Wednesday, June 5, 2024

సాయిభక్త శ్రీ బి.వి. నరసింహస్వామిగారి పండరిపుర క్షేత్ర అనుభవం.

*సాయిభక్త శ్రీ బి.వి. నరసింహస్వామిగారి పండరిపుర క్షేత్ర అనుభవం.*


*సద్గురు అన్వేషణలో శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు ఉత్తరదేశ పర్యటన గావిస్తున్నారు.*
*ఆ పర్యటనలో భాగంగా పండరిపురం పాండురంగ దర్శనమైనది.* 
*అక్కడివారు అక్కడగల బాపుమాయి అనే యోగినిని దర్శించుకోమని సలహ ఇచ్చారు. బాపుమాయి ఒక విశిష్ట యోగిని శరీరంపై ఒక తుండుగుడ్డ మాత్రమే ధరించేది.*

*భక్తులను ఒక పైసా ఇమ్మని అడిగేది. అది తీసుకుని అక్కడగల చంద్రభాగా నది వద్దకి వెళ్ళి " అమ్మా ! చంద్రభాగా ! ఈ దబ్బునంతా జాగ్రత్తగా దాచు " అని భక్తులు ఇచ్చిన నదిలో వేసేది.* 
*ఒకరోజు బి.వి.నరసింహస్వామి గారు పండరిపురంలో బాపుమాయిని చూశారు. అమె వెంట వెళ్లసాగాడు. ఆమె అయనను చూసి "ఎవరు నీవు ? " అని ప్రశ్నించింది ." నేనొక యాత్రికుడను " అని అన్నాడు స్వామి."*
 *నాకు ఇల్లు లేదు, స్మశానంలో ఉంటాను " అని శ్మశానం వైపు దారితీసింది.*

*" నాకు స్మశానమంటే భయం లేదు. అక్కడికి పోకూడదనే నియమము లేదు " అని ఆమె వెనుక పోసాగాడు. ఆమె స్మశానం చేరింది. అదిచూసి కొంతసేపైన తరువాత, ఆయనతో " నీకు ఆకలిగా ఉందా ? " అని అడిగింది.*
 *నిజంగానే ఆయన ఆకలితో ఉన్నాడు.*
*" అవును. ఆకలిగానే వుంది " అని జవాబిచ్చాడు.*
*ఇంతలో ఒక పెద్ద హొటల్ లో పనిచెసే వ్యక్తి ,ప్రత్యేక దుస్తులు ధరించి, అనేక విశేష భోజన పదార్ధాలు నిండిన ప్లేటుతో వచ్చాడు.* 
*ఆ ప్లేటులో అన్నము, రొట్టెలు, పప్పు, స్వీట్లు ఉన్నాయి.*
*అప్పుడు అయనను భోజనం చేయమనీ అన్నది.*
*ఆయన వెంటనే భోజనం చేశాడు. ఆ భోజనం అయనకు ఎంతో తృప్తిని ఇచ్చింది. ఆ భోజనం తెచ్చిన వ్యక్తి ఖాళీప్లేటుతో వెళ్లిపోయాడు.*

*తరువాత బాపుమాయి అతనితో " నీకు ఏమి కావాలి ? " అని అడిగింది.* 

*అందుకు ఆయన "నేను దేవుడిని చూడాలని వుంది " అని అన్నాడు అందుకు ఆమె పకపక నవ్వింది ." నీవు ఒక మొద్దువు.*
 *ఇప్పుడు నీకు భోజనము తెచ్చినవాడు ఆ పాండురంగడే ! నర సంచారములేని ఈ ప్రదేశానికి ఆయనగాఁక మరెవరు భోజనం తెస్తారు అని అన్నది బాపుమాయి.* *నరసింహస్వామి దిగ్భ్రాంతి చెందాడు.* 
*ఆమె ఆయనతో* 
*" సర్వానంతర్యామి అయిన ఆ సర్వేశ్వరుని దర్శించే అర్హత ఇంకా నీకు రాలేదు.* 
*ఉత్తర దిశలో నీ గురువు నీకోసం ఎదురుచూస్తున్నారు. నీవు వెంటనే బయలుదేరు " అని చెప్పి వెల్లిపోయింది.*

*తరువాత కొద్దిరోజులకు ఆయనకు సమర్థ సద్గురువు షిర్డిసాయినాధుని సమాధి దర్శనమైనది.*

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS