ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి క్షేత్రం గూర్చి తెలుసుకోండి.
అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి.
దేవతలు లోకకళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుదని చెబుతుంటారు. అలాంటి వాటిలో 'శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి' రూపానికి
ఎంతో విశిష్టత వుంది. కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెనుగొండ'లో విలసిల్లుతోంది. మరి ఈ వాసవీ అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెను పురాణగాథ ఏంటి? ఎందుకు అలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.*
ఎంతో విశిష్టత వుంది. కన్య పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడి వైశ్యులకి కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరిన ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని 'పెనుగొండ'లో విలసిల్లుతోంది. మరి ఈ వాసవీ అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెను పురాణగాథ ఏంటి? ఎందుకు అలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.*
*చరిత్ర*
*ఈ ఆలయ పురాణగాథ ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ అనే గ్రామంలో కుసుమ శ్రేష్టి, కౌసుంబి అనే వైశ్య దంపతులుండేవారు. వీరికి పెళ్ళై ఎన్ని ఎళ్ళు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుసుశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాధించి కౌసుంబిని తినమని చెప్పెను. ఆ ఫలం భుజించిన తర్వాత ఆ దంపతులకు వాసవీ అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌదర్యవతి. అయితే విష్ణువర్డనుడను రాజమహేంద్రవరం రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.*
*వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్ళి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకుని రమ్మని పంపాడు విష్ణువర్థనుడు. అయితే వైశ్యకుటుంబంలో జన్మించిన వాసవికి , క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించాడా కుసుమశ్రేష్టి.*
*అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయితే ఆవిషయం తెలుసుకున్న విష్ణువర్థనుడు కోపోద్రోక్తుడై, ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్లీ రాయబారానికి మంత్రిని పంపాడు.*
*అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు, పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడం కొంత మంది సమర్థించగా, ఎంతటి రాజైనా సరే కులగౌరవం కాపాడుకోవడం కోసం మరోకులానికి చెందని వారికి వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం సంప్రదాయ, ఆచారాలను మర్చిపోకూడదన్న అభిప్రాయాన్ని తెలిపారు మరికొందరు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకుని పోయి వివాహానికి సిద్దమయ్యేడు విష్ణువర్థనుడు.*
*ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్టి, పెనుగొండ ప్రజలు వాసవికి అగ్నిప్రవేశం చేయడమే మార్గం అని సూచించారు. ఆ విషయం వాసవికి తెలియజేయగా, అందుకు, తండ్రితో ఇలా అన్నది. తండ్రీ....... అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా నాకేం కాదు, మీరు దిగులుపడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది.*
*భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి. భవిష్యత్తులో జరగబోవు దృశ్యాలను కుసుమ శ్రేష్టికి చూపింది వాసవి. అగ్నిప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమ శ్రేష్టి ఖిన్నుడయ్యాడు.*
*అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్టి అగ్నిప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవుడిని ఆవాహన చేశారు. రాజుకు వాసవినిచ్చి పెళ్లి చేయడానికి సమర్ధించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్లిపోయారు. కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పినవారందరూ అగ్నిప్రవేశానికి సిద్ధమయ్యారు.*
*వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు.*
*వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనవసరంలేదు. ఒక్కోక్క కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండం లోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.*
*అంబిక తన విశ్వరూపాన్ని చూపింది*
*అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. "ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టీశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి.*
*విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది.*
*విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేంద్రుడు క్రుంగిపోయాడు.తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించడ్డాడని తెలుసుకున్నాడు.* *పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు.* *విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.*
*పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం.*
*ఈ క్షేత్రంలో గల ముఖ్య విషయాలు తెలుసుకోండి.*
ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు.*
*ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా రెండు నందులు. ధ్వజస్తంభం. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు. ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి. ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది.*
*వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్న గోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం.*
*ప్రధాన మండపంలో మూడు గర్భ గుడులు వరుసగా వున్నాయి. మధ్యలో ఈశ్వరుడు(నగరేశ్వరస్వామివారు) కొలువైయ్యాడు. ఎడమవైపున మహిషాసురమర్ధిని అమ్మవారిని, కుడివైపున కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించగలం.*
*ప్రధాన మండపంలోగల స్థంభాలపై ఆర్యవైశ్య గోత్రాలు, ఋషుల పేర్లు చెక్కబడి ఉన్నాయి.*
*మధ్యలో నగరేశ్వరస్వామివారి లింగరూపం పెద్దదిగా ఉంటుంది. చూడగానే తన్మయత్వం, ఆనందానుభూతికి లోనవుతాం.*
*మహిషాసుర మర్ధిని అమ్మవారి విగ్రహం చూపరులను ఇట్టే ఆకర్షించే విధంగా ఉంటుంది.*
*ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైఉంది. ఒకచేత చిఉలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది.*
*వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి ఆ వాసవి దేవి, వంశప్రతిష్ఠ కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగానిరతి కొనియాడబడినది.*
*ఈ దేవాలయం ప్రక్కనే అష్టలక్ష్మీ దేవాలయం నిర్మించబడింది. నిలువెత్తు విష్ణుమూర్తి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.*
*అష్టలక్ష్మీ దేవాలయం ప్రక్కనే నూలివారి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. దేవాలయానికి వచ్చిన ఆర్యవైశ్యులకు భోజనం,వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు.*
*ఇటీవల మన భారతదేశంలో గల వైశ్యులు అందరూ కలిసి వాసవీ శాంతిధామం పెనుగొండలో నిర్మించారు. ఇక్కడ అమ్మవారి నిలువెత్తు విగ్రహం తన్మయత్వానికి గురిచేస్తుంది. వెళ్ళినవారు ఈదేవాలయం కూడా తప్పక దర్శించండి. ఇక్కడకూడా ఆర్యవైశ్య సోదరులకు భోజన, వసతి సదుపాయాలు కల్పిస్తున్నారు.*
*లక్ష్మీ జనార్ధనస్వామివారు పెనుగొండ క్షేత్ర పాలకుడిగా ఉన్నారు. పెనుగొడ వెళ్ళినవారు ఈ స్వామిని తప్పక దర్శించండి.*
*ఈ క్షేత్రంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.*
*దర్శించడానికి వచ్చిన భక్తులకు ఆమె చేసిన త్యాగం గురించిన పురాణకధ తెలిసి మాటలు రాక సంభ్రమాశ్చర్యాలకు లోనౌతారు. ఆ తల్లి త్యాగం తెలిసిన తర్వాత ఎటువంటి వారైన కన్నీటి పర్వంతమౌతారానడం పేరు అతిశయోక్తి కాదు.*
*వాసవి కన్యకా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి.*
*శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవికి పలు ఆలయాలున్నాయి. వీటిలో ప్రసిద్ధి చెందిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోపశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ అనే పట్టణంలో ఉంది. ఈ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలి గోపురం వివిధ వర్ణాలతో,చక్కటి శిల్ప కళతో అలరారుతూ ఉంటుంది. ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం. పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీ గా భావిస్తారు.*
*🌸వాసవి దేవి జననం!🌸*
*వేంగి దేశాన్ని ఏలే కుసుమ శ్రేష్టి వైశ్యులకు రాజు. ఈ ప్రాంతం విష్ణు వర్ధనుడు (విమలాదిత్య మహారాజు) ఆధీనంలో ఉండేది. క్రీ.శ. 10, 11వ శతాబ్ధాలలో కుసుమ శ్రేష్టి సుమారు 18 పరగణాలను పెనుగొండను రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉండేవాదు. ఆయన,ఆయన భార్య కుసుమాంబ ఆదర్శ దంపతులుగా మెలిగి ప్రశాంతమైన జీవనం గడిపేవారు. శివుని (నాగేశ్వర స్వామి) ఆరాధన వారి దైనందిన జీవితంలో ఒక భాగంగా ఉండేది. వివాహం అయిన చాల సంవత్సరాలకి కూడా ఆ దంపతులకి సంతానం కలుగలేదు. రాజ్యానికి వారసులు లేక వారు చింతిచేవారు. ఎన్ని ప్రార్థనలు చేసినా, నోములు నోచినా వారి కోరిక తీరలేదు. అపుడు వారు తమ కుల గురువు అయిన భాస్కరాచార్యులను సంప్రదించగా, వారికి దశరథుడు చేసిన పుత్ర కామేష్టి యాగాన్ని చేయమని చెప్పారు.*
పెనుగొండలో కల వాసవీధామ్ వద్ద ఉన్న 30 అడుగుల వాసవీమాత విగ్రహము.
*ఒక పవిత్ర కాలంలో వారు ఆ యాగాన్ని తలపెట్టారు.దేవతలు అనుగ్రహించి యజ్ఞ ఫలాన్ని ప్రసాదించి, దాన్ని ఆరగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. భక్తి,శ్రధలతో దాన్ని ఆరగించిన కొన్ని దినాలకే కుసుమాంబ గర్భవతి అయినది. ఆమె గర్భవతిగా ఉండగా అనేక అసాధారన కోరికలు వ్యక్తపరిచేది. ఇది ఆమె భవిష్యత్తులో జనుల బాగోగుల కోసం పాటుపడే ఉత్తమ సంతానానికి జన్మనిస్తుంది అనుటకు సంకేతం.*
*వసంత కాలంలో సర్వత్రా ఆనందాలు నెలకొన్న వేళ వైశాఖ శుద్ధ దశమి,శుక్రవారం ఉత్తర నక్షత్రం,కన్య రాశిలో కుసుమాంబ కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వారిలో ఒకరు ఆడ పిల్ల,మరొకరు మగ పిల్లవాడు. అబ్బాయికి విరూపాక్ష అని అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేసారు. బాల్యం నుండి విరూపాక్షుడు భావి రాజుకు కావల్సిన అన్ని లక్షణాలను చూపేవాడు. వాసవి అన్ని కళలలోను ఆరితేరి, సంగీతం మరియు తర్క శాస్త్రాలలో మక్కువ చూపేది.*
*భాస్కరాచార్యుల శిక్షణలో విరూపాక్షుడు వేదాలని అభ్యసించాదు. గుర్రపు స్వారి, విలువిద్య, కత్తి సాము మొదలైన యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు. వాసవి అన్నికళలను,తర్క శాస్త్రాలను అభ్యసించి తెలివైన అమ్మాయిగా పేరు తెచ్చుకుంది.*
*🌸విష్ణు వర్ధనుడు!🌸*
*విరూపాక్షుడు యుక్త వయసుకి రాగానే ఆలేరుకి చెందిన అరిధి శ్రేష్టి కుమార్తె అయిన రత్నావతిని వివాహంఆడాడు. వివాహానికి విచ్చేసిన అతిధులందరూ త్వరలో వాసవి వివాహం కూడా ఇంత వైభవంగా జరుగుతుంది అని భావించారు.*
*విష్ణు వర్ధనుడు తన రాజ్య విస్తరణలో భాగంగా పెనుగొండకి విచ్చేయగా కుశుమ శ్రేష్టి ఆ రాజుకిఆహ్వానం పలుకుతూ గొప్ప ఊరేగింపు ఏర్పాటు చేసి ఘనమైన వేదిక పై సన్మానాన్ని జరిపాడు. ఇంతలో విష్ణువర్ధునుడి దృష్టి జన సమూహంలో ఉన్న వాసవిపై పడింది. తొలిచూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. ఆమె లేకుండా తాను బ్రతకలేనని భావించి ఆమెను వివాహమాడ నిశ్ఛయించాడు. ఆమె గురించి వివరాలు తెలుసుకోమని ఒక మంత్రిని పంపాడు. విష్ణువర్ధుని కోరిక కుశమ శ్రేష్టికి శరాఘాతం అయింది. ఆయన తన అంగీకారాన్ని తెలుపలేడు, అలా అని కాదనలేడు. దానికి కారణం ఆ రాజు అప్పటికే వివాహితుడు, వయసులో తన కూతురి కంటే చాల పెద్దవాడు, వారి కులాలలో అంతరం ఉంది. ఇవి తల్చుకుని ఆయన చాల ఒత్తిడికి లోనయ్యాడు. తన కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చర్చించగా, అందరూ ఈ విషయంలో నిర్ణయాన్ని వాసవికే వదిలేయమని సలహా ఇచ్చారు. వాసవి తను జీవితాంతం కన్యగా ఉంటానని, ప్రాపంచిక విషయాలతో తనకి సంబంధం వద్దని తన నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పేసింది.*
*కుశుమ శ్రేష్టి ఈ విషయాన్ని విష్ణువర్ధునుడికి వర్తమానాన్ని పంపాడు. దీనికి విపరీతంగా ఆగ్రహించిన ఆ రాజు తన సైన్యాన్ని పంపి బలవంతంగా అయినా వాసవిని తీసుకురమ్మని ఆజ్ఞాపించాదు. ధైర్య సాహసాలు గల వైశ్యులు సామ, దాన, భేద, దండోపాయాలతో ఆ సేనను తిప్పికొట్టారు.*
*🌸కులస్థుల ప్రతిస్పందన!🌸*
*ఇలాంటి విపత్కర పరిస్థితులలో కుశుమ శ్రేష్టి భాస్కరాచుర్యుల సమక్షంలో 18 నగరాలకి చెందిన 714 గోత్రాలకు చెందిన నాయకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వచాయి. 102 గోత్రాలకు చెందిన ముఖ్యులు పిరికివారు ప్రతి రోజు మరణిస్తారు, పోరాడి మరణిస్తే ఒకేసారి మరణం సంభవిస్తుంది, కాబట్టి పోరాటమే సరైనది అని అభిప్రాయ పడగా, మిగిలిన 612 గోత్రాల వారు మాత్రం రాజుతో పెళ్ళి చేస్తేనే అందరికి మంచిది అని అభిప్రాయ పడ్డారు.*
*భాస్కరాచార్యులు మన ప్రాణాలు పోయినా సరే మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఈ మాటలు కుశుమ శ్రేష్టికి మార్గదర్శక ప్రోత్సాహకాలుగా పనిచేసాయి. తన పక్షంలో కేవలం కొంత మంది మాత్రమే ఉన్నప్పటికి, తన కూతురిని రాజుకి ఇచ్చి ఎట్టి పరిస్థితులలోను పెళ్ళి చేయ రాదని నిశ్చయానికి వచ్చాడు. ఈ సంఘటనతో వైశ్యుల ఐకమత్యం దెబ్బతింది. రాజు మాత్రం దెబ్బతిన్న పాములా పగపట్టి, తన శత్రువులను తుదముట్టించడానికి, తన సమస్త సేనలను కూడదీసుకుని సంసిద్ధం అయ్యాడు. ఈ పరిణామాన్ని ఎదుర్కోవడానికి పెనుగొండలో ఉన్న 102 గోత్రాలకు సంబంధించిన వారు ఆయత్తమవుతున్నారు.*
*🌸వాసవి దేవి ప్రతిస్పందన!🌸*
*వాసవి ప్రవేశించి, అందరిని ఉద్దేశించి ఈ విధంగా అంది- "ఒక అమ్మాయి కోసం మనం అంతా రక్తం ఎందుకు చిందించాలి? మన స్వార్ధం కోసం సైనికుల జీవితాలని ఎందుకు అర్పించాలి? యుద్ధం అనే ఆలోచనను విరమిద్దాం. దానికి బదులు ఒక కొత్త పద్ధతిలో పోరాడదాం. అహింసా విధానంలో మనల్ని మనం అర్పించుకుందా. దృడ సంకల్పం, పట్టుదల ఉన్న వారు మాత్రమే ఈ పోరాటంలో పాల్గొన గలరు". వాసవి చెప్పిన విధానానికి తల్లిదండ్రులు అంగీకరించి ఆమెను అనుసరించడి నడవడానికి నిర్ణయించుకున్నారు.*
*🌸ఆత్మ బలిదానం!🌸*
*వాసవి సూచనలను అనుసరించి, గోదావరి నది ఒడ్డున బ్రహ్మకుండం అనే పవిత్ర స్థలంలో రాజబటులు 103 అగ్ని గుండాలను ఏర్పాటు చేసారు. నగరం అంతా ఆ రోజు పండుగ వాతావరణంలో ఉంది. అప్పుడు వాసవి ఆ 102 గోత్రాలకు సంబంధించిన జంటలను ఉద్దేశించి మీరంతా నాతో పాటు మంటలలో దూకడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగితే వారంతా మనస్ఫూర్తిగా తమ సంసిద్ధతను వ్యక్తం చేసారు. వారు వాసవిని దేవుని అంశగా అనుమానించి, తమకి నిజ రూపాన్ని చూపమని కోరారు.*
*ఆమె నవ్వి తన నిజ స్వరూపాన్ని దేదీప్యమానమైన వెలుగుతో చూపించి నేను ఆది పరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతరాన్ని అని చెప్పింది. ధర్మాన్ని నిల్పేందుకు, స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు, విష్ణువర్ధునుడిని అంతంచేసేందుకు, వైశ్యుల ఔదార్యాన్ని ప్రపంచానికి చాటేందుకు కలి యుగంలో జన్మించానని చెప్పింది. సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా చితి మంటల్లో దూకినట్టుగానే నేను కూడా అగ్నిలోకి దూకి పుణ్య లోకాలని చేరుకుంటాను అని చెప్పింది. కుశుమ శ్రేష్టి గత జన్మలో సమాధి అనబడే గొప్ప ముని. ఆయన తన 102 గోత్రాలకు చెందిన బంధువులతో సహా మోక్షాన్ని కోరాడు. అందుకే మీ అందరిని కూడా ఆత్మ బలి దానానికి పురి కొల్పాను అని అంది. ఆమె అక్కడ చేరిన వారికి దేశ భక్తి, నిజాయితి, సమాజ సేవ, సహనంమొదలగు వాటి గురించి వివరించింది.*
విష్ణువర్ధనుడి మరణం సవరించు
*ఆమె నోటి నుండి పవిత్ర వాక్కులు వెలువడగానే దేవి మానవ రూపంలో ప్రత్యక్షం అయింది. అప్పుడు వాళ్ళంతా తమ ఇష్ట దైవాలను తల్చుకుని అగ్ని గుండంలో దూకారు. విష్ణు వర్ధునుడికి దుశ్శకునాలు ఎదురైనప్పటికి తన సేనతో పెనుగొండ పొలిమేరాల్లో ప్రవేశించాడు. అప్పుడు చారులు అప్పటి వరకు జరిగిందంతా రాజుకి చెప్పారు. ఆ నిజాన్ని వినిహృదయం ముక్కలైపోయింది. రక్తం కక్కుని అక్కడికక్కడే మరణించాడు. వాసవి చేసిన ఆత్మ త్యాగం, విష్ణువర్ధనుడి మరణం గురించి పట్టణం అంతా మార్మోగిపోయింది. విష్ణు వర్ధునుడి చర్యలను ఖండించి, ఒక నూతన శకానికి నాంది పలికిన వాసవి మరియు ఆమె అనుచరులను కొనియాడారు.*
*🌸శ్రీ వాసవి దేవి వారసత్వం!🌸*
*ఈ సంఘటన తెలుసుకున్న విష్ణువర్ధనుని కుమారుడు రాజ రాజ నరేంద్రుడు హుటా హుటిన పెనుగొండ పట్టణాన్ని చేరుకుని విలపించాడు. ఆ తర్వాత విరూపాక్షుడు అతన్ని ఈ విధంగా ఓదార్చాడు-"సోదరా, గతం నేర్పిన అనుభవాలు పాటంగా భవిష్యత్తును నిర్మించుకుందాం. మహా రక్తపాతం జరగకుండా వాసవి మన అందరిని రక్షించింది. ఆమె అహింసా సిద్ధాంతం ఉత్తమ ఫలితాలని ఇచ్చింది."*
*ఆ తర్వాత విరూపాక్షుడు భాస్కరాచార్యులు చెప్పిన విధంగా కాశీ, గయ వంటి అనేక పుణ్య క్షేత్రాలను దర్శించాడు. పెనుగొండ పుణ్య క్షేత్రంగా చేయడానికి అక్కడ 101 గోత్రాలకి గుర్తుగా శివ లింగాలని ప్రతిష్ఠించాడు. నరేంద్రుడు వాసవి గౌరవార్ధం ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అప్పటి నుండి వైశ్యులందరు వాసవి కన్యకా పరమేశ్వరిని వైశ్య కుల దేవతగా తలచి పూజలు చేయడం మొదలెట్టారు.*
*వాసవి జీవిత చరిత్ర అహింసను నమ్మినందుకు, మత విశ్వాసాన్ని నిలిపినందుకు, స్త్రీల ఆత్మ గౌరవాన్ని నిలిపినందుకు శాశ్వతంగా చరిత్రలో నిలిచిపోయింది.*
No comments:
Post a Comment