Saturday, May 5, 2018

శక్తిపీఠం అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి.


శక్తిపీఠం అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి.

పురాణ కథ..
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు,

ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.
ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.                                        .                                                                                                                                                                                                                                                                                                        
సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి  విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.
ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.
ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:
18 శక్తిపీఠాలు..
అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం.
లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
1. శాంకరి - శ్రీలంక
ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో  ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో  పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.
2. కామాక్షి - కాంచీపురం.
తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శృంఖల ప్రద్యుమ్ననగరం.
పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
4. చాముండి - క్రౌంచ పట్టణం.
మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
5. జోగుళాంబ-అలంపూర్.
తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.
6. భ్రమరాంబిక - శ్రీశైలం.
ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో  కూడా  ఒకటి.
7. మహాలక్ష్మి - కొల్హాపూర్..
మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం  మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
8. ఏకవీరిక - మాహుర్యం..
లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు.  షిరిడీ నుండి ఈ మాతనుదర్శించుకొనవచ్చును.
9. మహాకాళి - ఉజ్జయిని..
మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
10. పురుహూతిక - పీఠిక్య..
లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
11. గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..
జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.
12. మాణిక్యాంబ - దక్షవాటిక..
లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో.
13. కామరూప-హరిక్షేత్రం..
అసోం, గౌహతి  నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
14. మాధవేశ్వరి -ప్రయాగ..
(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్,  త్రివేణీ సంగమం సమీపం -
ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.
15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం..
కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ -
ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
16. మంగళ గౌరి - గయ.
బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
17. విశాలాక్షి - వారణాసి..ఉత్తర ప్రదేశ్.
18. సరస్వతి - జమ్ముకాష్మీరు.
అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.
51 శక్తి పీఠాలు..
1- సంఖ్య-స్థలము
2- శరీరభాగము / ఆభరణము
3- శక్తిరూపము
4- శివరూపము
1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్
బ్రహ్మరంథ్రము (శిరోభాగము)
కొత్తారి
భీమలోచనుడు
2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్
కన్నులు
మహిషమర్దిని
క్రోధీశుడు
3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున
ముక్కు
సునంద
త్ర్యంబకేశ్వరుడు
4. అమరనాధ్  శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్
గొంతు
మహామాయ
-త్రిసంధ్యేశ్వరుడు
5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద
నాలుక
సిద్ధిద (అంబిక)
ఉత్తమ భైరవుడు
6. జలంధర్ (దేవీ తాలాబ్)
ఎడమ స్తనము
త్రిపురమాలిని
భీషణుడు
7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్
గుండె
జయదుర్గ
వైద్యనాథుడు
8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్
మోకాళ్ళు
మహాశిర
కపాలి
9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల
కుడి చేయి
దాక్షాయిని
అమరుడు
10.  బిరాజా, ఒడిషా
నాభి
విమల
జగన్నాథుడు
11.  ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్
నుదురు
గండకీ చండి
చక్రపాణి
12.  బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్
ఎడమ చేయి
బహుళా మాత
భిరుకుడు
13.  ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్ 
కుడి మణికట్టు
మంగళ చండిక
కపిలాంబరుడు
14.  ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం
కుడి కాలు
త్రిపురసుందరి
త్రిపురేశుడు
15.  ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్
కుడి చేయి
భవాని
చంద్రశేఖరుడు
16.  త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్
ఎడమ కాలు
భ్రామరి
అంబరుడు
17.  కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం
యోని
కామాఖ్య
ఉమానందుడు
18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్
కుడి పాదము
జుగాద్య
క్షీర ఖండకుడు
19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా
కుడి బొటనవేలు
కాళిక
నకులీషుడు
20.  ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్
కుడి వేళ్ళు
లలిత
భవుడు
21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్
ఎడమ తొడ
జయంతి
క్రమదీశ్వరుడు
22.  కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కిరీటము
విమల
సంవర్తుడు

23.  వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్
చెవిపోగు
విశాలాక్షి, మణికర్ణి
కాలభైరవుడు
24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు
వీపు
శర్వాణి
నిమీశుడు
25.  కురుక్షేత్రం, హర్యానా
మడమ ఎముక
సావిత్రి
స్థాణువు
26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్
రెండు చేతి కడియాలు
గాయత్రి
సర్వానందుడు
27.  శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్
మెడ
మహాలక్ష్మి
సంబరానందుడు
28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్
ఎముక
దేవగర్భ
రురుడు
29.  కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్
ఎడమ పిరుదు
కాళి
అసితాంగుడు
30.  షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్
కుడి పిరుదు
నర్మద
భద్రసేనుడు
31.  రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్
కుడి స్తనం
శివాణి
చందుడు
32.  వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్
కేశాభరణం
ఉమ
భూతేశ్
33.  శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు
పై దవడ పండ్లు
నారాయణి
సంహరుడు
34.  పంచసాగరం (స్థలం తెలియదు)
క్రింది దవడ పండ్లు
వారాహి
మహారుద్రుడు
35.  కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్
ఎడమకాలి పట్టీ
అర్పణ
వమనుడు
36.  శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)
కుడికాలి పట్టీ
శ్రీ సుందరి
సుందరానందుడు
37.  విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్
ఎడమ కాలి మణికట్టు
కపాలిని (భీమరూప)
సర్వానందుడు
38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్
ఉదరం
చంద్రభాగ
వక్రతుండుడు
39.  భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్
పై పెదవి పైభాగం
అవంతి
లంబ కర్ణుడు
40.  జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర
చుబుకం
భ్రామరి
వికృతాక్షుడు
41.  సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్
బుగ్గలు
రాకిణి / విశ్వేశ్వరి
వత్సనాభుడు / దండపాణి
42. బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్
ఎడమ కాలి వేళ్ళు
అంబిక
అమృతేశ్వరుడు
43.  రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్
కుడి భుజం
కుమారి
శివుడు
44.  మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో
ఎడమ భుజం
ఉమ
మహోదరుడు
45.  నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కాలి పిక్క ఎముకలు
కాళికా దేవి
యోగేశుడు
46.  కర్ణాట్ (స్థలం తెలియదు)
చెవులు
జయదుర్గ
అభీరుడు
47. వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కనుబొమల మధ్య భాగము
మహిష మర్దిని
వక్రనాథుడు
48.  జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్
చేతులు, కాళ్ళు
యశోరేశ్వరి
చందుడు
49.  అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
పెదవులు
ఫుల్లార
విశ్వేశుడు
50.  నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
మెడలో హారం
నందిని
నందికేశ్వరుడు
51. శ్రీలంక (ట్రింకోమలి లో, హిందూమహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ)
కాలి పట్టీలు
ఇంద్రాక్షి
రాక్షసేశ్వరుడు

రావి చెట్టును పూజించుట వలన కలుగు.. ఫలితములు.

రావి చెట్టును పూజించుట వలన కలుగు..
ఫలితములు.
అశ్వత్ధ వృక్షంలో సర్వదేవతలూ ఉంటారు. దాని మహాత్మ్యం గురించి బ్రహ్మాండపురాణము లో నారదుడు వివరించెను. అశ్వత్ధమే నారాయణస్వరూపము. ఆ వృక్షం యొక్క:
మూలము – బ్రహ్మ
దాని మధ్య భాగమే – విష్ణువు
దాని చివరి భాగము – శివుడు
కనుక దానిని పూజిస్తే త్రిమూర్తులను పూజించి నట్లే.
ఈ త్రిమూర్తులు దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిక్కులలోని కొమ్మలలో ఉంటారు. తూర్పు దిక్కునగల కొమ్మలలో ఇంద్రాదిదేవతలు, సప్తసముద్రాలు, అన్ని పుణ్యనదులు ఉంటాయి.
దాని వేర్లలో మహర్షులు, గోబ్రాహ్మలు, నాలుగువేదాలు ఉంటాయి. అశ్వత్ధ వృక్షాన్ని ఆశ్రయించి అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిపతులు, దిక్పాలకులు ఎల్లప్పుడు ఉంటారు.
అశ్వత్ధ వృక్షం మూలములో ‘అ’ కారము, మానులో ‘ఉ ‘ కారము, అదిఇచ్చే పళ్ళలో ‘మ’ కరము, వెరసి ఆ వృక్షమంతా ప్రణవస్వరూపమే .అశ్వత్ధ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షము.
ప్రదక్షణ మరియు పూజించు విధానము..
ముందుగా అశ్వత్ధ వృక్షాన్ని దర్శించి దానిని చేతితో తాకి( శనివారం మాత్రమే తాకాలి) ఈ క్రింది అశ్వత్ధ వృక్ష స్తోత్రమును పఠించాలి..
అశ్వత్ధవృక్ష స్తోత్రం..
మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతో విష్ణురూపిణే
అగ్రత శ్శివరూపాయ
వృక్షరాజయతే నమః
అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ చైత్ర, ఆషాడ, పుష్య మాసాలలో చేయరాదు. గురు,శుక్ర మౌడ్యాలలో చేయరాదు. కృష్ణపక్షంలో అశ్వత్ధ వృక్ష ప్రదక్షిణ ప్రారంబించరాదు. ఆది,సోమ,శుక్రవారాలలో, గ్రహణ మరియు సంక్రమణ సమయాల్లో, నిషిద్ధ సమయాల్లో, రాత్రి భోజనముచేసి యీ వృక్షాన్ని సేవించరాదు.
మౌనంగా లేదా గురునామము లేదా విష్ణుసహస్ర నామమును చదువుతూ నెమ్మదిగా ప్రదక్షణలు చేయాలి. ప్రతి ప్రదక్షణానికి ముందు అలాగే చివర అశ్వత్ధ వృక్షానికి నమస్కారించాలి.
అశ్వత్ధ వృక్ష పూజా ఫలము..
అశ్వత్ధ వృక్షానికి రెండులక్షల ప్రదక్షణాలు చేస్తే సర్వపాపాలూ నశించి నాలుగుపురుషార్ధాలు సిద్ధిస్తాయి.
బిడ్డలు కలగాలన్న సంకల్పముతో ప్రదక్షణలు చేస్తే తప్పక కలుగుతారు.
శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితో తాకి మహామృత్యుంజయ మంత్రమును జపిస్తే మృత్యుభయం పోతుంది. అలాగే శనివారంనాడు అశ్వత్ధ వృక్షాన్ని చేతితోతాకి ఈ క్రింది శనైశ్చర స్తోత్రమును పఠించిన శనిదోషం తొలగిపోతుంది.
అశ్వత్ధ వృక్షం క్రింద చెప్పవలసిన శనైశ్చర స్తోత్రం..
కోణస్థ: పింగళో బభ్రు: కృష్ణో రౌద్రాంతకోయమః
శౌరీ శ్శనైశ్చరో మందః పిప్పిల దేవ సంస్తుతః
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షం క్రింద వేదవిప్రునికి భోజనము పెడితే కోటిమంది బ్రాహ్మణులకు సమారాధన చేసిన ఫలితముంటుంది.
గురువారం, అమావాస్య కలసి వచ్చినరోజున అశ్వత్ధ వృక్షనీడలో స్నానమాచరించిన మహాపాపములు తొలగును.
అశ్వత్ధ వృక్షం క్రింద చదివిన గాయత్రి మంత్రజపం నాలుగు వేదాలు చదివిన ఫలితాన్ని ఇస్తుంది. అశ్వత్ధ వృక్షాన్ని స్థాపిస్తే నలభైరెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

మామిడాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.. ఎందుకని.?

మామిడాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.. ఎందుకని.?
ప్రేమకు,
సంపదకు,
సంతానాభివృద్ధికి
ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు
రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది.
మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే.
పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది.
మామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు.
క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది..
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

తెలుసుకోదగ్గ విషయాలు..

తెలుసుకోదగ్గ విషయాలు..
1. చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట, ఒట్టు పెట్టుట దోషం.
2. నిలబడికాని, అటూఇటూ తిరుగుతూ కాని అన్నం తినటం వల్ల క్రమంగా దరిద్రుడౌతాడు. రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు.
3. నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళుకొరుకుట చేయరాదు.
4. దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
5. ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసిఆకులు కోయరాదు.
6. చీకటి పడ్డాక పువ్వులు, ఆకులు చెట్లనుండి త్రుంచరాదు.
7. గురువుద్వారా మంత్రోపదేశం పొందనివాడు ఎప్పటికీ తరించలేడు. కనుక ఉపదేశం పొందితీరాలి.
8. చెట్లు, దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు, తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగులుగా పుడతారు. ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు.
9. గురువులకు, అర్చకులకు, పౌరాణికులకు సరిగా పారితోషంఇవ్వక, వారికి ఋణపడేవారు నూరుజన్మలు కుక్కలుగా, చండాలురుగా పుట్టి కష్టనష్టాల పాలవుతారు.
10. శివలింగార్చన ఆడువారు కూడా చేయవచ్చు.
11. ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు. పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు. తక్కిన వారికి పూజా విషయాలలో పెద్ద పెద్ద నియమాలు లేవు.
12. నిద్రనుండి లేవగానే ముందుగా అరచేతులను దర్శించి వామన నామస్మరణ చేయాలి.
13. పాచి ముఖంతో అద్దం చూసుకొనరాదు.
14. హారతి ఇచ్చాక దేవునిపై నీరు చల్లాలి. హారతి ఇచ్చే పాత్రపై కాదు.
15. తీర్థం తీసుకున్నాక, ఆ చేతిని కడుక్కోవాలి తప్ప, అరచేతిని తలపై రాసుకొనరాదు.
16. స్నానం చేశాక శరీరం తుడుచుకొని తడి-పొడి తువ్వాలు కట్టుకొని పూజ చేయరాదు. పూజా మందిరంలో ప్రవేశించరాదు. పూర్తిగా ఆ తుండును తడిపి నీరు పిండి మాత్రమే కట్టుకోవాలి. లేదా వేరే శుభ్రమైన వస్త్రాలు పూజకు ధరించాలి.
17. ఉపవాసం ఉన్నపుడు, జాగరణ చేసినపుడు పరులదోషాలు తలుచుకోరాదు.
18. శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు. కొంచెం దూరం ఉంచాలి.
19. తల వెంట్రుకలతో కూడిన అన్నం పండితులకు, గురువులకు పెట్టరాదు. సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి. పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసివేసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి.
20. అన్నం తింటున్న వారెవరినీ తిట్టరాదు, దెప్పి పొడవరాదు.
21. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అభాండాలు వేయరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అభాండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి.
22. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వనివాడు వందజన్మలు దరిద్రుడై పుడతాడు, వాగ్బంగం చాలా దోషం.
23. అన్నం తినేటప్పుడు కంచానికి బాగా దగ్గరగా కూరలు, మజ్జిగ మున్నగునవి ఉన్నపాత్రలు పెట్టరాదు. మనం తినేటప్పుడు ఎంగిలి ఆ పాత్రలలో పడితే ఆ పదార్థాన్ని మరొకరికి వడ్డిస్తే, వాడికి "యముడు" మల ముత్రాదులు ఆహారంగా ఇస్తాడు.
24. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు.
25. గురువునకు ఉపదేశ సమయాలలో కాని, పురాణాదులు వినేటప్పుడు కాని పాదాలు ఒత్తితే 7 జన్మల పాపాలు తొలుగుతాయి.
26. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి.
27. మంత్రోపదేశం చేసిన గురుని ఆజ్ఞ పాటించేవారికి ఏ పాపమూ అంటదు. పునర్జన్మ ఉండదు. (ఇది తప్పక పాటించవలసిన ముఖ్య పవిత్ర నియమము. దీనికి సాటి మరొకటి లేదు). పరాశర సంహితలో ఈ విషయాలున్నాయి.
28. అష్టమి, పూర్ణిమ, చతుర్థశి కాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు.
29. ఎక్కువ వేడిగా, ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు.
30. భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు.
31. శవాన్ని స్మశానం దాకా మోసినా, శవాన్ని ఇంటి దగ్గర ఉండటానికి అనుమతినిచ్చినా నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.
32. గృహప్రవేశ కాలంలో గాని, ఏడాదిలోపు గాని ఆ ఇంట మణిద్వీప పరాయణం చేయడం మంచిది. ఇది వాస్తుదోషాలను పరిహరిస్తుంది.
33. భోజనానికి ముందు, అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి.
34. సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు.
35. పుట్టిన రోజునాడు దీపాలు కానీ, కొవ్వొత్తులు కానీ ఆర్పరాదు. నోటితో అగ్నిని ఊదుట ఘోరపాపం. అటువంటివారు గ్రహణపు మొర్రితో మళ్ళీ జన్మమెత్తి దుఃఖాలు పొందుతారు.
36. తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనెజిడ్డు పులమరాదు.
37. శుక్ర, శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్నవారు హోటలు టిఫిన్లు తినుటగానీ, ఆనాటి అల్పహారాదులలో ఉల్లి వాడుట కాని నిషేదము. ఇది ప్రయాణ మధ్యంలో ఉన్న వారికి వర్తించదు.
38. చీటికి, మాటికి యజ్ఞోపవీతం తీసి పక్కనపెట్టడం, తాళి తీసేస్తుండటం రెండూ భయంకర దోషాలే.
39. క్రూరుడు, దుష్టుడు కాని మగనితో తాళికట్టించుకొన్న భార్య, కాపురం చేయక ఏడిపించటం, చెప్పిన మాట వినకపోవటం, తాళి తీసి భర్త చేతిలో పెట్టడం చేయరాదు. ఇలా చేసిన స్త్రీలకి వంద జన్మలలో వైధవ్యం కానీ, అసలు పెళ్లి కాకపోవడం జరుగుతుంది.
40. దీపాలు పెట్టేవేళ తలదువ్వుకోరాదు. ఇలా చేసిన స్త్రీలకి వందల జన్మలలో వైధవ్యం కాని, అసలు పెళ్లి జరగకపోవడం వంటివి జరుగుతాయి.
41. దిగంబరంగా నిద్రపోరాదు.
42. కలియుగంలో ఆలయంలో జంతువధ నిషేధం.
43. విజయదశమి, శివరాత్రి దినాలలో మాంసాహారం, ఉల్లి పనికిరాదు.
44. ఆచమనం చేసిన నీటిని దైవనివేదనలకు, అర్చనలకు వాడరాదు, కనుక వేరొక పాత్రలో శుద్ధ జలాన్ని ఈ కార్యాలకు వినియోగించుకోడానికి తెచ్చుకోవాలి.
45. దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు.
46. దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినపుడు మూడు వత్తులు వేయాలి.
47. కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోతే దోషం లేదు.
48. కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు, కొబ్బరికాయను పీచు ఒలిచివేశాక నీళ్ళతో కడగరాదు.
49. మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు వచ్చే నేయి ఇటువంటివి నైవేద్యానికి పనికిరావు.
50. ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే బయటకు పిలిచి మందలించాలి లేదా మరింత దుష్టుడైన అర్చకునినైతే మూడు మాసాల జీతమిచ్చి ఆ పదవినుంచి తొలగించి వేయాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                       శ్రీ మాత్రే నమః

