Thursday, March 13, 2025

గృహ‌ప్ర‌వేశం_ఎలా చేయాలి* "*ఏదీ మంచి ముహూర్తం*

గృహ‌ప్ర‌వేశం_ఎలా చేయాలి* 

"*ఏదీ మంచి ముహూర్తం*


*గృహ‌ము* నిర్మాణం అయిన త‌ర్వాత అందులోకి ప్రవేశించే ముందు జరుపుకొనే పండుగ "*గృహ ప్రవేశం*. హోమం,నవగ్రహాలకు శాంతి, సత్యనారాయణ స్వామి వ్రతం, ముందుగా గోమాత (ఆవు,ల్యాగే) ను నూతన గృహంలోకి ప్రవేశింపచేయాలి.అయితే గృహప్రవేశానికి ఏ రోజు మంచిది అనే విష‌యం చాలా ముఖ్యం.సూర్యుడు కుంభరాశిలో సంచరించే కాలం మినహా మిగిలిన మాసాలన్నీ శుభప్రదమైనవిగా చెప్ప‌వ‌చ్చు.అయితే కార్తీక, మార్గశిర మాసాలు మధ్యమ ఫలప్రదాలు.నూతన గృహ ప్రవేశానికి ఉత్తరాయణం మంచి కాలంగా చెప్పబడుతోంది.

రిక్త తిథులైన చవితి,నవమి,చతుర్థీ తిథులు విడిచిపెట్టి మిగిలిన తిథులలో పూర్ణచంద్రుని,సప్తమి, అష్టమి,దశమి తిథులు శుక్ల పక్షము నందు ఏకాదశి,ద్వాదశి, త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ,తదియ శుభమ‌ని శాస్త్రం చెబుతోంది.దక్షిణ సింహద్వారం ఉన్న గృహమునకు సంబంధించి గృహ ప్రవేశానికి పాడ్యమి,షష్టి,ఏకాదశీ తిథులు మంచివి.ఉత్తరాయణంలో మాఘమాసం,ఫాల్గుణం,వైశాఖ మాసాలు శుభ‌క‌ర‌మైన‌వి.ఇక మిగతా మాసాలందు నూతన గృహ ప్రవేశం పనికిరాదు.

"*దక్షిణ సింహద్వారం* 

 ఉన్న ఇంటికి.గృహ ప్రవేశం చేయాలంటే పాడ్యమి,షష్టి,ఏకాదశీ తిథులు మంచివి.తూర్పు సింహద్వారం కలిగిన ఇంటి గృహ ప్రవేశానికి పూర్ణ తిధులైన పంచమి,దశమి,పూర్ణిమా తిథులు, "*పశ్చిమ సింహద్వార గృహానికి* 
విదియ,సప్తమి,ద్వాదశీ తిథులు మంచివని వాస్తు శాస్త్రం చెబుతోంది.గృహ‌ప్ర‌వేశానికి సోమ,బుధ,గురు,శుక్రవారాలు శుభప్రదం.ఇక‌ ఆదివారం,మంగళవారంలో గృహ ప్రవేశం అశుభప్రదమ‌ని చెప్ప‌వ‌చ్చు. చవితి,నవమి,చతుర్దశి  తిథులను విడిచిపెట్టి,పౌర్ణమి,సప్తమి,అష్టమి, దశమి తిథుల్లో గృహప్రవేశం చేయడం ద్వారా ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి.ఇంకా.శుక్ల పక్షము నందు ఏకాదశి,ద్వాదశి,త్రయోదశీలతో పాటు శుక్లపక్ష విదియ,తదియలు కూడా గృహ ప్రవేశం చేయడానికి మంచి ముహూర్తాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
 
"*గృహ‌ప్ర‌వేశం* ఎలా?

నూత‌న గృహ‌ప్ర‌వేశం ఎలా అనే విష‌యం కూడా ముఖ్య‌మే. 
"*ధర్మ సింధు* శాస్త్రం ప్రకారం ఆచరించవలసిన పద్ధతి గ‌మ‌నిస్తే. "*గృహ యజమాని ధర్మపత్నితో*  సహా మంగళ స్నానాలు చేయాలి.బంధు మిత్రులతో కూడుకొని నూతన గృహమునకు,ముహూర్త సమయాని కంటే కాస్త ముందుగానే చేరుకోవాలి."*గృహ ద్వారం* వద్ద "*దూడతో ఉన్న ఆవును* పూజించి దానికి ఇష్టమైన ఆహారంను పెట్టాలి. 

"*అష్ట దిక్కులు,భూదేవికి ఊర్ధ్వ పురుషునికి వాస్తు వరుణ దేవతలకు* మృష్టాన్నం, వసంతంతో నింపిన "*గుమ్మడికాయ బలిహరణం* (ఉద్దిబేడలు,పెసరపప్పు,బియ్యము,పసుపు,సున్నము కలిపి వండిన అన్నం) ఇవ్వాలి.దీనిని వెలగకాయంత ముద్దలు చేసి అన్ని దిక్కుల పెట్టాలి.కలశమున గంగాది తీర్థములను ఆవాహన చేసి పూజించాలి. దీనినే గంగపూజ అంటారు. శుభ ముహూర్తాన దూడతో ఆవును ముందుంచుకొని, గృహదేవతా విగ్రహములను కాని, పటములను కాని చేత పట్టుకొని మంగళ వాద్య ఘోషముల మధ్య యజమాని కుడి కాలు, ధర్మపత్ని ఎడమ కాలు గృహమందు ప్ర‌ధాన గ‌డ‌ప దాటవ‌లెను.

అనంత‌రం పాలు పొంగించి, క్షీరాన్నంను వండి దానితో వాస్తు పురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రంనకు నెయ్యి, చక్కెర వేసి నమస్కరించవలెను. వాస్తు పూజకు ముందు వినాయ‌క పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణం పెట్టు వరకు నూతన గృహంలో ఏమియు వండ కూడ‌దు. 

"*లోకా సమస్తా సుఖీనోభవంతు*.

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS