Friday, February 23, 2018

రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు



రామకోటి రాయడానికి పాటించాల్సిన నియమాలు


🌷🌷🌷 ..... చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది...... 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం..... . చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు......శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు..... 🌷🌷🌷


🌷🌷🌷 ..... సమస్త పాపాలను హరించివేసి ... సకల పుణ్య ఫలాలను అందించే శక్తి ఒక్క రామ నామానికి మాత్రమే వుంది..... రామ అనే రెండు అక్షరాలు ధర్మ మార్గాన్ని సూచిస్తాయి ... . మోక్షమార్గాన పయనించడానికి కావలసిన అర్హతను సంపాదించి పెడతాయి.... దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్కడూ రాముడేననిపిస్తుంది.... దేవుడు పలు రూపాలు ధరిస్తే అందులో రాముడి రూపమే మనసుకు మరింత దగ్గరగా వుంటుంది.....🌷🌷🌷


🌷🌷🌷 .....శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలలో కొన్నింటి గురించి కొంతమందికి తెలియక పోవచ్చునేమో గానీ, రామావతారం గురించి తెలియని వారు వుండరు..... . అంతగా రాముడు అందరికీ దగ్గరయ్యాడు.... మది మదిలో మధురంగా మోగే మంత్రమయ్యాడు.... . అలాంటి రాముడి అనుగ్రహం కోసం పూర్వం 'రామకోటి' రాసేవారు..... ఇలా రాసినవి ఆయా దేవాలయాలోని రామకోటి స్తంభాల్లో నిక్షిప్తం చేసేవారు....జీవితమనే ప్రయాణంలో పెరిగిన వేగం వలన ఇప్పుడు రామకోటి రాసే వారి సంఖ్య తగ్గిందే గాని, పూర్తిగా కనుమరుగు కాలేదు....🌷🌷🌷


🌷🌷🌷....రామకోటి రాయడానికి ప్రతి రోజు ఒక సమయం పెట్టుకుని, తూర్పు దిశగా కూర్చుని రాయాలి....

ప్రతి రోజు రామకోటి రాసే ముందు మనసులోనే ఆయనకు నమస్కరించాలి.... అనుకున్నన్ని సార్లు రామకోటిని రాసి పూర్తి చేశాక, 'శ్రీ రామ శరణంమమ' అనే అష్టాక్షరీ మంత్రంతో ఉద్యాపన చెప్పుకోవాలి.... వీటితో పాటు రామకోటి రాయడానికి మరికొన్ని నియమాలున్నాయి అవేంటో తెలుసుకుందాం..... 🌷🌷🌷


🌷🌷🌷 ..... మీరుకోరుకున్న పనులు జరగాలంటే రామకోటి రాయండి?

రామకోటి రాయడానికి పూనుకోవడం ఓ మంచి కార్యం. అయితే రామకోటి రాయడానికి కొన్ని నియమాలు పాటించాలని పండితులు అంటున్నారు....🌷🌷🌷


💠అలాగే రామకోటిని గ్రీన్ ఇంక్‌లో రాయడం సత్ఫలితాలను ఇస్తుంది.

💠రామకోటి అంటే కోటి సార్లు కాకపోయినా వెయ్యి లేదా రెండు వేల సార్లు "శ్రీరామ జయం" అని రాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

💠పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.

💠రామకోటి రాయాలనుకునేటప్పుడు దేవుడి వద్ద మానసికంగా సంకల్పం చేసుకోండి. శ్రీరామ అని రాసే వీలున్న కోటి గళ్ళు ఉన్న పుస్తకం తెచ్చుకోండి. లేదా మీరే ఒక తెల్లకాగితాలతో పుస్తకం తయారుచేసుకోండి.

💠మంచి రోజు చూసుకుని పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో, శ్రీ రామ అష్టోత్తరశతనామావళితో పూజించండి. తరవాత పుస్తకం కళ్ళకద్దుకుని రాయడం ప్రారంభించండి.

💠రామకోటి రాసేటప్పుడు ఇతర వ్యాపకాలు, ఆలోచనలు పెట్టుకోకూడదు. మనస్సు స్థితిమితంగా శ్రీరామ అనుకుంటూ మనసును కేంద్రీకరించి రాయండి.

💠అనుకోకుండా మధ్యలో ఏదైనా పని మీద వెళ్ళవలసి వస్తే ఒక సరి సంఖ్యలో రాయడం ఆపి పుస్తకం మూసి నమస్కరించి వెళ్ళండి. పని అయిపోయిన తర్వాత కాళ్ళు , చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయడం మొదలుపెట్టండి.

💠రామకోటి రాసే పుస్తకం జాగ్రత్తగా భద్రపరచండి. అందులో ఇతర విషయాలు ఏవీ రాయకూడదు. దానికి ఉపయోగించేకలాన్ని కూడా విడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం.

💠రామకోటి రాయడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏదీ లేదు. కాని శుచి, శుభ్రత, పవిత్రత, ప్రశాంతత మాత్రం తప్పక పాటించాలి. ఒకవేళ ఎప్పుడైనా నిద్రవస్తుంది అనుకుంటే బలవంతంగారాయకుండా ఆపేయాలి.

💠ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజ, నివేదన చేసి ప్రసాదాన్ని పంచాలి. రామకోటి రాయడం పూర్తీ అయిన తర్వాత శక్తి అనుసారంగా పూజ, నివేదనలు సమర్పించి ఆరాధన చేయడం మంచిది.

💠పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామచంద్రుడికి సమర్పించాలి. లేదా ఏదైనారాముని గుడిలో సమర్పించండి. లేదంటే నదిలో వదలండి.

💠ఇలా రామకోటిని నిష్ఠతో రాస్తే మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.


ఏదైనా ఒక కార్యం పూర్తవ్వాలని సంకల్పించుకుని రామకోటి రాయడం ప్రారంభిస్తే అది తప్పక జరిగి తీరుతుందని పురోహితులు అంటున్నారు.

శుచిగా లేని సమయాల్లోను ... మైల సమయాల్లోనూ రామకోటి రాయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.... 🌷🌷🌷

లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటో తెలుసా



లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటో తెలుసా.💐


ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :

1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం


ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.


1. దక్షిణావర్త శంఖం.💐

ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖం అని అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకుని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.


లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే ... లక్ష్మీదేవి సముద్రంనుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరుకుతాయి. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే కావడం విశేషం. అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు.


దక్షిణావర్తి శంఖాలు మోగవు ... కానీ మోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. పగిలినది, విరిగినది, పల్చనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు.. పూజకు పనికిరావు. ఈ శంఖాలు వున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి, రామేశ్వరాలో దొరుకుతాయని ప్రసిద్ధి.


2. ముత్యాల శంఖం..💐

ముత్యపు కనతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు..

ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై

ధనదాన్య సంరుద్ధిం దేహిదేహి నమః

ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి.


3. ఏకాక్షి నారికేళం..💐

మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు వుంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి (ఒంటికన్ను) నారికేళానికి ఒకే కన్ను వుంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది .


💐శ్రీ మాత్రే నమః💐

శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల.. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల





శ్రీ దత్తాత్రేయ దేవాలయం...ఎత్తిపోతల.. అతి ప్రాచీన, కార్త్యవీర్యార్జున పునః ప్రతిష్టిత దత్తక్షేత్రం ఎత్తిపోతల ..బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని అతి గొప్ప విశేషమైన మహిమగల దత్తక్షేత్రమిది.

సహజసిద్ధ ఎత్తిపోతల జలపాతంతో పాటు దిగువ భాగంలో ఉన్ష్న వందల సంవత్సరాల నాటి దేవాలయం దత్తాత్రేయ దేవాలయం.

నాగార్జునాసాగర్ నుంచి 15 కి.మీ దూరం లొ మాచర్ల జిల్లా లో ఉంది.

ఎత్తిపోతల దత్తక్షేత్ర ప్రత్యేకత.💐
యతి – తపః – తలం (ఎత్తిపోతల) త్రివేణి సంగమ దత్తక్షేత్ర ప్రదేశం. ఇక్కడ (ఎత్తిపోతల) కృష్ణానది ఉప-ఉప నదులైన మూడు ఉప-ఉప (వంకలు) నదులు
చంద్రవంక,
అగ్నివంక మరియు
సూర్యవంక నదులు
ఒకదానికొకటి సంగమిస్తాయి. ఈ మూడు నదులు ఎత్తిపోతల జలపాతం వద్ద కలిసి ఒకటిగా ఏర్పడి ఆ మొత్తం ‘మధువంక’ గా మారి అది కృష్ణానదిలో కలవడం జరుగుతుంది.

అందువల్లనే ఎత్తిపోతల జలపాతం వద్ద సంగమేశ్వర దేవాలయాన్ని (ప్రస్తుతం జీర్ణ స్థితిలో కలదు) మనం చూడవచ్చు, మరియు ఈ మూడు వంకలు కలిసి పైనుండి క్రిందకు పడేచోట గల ప్రదేశం చూచుటకు గోవు యొక్క కర్ణం (ఆవుచెవి) మాదిరిగా ఉండడమూ మరియు మూడు వంకలు కలిసి ( చంద్రవంక, అగ్నివంక మరియు సూర్యవంక) ‘మధువంక’ గా దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి అయిన మధుమతీదేవి యొక్క నేత్రముల ఎదురుగా జరుగుతుండడం వల్ల ఈ క్షేత్రాన్ని ‘త్రివేణి మధు గోకర్ణ’ గా ఒకప్పుడు పిలిచేవారు.

ఇక్కడగల పరిసర ప్రదేశాల్లో మధుమతీ సమేత దత్తాత్రేయుని ఆవాసంవల్ల ఇక్కడ యతులు తపస్సు చేసుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఫలితంగా ‘త్రివేణి మధు గోకర్ణ’ కాస్తా ‘యతి – తపః – తలం’ గా తదుపరి ‘ఎత్తిపోతల’ గా మారింది.

ఎత్తిపోతల దత్తాత్రేయుడు స్వయంభూ దత్తాత్రేయుడు. కొండగుహలో ఉన్న స్వయంభూ దత్తాత్రేయమూర్తిని పునః ప్రతిష్టించాడు ‘హైహయ’ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు.

హైహయ వంశరాజైన కార్త్యవీర్యార్జునుడు ఈ క్షేత్రానికి దగ్గర లోగల మహీష్పతి నగరాన్ని(నేటి మాచర్ల) రాజధానిగా పరిపాలన సాగించేవాడు. అందువల్ల ఇక్కడే కార్త్యవీర్యార్జునుడు ముఖ్య పర్వదినములలో తప్పని సరిగా అనఘాస్టమీ వ్రతాలను ఆచరించేవాడు.

ఈ క్షేత్ర మహిమ తెలుసుకున్న. పరుశురాముడు (కార్త్యవీర్యార్జునుడి సంహరించినవాడు మరియు రేణుకామాత – జమదగ్నిల కుమారుడు) కార్త్యవీర్యార్జునుడి తదుపరి ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేసాడు.

ప్రపంచంలోని ఏకైక సింధూరలేపన దత్తాత్రేయుడు ఇక్కడ కనిపిస్తాడు, అలాగే ప్రపంచంలోని ఏకైక ‘నాగకిరిటాభారణ’ (నాగుపామును కిరిటంగా ధరించిన) దత్తాత్రేయుడు ఏకముఖ, చతుర్భుజుడుగా కనిపిస్తాడు. విష్ణురూప, అలంకారప్రియ, చిద్విలాస మరియు నామధారి (నామమును ధరించిన) దత్తాత్రేయుడు.

భక్తులు ఇక్కడి దత్తాత్రేయుడుని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు కార్త్యవీర్యార్జున విరచిత దత్తస్తోత్రాలను చదివితే మిక్కిలి ప్రీతి చెందుతాడట. అలాగే కష్టాలలో ఉన్నవారు వారి కస్టాలు తీరిన తరువాత ఇక్కడి ’ఝెండా ప్రాంగణం’ లో ఝెండాలను కడతారు.

మధుమతీ దేవి దత్తాత్రేయుని శక్తి స్వరూపిణి. మధుమతి అనగా ‘తేనెవంటి హృదయం’ గలది అని అర్ధం. మధుమతీ దేవి కుడా స్వయంభూ గానే ఉద్భవించారు.

దత్త శిల..💐
‘దత్త శిల’ ఎత్తిపోతల ప్రధాన ద్వారం నుండి దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళే మెట్ల మార్గంలో పెద్ద పుట్టకు సమీపంలో కుడివైపున ఉంటుంది. దత్తాత్రేయుడు ఈ రాయి మీద కుర్చుని విశ్రాంతి తీసుకునేవాడని అనేక మంది మహర్షులు చెప్పేవారు.

ఒక్కోసారి ఈ శిల మీదే దత్తాత్రేయుడు కల్లు త్రాగువాని వలె కుర్చుని కల్లు తాగుతూ కనిపిస్తాడట. నడి రాత్రిలో ఈ దత్త శిలకు శిరస్సును ఆనించి దత్తాత్రేయుడిని ధ్యానించి ఈ శిలకు దరిదాపుల్లోనే నిద్రిస్తే వారికి తప్పని సరిగా దత్తదర్శనం కలుగుతుంది. జై గురుదత్త.💐

💐శ్రీ మాత్రే నమః💐

Tuesday, February 20, 2018

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు



కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.

1. విద్యా ప్రాప్తికి:-

పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!

2. ఉద్యోగ ప్రాప్తికి :-

హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!

3. కార్య సాధనకు :-

అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!

4. గ్రహదోష నివారణకు :-

మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!

5. ఆరోగ్యమునకు :-

ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!

6. సంతాన ప్రాప్తికి :-

పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!

7. వ్యాపారాభివృద్ధికి :-

సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!

8. వివాహ ప్రాప్తికి :-

యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!

ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ,ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.

జై శ్రీరామ్
జై హనుమాన్

వీరాంజనేయ స్వామి –పొన్నూరు






వీరాంజనేయ స్వామి –పొన్నూరు

గుంటూరు జిల్లా పొన్నూరులో కూడా భారీ విగ్రహ రూపం లో శ్రీ వీరాంజనేయ స్వామి వెలుగొందుతున్నాడు.

స్వామి విగ్రహం 24అడుగుల ఎత్తు ,12అడుగుల వెడల్పు తో ఉంటాడు .

పొన్నూరు అంటే-పొన్ను అంటే బంగారం ఊరు అంటే గ్రామం కనుక బంగారు గ్రామం లేక స్వర్ణ పట్టణం అని అర్ధం.

వైశ్య స్వామి సద్గురు జగన్నాధ స్వామి గారు పూనుకొని చేయించిన కార్యక్రమం ఇది. ఆయన స్వయంగా గ్రామ గ్రామాలు తిరిగి శిష్యులకు జపదీక్ష నిచ్చి ,విగ్రహం తయారై బయల్దేరే సమయం లో అన్ని గ్రామాల భక్తులను ఆహ్వానించి యడ్లపాడు నుండి పొన్నూరు దేవాలయం చేరేవరకు ఏ విధమైన ఆటంకాలు కలుగ కుండా చూడమని తాము చేసిన జపఫలితాన్ని ధారాదత్తం చేసి అత్యంత క్రమశిక్షణతో దీక్షతో శోభాయాత్రలా నిర్వహించారు.

యడ్లపాడులో బయల్దేరినప్పుడు వెలిగించిన కర్పూరజ్యోతి పొన్నూరు ఆలయం చేరేవరకు అఖండంగా వెలిగెట్లు చూస్తూ, అత్యంత భక్తీ శ్రద్ధలతో స్వామిని అంగ రంగ వైభోగం గా తోడ్కొని తెచ్చి ప్రతిష్ట చేశారు. ఆ జ్యోతి నేటికీ అఖండం గానే వెలుగుతూనే ఉండటం ప్రత్యేకత. అందరి జప ఫలాలను ధార పోసి తెచ్చిన స్వామి అంటే గొప్ప మహిమాన్వితుడై విరాజిల్లుతున్నాడు .

విగ్రహ నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. అక్కడి నుండి పొన్నూరుకు చేర్చటానికి ఒక ఏదాది పట్టింది అంతటి అకుంఠిత దీక్షతో భక్తులు స్వామిని పొన్నూరుకు తెచ్చుకొన్నారు. అందుకే భక్తులపాలిటి ‘’కొంగు పొన్ను’’ అంటే బంగారం అయ్యాడు వీరాంజనేయస్వామి. భయంకరంగా కనిపిస్తాడు. ఎడమ చేతిలో భారీగదతో ,కుడి చేయి పైకెత్తి దర్శనమిచ్చే నల్ల రాతి భారీ ఆంజనేయస్వామి తోక శిరస్సుదాకా వెనక కనిపిస్తుంది. ఆభరణాలతో వెండినేత్రాలు నుదుట వెండి తిరునామం తో ఉంటాడు లంగోటి కట్టికనిపిస్తాడు .

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS