెయ్యి ఎనిమిది రకాల కూరగాయలతో వంట చేసి నాకు వడ్డించవలెను అన్నారు.


మీరు అడిగిన వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను అన్నారు.శ్రాద్ధ దినము రానే వచ్చింది విశ్వామిత్రులు రానే వచ్చినారు. 


వారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని కూరలు మాత్రము వాడి చేసిన వంటను అరుంధతి వడ్డించింది. 


వెయ్యిన్ని ఎనిమిది కూరలు అయితే లేవు.దానికి విశ్వామిత్రులు కోపించి ఇదేమిది? ఈ ఆకులో వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఎక్కడున్నాయి ? అన్నారు.


దానికి వశిష్ఠులు నేను తమ కోరికను అరుంధతి వద్ద ముందే చెప్పి ఉంచినాను.మీ కోరిక ప్రకారమే చేస్తాను అని చెప్పింది కూడా అడుగుతాను ఉండండి అన్నారు.


వీరి మాటలు వింటున్న అరుంధతి తానే ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెపుతుంది


కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే


దాని అర్థము:    శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ]  పచ్చడి మూడు వందల కూరలకు సమానము. పనసపండు ఆరు వందల కూరలకు సమానము.


ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.


అది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై నోటమాట రాక భోజనము చేసి  వెళ్లారుట.


   లోకా సమస్తా సుఖినోభవన్తు!

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS