*కర్తరి ప్రారంభ విశేషాలు*
కర్తరి ప్రవేశం:
మే 4 నుంచి 28వ తేదీ వరకు కర్తరి కొనసాగుతుంది. దీన్నే *వాస్తు కర్తరి* అంటారు.
మే 4వ తేదీ రాత్రి 9గం.18 లకు రవి భరణి నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడంతో
*చిన్న కర్తరి* ప్రారంభ మవుతుంది.
మే 11 రాత్రి 06గం.35 ని.లకు కృత్తికా నక్షత్రం లోకి రవి ప్రవేశించడంతో *పెద్ద కర్తరి* ప్రారంభ మగుతుంది.
28. 05 న రాత్రి 8గం.05 ని త్యాగ మవుతుంది.
చేయకూడనివి:
ఈ సమయంలో శంకుస్థాపనులు, చెక్కపనులు, తాపీ పనులు చేయరాదు.
రాశులు.. నక్షత్రములు
మనకు 27 నక్షత్రాలు, 12 రాశులు ఉన్న సంగతి తెలుసు! ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాల చొప్పున మొత్తం 27 X 4=108 పాదాలు. 12 రాసులతో భాగిస్తే ఒక్కోరాశికి 9 పాదాలొస్తాయి.
మొదటి రాశి మేషం, సాధారణంగా ఒక రోజు తేడాలో ఏప్రిల్ 14న సూర్యుడు ఈ రాశిలో ప్రవేశిస్తాడు.
దీనినే "సూర్య సంక్రమణం" అంటాం. *ఇది తమిళులకు నూతన సంవత్స రారంభం*
డొళ్ళు కర్తరి.. అగ్ని కర్తరి
సూర్యుడు భరణి నక్షత్రంలో 3,4 పాదాలలో ఉన్నపుడు "డొల్లు కర్తరి" అంటారు.
కృత్తిక నక్షత్రం లో ఉండగా "అగ్ని కర్తరి" అని అంటారు.
కృత్తిక నాలుగు పాదాలులో అగ్నిలేక పెద్ద కత్తిరి నడచేటప్పటికి రోహిణీ కార్తె ప్రారంభమవుతుంది.
నిర్వచనం
*కర్తరి అంటే.... కర్త + అరి = కర్తరి అంటే పని చేసేవానికి శత్రువు అని అర్ధం.*
ఈ కర్తరి సమయంలో వాతావరణ మార్పులు ఎక్కువగా ఉంతాయి. ఇక అగ్ని కర్తరి వచ్చేసరికి ఎండలు ముదిరిడంతో అగ్నిప్రమాదాల నీటి ఎద్ధడి ఉంటుంది. సుడిగాలుల తాకిడికి నిర్మాణాలు పడిపోవచ్చు.
అందుకే ఏ పనులూ చేయవద్దన్నారు.
చెట్లు నరకడం, వ్యవసాయ పనుల ప్రారంభం,నూతులు,బావులు,చెరువులు తవ్వడం మొదలైన పనులపై నిషేధం పెట్టారు.
రోహిణి కార్తె
ఈ సంవత్సరం మే 11 నాటికి రోహిణీ కార్తె వచ్చేస్తుంది, భరించలేని వేడి ఉంటుంది. అందుకు ఈ పదిహేను రోజులూ కూడా పై చెప్పిన పనులు వద్దన్నారు.
మరో సంగతి పెళ్ళిళ్ళు, గర్భాదానాలు,గృహ ప్రవేశాలకు సంబంధించి నిషేధాలు ఏమీ లేవు.
*జయ జయ శంకర!*
*హర హర శంకర!* 🙏🚩🚩🕉🕉
No comments:
Post a Comment