Monday, March 23, 2020

జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి .

జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి
.
ర్యాలి, తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలానికి చెందిన గ్రామము. 
ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉన్నది.ర్యాలి రాజమండ్రి కి 40 కి.మి., కాకినాడ కు 74 కి.మి., అమలాపురం కి 34 కి.మి. దూరం లో వసిష్ఠ, గౌతమి అనే గోదావరి ఉప పాయ ల మధ్య కలదు. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారి కి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం.
స్థల పురాణం



జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం, ర్యాలి
శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహిని ని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.
ఆలయ నిర్మాణం
11 వ శతాబ్దం లొ ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద ఫోన్న చెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యెక్క మేకు క్రింద పడిన ప్రదేశం లొని భూగర్భం లొ తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరం లొ ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.
మూలవిరాట్
5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. * స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు
ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.(విష్ణు పాద్బోవీం గంగా)
ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద మరియు అభయహస్తము హస్తరేఖలతో ఉన్నాడు.
విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.
వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది.ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీ కి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది మరియు అద్భుతమైనది.బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు మరియు వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.
శ్రీ మహావిష్ణువు తూర్పు వైపు ఉండగా ఆయనకు ఎదురుగా శ్రీ మహేశ్వరుడు పశ్చిమ ముఖమై ఉన్నాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలం చే పావనం చేయబడినందున ఇక్కడి శివలింగాన్ని ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని, గరుడుని, గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది.

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం

తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం                       తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాదులో ఉన్న దేవాలయం.ఇక్కడి ఆంజనేయస్వామి స్వయంభువుడని ప్రతీతి.       మొగలులు - రాజపుత్రులు - కుతుబ్ షాహీలుమొదలైనవారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
ఆలయ చరిత్ర




త్రేతాయుగంలో జాబాలి మహర్షి తపస్సుకు మెచ్చిన ఆంజనేయుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించినట్టు చెబుతారు. 19 శతాబ్దం తొలినాళ్లలో ఓ భక్తుడికి ఆంజనేయుడు కలలో కనిపించి తన జాడను తెలియజేయడంతో, అప్పుడా భక్తుడు ఈ ప్రాంతవాసుల సహాయసహకారాలతో, నూతన ఆలయంలో స్వామికి పునఃప్రతిష్ఠ జరిపాడు. ఆనాటి నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతూ వస్తున్నాయి.
పూజల వివరాలు
ప్రతి మంగళ - శని వారాల్లో అనేకమంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. ఇక్కడ హనుమజ్జయంతి, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి.

కదిలే శివలింగము ఉన్న దేవాలయం శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?దుగ్దేశ్వరనాథుడు

కదిలే శివలింగము  ఉన్న దేవాలయం




శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?
నిజమేనండి ఇక్కడి కోవెలలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు.
ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది.ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు అంటారు .మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.
మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.
ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది.
రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుంది.
అలా  ఒక గంటసేపు కదలచ్చు,లేదా ఐదు గంటలు కదలచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని  చెపుతుంటారు ఇక్కడి అర్చకులు.
అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా  ఒక్క అంగుళం కూడా కదలదట.
ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నదో  తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.
చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో !....
 దుగ్దేశ్వరస్వామినే నమః

Tuesday, March 17, 2020

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది

ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ??

1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు. కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

2.కనకధారా స్తోత్రం..!!

"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం..!!

ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.

4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి..

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

5.నవగ్రహ స్తోత్రం..

నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.

6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు.

విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.

7. గోపాల స్తోత్రం..!!

సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.

కార్య విజయం

*కార్య విజయం*

ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనులయందు ఆటంకం కలగకుండా ఉండాలంటే..

ఆదివారం.
ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు...
తమలపాకు నమలడం లేదా
ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే..
అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

సోమవారం.
సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. 
వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని 
ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

మంగళవారం.
హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం 
ఉదయం స్నానం చేసి, 
హనుమాన్ చాలీసా పఠించాలి. 
అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. 
బెల్లం కొద్దిగా తింటే మరీ మంచిది.

బుధవారం.
బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. 
ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ..
చాలా ప్రయోజనం ఉంటుంది.

గురువారం.
గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. 
వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

శుక్రవారం.
ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే 
పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. 
అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.

శనివారం.
అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. 
ప్రతి శనివారం కొద్దిగా అ్లలం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. 
ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి.

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రంఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు, కోర్టు సమస్యల పరిహారం కొరకు, సోదరులమధ్య మరియు ఆలుమగలు అన్యోన్యతకు

ఈ స్తోత్రం పఠించి.. ఫలితాలు పొందవచ్చు........!!
ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు,
కోర్టు సమస్యల పరిహారం కొరకు,
సోదరులమధ్య మరియు
ఆలుమగలు అన్యోన్యతకు,
మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు,
కుజ దశ జరుగుతున్నవారు,
శ్రీఘ్ర వివాహం కొరకు,
కుజ దోష పరిహారం,
సంతానం కోసం                           

"శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం"....

భక్తి శ్రద్దలతో 41రోజులు పారాయణ చేసి సుబ్రమణ్య స్వామికి కళ్యాణం జరిపించిన శుభ అనుకూల ఫలములను పొందగలరు

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |

ధ్యానం |
షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |
శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||
పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |
ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం || 

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |
అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |
సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా || 

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |
ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || 

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |
క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || 

షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |
బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || 

కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |
కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |
యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||

పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు మోసుకుంటూ వస్తాడో తెలుసా మీకు?

పెళ్లి లో కన్య ను గంప లో మేనమామ ఎందుకు మోసుకుంటూ వస్తాడో తెలుసా మీకు?

వెదురు బుట్ట తయారుచేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు. బుట్టలో కూర్చుని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది. 

గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటోంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతోంది. అవతలి వారి వద్ద భార్యా స్థానాన్ని పొందుతోంది. పత్నీ స్థానాన్ని పొందుతోంది. 
సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు. 
సహధర్మచారిణి. ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు. 
అసలు ఆయనకి అభ్యున్నతి లేదు. ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యం కాదు. ఆయన అభ్యున్నతి అంతా ఎవరిమీద ఆధారపడింది అంటే ఆమె మీదే ఆధారపడింది. ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. 
ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి. ఆమె లేనినాడు ఆయన ఏమీ చేసుకోలేడు. మరి లక్ష్మియే కదా జీవుడికి! 

 పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది. ఐశ్వర్యం అంతా ఆమెకి చెందుతుంది. 
అందుకే ఆయన వృద్ధి కూడా దేనిమీద ఆధారపడుతుంది అంటే భార్య మీద ఆధారపడుతుంది. 
ఆమెయే ఆతని లక్ష్మి. 
అందుకే లక్ష్మి ఉండే అయిదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపట ప్రారంభ స్థానం. 
అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి. 
అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. లక్ష్మీ స్థానం అది. 
ఆమె లక్ష్మియై నారాయణుడిని చేరుతోంది. లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది. 

ఆమె ‘నిత్యానపాయినీ’. 
ఆమె ఎన్నడూ విష్ణువును విడిచి పెట్టి ఉండదు. 
శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా 
చారజనంబు గాఁగ, విరజానది గౌతమిగా, వికుంఠము 
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో 
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
అని గోపరాజు గారు. 
 శ్రీమహా విష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది. 
ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీ దేవిగా వస్తుంది. ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది. ఎన్నడూ విడిచిపెట్టదు. 
అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది. 

ఆడపిల్ల – ఆడ అంటే తెలుగులో అక్కడ. 
అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది. 
ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది. 

ఇక్కడ లక్ష్మి పుట్టింది. 
అదృష్టం ఏమిటి? ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను. 
ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను. ఎవరికి? లక్ష్మి ఎప్పుడూ నారాయణునికే చెందుతుంది. 
అందుకే ఆమె లక్ష్మి గనుక పద్మంలో కూర్చోవాలి. 

కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం. 
ఎందుకు పద్మంలో కూర్చోవాలి? ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసిరావాలి. ఆయన వృద్ధిలోకి రావాలి. ఎన్నో యజ్ఞములు చేయాలి.

ఎంతో ధార్మికంగా సంపాదించాలి. 
ఆయనకి సంతానం కలగాలి. 
ఆయన సంతోష పడిపోవాలి. 
ఆయన తండ్రి కావాలి, తాత కావాలి, ముత్తాత కావాలి. 
ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ ఋణం తీరాలి. తండ్రి ఋణం తాను సంతానాన్ని పొందితే తీరుతుంది. 
ఆ సంతానం నానుండి రావాలి. ‘ధర్మ ప్రజాపత్యర్థం’ ఆయనకు నాయందున్న కామము ధర్మము చేత ముడిపడి నానుండి సంతానం కలగాలి. ఇన్ని లక్ష్ములకు ఆదిలక్ష్మిని నేనే. నడిచి వెళ్ళకూడదు వేదికమీదకి. లక్ష్మి అంటేనే ఐశ్వర్యం.
 లక్ష్మిగా ఆమె వేదికమీదకి వెళ్తోంది నారాయణ మూర్తిని పొందడానికి. పద్మంలో వెళ్ళాలి. 
అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం. 
ఈ ప్రేమ ఎవరిది? మా అక్కచెల్లెళ్ళది. మా అక్క చెల్లుళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమ పరవశంతో ఆమెను లక్ష్మిగా బుట్టలో పెట్టి తీసుకుని వెడతారు. 
తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చోబెడతారు. 
ఈమె నీ లక్ష్మి. 
ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కరలేదు. నారాయణుడి ప్రక్కన లక్ష్మియే. అందుకు ఒకపీట మీదకి మారిపోతారు ఇద్దరూ. 
మారేవరకు బుట్టలోనే కూర్చుంటుంది. 
బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌడ్యమైన విషయం కాదు. ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతోంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు.
 అన్ని విధాలా ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెని బుట్టలో కూర్చోబెట్టి మేనమామలు తీసుకు వెళ్తారు. 
మేనమామలు ప్రేమైక మూర్తులు. 
లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం. 
నా ఇంటికి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది. 

నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు. లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించి పోయేవాడు మగపిల్లవాడి తండ్రి.
 అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు. 
లక్ష్మీ దేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకుని చూసి. 
మీరు పదికాలాలు బ్రతకండి అని ఆయుః కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామలకి ఇస్తారు. 
మేనమామలే ఎందుకు తేవాలి? తెలుగునాట ఒక లక్షణం ఉంది. 
అక్క చెల్లెళ్ళకి ఆడపిల్ల పుడితే ఒరేయ్ నీకు భార్య పుట్టింది అంటారు. ఎన్నడూ నేను నా మేనకోడలిని ఆ దృష్టితో చూడలేదు. ఆమెను లక్ష్మిగానే చూశాను. నారాయణుడిని చేరుతుంది అనుకున్నాను. 
భర్తృ  భావనతో చూడలేదు.
 పవిత్రభావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణుడి దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు. 
అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం. 
అందుకే పెళ్ళి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక? నిజంగా వాళ్ళు ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమెని నడిపించి కానీ, ఇంకొకలా కానీ వెళ్ళకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి. 
అధవా ఎద్దులబండిలో తీసుకు వెళ్తారు. 
వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు. 

ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి జాతి మన జాతి🙏

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం

స్త్రీ మూర్తులకి ఇవి అవసరం

1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.

2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..

3.అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..

4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..

5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..

6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.

7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.

8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. 

9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..

10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..

11.కుటుంబ సభ్యులు దగ్గర  ఏది దాపరికం ఉండకూడదు..

12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .

13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికి న వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..

14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని  కొత్త వారి నుండి  మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. 

15 చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో  ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...

(సేకరణ)

ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ

*ఏ నక్షత్రానికి ఏ గణపతి స్వరూప ఆరాధన చెయ్యాలో వివరణ

1. అశ్విని  -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ  గణపతి .
4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .
7. పునర్వసు - లక్ష్మి గణపతి. 
8. పుష్యమి - మహ గణపతి. 
9. ఆశ్లేష - విజయ గణపతి. 
10. మఖ - నృత్య గణపతి. 
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి. 
12 ఉత్తర - ఏకాక్షర గణపతి. 
13. హస్త - వరద గణపతి .
14. చిత్త -  త్య్రక్షర గణపతి. 
15. స్వాతి - క్షిప్రసాద గణపతి. 
16. విశాఖ - హరిద్ర గణపతి. 
17.అనూరాధ - ఏకదంత గణపతి. 
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి. 
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి. 
21.  ఉత్తరాషాఢ - ధుండి గణపతి. 
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి. 
23. ధనిష్ట - త్రిముఖ గణపతి. 
24. శతభిషం - సింహ గణపతి. 
25. పూర్వాభాద్ర - యోగ గణపతి. 
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి. 
27. రేవతి - సంకట హర గణపతి.           

పై గణపతి ఆరాధన వలన మన పూర్వ జన్మ కర్మల నుండి బయట పడి భగవంతుని అనుగ్రహం పోందుతాము. 

అలాగే మన ఆత్మ ద్వాదశ జ్యోతిర్లింగాలు కు ముడి పడి వుంది.    పై గణపతులు మరియి నక్షత్రాలు యెక్క అనుబంధం అర్దం చేసుకో గలిగితే ద్వాదశ భావాలు యెక్క   రహస్యం అర్దం అవుతుంది.

పూలమ్మ గారు (చుండూరు కామేశ్వరమ్మ గారు


పూలమ్మ గారు
(చుండూరు కామేశ్వరమ్మ గారు)సాయి నాధుని శబ్దం తెలుగు వారు విననప్పుడే వీరు సాయి భక్తురాలు,గుంటూరు జిల్లా  నండూరు లో సాయి మందిరం 1965 లో కట్టించారు.వీరికి సాయి నాధుడు పిలిస్తే పలికెవారు వీరికి.అంతటి అదృష్టం.
వీరి చేతిలో తరచూ  గుప్పెడు నిండా గులాబీ పూలు వచ్చేవి.అందుకే పూలమ్మ గారు గా ప్రసిద్ధి.శివరామయ్య గారు,రుక్మిణి అమ్మ దంపతులకు 22,జనవరి,1915 సంవత్సరం లో రధ సప్తమి రోజు గుంటూరు జిల్లా లో ముని పల్లి గ్రామంలో జన్మించారు. శుక్రవారం రోజు పుట్టారు కాబట్టి లక్ష్మీ కామేశ్వరి అని పెట్టారు.వీరి 8 ఏట ఎవరో(సాయి నాధుడు) కనపడి బాబా పటం ఇచ్చి,రోజు అగరబత్తి పెట్టి అరిపోయేoతవరకు బాబా ని తదేకంగా చూస్తూ కూర్చో అని చెప్పారు.రోజు నియమంగా చేసేవారు.సాయి నాధుని భౌతికంగా దర్శించాలని 12 సంవత్సరాలు ఉపవాసం చేశారు.చివరికి షిరిడీ వెళ్లి నప్పుడు సాయి నాధుడే స్వయంగా జొన్న రొట్ట పెట్టి ఉపవాస దీక్ష విరమింపజేశారు.తెలుగులో మొదటిసారి సాయి సత్ చరిత్ర,సాయిసత్య వ్రతం రాసిన శ్రీ వేమూరి వెంకటేశ్వర్లు గారి పుస్తకాలను పూలమ్మ గారు ప్రింట్ చేయించారు.వీరిని తరచు రoగన్న బాబు గారు,జిల్లెలముడి అమ్మ, శ్రీ లక్ష్మీకాంత యోగేశ్వరులు దర్శించుకున్నారు. ఒకరోజు కాశీ నుంచి ప్రసాదం,గంగ నీరు రావటం తో తాను కాశీ దర్శించలేదని బాధ పడ్డారు.ఆరోజు సాయి పటం నుంచి 3 బిందెలో నీరు కారితే పట్టుకొని వారు స్నానం చేయటమే కాక,ఇది చూడడానికి వచ్చిన వారికి తీర్ధం గా ఇచ్చారు.29,జులై 1993 సంవత్సరం లో 5 రోజుల ముందుగా తెలిపి ఏకాదశి రోజు సాయి లో ఐక్యం అయ్యారు.ఓం శ్రీ సాయిరాం.

కంచికామక్షి

1) కంచికామక్షి తల్లిని దర్శించు కోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు. తల్లి సంకల్పమే ప్రధానం. ( ఇది గొప్పవిశేషం )

2) సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. (మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. (అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.)

3)  ప్రపంచంలో ఎక్కడా దర్శించ లేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు. (ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది.)

4) ప్రపంచంలో ఎక్కడా దర్శించ లేని విధంగా ఇక్కడ "ఢంకా వినాయకుడు" దర్శనమిస్తాడు.(ఏకాంబరేశ్వర, సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు )

5)  కామాక్షి తల్లి ఆలయంలో "అరూపలక్ష్మి" దేవి దర్శన మిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూపలక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే, భర్తను నిందించిన దోషం పొతుంది. మరియు స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూపలక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.

6) కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా, శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకత లింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో (కౌగిలితో) కాపాడుకుంటుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మగాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై అగుపిస్తాయి.

7) కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మిన వారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి )
అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ  సతాం" అనే దివ్యవాక్కు గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది. తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.

కావున భక్తులెల్లరు కామాక్షి తల్లిని దర్శించి పునీతులు కాగలరని మనవి..స్వస్తి..

*బొట్టు పెట్టుకోకపోతే* *ఏమవుతుందో* *తెలుసుకోండి*బొట్టు ప్రాముఖ్యత..

బొట్టు ప్రాముఖ్యత..

*బొట్టు పెట్టుకోకపోతే*
*ఏమవుతుందో*
*తెలుసుకోండి*.

🌺మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది.

బొట్టులేని ముఖము,
ముగ్గులేని ఇల్లు అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో 
వారి యొక్క ముఖము,
ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా స్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత
 ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,
దరిద్రదేవత తాండవం చేస్తాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

🌺ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే.కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు.

అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.
వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు.

కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.

🌺మన ముఖములో ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు.

నరుడు కంటే చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు, అలాగే ఎదురుగా ఉండేటటువంటివారు
 మన ముఖాన్ని చుస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది.
మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి.

🌺ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.

ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన 
ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.
అంటే మెదడుకు సంభందించినటు
వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.

🌺కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది.
మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది.
తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.
మనఃశాంతి పోతుంది.
చిరాకు వస్తుంది.
ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము.
కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే
 మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే మెదడును కాపాడుకోవాలంటే 
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు 
మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.
తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది.

🌺జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.
ఎటువంటి ఒత్తిడికి 
లోనూ కావు.
మనల్ని కాపాడుతూ ఉంటాయి.
మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.
అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.

🌺సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.

అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.

ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని
 బొట్టుగా ధరించండి.
ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ 
కూడా తొలగిపోతాయి.

అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి.

ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి.

🌺పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులే కాకుండా మగవారే కాకుండా వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.

ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. 

ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.
ఎటువంటి తప్పూ లేదు.
అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి.

🌺మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన  ఆచారాలే.
ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే 
హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము
దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. పాపటిలో సింధూరం ఆడవాళ్లకు మరింత గౌరవాన్ని కలిగిస్తుంది.. భర్తకు క్షేమం కూడా అంటారు.

ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.
అందుకని చక్కగా కుంకుమను ధరించండి.

🙏🏻శ్రీ మాత్రే నమః🙏🏻ధేరం ఫణి కుమార్ శర్మ పురోహితులు.

కర్పూర హారతి శాస్త్రీయత....

కర్పూర హారతి ...సాంప్రదాయం.


కర్పూర హారతి శాస్త్రీయత....

దేవుని పూజలో ధూపదీపాల్లాగే, కర్పూరంతో ఇచ్చే మంగళ హారతికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ధూపం వల్ల ఏయే ప్రయోజనాలు ఉన్నాయో హారతివల్ల కూడా ఆయా ప్రయోజనాలు నెరవేరుతాయి.
సాధారణంగా దేవునికి కర్పూరంతో హారతి ఇస్తారు. ఇలా కర్పూరంతో హారతి ఇవ్వడమే మంచిది, శ్రేష్టం. కానీ, కొన్ని సందర్భాల్లో నేతిలో నానబెట్టిన దూది వత్తులతో కూడా హారతి ఇస్తారు.
అత్తర్లకు మల్లే కర్పూరం ఏవో రసాయన పదార్ధాలతో కృత్రిమంగా తయారయింది అనుకుంటారు చాలామంది. కానీ, కర్పూరం చెట్టు నుండి ఉత్పత్తి అవుతుంది అంటే కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది.
కర్పూర చెట్ల కాండానికి గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారౌతుంది. కర్పూర వృక్షాలు మన దేశంలో చాలా తక్కువ. జపాన్, చైనా దేశాల్లో ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.
కర్పూరం సూక్ష్మ క్రిములను నిర్మూలిస్తుంది. కాలుష్యాన్ని పోగొట్టి, వాతావరణాన్ని స్వచ్చంగా మారుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది. కళ్ళకు మంచిది. జలుబును, కఫాన్ని తగ్గిస్తుంది. అంకుకే ఒక శుభ్రమైన వస్త్రంలో కొన్ని బియ్యపుగింజలు, కొద్దిగా కర్పూరం వేసి దాన్ని చిన్న ముడిలా చుట్టి ఆ వాసన పీలుస్తారు. ఇలా చేయడంవల్ల జలుబు తగ్గుతుంది, పూడుకుపోయిన ముక్కు యధాస్థితికి వస్తుంది.
కర్పూరం అతి దాహం, ముఖ శోష లాంటి అనారోగ్యాలను నివారిస్తుంది. మంటలు, దురదలు లాంటి చర్మ వ్యాధులకు బాగా పనిచేస్తుంది. వాత, పిత్తాలను హరిస్తుంది. మానసిక జబ్బులను సైతం పోగొడుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త ప్రసరణ సవ్యంగా ఉండేలా చేస్తుంది. గొంతు పూడుకుపోవడం, స్వరపేటికలో ఉండే దోషాలను నివారిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే, కర్పూరం వల్ల అసంఖ్యాకమైన ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే చాలు శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
దేవాలయం లాంటి పవిత్ర ప్రదేశంలో కూడా స్త్రీపురుషుల మధ్య ఆకర్షణ కలిగే అవకాశం ఉంది. మనసు చంచలమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి కామం, కోరికలు కలక్కుండా కర్పూరం ఒక చక్కటి ఆధ్యాత్మికవాతావరణాన్ని సృష్టిస్తుంది కర్పూరం. అలజడులు, ఆందోళనలు తగ్గించి ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తుంది కర్పూరం.
కర్పూరంలో అనేక రకాలు ఉన్నాయి. హిమ కర్పూరం, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం, పచ్చ కర్పూరం మొదలైనవి ముఖ్యమైనవి.
ఇన్ని ఔషధ గుణాలు కలది, అద్భుతమైంది కనుకనే కర్పూరంతో మంగళ హారతి ఇస్తారు....

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS