Monday, March 23, 2020

కదిలే శివలింగము ఉన్న దేవాలయం శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?దుగ్దేశ్వరనాథుడు

కదిలే శివలింగము  ఉన్న దేవాలయం




శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?
నిజమేనండి ఇక్కడి కోవెలలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు.
ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది.ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు అంటారు .మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.
మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.
ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది.
రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుంది.
అలా  ఒక గంటసేపు కదలచ్చు,లేదా ఐదు గంటలు కదలచ్చు. అయితే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని  చెపుతుంటారు ఇక్కడి అర్చకులు.
అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా  ఒక్క అంగుళం కూడా కదలదట.
ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నదో  తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.
చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో !....
 దుగ్దేశ్వరస్వామినే నమః

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS