లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు ఏమిటో తెలుసా.💐
ఆస్తికుల నమ్మకం ప్రకారం లక్ష్మీదేవి ఎలాంటి వస్తువులలో నివాసం ఉంటుందంటే వారు చెప్పే సమాధానాలు ఇవి :
1. దక్షిణావర్త శంఖం
2. ముత్యాల శంఖం
3. ఏకాక్షి నారికేళం
ఈ వస్తువులను పూజామందిరంలో వుంచి భక్తిశ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
1. దక్షిణావర్త శంఖం.💐
ఈ శంఖం కడుపు ఊదేవారి కుడివైపుకు తెరచుకుని వుంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్త శంఖం అని అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకుని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.
లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే ... లక్ష్మీదేవి సముద్రంనుండి జన్మించింది. శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరుకుతాయి. మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖాలే కావడం విశేషం. అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు.
దక్షిణావర్తి శంఖాలు మోగవు ... కానీ మోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకుని పూజించాలి. పగిలినది, విరిగినది, పల్చనిపొర, గరుకైన ముక్కు, రంధ్రాలు.. పూజకు పనికిరావు. ఈ శంఖాలు వున్న ఇంటిలో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి, రామేశ్వరాలో దొరుకుతాయని ప్రసిద్ధి.
2. ముత్యాల శంఖం..💐
ముత్యపు కనతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే. ఈ శంఖాన్ని బుధవారం రోజు..
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనదాన్య సంరుద్ధిం దేహిదేహి నమః
ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి.
3. ఏకాక్షి నారికేళం..💐
మామూలు కొబ్బరికాయలకు రెండు కళ్ళు వుంటాయి. కానీ అరుదుగా దొరికే ఈ ఏకాక్షి (ఒంటికన్ను) నారికేళానికి ఒకే కన్ను వుంటుంది. ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఉంచి, ఎర్రని వస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి, ధనలాభం చేకూరుతుంది .
💐శ్రీ మాత్రే నమః💐
No comments:
Post a Comment