అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారుచంద్రుని యొక్క అష్టమికళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలోఅర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.చంద్రుడికి పదహారు కళలున్నాయి.పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను పదహారవకళ సాక్షాత్తూసచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధపాడ్యమిఅంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చిచంద్రునిలో ప్రవేసిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజునుపూర్ణిమ అంటారు. ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయిసూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయినరోజును అమావస్యా అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు. ఇవే శుక్ల కృష్ణపక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమినాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు.అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు.వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్తిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ,జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్యఇవి పదహారునిత్యలు. ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటంచేతనేచంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు నిత్యలుఈ దిగువ ఇవ్వబడ్డాయి.శుక్లపక్షము తిథి, నిత్యాదేవత కృష్ణపక్షము తిథి1. పాడ్యమి ,కామేశ్వరి. 1. పాడ్యమి, చిత్ర2. విదియ, భగమాలిని. 2 జ్వాలామాలిని3. తదియ ,నిత్యక్షిన్న 3 సర్వమంగళ4. చవితి , భేరుండా. 4 విజయ5. పంచమి, వహ్నివాసిని 5 నీలపతాక6. షష్టి ,మహావజ్రే్ేశ్వరి 6. నిత్య7. సప్తమి ,శివదూతి 7 కులసుందరి8. అష్టమి, త్వరిత 8 త్వరిత9. నవమి, కులసుందరి. 9 శివదూతి10. దశమి ,నిత్య 10. మహావజ్రేేశ్వరి11. ఏకాదశి ,నీలపతాక 11. ఏకాదశి వహ్నిివాసిని12. ద్వాదశి ,విజయ 12. ద్వాదశి భేరుండా13. త్రయోదశి | సర్వమంగళ 13. త్రయోదశి | నిత్యకిన్న14. చతుర్దశి, జ్వాలామాలిని 14. చతుర్దశి భగమాలిని15. పూర్ణిమ ,చిత్ర 15. కామేశ్వరిచంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్లకృష్ణ పక్షాలలో నిత్యాదేవతలు వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తేతెలుస్తుంది. కాని రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం “త్వరిత” అనబడేనిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే త్వరితాకళ అని కూడా అంటారు. అనగా ఎటువంటిమార్పులేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే అష్టమినాటి చంద్రునితో దేవిముఖాన్ని పోల్చటం జరిగింది.గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.🌹🙏శ్రీ మాత్రే నమః🙏🌹
Tuesday, March 4, 2025
అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు
Subscribe to:
Post Comments (Atom)
RECENT POST
మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి
మంగళగిరి పానకాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవారంభం ... ధ్యాయామి నారసింహాఖ్యం బ్రహ్మవేదాంతగోచరం భవాబ్ధి తరణోపాయం శంఖచక్రధరంపదమ్ శ్రీ...

POPULAR POSTS
-
కార్తెలు-వాటి వివరణ మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు.తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరచుకున్నారు.తెల...
-
అశ్విని నక్షత్రము గుణగణాలు అశ్వినీ నక్షత్ర అధిదేవత అశ్వినీ దేవతలు. సూర్యభగవానుడి భార్య సజ్ఞాదేవికి, సూర్యభవానుడికి పుట్టిన వారు అశ్విన...
-
విగ్రహానికి చర్మం, స్వేదం, వెంట్రుకలు...ప్రపంచంలో ఏకైక విగ్రహం ఇక్కడే... i భారత దేశం అనేక ఆలయాలకు నిలయం. ఇక్కడ శైవం, వైష్ణవం తో ...
-
కదంబ వృక్ష మహిమ : కదంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్సిస్. ఇది ఆకురాల్చదు. ఎప్ప...
-
సకల దేవతల మంత్రాలు మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయి. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్...
-
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత. లక్ష్మి గవ్వల పూజ - ఉపయోగాలు . Laxmi Pasupu Gavvalu.The Importance of Laxmi Gavvalu Sri Maha Lakshmi Pasupu ...
-
నక్షత్ర ఆధారిత ఉపశమనాలు వివరణ జన్మ నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకొని దానికి సరిపడు ఉపశమనాలను మీకు అందిస్తున్నాను. జ్యోతిష శాస్త్రము మ...
-
సలేశ్వరం- శ్రీశైలం అన్ని సార్లు వెళ్ళారు . కానీ ప్రక్కన ఉన్న అత్బుతమైన సలేశ్యరం చూసారా. సలేశ్వరం (Saleshwaram) ఇ...
-
శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల బాహ్య ప్రపంచానికి అంతగా త...
-
బీజాక్షర సంకేతములు ఓం - ప్రణవము సృష్టికి మూలం హ్రీం - శక్తి లేక మాయా బీజం ఈం - మహామాయ ఐం - వాగ్బీజం క్లీం - మన్మధ బీజం సౌ...
No comments:
Post a Comment