సాయి చాలీసా చదవండి షిరిడీవాస సాయిప్రభో జగతికి మూలం నీవే ప్రభో....!!

సాయి చాలీసా చదవండి
షిరిడీవాస సాయిప్రభో
              జగతికి  మూలం నీవే ప్రభో....!!
దత్తదిగంబర అవతారం
                నీలో సృష్టి వ్యవహారం.....!!
త్రిమూర్తి రూపా ఓ సాయీ
               కరుణించి కాపాడోయి.......!!
దర్శన మియ్యగరావయ్యా
         ముక్తికి మార్గం చూపుమయా.....!! 
కఫిని వస్త్రము ధరియించీ
భుజమునకు జోలీ తగిలించి.....!!
నింబ వృక్షము ఛాయలలో
               ఫకీరు వేషపుధారణలో.......!!
కలియుగమందున వెలసితివి
              త్యాగం సహనం నేర్పితివి.....!!
షిరిడీ గ్రామం నీ నివాసం
              భక్తుల మదిలో నీ రూపం....!!
చాంద్ పాటిల్ ను కలుసుకుని
             అతని బాధలు తెలుసుకొని.....!!
గుఱ్ఱము జాడ తెలిపితివి
              పాటిల్ బాధను తీర్చితివి.....!!
వెలిగించావు జ్యోతులను
                 నీవుపయోగించీ జలము.....!!
అచ్చెరువొందెను ఆ గ్రామం
                   చూసి వింతైన ఆ దృశ్యం.....!!
బాయిజా చేసెను నీ సేవ
                 ప్రతిఫలమిచ్చావో దేవా.....!!
నీ ఆయువును బదులిచ్చి
                తాత్యాను నీవు బ్రతికించి......!!
పశుపక్షులను ప్రేమించి
                ప్రేమతో వాటిని లాలించి....!!
జీవులపైన మమకారం
               చిత్రమయా నీ వ్యవహారం.....!!
నీ ద్వారములో నిలిచితిని
              నిన్నే నిత్యము కొలిచితిని.....!!
అభయము నిచ్చి బ్రోవుమయా
                 ఓ షిరిడీశా దయామయా.....!!
ధన్యము ద్వారక ఓ మాయీ
                నీలో నిలిచెను శ్రీసాయి.....!!
నీ ధుని మంటల వేడిమికి
              పాపము పోవును తాకిడికి......!!
ప్రళయ కాలము ఆపితివి
              భక్తులను నీవు బ్రోచితివి.....!!
చేసి మహామ్మారీ నాశం
             కాపాడి షిరిడి గ్రామం....!!
అగ్నిహోత్రి శాస్త్రికి
            లీలా మహాత్మ్యం చూపించి.....!!
శ్యామాను బ్రతికించితివి
              పాము విషము తొలగించి.....!!
భక్త భీమాజీకి క్షయరోగం
           నశియించే అతని సహనం.....!!
ఊదీ వైద్యం చేసావు
           వ్యాధిని మాయం చేసావు.....!!
కాకాజీకి ఓ సాయి
         విఠల దర్శన మిచ్చితివి.....!!
దామూకిచ్చి సంతానం
              కలిగించితివి సంతోషం.....!!
కరుణాసింధూ కరుణించు
              మాపై కరుణా కురిపించు......!!
సర్వం నీకే అర్పితము
             పెంచుము భక్తి భావమును.....!!
ముస్లిమనుకొని నిను మేఘా
             తెలుసుకుని అతని బాధ.....!!
దాల్చి శివశంకర రూపం
           ఇచ్చావయ్యా దర్శనము.....!!
డాక్టరుకు నీవు రామునిగా
              బల్వంతుకు శ్రీదత్తునిగా.....!!
నిమోనుకరకు మారుతిగా
                   చిదంబరకు శ్రీగణపతిగా.....!!
మార్తాండకు ఖండోబాగా
                   గణూకు సత్యదేవునిగా......!!
నరసింహస్వామిగా జోషికి
              దర్శనము మిచ్చిన శ్రీసాయి.....!!
రేయి పగలు నీ ధ్యానం
                  నిత్యం నీ లీలా పఠనం....!!
భక్తితో చేయండి ధ్యానం
                  లభించును ముక్తికి మార్గం....!!
పదకొండు నీ వచనాలు 
                       బాబా మాకివి వేదాలు...!!
శరణణి వచ్చిన భక్తులను
                    కరుణించి నీవు బ్రోచితివి...!!
అందరిలోన నీ రూపం
              నీ మహిమా అతిశక్తిమయం...!!
ఓ సాయి మేముమూఢులమూ  
           ఒసగుమయా నీవు జ్ఞానమును..!!
సృష్టికి నీవేనయ మూలం......!!
                   సాయి మేము సేవకులం.....!!
సాయి నామము తలచెదము
          నిత్యము సాయిని కొలిచెదము....!!
భక్తి భావన తెలుసుకొని
         సాయిని మదిలో నిలుపుకొని......!!
చిత్తముతో సాయీ ధ్యానం
                  చేయండీ ప్రతినిత్యం.....!!
బాబా కాల్చిన ధుని ఊది
                 నివారించును అది వ్యాధి.....!!
సమాధి నుండి శ్రీసాయి
                  భక్తులను కాపాడేనోయి.....!!
మన ప్రశ్నలకు జవాబులు
          తెలుపును సాయి చరితములు...!!
వినండి లేక చదవండి
            సాయి సత్యము చూడండి.....!!
సత్సంగమును చేయండి
            సాయి స్వప్నము పొందండి....!!
భేద భావమును మానండి
                సాయి మన సద్గురువండి....!!
వందనమయ్యా  పరమేశా
                 ఆపద్భాందవ సాయీశా......!!
మా పాపములా కడతేర్చు
                 మా మది కోరిక నెరవేర్చు....!!
కరుణామూర్తి ఓ సాయి
         కరుణతో మమ్ము దరిచేర్చోయి.....!!
మా మనసే నీ మందిరము
            మా పలుకులే నీకు నైవేద్యం.....!!
  శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ
                  సాయినాథ మహరాజ్ కీ జై...

దేవాలయంలో దేవుడికి ఎదురుగా..నిలబడకూడదు.


దేవాలయంలో దేవుడికి ఎదురుగా..నిలబడకూడదు.
గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టకోకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజమే దేవుడికి ఓ పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు.
ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది
దేవాల‌యంలో  అద్వితీయ‌మైన శ‌క్తి ఉంటుంది. ప్ర‌ధానంగా మూల‌విరాట్‌ను  ప్ర‌తిష్టించే స‌మ‌యంలో వేద‌మంత్రాల‌ను ప‌ఠిస్తారు.  గ‌ర్భ‌గుడిలో మ‌హాశక్తుల‌ను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్ర‌బ‌లంతో పాటు మంత్ర‌బ‌లం ఉంటాయి.
ప‌ర‌మేశ్వ‌రుడు, కాళీమాత ఆల‌యాల్లో ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. శివ‌లింగ ద‌ర్శ‌నాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన త‌రువాత‌నే ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని పురాణ‌గ్రంథాలు వెల్ల‌డిస్తున్నాయి.
ఇంకా కొన్ని ఆల‌యాల్లో సూర్య‌కిర‌ణాలు నేరుగా గ‌ర్భ‌గుడిలోకి ప్ర‌వేశిస్తాయి. మ‌నం అడ్డంగా నిలిస్తే  కిర‌ణాలు మూల‌విరాట్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేవు.
ఇలా పలుకార‌ణాల‌తో ఆల‌యంలో దేవుడికీ ఎదురుగా నిల్చోని న‌మ‌స్క‌రించ‌కూడ‌దు.  మ‌న పెద్ద‌లు ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితాన్ని గ‌డిపేందుకు అనేక నియ‌మ నిబంధ‌న‌లు ప్ర‌వేశ‌పెట్టారు.
వీటిని ఆచ‌రించ‌డంతో మ‌న సంప్ర‌దాయాన్ని ప‌రిర‌క్షించిన‌వాళ్ల‌మ‌వుతాం. అందుక‌నే ఒక వైపుగా నిల‌బ‌డి ద‌ర్శ‌నం చేసుకోవాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

కలలో దేవతాదర్శనం దేనికి సంకేతం

కలలో దేవతాదర్శనం దేనికి సంకేతం
మనలో చాలామందికి కలలు రావడం సహజం. కలలలో మంచి కలలు రావచ్చు, చెడు చూడవచ్చు, కానీ కలలు కేవలం కలవరకు మాత్రమె నిజం. నిజ జీవితంలో వాటి ప్రభావం ఎంత అన్నది పరిస్థితులనుబట్టి వుంటుంది.
అసలీ కలలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. మనం ఎప్పుడో చూసిన విషయాలు, మనుషులు, స్థలాలు దానికి సంబంధించిన విశేషాలతో ఒకానొక సన్నివేశం సృష్టించి ఇతఃపూర్వం మనం అనుకున్న ప్రక్రియనో లేక అనుకుని చెయ్యలేకపోయిన వైనాన్నో మనముందు ఆవిష్కరిస్తుంది మనస్సు. కానీ మనకు సంబంధం లేని విషయాలు, స్థలాలు, పరిస్థితులు కూడా మనకు కలల్లో కనబడడం కద్దు.
ఒకానొక పరిశోధన ప్రకారం ఏ ఏ విషయాలు మనం మన పంచేద్రియాలతో మనం ఏ విషయాలను గ్రహిస్తామో దాన్ని అనుసంధానించి మన మెదడు ఒక ప్రపంచాన్ని సృష్టించి ఆ విషయాలను తిరిగి మనకు అందిస్తాయి అన్నది నేటి శాస్త్రం. మరి మనం చూడని విషయాలు ఎలా మనం ఎప్పుడో చూసినట్టు ఎందుకు కనబడుతున్నాయి? అంటే దానికి కొన్ని కొన్ని సార్లు మెదడు అలాగే పని చేస్తుంది అని చెబుతుంది నేటి శాస్త్రం.
ఈ విషయమై మన వాంగ్మయం ఏమి చెబుతోందో ఒక్కసారి అవలోకించుకుందాం. మన జీవుడు జాగ్రదావస్థలో ఉన్నప్పుడు విశ్వాన్ని స్వయంగా తెలుసుకుంటున్న వాడిని విశ్వుడు అని పిలుస్తుంది. స్వప్నావస్థలో ఉండే జీవుడికి తైజసుడని పేరు. తన తేజస్సుతో అన్నీ తెలుసుకుంటాడు.  Deep Sleep అంటే సుషుప్తి అవస్థలో ఉండే జీవుడికి ప్రాజ్ఞుడని పేరు. ఇతడు హృదయ స్థానంలో ఉండి తన పనులు చేసుకుంటాడు.
ఇక ఇవి కాక మరొక అవస్త వుంది. తురీయం: ఇది అవస్థ గాని అవస్థ – తురీయావస్థ, 3 అవస్థలు ఉండటాన్ని - లేకపోవటాన్ని చూసే సాక్షి గాను; స్వయంగా తాను ఒకప్పుడుండటం  గాని, లేకపోవటం గాని లేకుండా నిత్యంగా - నిరంతరంగా, అనుస్యూతంగా, ఎడ తెగకుండా, అఖండంగా జ్ఞాన రూపంగా, ఏది ఉంటున్నదో అదే తురీయం.  ఇవన్నీ కూడా ప్రాణం ఉన్న మనలోనే ఉంటాయి. ఒకొక్కరి స్థాయిని బట్టి వారికి ఆయా అవస్థలు కరతలామలకాలు.
మనలో ఉన్న విశ్వుడు ఎప్పుడెప్పుడు ఏ ఏ విషయాలను ఈ లోకం నుండి గ్రహిస్తూ ఉంటాడో ఆ విషయాలన్నీ మనస్సులో నిక్షిప్తం అవుతూ వుంటాయి. అవి ఈ జన్మలోనివే కాక ఎన్నో జన్మజన్మల వాసనలను మనస్సుపొరలలో నిక్షిప్తం చేసి ఉంచుతుంది. అందుకే ఎన్నడూ ఈ జన్మలో చూడని విషయాలు కూడా మనకు ఎంతో పరిచయం ఉన్న విషయాలగా కనబడుతూ వుంటాయి. అటువంటి సన్నివేశాలు, ప్రదేశాలు మనకు బాగా తెలిసినవిగా కనబడుతూ వుంటాయి. వాటిలో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడు జీవుడు.
అన్నమయ్య చెప్పినట్టు “ కలలోని సిరులెల్ల కనుకూర్కులే కాక మెలకువ జూడనవి మెరసీనా” అన్నట్టు కలలోని సుఖం అక్కడితో ఆఖరు. మన కర్మసిద్ధాంతాన్ని అనుసరించి ఎన్నడో నీవు చేసిన చాలా చిన్నపాటి పుణ్యం నీకు ఆ ప్రశాంతతను ఇచ్చేది నీకు కలలో వచ్చి మనస్సును ఆహ్లాదపరుస్తుంది. అలాగే నువ్వేప్పుడో చేసిన పాపం నీవు భౌతికంగా అనుభవించవలసిన అవసరం లేకుండా కలలో నిన్ను కలతబెట్టి నీ పాపప్రక్షాళన జరుగుతుంది.
కొంత కొంత మంది యోగులు తమ భక్తుల పాపాలను పరిహరించి అటువంటి పెద్ద పాపాన్ని భౌతికంగా కాక కలలో తీర్చెట్టు అనుగ్రహించగలరు. ఒకానొక యోగి తమ శిష్యుని బాధ వ్యాధి రూపంలో వచ్చినప్పుడు అతడి కలలో బండరాయి అతడి గుండెమీద పోనిచ్చి అదిమి అతడిని ఎంతో బాధకు గురి చేసి ఒక్కరాత్రి కలలో ఆ పాపాన్ని తీసి వేసారు. ఇటువంటి విషయాలు గురుచరిత్రలో అనేకం మనకు కనబడతాయి.
అలాగే నీ కర్మ పరిపక్వస్థితికి వచ్చినప్పుడు నీకు దిశానిర్దేశం చెయ్యడం కొరకు అనో లేక దేవుడిని నమ్ముకున్న నీకు ఆ దేవతా అనుగ్రహం నీకు వస్తున్న సూచనగానో, లేక నువ్వు పడుతున్న బాధను తాను దగ్గరుండి తీసివేస్తున్నానన్న భరోసా ఇవ్వడానికో నీకు ఆ దేవతామూర్తులు కలలో కనబడి అనుగ్రహిస్తూ వుంటారు.
నారదుని పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసిన మీదట ఆయనకు కలలో లీలగా విష్ణుమూర్తి దర్శనం అనుగ్రహించి తదుపరి జన్మలలో పరమభాగావతోత్తముని చేసాడు. నువ్వు చేసిన పుణ్యఫలం వలన మాత్రమె నీకు దైవదర్శనం కలుగుతుంది. ఒకొక్కప్పుడు నువ్వు ఇతహ్పూర్వం జన్మలలో చూసిన దేవాలయాలు, దేవతామూర్తులు ఇప్పుడు నీకు కనబడతాయి.
నిన్ను సూదంటురాయిలా తమవైపు తిప్పుకోవడానికి, నువ్వు సరైన మార్గంలో నడవడానికి నీకు దోహదపడేలా వారి అనుగ్రహం నీకు కలలో కనిపించి మాంసనేత్రంతో మనోనేత్రంతో నువ్వు దర్శించేలా అనుగ్రహించి నువ్వు మాంసనేత్రాలతో సాక్షాత్కరించుకోమని అటువంటి సాధన చెయ్యమని చెప్పడానికి అన్నట్టు దర్శనం అనుగ్రహించి నిన్ను సరైన దారిలో నడిపిస్తారు.
అటువంటి సాధన చెయ్యడం అన్నది మన కర్తవ్యంగా భావించి గురువుల పాదములు పట్టుకుని అటువైపు ప్రయాణం చెయ్యవలసిన బాధ్యత నీది అని గుర్తేరిగేలా అనుగ్రహం వర్షిస్తారు. మనం అందరం కూడా మనకు కలల్లో కనబడ్డ దేవతా స్వరూప అనుగ్రహానికి పాత్రులయ్యేలా సాధన చేసి వారిని నిజనేత్రాలతో దర్శించుకునే భాగ్యం సంపాదిద్దాం.
ఓం నమో వేంకటేశాయ..!!
సర్వే జనా సుఖినో భవంతు..!!
                            శ్రీ మాత్రే నమః

ఆశీర్వచనం సమయంలో తలమీద అక్షింతలు ఎందుకు చల్లుతారు

ఆశీర్వచనం సమయంలో తలమీద అక్షింతలు ఎందుకు చల్లుతారు
ప్రతి శుభకార్యంలో ఆశీర్వచనానికి తలమీద అక్షింతలు చల్లుతారు. ఆశీర్వచనానికీ, అక్షింతలకీ ఎమీటి సంబంధం? అక్షింతలే ఎందుకు చల్లాలి వేరే ధాన్యాలు వున్నాయికదా వాటిని చల్లవచ్చుకదా? పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి?
ఇలా చాల మందికి సంశయం కలగవచ్చు.
బియ్యం చంద్రుడికి కారకం. చంద్రుడు మనస్సుకి కారకుడు. అంటే బియ్యం, మనం మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట.
బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారకం. గురువు శుభ గ్రహం. ఆయనకి సంకేతంగా, శుభానికి సంకేతంగా పసుపు రంగు కలిపిన అక్షింతలను మంత్రపూర్వకంగా తలమీద చల్లుతారు.
మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా వున్న అక్షరాలతో, బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి వుంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడి చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది.
క్షయంలేని మంత్రాలను, క్షయంలేని అక్షింతలు పట్టుకుని చదివి, అవి ఎవరి తలపై వేస్తారో వారుకూడా క్షయం లేకుండా ఆభివృధ్ధి చెందుతారు.
ఇందుకే మన పూర్వికులు, ఆశీర్వచనానికి శక్తి వుంటుంది అని చెప్పేవారు.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
                         శ్రీ మాత్రే నమః

పంచముఖ హనుమ మంత్రరాజం

పంచముఖ హనుమ మంత్రరాజం
అథ మంత్ర
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా!
ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా!
ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా!
ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా!
ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ  బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా!
భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!
శ్రీరామ జయరామ జయ జయరామ..!!
                          శ్రీ మాత్రే నమః

దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది. "ఓం దుం దుర్గాయైనమః"


దుర్గా నామ జపం..
దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.
"ఓం దుం దుర్గాయైనమః"
ద్ + ఉ + ర్ + గ్ + అ  అనే  ఐదు  బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ.
ద కారం  - 
దైత్యాన్ని ( మనలో ఉన్న రాక్షస గుణాలను)  పోగోడుతుంది.
ఉ కారం - 
మనం అనుకున్న పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది.
ర కారం- 
రోగాలు రాకుండా రక్షిస్తుంది.
గ కారం- 
మనం చేసిన పాపాలను పోగొడుతుంది.
అ కారం - 
శత్రు నాశనం చేస్తుంది.
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు. దుర్గా నామం దుఖాలను పోగొడుతుంది.
ఓం  ఐం  హ్రీం  శ్రీం  శ్రీమాత్రే నమః !!
శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ :
1 -నమస్తే  శరణ్యే  శివేసాను  కంపే
     నమస్తే  జగద్వ్యాపికే  విశ్వరూపే !
     నమస్తే  జగద్వంద్య  పాదారవిందే
     నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే  !!
2 - నమస్తే  జగచ్చింత్య  మానస్వరూపే
      నమస్తే   మహాయెాగి  విజ్ఞానరూపే !
      నమస్తే  నమస్తే  సదానంద  రూపే
      నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
3 - అనాథస్య  దీనస్య  తృష్ణాతురస్య
     భయార్తస్య  భీతస్య  బద్ధస్య  జంతోః !
     త్వం  ఏకా  గతి  ర్దేవీ  విస్తారకర్త్రీ
     నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
4 - అరణ్యే  రణే  దారుణే  శత్రుమధ్యే
      అనలే  సాగరే  ప్రాంతరే  రాజ గేహే !
      త్వం  ఏకా  గతి  ర్దేవి  నిస్తార  నౌకా
      నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
5 - అపారే  మహాదుస్తరే2 త్యంత  ఘోరే
      విపత్సాగరే  మజ్జితాం  దేహిభాజామ్ !
      త్వం  ఏకా  గతి  ర్దేవీ  నిస్తార  హేతుర్
      నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
6 - నమశ్చండికే  చండ  దుర్దండ  లీలా
      సముత్  ఖండి  తాకండితా శేష శత్రో !
      త్వం  ఏకా  గతి  ర్దేవి  వినిస్తార  బీజం
      నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
7 - త్వమేవాఘ  భావాధృతా  సత్యవాది
      న్యమే  యాజితా  క్రోధనాత్క్రోధ  నిష్టా !
     ఇడా  పింగళా  త్వం  సుషుమ్నాచ  నాడీ
     నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
8 - నమెా  దేవి  దుర్గే  శివే  భీమనాదే
      సరస్వత్యరుంధత్యమెాఘ  స్వరూపే !
     విభూతిః  శచీ  కాళరాత్రీః  సతీ  త్వం
     నమస్తే  జగత్తారిణీ  త్రాహి  దుర్గే !!
9 - శరణమసి  సురాణాం  సిద్ధ  విద్యాధరాణాం
      ముని  మనుజ  పశూనాం  దస్యుభిస్త్రాసితానాం !
     నృపతి  గృహ  గతానాం  వ్యాధిభిః  పీడితానాం
     త్వమసి  శరణమేకా దేవి  దుర్గే  ప్రసీద  ప్రసీద !!
    -:ఇతి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం సంపూర్ణం :-
అధ్భుతమైన గతిలో నడిచే ఈ స్త్రోత్ర రాజం చదువుతుంటేనే అర్థము స్ఫురిస్తుంది !!  ఆనందమును కలిగిస్తుంది !!   
చదవండి !! చదివి " అమ్మ " కృపకు పాత్రులు కండి.
ఈ దుర్గా ఆపదుద్దారక స్తోత్రమును పఠించిన యెడల
అనేక..
ఆపదలు,
ఈతి బాధలు,
గ్రహ బాధలు,
అత్యంత దుర్గమమైన కష్టాలు
మరియు ఘోరమైన వ్యాధులు
తొలగి సుఖ సంతోషాలు ప్రాప్తించును.
ఓం శాంతిఃశాంతిఃశాంతిః !!
-: శుభమ్ భూయాత్ :-
                           శ్రీ మాత్రే నమః

లింగాష్టకం యొక్క అర్థం

లింగాష్టకం యొక్క అర్థం..!!

1) బ్రహ్మ మురారి సురార్చిత లింగం
బ్రహ్మ ,విష్ణు , దేవతల చేత పూజింపబడ్డ లింగం..!!
2) నిర్మల భాషిత శోభిత లింగం,
నిర్మలమైన మాటల చేత అలంకరింపబడ్డ లింగం..!!
3) జన్మజ దుఃఖ వినాశక లింగం,
జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం..!!
4) తత్ ప్రణమామి సదా శివ లింగం,
ఓ సదా శివ లింగం నీకు నమస్కారం..!!
5) దేవముని ప్రవరార్చిత లింగం
దేవమునులు ,మహా ఋషులు పూజింప లింగం..!!
6) కామదహన కరుణాకర లింగం,
మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే చేతులు గల శివలింగం..!!
7) రావణ దర్ప వినాశక లింగం,
రావణుడి గర్వాన్ని నాశనం చేసినట్టి శివ లింగం..!!
8) తత్ ప్రణమామి సద శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
9) సర్వ సుగంధ సులేపిత లింగం,
అన్ని మంచి గంధాలు , మంచి గా పూసిన శివ లింగం..!!
10) బుద్ధి వివర్ధన కారణ లింగం,
మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం ..!!
11) సిద్ధ సురాసుర వందిత లింగం,
సిద్ధులు , దేవతలు , రాక్షసుల చేత కీర్తింపబడ్డ శివ లింగం..!!
12) తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
13) కనక మహామణి భూషిత లింగం,
బంగారు , మహా మణుల చేత అలంకరింప బడ్డ శివ లింగం..!!
14) ఫణిపతి వేష్టిత శోభిత లింగం,
నాగరాజు నివాసం చేత అలంకరింపబడ్డ శివ లింగం..!!
15) దక్ష సుయజ్ఞ వినాశక లింగం,
దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం..!!
16) తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
17) కుంకుమ చందన లేపిత లింగం,
కుంకుమ , గంధము పూయబడ్డ శివ లింగం..!!
18) పంకజ హార సుశోభిత లింగం,
కలువల దండ చేత చక్కగా అలంకరింప బడ్డ శివ లింగం..!!
19) సంచిత పాప వినాశక లింగం,
సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం..!!
20) తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
21) దేవగణార్చిత సేవిత లింగం,
దేవ గణాల చేత పూజింప బడ్డ , సేవించ బడ్డ శివ లింగం..!!
22) భావైర్ భక్తీ భిరేవచ లింగం,
చక్కటి భావం తో కూడిన భక్తీ చేత పూజింప బడ్డ శివ లింగం..!!
23) దినకర కోటి ప్రభాకర లింగం,
కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి శివ లింగం..!!
24) తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
25) అష్ట దలోపరి వేష్టిత లింగం,
ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం..!!
26) సర్వ సముద్భవ కారణ లింగం,
అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం..!!
27) అష్ట దరిద్ర వినాశక లింగం,
ఎనిమిది రకాల దరిద్రాలను (అష్ట దరిద్రాలు) నాశనం చేసే శివ లింగం..!!
28) తత్ ప్రణమామి సదా శివ లింగం,
నీకు ఇవే నా నమస్కారాలు, ఓ సదా శివ లింగమా ..!!
29) సురగురు సురవర పూజిత లింగం,
దేవ గురువు (బృహస్పతి), దేవతల చేత పూజింప బడ్డ శివ లింగం..!!
30) సురవన పుష్ప సదార్చిత లింగం,
దేవతల తోటల్లో పూచే పువ్వులు (పారిజాతాలు) చేత ఎప్పుడూ పూజింప బడే శివ లింగం..!!
31) పరమపదం పరమాత్మక లింగం,
ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము
32) తత్ ప్రణమామి సదా  శివ లింగం
నీకు ఇవే నా నమస్కారాలు , ఓ సదా శివ లింగమా ..!!
33) లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ,
ఎప్పుడైతే శివుడి సన్నిధిలో చదవబడుతుందో , వారికి చాలా పుణ్యం వస్తుంది..!!
34) శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే,
శివ లోకం లభిస్తుంది ..!!
(శివుడి లో ఐక్యమయ్యే మార్గం దొరుకుతుంది).
ఓం నమః శివాయ హర హరమహాదేవ శంభో శంకరా.
                       శ్రీ మాత్రే నమః

Thursday, May 3, 2018

మహిళా దత్తక్షేత్రం. దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) సుమారు 650 సంవత్సరాల చరిత్రకలిగిన క్షేత్రం.

మహిళా దత్తక్షేత్రం.
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)
సుమారు 650 సంవత్సరాల చరిత్రకలిగిన క్షేత్రం.
దత్తబంధువులందరికీ నమస్కారములు,
రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి గురించిన రహస్య సమాచారమేదైనా ఉంటే తెలపమని శ్రీపాద శ్రీ వల్లభుల వారిని నేను తరచూ నా మనసు లోనే అడిగే వాడిని.
ఒక రోజు నాకు ప్రముఖ శ్రీపాద శ్రీ వల్లభ భక్తులైన శ్రీ మల్లాది వెంకట భాస్కర రావు గారి (న్యూ ఢిల్లీ) దగ్గర నుండి స్పీడ్ పోస్ట్ లో ఒక పార్సిల్ వచ్చింది. ఆ పార్సిల్ ఇవ్వడానికి వచ్చినతను నాదగ్గర సంతకం తీసుకుంటుంటే నా మొబైల్ ఫోన్ మోగింది నా మొబైల్ ఫోన్కు నేను రింగ్ టోన్ గా “దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా..దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..” అనే ట్యూన్ సెట్ చేసుకున్నాను.
అది విన్న అతను “ఈ నరసింహ సరస్వతి ఎవరు? మా జోగిపేట దగ్గర ‘ఒక గుట్ట’లో కుడా ఇదే పేరుని విన్నాను” అని చెప్పాడు. నేను నరసింహ సరస్వతి స్వామీ వారి గురించి చెప్పి అతని దగ్గర ఉన్న అస్పష్టమైన సమాచారాన్ని, అడ్రస్ ను తీసుకోని మొత్తానికి అతను చెప్పిన గుట్ట చేరాను.
అక్కడికి వెళ్ళిన తరువాత తెలిసింది అది ఒక అతి రహస్యమైన దత్తక్షేత్రమనీ , శ్రీపాదుడు తన పాద స్పర్శతో పునీతం చేసిన ప్రదేశమనీ, నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రాంతమనీ, గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలంలో ఇక్కడే గడిపాడని తెలుసుకొని ఆశ్చర్యపోయాను.
అక్కడ ఉండే దత్తాత్రేయుని రూపం చూసి మరింతగా ఆశ్చర్యపోయాను. వెంటనే స్థానికులను, పూజారి గారిని కలిసి భక్తులందరి కోసం ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తున్నాను. ఆస్వాదించండి.
దిగంబరా..దిగంబరా..శ్రీ పాద వల్లభ దిగంబరా.. దిగంబరా..దిగంబరా.. నరసింహ సరస్వతి దిగంబరా..
- Keerthi Vallabha (keerthivallabha@gmail.com)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట)..
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) మెదక్ జిల్లా లో నర్సాపూర్ కు దగ్గర లో గల హత్నురా మండలం లోని Madhira (Maadaram Village) మాధిర (మాదారం) గ్రామ శివార్లలో ఉంది.
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను సొంత వాహనాలలో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి దాదాపుగా 100 కీ.మీ. దూరం ఉంటుంది. అక్కడి ప్రజలని రూట్ అడిగేటప్పుడు ‘మాధిర’ కు బదులుగా ‘మాదారం’ అని అడిగితే సులభంగా గుర్తుపడతారు.
టూవీలర్ మీద వెళ్ళేవారు హత్నురా ITI లోపల నుండి / ఫోర్ వీలర్ పై వెళ్ళేవారు ITI పక్కనగల మట్టి రోడ్డు ద్వారా సులభంగా దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ను చేరుకోవచ్చు.
Dattachalam (Dattalaya Gutta, Madhira / Maadharam Village) Route
Balanagar----> Jeedimetla----> Gandi Maisamma X Roads ----> ORR ----> Narsapur Road---->Dundigal----> Gummadidala---->Nallapalli Forest Belt---->Narsapur----> Left Side Road At Narsapur Ambedkar Statue---->Doulatabad Road -----> Doulatabad-----> Right Side Road At Doulatabad 'Y' Junction---->Hatnura Road----> Hatnura---->Konyaal Road---->Maadhira Village -----> Dattachalam (Dattalaya Gutta)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) ప్రత్యేకత.
ఏక పాద దత్తక్షేత్రం..
శ్రీపాద శ్రీ వల్లభులు తమ 16వ ఏటా పిఠాపురంలో సన్యాస దీక్ష తీసుకోని, ఇంటినుండి బయలుదేరి ఉత్తరదేశ ముఖంగా వెళ్లి అనేక క్షేత్రాలను దర్శించి తరువాత గోకర్ణం చేరి అక్కడ 3 సంవత్సరాలకాలముండి, దత్తాచలం చేరి అక్కడి గుహలలో గల మహాసిద్ధులను ఆశీర్వదించి, దగ్గరలో గల మంజీరా నదిలో స్నానమాచరించి, దత్తాచలక్షేత్రం మీదుగా శ్రీశైలం చేరారని ఇక్కడి స్థల పురాణం.
నరసింహ సరస్వతి స్వామివారు 12 సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రదేశమిది
నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుడు మరియు గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలం మొత్తం ఇక్కడే గడపడం విశేషం
మంజీరానది కి (సుమారు 8 కీ.మీ. దూరంలో) సమీపం లో గల దత్తక్షేత్రం. దత్తాలయగుట్టకు సమీపంలోనే అన్ని విధాలా కాశీ విశ్వేశ్వరుడిని పోలిఉన్న కాశీపతి దేవాలయం కలదు. ఈ గుడి వద్దనే శ్రీగురుని ఏకపాద ముద్ర గలదు
శ్రీచక్రాన్ని కలిగి ఉన్న ఏకైక దత్తాత్రేయుడు..
ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తాత్రేయుడు కొలువుతీరి ఉండడం వల్ల ఈక్షేత్రం “మహిళా దత్తక్షేత్రం” గా వెలుగుతోంది (ఇక్కడి గుడి నిర్మాణ కార్యక్రమమును ప్రారంబించింది కుడా ఒక మహిళా మంత్రే!)
ఇక్కడ న్యాయబద్ధమైన కోరిక కోరిన మహిళలు, అవి తీరకుండా నిరాశ పొందిన మహిళ ఒక్కరు కుడా లేరట.
ఇక్కడ కొలువుతీరిన దత్తుడి రూపం మనం ఊహించనిదిగా, ముందెప్పుడూ చూడని విధంగా ఉంటుంది.
శ్రీచక్రం లేదా శ్రీయంత్రం అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏంటి?.
కొన్ని అవ్యక్త తాంత్రిక సిద్ధాంతలాధారంగా గొప్ప గణిత శాస్త్రీయ విధానంలో, తనకు తానై ఆవిష్కరించు కొన్నటువంటి మహాయంత్రం శ్రీచక్రం. సృష్టి వైచిత్రినీ, రహస్యాలను ఇంత సంపూర్ణమైన అధ్యయనంతో అన్వయించి సాధకుడి సకల మనోభీష్టములను సిద్ధింప చేయగలిగినటువంటి యంత్ర రాజం మరొకటి లేదు.
శ్రీచక్రం లేదా శ్రీయంత్రం ఒక పవిత్రమైన యంత్రం. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన త్రిభుజాలు కేంద్రంలోని బిందువు చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీలలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతుంది.
దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వ ముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుషుణ్ణి సూచిస్తాయి. అయిదు త్రిభుజాలు నిమ్న ముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీచక్రం స్త్రీ-పురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని నవయోని చక్రం అని కూడా అంటారు.
దత్తాచలక్షేత్ర సందర్శనలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.
దత్తాచలక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకునే వారు పుజాసామగ్రిని వెంటతీసుకోని వెళ్ళడం మంచిది. అలాగే దత్తాచలక్షేత్ర పూజారి అయిన శ్రీ సభాపతి శర్మ గారిని ఫోన్ ద్వారా (09247334660) సంప్రదించి వెళ్ళడం మంచిది.
దయచేసి గమనించండి దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) పరిసర ప్రాంతాలలో పాములు (Indian King Cobra), చిరుతపులుల (Chita) సంచారం ఉన్నట్లుగా సమాచారం. కాబట్టి తగినన్ని రక్షణ చర్యలు తీసుకోని వెళ్ళడం మంచిది. సాయంత్రం, పొద్దుపోయే వేళల్లో వెళ్ళడం నిషేదం.
గుమ్మడిదల నుండి నర్సాపూర్ మధ్యలోగల దట్టమైన అటవీ ప్రాంతంలో విపరీతమైన వేగంతో వచ్చే హెవీ ట్రక్కులు, ఆర్టిక్యులేటేడ్ లారీలతో నిండి ఉండే ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయం పూట అయితే (6.30 AM To 12.30 PM వరుకు) డుండిగల్ దగ్గర గల SGS (శ్రీ గణపతి సచ్చిదానంద) ఆశ్రమాన్ని కుడా ఇదే దారిలో దర్శించుకోవచ్చు.
దత్తాచలక్షేత్ర (దత్తాలయగుట్ట) స్థలపురాణం..
రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాణ్గాపురము నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని వారి వద్ద గల శిష్యులకు సనాతన ధర్మములను ఉపదేశించేవారు. వారి శిష్యగణంలో అతి ముఖ్యమైన వారు శ్రీ నామధారకులు.
నామధారకుల వారు గురు ఆశీర్వాదం మెండుగా కలిగినవారు, మరియు గృహస్తు కుడా. వారు అనేక వేదములను అధ్యయనం చేసి, శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సేవలో గడిపి శ్రీగురుని (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) వద్ద నుండి అనేక గురుసేవా రహస్యాలను తెలుసుకున్న దత్తదైవాంశ సంభూతులు.
అలాగే గురు చరిత్రను మనకి అక్షర రూపంలో అందించినది కుడా ఈయనే. ఇటువంటి స్థితిలో గల నామధారకుల వారు శ్రీగురుని విడిచి క్షణమైనా ఉండలేకపోయేవారు.
ఒకానొక సమయంలో శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) 12 సంవత్సరాల పాటు గాణ్గాపురమును విడిచి తపస్సు చేసుకొనుటకు వేరే ప్రాంతానికి వెళతారు. ఆ ‘గురు ఎడబాటు’ తట్టుకోలేని నామధారకుడు గురువు గారి జాడ కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆఖరుకు శ్రీగురుడు దత్తాచలక్షేత్రం లో తపస్సు చేసుకొంటున్నట్లుగా తెలుసుకుంటారు.
ఆ తరువాత ఒకానొక మాఘ బహుళ పాడ్యమి రోజు శ్రీగురుడు నిర్హరితం చెందినట్లుగా తెలుసుకొని ఎంతో దుఃఖించి, విరక్తి చెంది, ముందు లాగే మళ్లీ ఎలాగైనా దత్తాచలక్షేత్రం లో కనబడవచ్చనే నమ్మకంతో దత్తాచలం వచ్చి శ్రీగురుని కోసం ఘోరంగా తపస్సు చేస్తారు.
నామధారకుల వారి అచంచల గురు భక్తికి మెచ్చి శ్రీచక్ర సమేతంగా శ్రీదత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై, వెంటనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చి జనన-మరణ-వైరాగ్య బోధనలను ఉపదేశించి, వారి పాదుకలను (నిర్గుణ పాదుకలు – ప్రస్తుతం మనం చూసే నిర్గుణ పాదుకలు అవే) శ్రీ నామధారకులవారికిచ్చి, వాటిని గాణ్గాపుర ఆశ్రమంలో ప్రతిష్టించి నిత్యపూజలు చేస్తూ సనాతన ధర్మములను భక్తులకు భోదించమని చెప్పి అంతర్ధానమవుతారు.
అంతట శ్రీగురుని ఆదేశానుసారం శ్రీ నామదారకులు శ్రీగురుని పాదుకలను ప్రతిష్టించి సనాతనధర్మప్రచారం చేస్తూ కాలం గడుపుతారు. శ్రీ నామదారకులు వృద్దాప్యం లోకి వచ్చిన తరువాత మళ్లీ శ్రీగురుని వెతుక్కుంటూ దత్తాచలం చేరి దత్తాచలగుట్ట వద్ద గల దత్తకొలను లో నీటి మీద కుర్చుని అన్న, పానీయాలు మాని శ్రీగురుని దర్శనభాగ్యం కోసం తపోనిష్టలో ఉండేవారు.
దాదాపుగా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే నవాబ్ (రాజు – King) గారి ఒక్కగానొక్క కూతురికి రాచపుండు (Cancer) వ్యాధి వస్తుంది. అప్పుడు ఆ నవాబ్ గారు కూతురుని బతికించమని అనేక మంది వైద్యులను కలుస్తారు. అందరు వైద్యులు కుడా ఈ జబ్బు తగ్గదని, త్వరలోనే మరణం తధ్యమని చెపుతారు.
అయినప్పటికీ నవాబ్ గారు ఏదైనా ఉపాయం చెప్పమని వైద్యులని వేడుకుంటాడు. ఆ వైద్యులలో ఒక వైద్యుడు ” మీ కూతురు మరణించకుండా ఆపలేము కాని ఆ మరణాన్ని వాయిదా వేయుటకు ఒక సలహాగలదు” అని చెపుతాడు. అంతట ఆ నవాబ్ గారు ఆ సలహా ఏమిటో చెప్పమని వేడుకొనగా “మీ కూతురిని నగర కాలుష్యం నుండి దూరంగా అడవికి తీసుకుని వెళ్లి అక్కడ లభించే సహజ ఫలాలు, తెనే వంటివి ఇస్తే మరొక రెండు నెలలు బ్రతకవచ్చు” అని సలహా ఇస్తాడా వైద్యుడు.
వెంటనే నవాబ్ గారు రాజ్యాన్ని వారి తమ్ముడికి అప్పజెప్పి కొంత మంది పని వారిని తీసుకోని కూతురితో సహా దట్టమైన అడవులలోకి వెళతారు. పనివారు ఆహార సేకరణ లో భాగంగా దత్తాచలగుట్ట దగ్గరకు వస్తారు. అక్కడ గల కొలనులో నీటి మీద కుర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆశ్చర్యపోయి ఆ సమాచారాన్ని నవాబ్ గారికి అందిస్తారు.
అప్పుడు ఆ నవాబ్ గారు నీటి మీద కూర్చుని తపోనిష్ట లో ఉన్న శ్రీ నామదారకుడిని చూసి, ఆయన వద్దకు వెళ్ళాలా? వద్దా? పైగా ఆయన హిందూ మతస్తుడు, నేనేమో మహామ్మదియుడిని అని ఆలోచిస్తారు, ఈయన ఎలాగైనా నా కూతురుని రక్షించగలరని మనసులో అనుకోని శ్రీ నామదారకుడి వద్దకు వెళతారు,
తమ కూతురిని రాచపుండు (Cancer) వ్యాధి నుండి రక్షించమని వేడుకుంటారు. దానికి సమాధానంగా శ్రీ నామదారకుడు “అయ్యా రాజు గారు, నేను ఒక సాధారణ బ్రాహ్మణుడను. నావద్ద ఎలాంటి మంత్ర విద్యలు కాని, వైద్య విద్యలు కాని, సంజీవిని కాని లేదు. జీవితం పై విరక్తి చెంది, పెళ్ళాం బిడ్డలను వదిలి సన్యసిస్తున్న సాధారణ సన్యాసిని నేను, తపోభంగం కలిగించవద్దు దయచేసి వెళ్ళిపోండి” అని చెబుతారు.నవాబ్ గారు ఆరోజుకు వెళ్లి పోయినా ఆరోజు నుండి ప్రతీ రోజు వచ్చి శ్రీనామదారకుల వారిని తగిన నివారణోపాయాన్ని తెలపమని ప్రార్ధిస్తూనే ఉంటారు.
ఆఖరుకు ఒక రోజు శ్రీ నామదారకుల వారు ఈ దత్తకొలను లోని నీటిని తీసుకువెళ్లి మీ కూతురికి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) రోజూ కడుగుతూ ఉంటే శ్రీగురుని దయతో నయం అవుతుందని చెపుతారు.
శ్రీ నామదారకుల ఆజ్ఞానుసారం ప్రతీ రోజూ నవాబ్ గారు వారి కూతురికి దత్తకొలను లోని నీటిని తీసుకు వెళ్లి త్రాగించి, రాచపుండు కురుపును (Cancer Wound) కడుగుతూ ఉండగా కొద్ది రోజులలోనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది.
సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన కూతురుని తిరిగి రాజ్యంలో దిగబెట్టి సంతోషంతో నవాబ్ గారు దత్తాచలం చేరి శ్రీ నామదారకుల వారిని కలసి ఏమైనా బహుమతి కోరుకోనమనగా సన్యాసి అయిన నాకు ఏమి అవసరం లేదని, ఏదైనా ఉంటే దత్తుడికి ఇచ్చుకోమని, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెబుతాడు.
అంతట ఆ నవాబ్ గారు దత్తాచలగుట్ట నుండి అష్టదిక్కులలో ఎటు చూసినా 1000 ఎకరాల భూమి స్వామీ వారి పేరు మీద రాగి పత్రాల పై రాయించి అక్కడ పెట్టి వెళ్లిపోతాడు. ఆవిధంగా శ్రీ నామదారకుల వారి పేరు ఇతరప్రాంతాలకు వ్యాపించింది.
శ్రీ నామదారకుల వారి జాడ తెలిసిన వారి భార్య- పుత్రులు దత్తాచలక్షేత్రం వచ్చి కుటుంబ పోషణ కష్టంగా ఉంది, దయచేసి సన్యాసదీక్ష విరమించవలసిందిగా కోరతారు. అందుకు ససేమిరా అన్న..నామదారకుడు ఈ గుట్టకు దూరంగా నవాబ్ గారు ఇచ్చిన 1000 ఎకరాల భూమిలో కేవలం ఉదరపోషణ నిమిత్తం ఎంత అవసరమో అంత భూమిని మీరు సాగుచేసుకోవచ్చని చెప్పి, తనకు మాత్రం తపోభంగం కలిగించవద్దని , తాను అనతి కాలంలోనే గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుకోబోతున్నట్లుగా చెప్పి దత్తాచలక్షేత్ర గుట్ట మీద గల గుహలో తీవ్ర తపమాచరించడానికి సమాయత్తమవుతారు.
ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడచిన తరువాత ఒక రోజూ వారి కుమారుడైన శ్రీ సూర్యభట్టుకు స్వప్నంలో శ్రీ నామదారకుల వారు కనబడి “కుమారా… నేను దత్తాత్రేయస్వామీలో లయం చెందాను. దత్తుడుకి ప్రతీ సంవత్సరం మార్గశీర్ష శుద్ధ షష్టి నుండి మార్గశీర్ష పౌర్ణమి వరకు (దత్త జయంతి) ఉత్సవాలు జరిపి, చివరి రోజైన దత్త జయంతి రోజున అన్నసంతర్పణ జరిపించ వలసిందిగా మనవి” అని చెపుతారు.
శ్రీ నామదారకుల వారు దత్తాత్రేయునిలో లయం చెందిన కారణంగా ఈ ప్రాంతాన్నే “దత్తాలయగుట్ట” అనికూడా పిలుస్తారు. శ్రీ నామదారకుల ఆదేశానుసారం నాటినుండి (600 సంవత్సరాల నుండి) నేటి వరుకు వారి వంశస్థులు ప్రతీ సంవత్సరం ఉత్సవాలను జరుపుతున్నారు.
శ్రీ నామదారకుల వారిని లయం చేసుకోవడానికి విచ్చేసిన శ్రీగురుడు (శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు) మొదటి పాదం మాధురగ్రామ పరిసరాల్లో గల కాశీపతి దేవాలయం దగ్గర పెట్టగా రెండవపాదం దత్తాచలగుట్ట మీద మొదటి పాదానికి అభిముఖంగా పెడతారు.
ఈ రెండు చోట్లా ఏకపాద ముద్రలే ఇక్కడ ఉంటాయి, మరియు ఈ రెంటి మధ్య సుమారు 1 కీ.మీ. పైన దూరం ఉంటుంది. ఇవి శ్రీగురుని అసలైన పాదముద్రలు. వెంటనే శ్రీ నామదారకులు దత్తాచలగుట్ట పై రెండవ పాదముద్రను ప్రతిష్టించి శ్రీగురునిలో లయంఅవుతారు.
ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు..
ప్రతీ పౌర్ణమి మరియు అమావాస్యలకి ఇక్కడ అర్ధరాత్రి 2.00 గంటల నుండి 2.30 గంటల మధ్య ఈ గుట్టలో ‘ఓం’ కార శబ్దం ధ్వనిస్తుంది. శక్తి, ధైర్యం,ఈ ఓంకార శబ్దాన్ని వినాలనుకునే ఆశక్తిగల వారు ఇక్కడి పూజారి అయిన శ్రీ సభాపతిశర్మ గారికి చెబితే వారు మీరు రాత్రికి దత్తాచలగుట్ట మీద ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు.
దత్తాచలగుట్ట మీద వెలసిన దత్తాత్రేయుని పాదముల వద్ద మన చెవిని ఆనించి ప్రశాంతంగా వింటే అన్నివేళలా “ఓం” కార శబ్దం వినిపిస్తుంది.
మనుష్య సంచారం ఉండని సాయంత్ర వేళల్లో, తెల్లవారు ఝామున భయానకరూప దిగంబరులని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు.
అప్పట్లో నవాబ్ గారు రాసిచ్చిన 1000 ఎకరాల భూమి లో ప్రస్తుతం 10 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ 10 ఎకరాలూ “శ్రీ దత్తాత్రేయ స్వామి” వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడినది. ఆ రిజిస్ట్రేషన్ పేపర్లను మనం చూడవచ్చు. ( గడచిన 600 సంవత్సరాలలో నవాబులు పోయారు, నిజాం పాలన పోయింది, బ్రిటీష్ పాలన పోయింది, ఇండియన్ గవర్నమెంట్ వచ్చింది, మద్రాస్ తో పాటు ఉన్న ఉమ్మడి రాష్ట్రం పోయింది, కర్నూల్ రాజధాని మారి హైదరాబాద్ వచ్చింది, కరణీకం పోయింది – ఇన్ని మార్పులు రావడం వల్ల రికార్డులు మార్చి విలువైన దత్తాత్రేయుని భూమి కబ్జా చేయబడినది)
దత్తాచలక్షేత్రం (దత్తాలయగుట్ట) క్షేత్ర నిర్వాహకుల సమాచారం..
శ్రీ సభాపతి శర్మ(బాబు పంతులు) – శ్రీ నామధారకుల వంశీకులు మరియు దత్తాచలక్షేత్ర పూజారి Mobile No: 09247334660, కాశీపతి దేవాలయం తాళం చెవి ఉన్న, ఏక పాద ముద్రను చూపించగల మాధుర గ్రామ స్థానికులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ Mobile No: 9949687780.
ఈ సమాచారం sripadavallabha.org వెబ్సైట్ నుండి సంగ్రహించబడినది.. జై..గురుదత్త..!!
శుభమ్.. భూయాత్..!!
                             శ్రీ మాత్రే నమః

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS