గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం పెట్టకోకూడదని పెద్దలు చెబుతుంటారు. నిజమే దేవుడికి ఓ పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామివారికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యలో కూడా నిలబడకూడదు.
ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తారు. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది
దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది. ప్రధానంగా మూలవిరాట్‌ను ప్రతిష్టించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు. గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు. మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం ఉంటాయి.
పరమేశ్వరుడు, కాళీమాత ఆలయాల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. శివలింగ దర్శనాన్ని నంది కొమ్ముల నుంచి చూసిన తరువాతనే దర్శనం చేసుకోవాలని పురాణగ్రంథాలు వెల్లడిస్తున్నాయి.
ఇంకా కొన్ని ఆలయాల్లో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి. మనం అడ్డంగా నిలిస్తే కిరణాలు మూలవిరాట్ దగ్గరకు వెళ్లలేవు.
ఇలా పలుకారణాలతో ఆలయంలో దేవుడికీ ఎదురుగా నిల్చోని నమస్కరించకూడదు. మన పెద్దలు ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేందుకు అనేక నియమ నిబంధనలు ప్రవేశపెట్టారు.
వీటిని ఆచరించడంతో మన సంప్రదాయాన్ని పరిరక్షించినవాళ్లమవుతాం. అందుకనే ఒక వైపుగా నిలబడి దర్శనం చేసుకోవాలి.
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
శ్రీ మాత్రే నమః
No comments:
Post a Comment