Wednesday, January 31, 2024

హిందువుల ప్రసాదాల లోగుట్టు

హిందువుల ప్రసాదాల లోగుట్టు


 🙏 *Medical benefits of Hindu Prasadam* 🙏🏻

ప్రతి ప్రసాదానికి విశిష్టత ఉంది . ఈ ప్రసాదాల్లో ఉన్న మిశ్రమాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు .

★ *జీర్ణశక్తిని పెంచే  "కట్టె పొంగలి"*

" బియ్యం, పెసరపొప్పు, జీలకర్ర, ఇంగువ, నెయ్యి, అల్లం, శొంఠిపొడి, ఉప్పు, కరివేపాకు, జీడిపప్పుల మిశ్రమంలో తయారయ్యే కట్టెపొంగలి రోగనిరోధకశక్తిని, జీర్ణశక్తిని పెంచు తుంది. మంచి ఆకలిని కలిగిస్తుంది.

★ *జీర్ణకోశ వ్యాధుల నివారిణి "పులిహోర"*

' బియ్యం, చింతపండు పులుసు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, ఇంగువ, పసుపు, బెల్లం, నూనె, వేరుశనగలు, జీడిపప్పు మిశ్రమంతో తయారు చేసే పులిహోర జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణకోశ వ్యాధులను నివారిస్తుంది.

★ *మేధస్సును పెంచే "దద్ధోజనం"*

బియ్యం, పెరుగు, ఇంగువ, కొత్తిమీర, అల్లం, మిర్చి, శొంఠిపొడి మిశ్ర మంతో తయారు చేసే ఈ ప్రసాదం మేధస్సును పెంచుతుంది. శరీరానికి కి మంచి శక్తిని ఇచ్చి ఆరో గ్యాన్ని కల్గిస్తుంది.

★ *వార్ధక్యాన్ని నిలువరించే "కదంబ"*

బియ్యం, చింతపండు, ఎండుమిర్చి, పోపు గింజలు, ఇంగువ, నూనె, ఉప్పు , కందిపప్పు, పసుపు, బెల్లం, నెయ్యి , బెండకాయ, వంకాయ, గుమ్మడికాయ, చిక్కుళ్లు, బీన్స్ , దోసకాయ, క్యారెట్, టమోటా, చిలకడ దుంపల మిశ్రమంలో తయారు చేసే కదంబ ప్రసాదం అత్యంత బలవర్థకం. సప్తధాతువుల పోషణ చేస్తుంది. వార్ధక్యాన్ని నిలువరిస్తుంది. అన్ని వయస్సుల వారికి మంచి పౌష్టికాహారం. 

★ *శ్లేష్మాన్ని తగ్గించే "పూర్ణాలు"*

పచ్చిశనగపప్పు, బెల్లం, కొబ్బరి తురుము, యాలకుల మిశ్ర మంతో ఈ ప్రసాదం సప్తధాతు వుల పోషణ చేస్తుంది. శ్లేష్మాన్ని తగ్గిస్తుంది. మంచి బలవర్ధకం.

★ *రోగ నిరోధక శక్తిని పెంచే "చలిమిడి"*

' బియ్యం పిండి, బెల్లం, యాలుకలు, నెయ్యి,  పచ్చకర్పూరం, జీడిపప్పు, ఎండుకొబ్బరి కోరుతో తయారుచేసే చలిమిడి మంచి బలవర్ధకం.

★ *కొబ్బరి పాల పాయసం*

కొబ్బరి పాలు, పచ్చ కర్పూరం, యాలకుల పొడి, బాదంపప్పు, కుంకుమపువ్వు, పంచదార, ఆవు పాలు, కలకండ పొడి తో చేసే ఈ ప్రసాదం వెంటనే శక్తినిస్తుంది. మంచి బలవర్ధకం. శ్రేష్మాన్ని హరిస్తుంది.

Tuesday, January 30, 2024

దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి? శంఖాన్ని ఎప్పుడు పూజించాలి?


దక్షిణామూర్తి శంఖం ప్రాధాన్యత ఏంటి? శంఖాన్ని ఎప్పుడు పూజించాలి?


భారతీయ సనాతన ధర్మంలో శంఖానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. మన పురాణాలలో మహా విష్ణువు శంఖ చక్రాలను ధరించడం శివుడు కూడా అనేక సందర్భాలలో శంఖాలని ధరించాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు పాంచజన్యం అనేటటువంటి శంఖమును ఉపయోగించడం ఇవన్నీ కూడా శంఖము ప్రాధాన్యతను తెలుపుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త (బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శివుడుకు చేసే అభిషేకాలలో శంఖం ద్వారా నీటిని పోసి అభిషేకం చేయడం కూడా శ్రేష్టముగా భావిస్తారు. శంఖము ద్వారా కూడా తీర్థాన్ని అందచేస్తారు. శంఖం లక్షీ స్వరూపమని పాలసముద్రంలో లక్ష్మీదేవితో పాటు శంఖము ఆవిర్భవించినట్లుగా పురాణాలు తెలియచేస్తున్నాయి. అందుకే శంఖాన్ని లక్ష్మీస్వరూపముగా కూడా భావిస్తారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ప్రతిరోజు శంఖాన్ని మోగించడం వలన శ్వాసకు సంబంధించిన రోగాలు తొలగుతాయని, ఆరోగ్య సిద్ది కలుగుతుందని శాస్త్రం తెలియచేస్తోంది. పూజ చేసేటప్పుడు ఇంటిలో శంఖాన్ని ఊదడం వలన క్రిమి కీటకాలు వంటివి దూరమవుతాయని చిలకమర్తి తెలిపారు.

శంఖం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు

ఈనాటికి శంఖానికి మన ధార్మిక జీవితములో సంబంధము ఉంది. ప్రజలు శంఖాన్ని పూజింతురు. అర్చన సమయాలలో శంఖనాధము చేస్తారు. శంఖరాజము అన్నికంటె పెద్దదిగా ఉండును. దానిలోపలి భాగము ముత్యం లాగా ఉంటుంది. దాన్ని చెవి దగ్గర పెట్టుకుంటే సముద్ర అలల హోరు వినిపిస్తుంది. వైజ్ఞానికముగా చూసినా కూడా శంఖము సున్నపు అంశముతో తయారు చేయబడింది. మానవుని దేహారోగ్యమునకు (ఎముకలు పెరుగుటకు) సున్నపు అంశము అత్యంత ఆవశ్యకం. వాత పిత్త దోషాలు పోవును. బలము కాంతిని ప్రసాదించును.

శంఖాన్ని ఎప్పుడు పూజించాలి?

శంఖం ద్వారా ఇచ్చే స్వామి తీర్థమును పుచ్చుకొనువారు ఆరోగ్యముగా ఉంటారు. తులసితో కూడిన సాలగ్రామ తీర్థమును శంఖము ద్వారా స్వీకరించినా చాలు. రోగాలు పోతాయని పరమ పురుష సంహిత చెప్పుచున్నదని చిలకమర్తి తెలిపారు. దక్షిణావర్త శంఖం ఉన్న ఇంటిలో అఖండ సంపదలతో లక్ష్మి నివసిస్తుంది.

చాలామంది పూజలో ఈ శంఖాన్ని పెడతారు. పుణ్యదినమున ఇంటిలో పూజచేసి దేవతార్చనలో పెట్టాలి. శ్రీరామనవమి, విజయదశమి, గురు పుష్యమి, రవి పుష్యమి నక్షత్రములు, పుణ్య తిథులు ఉన్న పర్వదినములో తప్పకుండా పూజచేయాలి.

దక్షిణావృత శంఖం ఎప్పుడు ఊదుతారు?

సాత్విక పూజలలో, యజ్ఞాలలో ఉపయోగపడే శంఖము వివిధ సైజులలో ఆకారములలో ఉపయోగిస్తారు. బ్రాహ్మణులు దీనిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది వరకు క్షత్రియులు, వైశ్యులు కూడ పూజలలో ఉపయోగించేవారు. ఈ శంఖాలు సముద్రంలో తెలియాడుతూ సులభంగా దొరుకుతాయి. తెల్లటి శంఖాలు మంచి ఆకారములో ఉండటమే కాదు వాటిని ఎక్కువ పవిత్రమైనదిగా భావిస్తారు. శంఖము కుడివైపును తెరచి ఉన్నది దక్షిణావృత శంఖము అంటారు. గాలి ఊదితే చక్కని ధ్వని వస్తుంది. రామాయణ, మహాభారతములలో దీని ప్రాశస్యము చెప్పబడింది.

నిత్యపూజలు, పండుగలప్పుడు ఈ శంఖం ఊదితే ఆ ధ్వనిని శుభప్రదమైనదని తెలుస్తుంది. ఈ దక్షిణావృత శంఖాలు కన్యాకుమారిలో దొరుకుతాయి. అంతా తెల్లరంగు శంఖము దొరకడం కొంచెం కష్టం అని తెలుస్తుంది. హీరా శంఖం అనునది చిన్నగా ఉండి సరస్సులలో దొరుకుతుంది. ఇది మేలి వజ్రములాగా చాలా విలువగలది. దొరకడం చాలా కష్టము. ఇంటిలో ఒక శంఖమే ఉండాలి కానీ రెండు ఉండగూడదు అని పెద్దలు తెలుపుతారు. కొందరు 4,5,6,7,9 శంఖాలు ఉండవచ్చును అని అంటారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

🌹🌹🌹🙏🙏🙏 పిల్లాడి రుద్రయ్య

Saturday, January 27, 2024

దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు కలిసి ఉంటాయి

దేవాలయాల్లో రావిచెట్టు, వేపచెట్టు ఎందుకు  కలిసి ఉంటాయి


రావిచెట్టుకి అశ్వత్థవృక్షం అని..
బోధివృక్షం అని.
పేర్లు ఉన్నాయి, 
చాలా చోట్ల రావిచెట్టు,వేపచెట్టు ఉంటాయి,
ఎక్కువ చోట్ల రావి,వేప చెట్లు కలిపి ఉంటాయి

రావిచెట్టు పురుషునిగాను, 
వేపచెట్టు స్త్రీగాను భావించి 
హిందువులు ఎక్కువగా పూజిస్తారు.
రావిచెట్టును విష్ణు స్వరూపంగా..
వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా..
భావించి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇలా జంట వృక్షాలను పూజిస్తే 
దాంపత్య దోషములు ఉంటే అవి పరిస్కారం అయ్యి సంసారం అన్యోన్యంగా ఉంటుందని 
శాస్త్రాలు చెబుతున్నాయి..
అందువలన హిందువులకు నమ్మకం.

రావిచెట్టు గురించి పద్మపురాణంలో వివరించి ఉంది
రావిచెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే 
అని ఆగమశాస్త్రాలు కూడా చెబుతున్నాయి.
ఇదే విషయాన్ని స్కంద పురాణం కూడా చెబుతుంది.
అందుకే శ్రీకృష్ణుని వటపత్రశాయి అని కూడా అంటారు.

పిల్లలకి చిన్నప్పుడు పడుకోపెట్టడానికి జోలపాడేవారు.
అపాటలో వటపత్రశాయికి వరహాల లాలి 
అని పాడుతూ నిద్రపుచ్చేవారు.

ఇప్పుడు తల్లులు అటువంటి పాటలు పాడటం లేదు
రామాయణం, భాగవతం కధలు చెప్పడం లేదు
పాత తరం పాత తరమే..
ఆరోజులు మళ్ళీ రావాలని కోరుకుందాం.

జోతిస్య శాస్త్రంలో రావిచెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది.
శనిదోషం పోవాలంటే ప్రతిరోజు 
రావిచెట్టు నీడన నిలబడాలి..!!
రావిచెట్టుకి నమస్కారం చెయ్యాలి..!!
రావిచెట్టుని హత్తుకోవాలి..!!
ఈవిధంగా కొన్ని రోజులు చేస్తే శనిదోషం తొలుగుతుందని శాస్త్రం.

రావిచెట్టు కొమ్మలతో యజ్ఞ యాగాల చేస్తారు..!
సన్యాసులు రావిచెట్టు కర్రను దండంగా చేసుకుంటారు..!!
రావిచెట్టు నీడన కొంచం సేపు కూర్చుంటే బీపీ తగ్గుతుంది..!!
రావిచెట్టు గాలి మంచి ఆలోచనలు కలిగిస్తుంది..!!

శుద్దోధనుని కుమారుడైన సిద్దార్ధుడు..
ఎన్నో సంవత్సరాలు ఎందరినో సేవించిన 
కలగని జ్ఞానోదయం..
రావిచెట్టు కింద విశ్రమించిన తరువాత..
మహాజ్ఞానోదయం కలిగి బుద్ధుడు అయ్యాడు
అందువల్లనే రావిచెట్టును బోధివృక్షం అంటారు

బౌద్ధ మతస్థులకు రావిచెట్టు మహాపవిత్రమైనది.
శ్రీకృష్ణుడు చివరిదశలో రావిచెట్టు క్రిందనే 
ప్రాణత్యాగం చేశాడు అని శాస్త్రాలలో కూడా ఉంది
రావిచెట్టు ఆడ మగ పువ్వులు కాయలు రెండు కాస్తాయి

వేపచెట్టు కూడా ఎన్నో ఔషధ గుణాలు కలిగిన అద్భుతమైన చెట్టు,
వేప చెట్టు ఆకులను ఎన్నో రోగాలకు మందుగా వాడుతున్నారు.

వేప చెట్టు గాలికి..ఎన్నో రోగాలు,క్రిములు నశింపచేసే గుణంఉన్నది. 
వేపాకులను నీటిలో వేసి మరిగించి తాగినా,
స్నానం చేసినా అనేక రోగాలు పోతాయి
అందుకే ఉగాది ముందురోజులలో పొంగుచూపినవారిని వేపాకులపై పడుకోబడతారు.

అమ్మవార్లకు వేపాకు బాగా ఇష్టం 
అందుకే జాతర్ల సమయంలో వేపాకు ఎక్కువగా వాడతారు 
వేపచెట్టు వంటి దివ్య ఔషద వృక్షం భూలోకంలో 
మరొకటి లేదు.

ఇంతకు ముందు ప్రతి ఇంటిదగ్గర వేప చెట్టు ఉండేది
ఇప్పుడు ఎక్కడో ఒకటీ కనిపిస్తుంది.

మన హిందూ సంప్రదాయాలలో ప్రతిఒకటి అద్భుతమే,
ప్రతి ఒక్కటీ జీవనవిధానానికి సంబంధించినవే.

Tuesday, January 23, 2024

మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - ఆదర్శ పురుషుడు

ఎవరు రాసారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉంది.  చదవండి.


ఇంగ్లీషు వాడు, సెక్యులరిజం వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మన దిన వారీ చర్యల్లో మనవెంట నడిచిన దేవుడు .

🌺మనం విలువల్లో , వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన  - ఆదర్శ పురుషుడు

🌺మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన -  అద్దం - రాముడు .

🌺ధర్మం పోత పోస్తే రాముడు
🌺ఆదర్శాలు రూపుకడితే రాముడు 
🌺అందం పోగుపోస్తే రాముడు 
🌺ఆనందం నడిస్తే రాముడు

🌷వేదోపనిషత్తులకు అర్థం రాముడు
🌷మంత్రమూర్తి రాముడు .
🌷పరబ్రహ్మం రాముడు .
🌷లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు

🌺ఎప్పటి త్రేతా యుగ రాముడు ?
🌺ఎన్ని యుగాలు దొర్లిపోయాయి ?
🌺అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా రాముడే

🌺చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -
"శ్రీరామరక్ష సర్వజగద్రక్ష."

🌺బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట - "రామాలాలీ - మేఘశ్యామా లాలీ"

🌺మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - 
శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష.🌺

🌺మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - "అయ్యో రామా"!

🌺వినకూడని మాట వింటే అనాల్సిన మాట -
"రామ రామ"😢

🌺భరించలేని కష్టానికి పర్యాయపదం -
"రాముడి కష్టం "

🌺తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే -" రాముడు"

🌺కష్టం గట్టెక్కే తారక మంత్రం - "శ్రీరామ"

🌺విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట -"శ్రీరామ రామ రామేతి"

🌺అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - 
"అన్నమో రామచంద్రా"

🌺వయసుడిగిన వేళ అనాల్సిన మాట -
"కృష్ణా రామా !"

🌺తిరుగులేని మాటకు - " రామబాణం "

🌺సకల సుఖశాంతుల పాలనకు పర్యాయ పదం - "రామరాజ్యం"

🌺ఆదర్శమయిన పాలనకు - రాముడి పాలన

🌺ఆజానుబాహుడి పోలికకు - రాముడు

🌺అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు- రాముడు 

🌺రాముడు ఎప్పుడూ మంచి బాలుడే 🌺

🌺ఆదర్శ దాంపత్యానికి " సీతారాములు"

🌺గొప్ప కొడుకు - "రాముడు"

🌺అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక  - "రామలక్ష్మణులు"

🌺గొప్ప విద్యార్ధి రాముడు
(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు ) .

🌺మంచి మిత్రుడు- రాముడు
(గుహుడు చెప్పాడు).

🌺మంచి స్వామి రాముడు
(హనుమ చెప్పారు).

🌺కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - 
రాముడు 
🌺నోరున్నందుకు పలకాల్సిన నామం - రాముడు 
🌺చెవులున్నందుకు వినాల్సిన కథ - రాముడు 🌺చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - రాముడు 
🌺జన్మ తరించడానికి - రాముడు , రాముడు, రాముడు .🌺

🌺రామాయణం పలుకుబళ్లు...🌺

మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది .

తెలుగులో కూడా అంతే .

🌺ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని
అడిగినట్లే ఉంటుంది ...

🌺చెప్పడానికి వీలుకాకపోతే -
అబ్బో అదొక రామాయణం .

🌺జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే
సుగ్రీవాజ్ఞ , లక్ష్మణ రేఖ .

🌺ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -
అదొక పుష్పకవిమానం

🌺కబళించే చేతులు , చేష్టలు
కబంధ హస్తాలు .

🌺వికారంగా ఉంటే -
శూర్పణఖ

🌺చూసిరమ్మంటే కాల్చి రావడం (హనుమ ).

🌺పెద్ద పెద్ద అడుగులు వేస్తే -
అంగదుడి అంగలు.

🌺మెలకువలేని నిద్ర
కుంభకర్ణ నిద్ర

🌺పెద్ద ఇల్లు
లంకంత ఇల్లు .

🌺ఎంగిలిచేసి పెడితే - శబరి

🌺ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - ఋష్యశృంగుడు

🌺అల్లరి మూకలకు నిలయం
కిష్కింధ 

🌺విషమ పరీక్షలన్నీ మనకు రోజూ -
అగ్ని పరీక్షలే .

🌺పితూరీలు చెప్పేవారందరూ -
మంథరలే.

🌺సాయం చేసినపుడు- ఉడుతా భక్తి..
🌺కార్యాన్ని సాధించినపుడు - హనుమ యుక్తి..
🌺 గొడవ కు దిగే వాళ్ళ పేరు - లంకిణి

🌺యుద్ధమంటే రామరావణ యుద్ధమే .

🌺ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ -
(రావణ కాష్టాలే .)

😂కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది
(ఇది విచిత్రమయిన ప్రయోగం ).

🌺సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు . 
🌺బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. 
🌺ఒక ఊళ్లో పడుకుని ఉంటారు.
🌺ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు . 
🌺ఒక ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు

🌺ఒంటిమిట్టది ఒక కథ ..
🌺భద్రాద్రిది ఒక కథ
🌺అసలు రామాయణమే మన కథ .
🌺అది రాస్తే రామాయణం
🌺చెబితే మహా భారతం
🌺రామాలయం లేని గ్రామం లేదు అంటే అతిశయోక్తి కాదు.
🌺ముందుగా శ్రీరామ నామం రాయని పద్దు, ఉత్తరం ఉండేది కాదు
🌺ఉత్తర భారతం లో హలో పలకరింపు రామ్..రామ్.
🌺 దోస్తు విడిపోయారు అనుకోవలన్నా నీకూ నాకూ రాం రాం

🌺అందుకే ఇప్పటి దక్షిణాసియా దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాలో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు.

🌺రామాయణ కథలు మనకంటే చక్కగా ముస్లిం మెజార్టీ  దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు

🌺|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే 
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||🌺

అయోధ్య బాల రాముని ఆభరణాల ప్రత్యేకత

అయోధ్య బాల రాముని ఆభరణాల ప్రత్యేకత 


   అయోధ్య: బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న బాలుడు కాబట్టి ఆడుకోవడం కోసం బొమ్మలను కూడా అందుబాటులో ఉంచారు. ఏనుగు, గుర్రం, ఒంటె, బండి వంటివాటిని పెట్టారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఈ వివరాలను వెల్లడించింది.

 *కిరీటం :* బాల రాముడు ధరించిన బంగారు కిరీటంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ కిరీటంలో వజ్రాలు, పచ్చ రాళ్లు, మరకత, మాణిక్యాలను పొదిగారు. దీనిని ఉత్తర భారత దేశ సంప్రదాయంలో తయారు చేశారు. కిరీటం కుడివైపున ముత్యాల దండలను వేలాడదీశారు.

 *కౌస్తుభమణి :*  బాల రాముని హృదయ భాగంలో ఉంచిన కౌస్తుభ మణిని కెంపులు, వజ్రాలతో అలంకరించారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిలోనూ ఇది కనిపిస్తుంది.

 *విజయమాల :* బాల రాముడు ధరించిన ఆభరణాల్లో ఇది చాలా పొడవైనది. కెంపులు పొదిగిన ఈ హారం విజయానికి చిహ్నంగా నిలుస్తుంది. వైష్ణవ సంప్రదాయ చిహ్నాలైన సుదర్శన చక్రం, కమలం, శంఖం, మంగళ కలశం దీనిలో ఉన్నాయి.

*కంఠాభరణం :* అర్ధ చంద్రాకారంలో ఉన్న మరొక హారంలో అదృష్టాన్ని సూచించే పూల డిజైన్లు ఉన్నాయి. మధ్య భాగంలో సూర్య దేవుని బొమ్మ ఉంది. ఈ హారాన్ని కంఠాభరణం అంటారు. నడుముకు అమర్చిన ఆభరణంలో వజ్రాలు, మరకత, మాణిక్యాలు, కెంపులను పొదిగారు. వజ్రాలు, పచ్చరాళ్లు, ముత్యాలను పొదిగిన పాదిక అనే హారాన్ని నాభి వద్ద అలంకరించారు. అదేవిధంగా భుజకీర్తులు, మండ గొలుసులు, ఉంగరాలను కూడా బాల రామునికి ధరింపజేశారు. బాల రాముని కాళ్లకు కడియాలు, కాలి వేళ్లకు చుట్లు పెట్టారు. వీటన్నిటిలోనూ వజ్రాలు, కెంపులను పొదిగారు. ముత్యాలు, పచ్చ రాళ్లు పొదిగిన బంగారు విల్లు, ఓ బాణం కూడా బాల రాముని చేతుల్లో ఉన్నాయి. వజ్రాలు, కెంపులతో వెండి-ఎరుపు రంగుల్లో నుదుటిపై తిలకాన్ని పెట్టారు. వాల్మీకి రామాయణం, ఆధ్యాత్మ రామాయణం, రామచరితమానస్‌ వంటి గ్రంథాలను విస్తృతంగా అధ్యయనం చేసి ఈ ఆభరణాలను తయారు చేయించినట్లు ట్రస్ట్‌ వెల్లడించింది.

పసుపు రంగు పంచె, ఎరుపు రంగు అంగ వస్ర్తాలను బెనారస్‌ వస్ర్తాలతో తయారు చేయించారు. వీటిపైన శంఖం, పద్మం, చక్రం, నెమలి బొమ్మలు ఉన్నాయి. ఆకర్షణీయమైన జరీ అంచులు ఉన్నాయి.

🚩 *జై శ్రీరామ్* 🙏🏻

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.

ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు ...

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం.


పురాణకథ ప్రకారం, ...
ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.

స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు:

1. తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.

2. మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం.

3. పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.

4. తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది

5. కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.

పంచముఖ హనుమాన్:

శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఇలా చెప్పబడ్డాయి.

1 తూర్పుముఖముగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు.

2 దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు.

3 పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావలను పోగొట్టీ, శరీరానికి కలిగే విష ప్రభావలనుండి రక్షిస్తాడు.

4 ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు.

5 ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తాడు.

హనుమంతుడి సందేశం ?

హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట –

‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని.

కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు.

మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!

ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక.

‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'.

ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

హనుమంతుడు మానవాళికి ఏకైక ఆదర్శమా?

'ధర్మ ఏవ హతో హన్తి'

ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనల్ని దెబ్బతీస్తుంది. ధర్మసేవ చేయాలనుకునేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజముయిన ధర్మసేవకుడు అతడే. హనుమంతుడిని రాముని సేవకుడని చెప్పుకుంటూ ఉంటాం. అక్కడ రామశబ్దాన్ని 'రామో విగ్రహవాన్ ధర్మః' అన్న దాన్ని బట్టి ధర్మంగానే స్వీకరించాలి. ధర్మ రక్షణకోసం రాముడు అవతరిస్తే అతని రూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. త్రేతాయుగంలో రావణాదులని వధించి ధర్మాన్ని రక్షించడం కోసం శ్రీరాముడు అవతరించాడు. ఆ ధర్మ కార్యం హనుమంతుడి సహకారంతోనే జరిగింది. రాముని సేవకుడైతే రాముడు పుట్టినప్పటినుండీ అతనిసేవలో హనుమంతుడు ఉండాలి. కానీ రాముడు ధర్మకార్యం ఆరంభించినప్పటినుండి మాత్రమే హనుమతుడు రాముడితో ఉన్నాడు. అందుకే రాముడికీ, హనుమంతుడికీ పరిచయం కిష్కింద కాండ దాకా జరగలేదు. అలాగే ధర్మ కార్యం ముగియగానే హనుమంతుడు గంధమాదన పర్వతంపై తపోనిష్టుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు తప్ప రామునితో రాజభోగాలు అనుభవించలేదు. ధర్మకార్యంలో తన అవసరం ఉన్నప్పుడల్లా రాముడికి తోడుగా నిలిచాడు. త్రేతాయుగంలో ధర్మస్థాపనలో కీలకపాత్రే వహించినవాడు హనుమంతుడు. రామరావణ యుద్ధం అనే ధర్మయుద్ధంలో విజయకారకుడు హనుమంతుడు.

ద్వాపరయుగంలో ధర్మాధర్మాలమధ్య జరిగిన యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం. అందులో ధర్మం విజయం సాధించింది. అటువంటి ద్వాపరయుగంలో ధర్మవిజయంలో కూడా హనుమంతుడిది కీలకపత్రే. కాకపొతే త్రేతాయుగంలో ధర్మ విజయానికి ప్రత్యక్షంగా కారణం కాగా ద్వాపర యుగంలో విజయానికి పరోక్షంగా కారకుడు అయ్యాడు. కురుక్షేత్ర సంగ్రామ విజయం తర్వాత ధర్మ రక్షణ భీమార్జునుల భుజస్కంధాల మీదే ఉంచబడింది. అటువంటి భీమార్జునులను ఇరువురినీ బలపరీక్ష, ధర్మ రక్షకులకు గర్వం తగదని బోధించి, అభయమిచ్చి, అండగా నిలిచి వారి విజయానికి పరోక్షంగా కారకుడు అయినవాడు హనుమంతుడు. విజయుడికి వరమిచ్చిన ప్రకారం అమ్ములవారధిని అవలీలగా పడగొట్టి కూడా ఓటమిని అంగీకరించి అర్జునుడి రథటెక్కం మీద ఉండి ధర్మ విజయ కారకుడు అయ్యాడు హనుమంతుడు.

సౌగంధిక కుసుమాన్ని పురుష మృగాన్ని తేవటంలో భీముడిని పరీక్షించి అనుగ్రహించి విజయం వరించాలని వరం ఇచ్చాడు. 'కపిధ్వజప్రభల అంధీబూతులన్ జేయవే' అని తిక్కన అన్నట్టు కౌరవసేన కళ్ళు హనుమంతుని తేజ ప్రభలతో బైర్లుకమ్మి యుద్ధం చేయటంలో ఆశక్తమయింది. హనుమంతుడు టెక్కం మీద ఉన్నందు వల్లనే శతృపక్షపు భయంకర ఆగ్నేయాస్త్రాదుల వల్ల రథం దగ్ధం కాకుండా ఉందని శ్రీకృష్ణడు అర్జునుడికి నిరూపించాడు. అలా ద్వాపరయుగంలోనూ ధర్మ విజయానికి కారకుడు హనుమంతుడు. ఇతిహాసపురాణాలు, చారిత్రిక సత్యాలు, ధర్మరక్షణలో హనుమంతుడు ఒక్కడే దిక్కు అని చెబుతున్నాయి. సకల సద్గుణ గరిష్టుడు, సర్వ శక్తిమంతుడు అయిన హనుమంతుడిని ఆదర్శంగా స్వీకరించినప్పుడే మానవజాతి ధర్మరక్షణలో కృతకృత్యం అవుతారు.

శ్రీ హనుమత్కుండం ?

స్కంద పురాణంలో బ్రహ్మ ఖండంలో రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించ బడింది. అవి చక్ర తీర్ధం, భేతాళ వరద తీర్ధం, పాప వినాశనం, సీతా సరస్సు, మంగళ తీర్ధం, అమృత వాపిక, బ్రహ్మ కుండము, హనుమత్కుండం, అగస్త్య తీర్ధం, రామ తీర్ధం, లక్ష్మణ తీర్ధం, జటా తీర్ధం, లక్ష్మీ తీర్ధం, అగ్ని తీర్ధం, శివ తీర్ధం, శంఖ తీర్ధం, యమునా తీర్ధం, గంగా తీర్ధం, గయా తీర్ధం, కోటి తీర్ధం, స్వాధ్యామృత తీర్ధం, సర్వ తీర్ధం, ధనుష్కోటి తీర్ధం, మానస తీర్ధం.

రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీ రాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన "పుల్ల'' గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్త విషయాన్ని కూడా తెలిపి, ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.

హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించి పోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి ఇసుకతో లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు' ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. విషయం తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి "రామా! నన్ను అవమానిస్తావా? సైకైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు? ఇంకో చోట ప్రతిష్ట చేయటం కోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది? నాకీ జీవితం వద్దు. నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను "అని దూకబోతుండగా రాముడు వారించాడు"’అన్నా హనుమన్నా! మనిషి తను చేసిన కర్మఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు. దుఖం పొందటం వివేకికి తగనిపని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్థాపిద్దాం. ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరెయ్యి'' అన్నాడు.

అప్పుడు హనుమ తన తోకను ఇసుకలింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఇసుమంత కూడా కదలలేదు. మళ్ళీ ప్రయత్నం చేసి వీలుగాక నెత్తురు కక్కు కొంటు దూరంగా పడిపోయాడు. పడిన చోట హనుమ ముక్కులు, చెవులు, నోటి నుండి విపరీతంగా రక్తం కారి ఒక సరస్సుగా మారింది. హనుమ స్పృహ కోల్పోయాడు. అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్ళి, అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకొని సేదతీర్చాడు. అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు. కొంతసేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది. అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతారాములు ప్రతిష్టించారు. హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే "హనుమత్కుండం''. ఇది రామేశ్వరానికి కొద్దిదూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతా రాములు అనుగ్రహించారు.

సూర్యాంజనేయం ?

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు.

బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం.

సూర్యశిష్యరికం :

బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.

సూర్యుపుత్రునికి స్నేహితుడు :

సూర్యభగవానుని శిష్యుడైన హనుమంతుడు సూర్యపుత్రుడైన సుగ్రీవునికి మంత్రిగా, మిత్రునిగా సలహాలను, సహాయాన్ని అందించాడు. వాలికి భయపడి దేశాలు పట్టి తిరిగిన కాలంలో సుగ్రీవునికి చేదోడు వాదోడుగా మెలిగాడు. సూర్యపుత్రుడైన సుగ్రీవునికి, సూర్యవంశీయుడైన శ్రీరామునికి చెలిమి ఏర్పడటానికి కారకుడు ఆంజనేయుడే. అంతేగాక రావణ సంహారానికి తోడ్పడే నరవానర మైత్రికి బీజం వేసినవాడు కూడా హనుమంతుడే.

సూర్యుని మనుమడు : కొన్ని పురాణాల ప్రకారం హనుమంతుని తల్లి అంజనాదేవి సూర్యుసుతుడైన సుగ్రీవునికి సోదరి. అంటే హనుమంతుడు సుగ్రీవునికి మేనల్లుడు. కనుక సూర్యుడు హనుమంతుడికి తాత.

సూర్యుని అల్లుడు : వాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది.

సూర్యవంశీయుని భక్తుడు : హనుమంతుని ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు కావడం విశేషం. తన గురువు వంశంలో అవతరించిన మహాపురుషుని సేవించుకునే మహాద్భాగ్యం హనుమంతునికి దక్కింది. గురువు ఋణం తీర్చుకోవడానికి ఇది గొప్ప అవకాశం. శ్రీరామునితో పరిచయమైనా నాటినుండి హనుమంతుడు రాముని సేవకే అంకితమయ్యాడు. అనితర సాధ్యమైన సముద్ర లంఘనం చేసి, శత్రు దుర్భేద్యమైన లంకలో సీతమ్మ జాడ కనిపెట్టడం ద్వారా శ్రీరామునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. సంజీవినిని తెచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. సీతారాములను హృదయంలో నిలుపుకోవడం హనుమంతుని భక్తికి పరాకాష్ట. శ్రీరామభక్తులకు హనుమంతుడు సర్వదా సంరక్షకుడిగా ఉంటాడు.

త్రిమూర్తుల శక్తి : సూర్యవంశ సంజాతుడైన శ్రీరాముడు మహావిష్ణువు అవతారం. హనుమంతుడు శివాంశ సంభూతుడు. అంటే రామాంజనేయుల అనుబంధం శివకేశవుల అభేదానికి ప్రతీక. హనుమంతుని భవిష్యబ్రహ్మగా కూడా పురాణాలు పేర్కొన్నాయి. కనుక వీరిద్దరి కలయికతో త్రిమూర్తులు ఏకామైనట్టే. సూర్యుని కూడా త్రిమూత్రుల స్వరూపంగా శాస్త్రాలు నిర్వచించాయి. కాబట్టి శ్రీ సూర్యరామాంజనేయులను ద్విగుణీకృతమైన శక్తికి సంకేతంగా అభివర్ణించ వచ్చు. ఇలా గురుశిష్య బంధంగా మొదలైన సూర్యాంజనేయుల అనుబంధం త్రిమూర్త్యాత్మకంగా విస్తరించింది.

హనుమాన్ మంగళ హారతి

శ్రీ రామ చంద్ర సేవకాయ వజ్రదేహ పంజరాయ
వారధి భంధనాయ మారుతి మంగళం

అంజనీ తప: ఫలాయ ఆత్మయోగ తత్పరాయ
సత్య ధీర పరాక్రమాయ వీర మంగళం

అష్ట సిద్ధి యోగావేద్యా దుష్ట బుద్ధి నాశకాయ
నిత్యముక్తి కర్మకాయ వీర మంగళం

భాను వంశరక్షకాయ సర్వశాస్త్ర పారగాయ
శ్రీ రామచేంద్ర సేవకాయ వీర మంగళం

శాంత దాంత భూషణాయ శత్రుగర్వ శోషణాయ
మొహ భంద ఛేదకాయ వీర మంగళం

సుప్రసన్న వీక్షనాయ సూర్య బింబ భక్షకాయ
సర్వదేవ వంద్య పాత్ర వీర మంగళం

భానుపుత్ర మంత్రి వర్య భానుమూర్తి శిష్య వర్య
వేదశాస్త్ర ధర్మవేద్య వీర మంగళం

దైవకార్య పోషకాయ దైత్యమాయ నాశకాయ
గోష్పధీకృతార్ణవాయ వీర మంగళం

ఆదివిష్ణు సేవకాయ గూఢకార్య సాధకాయ
సర్వలోక ప్రాణ పుత్ర వీర మంగళం

రామ భక్త వత్సాలాయ భీమగర్వ భంజనాయ
సర్వ దు:ఖ నాశకాయ వీర మంగళం

నిత్య శుద్ధ మానసాయ సత్య భద్ధ కర్మణాయ
కామ రూప ధారకాయ వీర మంగళం

దానతాప నాశకాయ దేవలోక వందితాయ
రక్తమాల భూషణాయ వీర మంగళం

శాకినీ పిశాచ నాశ ధాకినీ గ్రహాది నాశ
క్షుద్రదేవ నాశకాయ వీర మంగళం

సీతాదు:ఖ నాశకాయ పాపకర్మ భంజకాయ
మాయా మంత్ర ఛేదకాయ వీర మంగళం

రామ రూప పూజకాయ రామనామ కీర్తనాయ
రామ కదా ప్రసంగాయ వీర మంగళం

Monday, January 22, 2024

హనుమంతునికి ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?

హనుమంతునికి ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. 
ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చేస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. ‘ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా’ అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ, భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు, అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.

‘శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్’

శ్లో|| ఆంజనేయం మహావీరం-బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభంశాంతం – రామదూతం నమామ్యహం
శ్లో|| మర్కటే శ మహొ త్సాహ- సర్వశోక వినాశన
శత్రూన్సంహర మాం రక్ష – శ్రియం దాపయ మే ప్రభో||

అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి

”యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు”

అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిర స్స్నానం, నేలపడక, సాత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.

ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తొలగునట్లు చేయాలి. హనుమత్ప్రదక్షిణ ధ్యానం శిలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.


Sunday, January 21, 2024

అయోధ్య బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ట

అయోధ్య బాల శ్రీరాముని ప్రాణప్రతిష్ట శుభాకాంక్షలు అందరికి /   

                                                     Greetings on the Prana Prathishta of Ayodhya Bala Sri Ram 🌹*
*22-1-2024*

*జై శ్రీరామ జయ రామ జయ జయ రామ -  అనే విజయమహామంత్రమును  అందరమూ కలిసి సామూహికంగా  జపిద్దాము  ప్రాణ ప్రతిష్ట రోజున దేవతలను ప్రసన్నం చేసుకోడానికి సాయంకాల సమయంలో ఇంటి ముందు అయిదు దీపాలు వెలిగించి   అయోధ్య రామయ్య ఆగమనానికి ఆహ్వానం పలుకుదాం.*

*🌻 శ్రీ రామ జన్మభూమి మందిర విశేషాలు 🌻*

*1. ఆలయం సాంప్రదాయ నాగర్ శైలిలో ఉంది.*

*2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు.*

*3. ఆలయం మూడు అంతస్తులు, ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి.*

*4. ప్రధాన గర్భగుడిలో, భగవాన్ శ్రీరాముని చిన్ననాటి రూపం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది.*

*5. ఐదు మండపాలు (హాల్) - నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మరియు కీర్తన మండపాలు.*

*6. దేవతలు, మరియు దేవతల విగ్రహాలు స్తంభాలు మరియు గోడలను అలంకరించాయి.*

*7. ప్రవేశం తూర్పు నుండి, సింగ్ ద్వారం గుండా 32 మెట్లు*

*8. వికలాంగులు మరియు వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు మరియు లిఫ్టుల ఏర్పాటు.*

*9. మందిర్ చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో పార్కోట (దీర్ఘచతురస్రాకార సమ్మేళనం గోడ).*

*10. సమ్మేళనం యొక్క నాలుగు మూలల్లో, నాలుగు మందిరాలు ఉన్నాయి - సూర్య దేవ్, దేవి భగవతి, గణేష్ భగవాన్ మరియు భగవాన్ శివులకు అంకితం చేయబడింది. ఉత్తర భుజంలో మాతా అన్నపూర్ణ ఆలయం మరియు దక్షిణ వైపు  హనుమాన్ జీ ఆలయం ఉన్నాయి.*

*11. మందిర్ సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూప్) ఉంది.*

*12. శ్రీ రామ జన్మభూమి మందిర్ ‌లో, మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, మాతా షబ్రి మరియు దేవి అహల్య యొక్క గౌరవనీయమైన భార్యకు అంకితం చేయబడిన ప్రతిపాదిత మందిరాలు ఉన్నాయి.*

*13. మందిరం యొక్క నైరుతి భాగంలో, కుబేర్ తిలా వద్ద, భగవాన్ శివుని పురాతన మందిరం, జటాయుని స్థాపనతో పాటు పునరుద్ధరించబడింది.*

*14. గుడిలో ఎక్కడా ఇనుము వాడలేదు.*

*15. మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించబడింది, ఇది కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.*

*16. నేల తేమ నుండి రక్షణ కోసం, గ్రానైట్ ఉపయోగించి 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించబడింది.*

*17. మందిర్ కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని భద్రత కోసం నీటి సరఫరా మరియు స్వతంత్ర విద్యుత్ కేంద్రం ఉన్నాయి.*

*18. 25,000 మంది వ్యక్తుల సామర్థ్యంతో ఒక యాత్రికుల సౌకర్య కేంద్రం (PFC) నిర్మించబడుతోంది, ఇది యాత్రికులకు వైద్య సదుపాయాలు & లాకర్ సౌకర్యాన్ని అందిస్తుంది.*

*19. కాంప్లెక్స్‌లో స్నానపు ప్రాంతం, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు మొదలైన వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.*

*20. ఆలయం పూర్తిగా భారత సాంప్రదాయ మరియు స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మించబడుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండడంతో పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దీనిని నిర్మిస్తున్నారు.*
🌹🌹🌹🌹🌹

*🌹. Greetings on the Prana Prathishta of Ayodhya Bala Sri Ram 🌹*
*22-1-2024*
*🪷 Prasad Bharadwaj*

Let's chant the Vijaya Mahamantra  - Jai Sri Rama Jaya Rama Jaya Jaya Rama - together. On the Prana Pratishta day, let's light five lamps earlier in the evening to please the gods and invite the arrival of Ayodhya Rama.*

*🌻 Features of Sri Rama Janmabhoomi Mandir 🌻*

*1. The temple is in traditional Nagar style.*

*2. The length (east-west) of the shrine is 380 feet, width 250 feet, height 161 feet.*

*3. The temple has three floors and each floor is 20 feet high. It has a total of 392 pillars and 44 doors.*

*4. In the main sanctum sanctorum, there is a childhood form of Lord Sri Ram (Sri Ram Lalla Vigraham) and on the first floor is the Sri Ram Darbar.*

*5. Five Mandapams (Hall) – Nritya Mandapam, Ranga Mandapam, Sabha Mandapam, Prayer and Kirtan Mandapam.*

*6. Deities, and idols of deities adorn the pillars and walls.*

*7. Entrance is from the east, through the Singh Gate 32 steps*

*8. Provision of ramps and lifts for the convenience of disabled and elderly persons.*

*9. The mandir is surrounded by a parkota (rectangular compound wall) 732 meters long and 14 feet wide.*

*10. At the four corners of the compound, there are four mandirs – dedicated to Surya Dev, Devi Bhagwati, Lord Ganesh and Lord Shiva. There is a Mata Annapurna temple on the north side and a Hanuman ji temple on the south side.*

*11. Near the Mandir is an ancient historical well (Sita Koop).*

*12. In Sri Rama Janmabhoomi Mandir, there are proposed shrines dedicated to Maharshi Valmiki, Maharshi Vashishtha, Maharshi Vishwamitra, Maharshi Agastya, Nishad Raj, Mata Shabri and the revered consort of Devi Ahalya.*

*13. In the south-west part of the shrine, at Kuber Tila, an ancient shrine of Lord Shiva was renovated along with the establishment of Jatayu.*

*14. No iron was used anywhere in the temple.*

*15. The foundation of the mandir is constructed of 14-metre thick roller-compacted concrete (RCC), which gives it an artificial rock look.*

*16. To protect the soil from moisture, a 21 feet high foundation was constructed using granite.*

*17. The mandir complex has a sewage treatment plant, water treatment plant, water supply for fire safety and an independent power station.*

*18. A Pilgrims' Facility Center (PFC) with a capacity of 25,000 persons is being constructed which will provide medical facilities & locker facility to pilgrims.*

*19. The complex also has a separate block with bathing area, washrooms, washbasin, open taps etc.*

*20. The temple is being built entirely using Indian traditional and indigenous technology. It is being built with special emphasis on eco-water conservation as 70% of the 70 acres area is green.*
🌹🌹🌹🌹

గ్రామదేవతల ఆవిర్భావము



*గ్రామదేవతల ఆవిర్భావము*


*🐥పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.*

*పృధ్వీ దేవత:*

*పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.*

*జల దేవత:*

*జలానికి సంభందించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.*

*అగ్ని దేవత:*

*మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).*

*వాయు దేవత:*

*నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.*

*ఆకాశ దేవత:*

*ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.*

*గ్రామదేవతా వ్యవస్థ:*

*గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపలను గ్రామదేవతలని అందురు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా – అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సంధర్బాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.*

*ఈ దేవతా ప్రతిష్ట గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ట శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.*

*పోషణ, రక్షణ నిచ్చే గ్రామదేవతలు:*

*ఇక ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన వాటిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా ఈమె ‘తలుపులమ్మ’గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెల్లేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్దించి వెళ్ళడం చేస్తారు. వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది. పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.*
        💦🐋🐥🐬💦

Saturday, January 20, 2024

పిల్లలకి ఇక ఇలా నేర్పించండి శ్రీరామ నామావళి

పిల్లలకి ఇక ఇలా నేర్పించండి
శ్రీరామ నామావళి


A - అయోధ్య రామ
B - భార్గవ రామ
C - చిన్మయ రామ
D- దశరధ రామ
E - ఈశ్వర రామ
F - ఫల్గుణ రామ
G - గుణాత్మక రామ
H - హనుమత రామ
I -  ఇనయ రామ
J - జగదభి రామ
K - కౌసల్య రామ
L - లక్ష్మణ రామ
M - మర్యాద రామ
N - నరహరి రామ
O -  ఓంకార రామ
P - పురుషోత్తమ రామ
Q - కుశలవ రామ
R - రఘుకుల రామ
S - సీతా రామ
T - తారక రామ
U - ఉదాత్త రామ
V - వసిష్ఠ రామ
W - వైకుంఠ రామ
X - జితేంద్ర రామ
Y - యోగిత రామ
Z - జనహిత రామ

Friday, January 19, 2024

108 దీప లక్ష్మీల పూజా విధాన శ్లోకాలు.

108 దీప లక్ష్మీల పూజా విధాన శ్లోకాలు.


1::దీపలక్ష్మీ నమస్తుభ్యం సర్వ మంగళ రూపిణీ
ఆయురారోగ్యయైశ్వర్యం యావజ్జీవ మరోగతాం
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః

2::దీపదేవి మహాదేవీ సర్వవిద్యా ప్రకాశినీ
విద్యాం దేహి శ్రియం దేహి సర్వ కామ్యాంశ్చ దేహిమే
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవ్యై నమః

3::దీపజ్యోతి నమస్తుభ్యం సర్వదేవ స్వరూపిణీ
సౌఖ్యం దేహి బలం దేహి సామ్రాజ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం దీపజ్యోతిషే నమః

4::జ్యోతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి విలాసినీ
గృహం దేహి ధనం దేహి విద్యాం దేహి మహేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః

5::ఆది లక్ష్మి నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణీ
గృహం దేహి ఫలం దేహి ధాన్యం దేహి సురేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆదిలక్ష్మ్యై నమః

6::ధనలక్ష్మి నమస్తుభ్యం ధనధాన్య వివర్ధినీ
ధాన్యం దేహి ధనం దేహి రాజ్యం దేహి రమేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం ధనలక్ష్మ్యై నమః

7::ధాన్యలక్ష్మి నమస్తేస్తు దానశీల స్వరూపిణీ
శ్రియం దేహి గృహం దేహి వ్రీహి దేహి ధనేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం దాన్యలక్ష్మ్యై నమః

8::విద్యాలక్ష్మి నమస్తేస్తు సర్వవిద్యాప్రదాయినీ
విద్యాం దేహి జయం దేహి సర్వత్ర విజయం సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం విద్యాలక్ష్మ్యై నమః

9::ధైర్యలక్ష్మి నమస్తుభ్యం సర్వ శౌర్య ప్రదాయినీ
వీర్యం దేహి జయం దేహి ధైర్యం దేహి శ్రియేశ్వరీ
ఓం హ్రీం శ్రీం హ్రీం ధైర్యలక్ష్మ్యై నమః

10:జయలక్ష్మి నమస్తుభ్యం సర్వత్ర జయదాయినీ
జయందేహి శ్రియందేహి విజయం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం జయలక్ష్మ్యై నమః

11: విజయలక్ష్మీ నమస్తేస్తు సర్వత్ర విజయంవహే
వీర్యం దేహి వరం దేహి శౌర్యం దేహి జనేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం విజయలక్ష్మ్యై నమః

12:వీరలక్ష్మి నమస్తుభ్యం వీరదీర విదాయినీ
ధైర్యం దేహి జయం దేహి వీర్యం దేహి జయేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం వీరలక్ష్మ్యై నమః

13: రాజ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వసామ్రాజ్య దాయినీ
రాజ్యందేహి శ్రియందేహి రాజేశ్వరి నమోస్తుతే
ఓం హ్రీం శ్రీం హ్రీం రాజ్యలక్ష్మ్యై నమః

14:వరలక్ష్మీ నమస్తేస్తు సౌమాంగల్య వివర్ధినీ
మేధాం దేహి ప్రియం దేహి మాంగల్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం వరలక్ష్మ్యై నమః

15:హేమలక్ష్మి నమస్తుభ్యం కనకవర్ణ స్వరూపిణీ
శ్రియం దేహి ధనం దేహి హిరణ్యం దేహిమేసదా
ఓం హ్రీం శ్రీం హ్రీం హిరణ్యలక్ష్మ్యై నమః

16:గృహలక్ష్మీ నమస్తుభ్యం శంఖ పద్మ నిధీశ్వరి
శాంతిం దేహి శ్రియం దేహి యశో దేహి ద్విషోజహి
ఓం హ్రీం శ్రీం హ్రీం గృహలక్ష్మ్యై నమః

17:అన్నలక్ష్మి నమస్తుభ్యం అన్నపూర్ణ స్వరూపిణీ
అన్నం దేహి ఘ్రుతం దేహి ఇష్టాన్నం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం అన్నలక్ష్మ్యై నమః

18:గోలక్ష్మీనమస్తేస్తు గోవర్ధన ధరప్రియే
గవాం దేహి ప్రియాం దేహి సర్వం దేహి శివేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం గోలక్ష్మ్యై నమః

19:కీర్తి లక్ష్మీ నమస్తుభ్యం ఆదిమూల ప్రియేశ్వరీ
కీర్తిం దేహి శుభం దేహి శోభనం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం కీర్తిలక్ష్మ్యై నమః

20:సంతానలక్ష్మి నమస్తుభ్యం సర్వసౌభాగ్యదాయినీ
పుత్రాన్ దేహి ధనం దేహి పౌత్రాన్ దేహి సుధేశ్వరి
ఓం హ్రీం శ్రీం హ్రీం సంతానలక్ష్మ్యై నమః

21:రూపలక్ష్మి నమస్తుభ్యం సౌందర్య లహరీశ్వరీ
రూపం దేహి ప్రియం దేహి లావణ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం సౌందర్యలక్ష్మ్యై నమః

22:భోగలక్ష్మీ నమస్తుభ్యం సర్వసంతోషదాయినీ
భోగందేహి శ్రియం దేహి సౌభాగ్యం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం భోగలక్ష్మ్యై నమః

23:భాగ్యలక్ష్మీ నమస్తుభ్యం సర్వ సౌభాగ్య శాలినీ
మతిం దేహి గతిం దేహి మంగళం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం భాగ్యలక్ష్మ్యై నమః

24:సీతాలక్ష్మి నమస్తుభ్యం రామానంద ప్రదాయినీ!
పతిందేహి ప్రియం దేహి భర్తారం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సీతాలక్ష్మ్యై నమః

25:పుష్టి లక్ష్మి నమస్తేస్తు సర్వ సంతుష్టి కారిణీ!
పుష్టిం దేహి దృఢమ్ దేహి పుత్ర వృద్ధి ప్రదాయినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్టి లక్ష్మ్యైనమః

26:తుష్టి లక్ష్మీ నమస్తుభ్యం నారాయణ సమాశ్రితే!
తుష్టిం దేహి మతిం దేహి దుష్టారిష్ట నివారిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం తుష్టి లక్ష్మ్యై నమః

27:కాంతిలక్ష్మి నమస్తుభ్యం సర్వశోభనకారిణీ!
కాంతిం దేహి ప్రియం దేహి సర్వ కామార్ధ సాధకే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కాంతిలక్ష్మ్యై నమః

28:రాధాలక్ష్మి నమస్తుభ్యం వేణుగాన వినోదినీ!
మేధాం దేహి ప్రియం దేహి మహామంగళ రూపిణీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం రాదాలక్ష్మ్యై నమః

29:శాంతిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి!
శాంతం దేహి యశోదేహి దేహిమే రమా శ్రియం!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శాంతిలక్ష్మ్యై నమః

30:మేధా లక్ష్మి నమస్తుభ్యం మధుసూదన కామినీ!
బుద్ధిం దేహి శ్రియం దేహి మహా మేధారావ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం మేధాలక్ష్మ్యై నమః

31:ప్రజ్ఞా లక్ష్మీ నమస్తేస్తు ప్రధాన పురుషేశ్వరీ!
మేధాం దేహి కృపాం దేహి మహీం దేహి జనేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మ్యై నమః

32:భూమిలక్ష్మి నమస్తేస్తు సర్వసస్య ప్రదాయినీ!
మహీం దేహి శ్రియం దేహి మహా మహిమశాలినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భూలక్ష్మ్యై నమః

33:భువనలక్ష్మి నమస్తేస్తు భువనేశ్వరి నమోస్తుతే!
సస్యం దేహి ధనం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

34:దయాలక్ష్మి నమస్తేస్తు దామోదర ప్రియంకరీ!
దయాం దేహి కృపాం దేహి ధరణీధర వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దయాలక్ష్మ్యై నమః

35:శుభలక్ష్మీ నమస్తుభ్యం శుభప్రద గృహేశ్వరి!
శుభం దేహి ధనం దేహి శోభనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం శుభలక్ష్మ్యై నమః

36:క్షేమలక్ష్మీ నమస్తుభ్యం సర్వక్షేత్ర నివాసినీ!
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం మహేశ్వరి!!
ఓం హ్రీం శ్రీం హ్రీం క్షేమలక్ష్మ్యై నమః

37:లాభలక్ష్మీ నమస్తుభ్యం లలితే పరమేశ్వరీ!
లాభందేహి ధనం దేహి కారుణ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం లాభలక్ష్మ్యై నమః

38:గజలక్ష్మీ నమస్తుభ్యం గృహలక్ష్మి నమోస్తుతే!
గృహం దేహి శ్రియం దేహి గజేంద్ర వరదాశ్రితే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం గజలక్ష్మ్యై నమః

39:కృపాలక్ష్మి నమస్తుభ్యం కృష్ణ పత్ని నమోస్తుతే!
కృపాం దేహి దయాం దేహి గరుడధ్వజ వల్లభే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం కృపాలక్ష్మ్యై నమః

40:బిల్వ లక్ష్మి నమస్తుభ్యం అచ్యుత ప్రాణ నాయకే!
సౌఖ్యం దేహి ధృవం దేహి ఆరోగ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః

41:దుర్గాలక్ష్మి నమస్తేస్తు చండముండ వినాశినీ!
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం దుర్గాలక్ష్మ్యై నమః

42:రసలక్ష్మి నమస్తుభ్యం మధురాపుర వాసినీ!
దీనేమయి కృపాం కృత్వా మధురం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం రసలక్ష్మ్యై నమః

43:స్థిరలక్ష్మి నమస్తుభ్యం శ్రీధర ప్రియభామినీ!
భక్తిం దేహి ప్రియం దేహి ముక్తిమార్గ ప్రదర్శినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం స్థిరలక్ష్మ్యై నమః

44:ద్వారలక్ష్మి నమస్తుభ్యం ద్వారకా నాయక ప్రియే!
శ్రియం దేహి గృహం దేహి దేహిమే భవనం సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం ద్వారలక్ష్మ్యై నమః

45:సత్యలక్ష్మి నమస్తుభ్యం నిత్య కళ్యాణ దాయినీ!
క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః

46:యోగాలక్ష్మి నమస్తుభ్యం సిద్ధి బుద్ధి ప్రదాయినీ!
భోగం దేహి సుఖం దేహి యోగ సిద్ధిం చ దేహిమే!!
ఓం హ్రీం శ్రీం హ్రీం యోగలక్ష్మ్యై నమః

47:బుద్ధి లక్ష్మి నమస్తుభ్యం యోగమార్గ ప్రదర్శినీ!
బుద్ధి సిద్ధి ప్రదం దేహి భుక్తి ముక్తి ప్రదాయినీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం బుద్ధిలక్ష్మ్యై నమః

48:భువన లక్ష్మి నమస్తుభ్యం భువనాధార వాహినీం!
గృహం దేహి శ్రియం దేహి భవనం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం భువనలక్ష్మ్యై నమః

49:వీణాలక్ష్మి నమస్తుభ్యం సదా మధుర భాషిణీ!
గీతాం దేహి స్వరం దేహి గానం దేహి సరస్వతీ!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వీణాలఖ్మ్యై నమః

50:వర్ణలక్ష్మి నమస్తుభ్యం స్వరాకర్షణ భైరవీ!
వర్ణం దేహి వరం దేహి సువర్ణం దేహిమే సదా!!
ఓం హ్రీం శ్రీం హ్రీం వర్ణలక్ష్మ్యై నమః

51. కమలలక్ష్మి నమస్తేస్తు కమలేశ్వరి నమోస్తుతే
కీర్తిం దేహి శాంతిం దేహి ఫలం దేహిమే సౌగంధి 
ఓం హ్రీం శ్రీం హ్రీం కమలక్ష్మై నమః

52. కారుణ్యలక్ష్మి నమస్తేస్తు కారుణ్యేశ్వరి నమోస్తుతే 
కరుణం దేహి దయాం దేహి కృపాం దేహిమే కరుణేశ్వరి 
ఓం హ్రీం శ్రీం హ్రీం కారుణ్యలక్మ్యై నమః

53.శ్రీలక్ష్మి నమస్తేస్తు సిరి మహాదేవి నమోస్తుతే 
ధనం దేహి జయం దేహి సౌక్యం దేహిమే నిత్యకళ్యాణి 
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః

54.స్వర్ణలక్ష్మి నమస్తేస్తు సువర్ణరూపే నమోస్తుతే 
సువర్ణం దేహి సుచలం దేహి సుదేహం దేహిమే స్వర్ణధారిణి 
ఓం హ్రీం శ్రీం హ్రీం స్వర్ణలక్ష్మ్యై నమః

55.ఫలరూపలక్ష్మి నమస్తేస్తు సంపూర్ణరూపే నమోస్తుతే 
ఫలం దేహి బలం దేహి ధనం దేహిమే ఫలదాత్రి 
ఓం హ్రీం శ్రీం హ్రీం ఫలరూపలక్ష్మ్యై నమః

56. రత్నలక్ష్మి నమస్తేస్తు రత్నేశ్వరి నమోస్తుతే 
రత్నం దేహి శ్రియం దేహి కీర్తిం దేహిమే ప్రకాశినీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం రత్నలక్ష్మ్యై నమః

57. త్రికాలలక్ష్మి నమస్తేస్తు త్రికాలేశ్వరి నమోస్తుతే 
జయందేహి శ్రియందేహి విజయం దేహిమే జ్ఞాన సంపన్నాయై 
ఓం హ్రీం శ్రీం హ్రీం త్రికాలక్ష్మ్యై నమః

58. బ్రహ్మాండలక్ష్మి నమస్తేస్తు జననీ మహాలక్ష్మి నమోస్తుతే 
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం వసుప్రదాయై 
ఓం హ్రీం శ్రీం హ్రీం బ్రహ్మాండలక్ష్మ్యై నమః

59. హిమలక్ష్మి నమస్తేస్తు హిమేశ్వరి నమోస్తుతే 
జలం దేహి ప్రియం దేహి యోగం దేహిమే కమలాయై 
ఓం హ్రీం శ్రీం హ్రీం హిమలక్ష్మ్యై నమః

60. పీతాంబరలక్ష్మి నమస్తేస్తు ప్రకాశధారి నమోస్తుతే 
శుభం దేహి ప్రకాశం దేహి శోభనం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం పీతాంబరలక్ష్మ్యై నమః

61. సంతోషలక్ష్మి నమస్తేస్తు నిత్యశోభిని నమోస్తుతే 
శోభం దేహి సంతోషం దేహి సాధనం దేహిమే సర్వార్థ సాధకీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం సంతోషలక్ష్మ్యై నమః

62. నిత్యలక్ష్మి నమస్తేస్తు కృష్ణ పత్ని నమోస్తుతే 
సత్యం దేహి సాధకం దేహి ప్రియం దేహిమే సౌందర్యేశ్వరి 
ఓం హ్రీం శ్రీం హ్రీం సత్యలక్ష్మ్యై నమః

63 .ఆరోగ్యలక్ష్మి నమస్తేస్తు దారిద్ర్యరహితి నమోస్తుతే 
ఆరోగ్యం దేహి ఆయువు దేహి సౌభాగ్యం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆరోగ్యలక్ష్మ్యై నమః

64. చతుర్భుజలక్ష్మి నమస్తేస్తు మహాలక్ష్మి నమోస్తుతే 
కృపాం దేహి మధురం దేహి భాగ్యం దేహిమే కోమలాంగి 
ఓం హ్రీం శ్రీం హ్రీం చతుర్భుజలక్ష్మ్యై నమః

65. విశ్వలక్ష్మి నమస్తేస్తు విశ్వమూర్తే నమోస్తుతే 
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే విశ్వభత్రి 
ఓం హ్రీం శ్రీం హ్రీం విశ్వలక్ష్మ్యై నమః

66. ప్రియలక్ష్మి నమస్తేస్తు పతివ్రతే నమోస్తుతే 
సౌఖ్యం దేహి సౌభాగ్యం దేహి సౌశీల్యం దేహిమే పతిప్రియే 
ఓం హ్రీం శ్రీం హ్రీం విష్ణుప్రియేలక్ష్మ్యై నమః

67. గీతలక్ష్మి నమస్తేస్తు రాగమూర్తే నమోస్తుతే 
గీతం దేహి రాగం దేహి శాంతం దేహిమే గీతరూపే 
ఓం హ్రీం శ్రీం హ్రీం గీతలక్ష్మ్యై నమః

68. స్తోత్రలక్ష్మి నమస్తేస్తు రమేశ్వరీ నమోస్తుతే 
స్తోత్రం దేహి మంత్రం దేహి శ్లోకం దేహిమే స్తోత్రప్రియే 
ఓం హ్రీం శ్రీం హ్రీం స్తోత్రలక్ష్మ్యై నమః

69. భుక్తిలక్ష్మి నమస్తేస్తు భక్ష్యరూపే నమోస్తుతే 
భుక్తం దేహి అన్నం దేహి సర్వం దేహిమే భుక్తిదాత్రి 
ఓం హ్రీం శ్రీం హ్రీం భుక్తిలక్ష్మ్యై నమః

70. ప్రాఙ్ఞలక్ష్మి నమస్తేస్తు ఆఙ్ఞాకారి నమోస్తుతే 
ప్రఙ్ఞం దేహి కీర్తిం దేహి కృపాం దేహిమే ప్రాఙ్ఞవంద్యే 
ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రాఙ్ఞలక్ష్మ్యై నమః

71. భక్తిలక్ష్మి నమస్తేస్తు మోక్షకారి నమోస్తుతే 
మోక్షం దేహి కృపాం దేహి దయాం దేహిమే భక్తిగమ్యే 
ఓం హ్రీం శ్రీం హ్రీం భక్తిలక్ష్మ్యై నమః

72. దివ్యలక్ష్మి నమస్తేస్తు మహాశక్తి నమోస్తుతే 
దీనేమయి కృపాం కృత్వా మధురం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం దివ్యలక్ష్మ్యై నమః

73. కృష్ణలక్ష్మి నమస్తేస్తు మధురాపుర వాసినీ నమోస్తుతే 
క్షేమం దేహి వరం దేహి సామ్రాజ్యం దేహిమే కృష్ణరూపే 
ఓం హ్రీం శ్రీం హ్రీం కృష్ణలక్ష్మ్యై నమః

74. సముద్రలక్ష్మి నమస్తేస్తు భూతనయే నమోస్తుతే 
ధైర్యం దేహి జయం దేహి వీరం దేహిమే జయేశ్వరి 
ఓం హ్రీం శ్రీం హ్రీం సముద్రలక్ష్మ్యై నమః

75. హృదయలక్ష్మి నమస్తేస్తు వైకుంఠవాసిని నమోస్తుతే 
గృహం దేహి శ్రియం దేహి భవనం దేహిమే పరమాత్మికాయై 
ఓం హ్రీం శ్రీం హ్రీం హృదయలక్ష్మ్యై నమః

76. శ్వేతాంబరలక్ష్మి నమస్తుభ్యం నానాలంకార భూషితే
శాంతిం దేహి క్రాంతిం దేహి బ్రాంతారిష్ట నివారిణీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్వేతాంబరలక్ష్మ్యై నమః

77. సూక్ష్మరూపలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే
శక్తిం దేహి భక్తిం దేహి మహా రౌద్రే
ఓం హ్రీం శ్రీం హ్రీం సూక్ష్మరూపలక్ష్మ్యై నమః

78. మహా మాయాలక్ష్మి నమస్తుభ్యం మహా పాప వినాశినీ   
మేధాం దేహి కృపాం దేహి మహామంగళ రూపిణీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం మహా మాయాలక్ష్మ్యై నమః

79.ముగ్ధలక్ష్మి నమస్తుభ్యం సౌంధర్య స్వరూపిణీ  
శోభం దేహి సర్వం దేహి లావణ్యం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం ముగ్ధలక్ష్మ్యై నమః

80. గోపాలక్ష్మీనమస్తేస్తు గోవర్ధన ధరప్రియే 
సుమం దేహి క్షీరం దేహి ధనం దేహి గోపేశ్వరీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం గోపాలక్ష్మ్యై నమః

81.ధర్మలక్ష్మి నమస్తుభ్యం  లోకశోక వినాశిన కారిణీ!
స్నేహం దేహి మిత్రం దేహి సర్వ ధర్మార్ధ సాధకే!! 
ఓం హ్రీం శ్రీం హ్రీం ధర్మలక్ష్మ్యై నమః

82. ఫలలక్ష్మి నమస్తుభ్యం  యశస్విన్యై 
క్షేమం దేహి శ్రియం దేహి యోగక్షేమం మహేశ్వరి 
ఓం హ్రీం శ్రీం హ్రీం ఫలలక్ష్మ్యై నమః

83. విష్ణులక్ష్మి నమస్తుభ్యం ముక్తి ప్రదాయిని 
పుత్రాం దేహి ధనం దేహి పౌత్రాం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం విష్ణులక్ష్మ్యై నమః

84. హరిణ్యైలక్ష్మి నమస్తుభ్యం నానాలంకార భూషితే
సుఖం దేహి దయాం దేహి విజయం దేహిమే సదా
ఓం హ్రీం శ్రీం హ్రీం హరిణ్యైలక్ష్మ్యై నమః   

85. యశస్విలక్ష్మి నమస్తుభ్యం  ప్రసన్నా వరదా
బుద్ధిం దేహి శ్రియం దేహి యోగజ్ఞే యోగ సంభూతే
ఓం హ్రీం శ్రీం హ్రీం యశస్విలక్ష్మ్యై నమః

86. ఆద్యంతలక్ష్మి నమస్తుభ్యం  శ్రీ పీఠే సుర పూజితే 
శ్రియైం దేహి శివాం దేహి సర్వజ్ఞే సర్వ వరదే
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆద్యంతలక్ష్మ్యై నమః

87. జగత్ లక్ష్మి నమస్తుభ్యం  ఇందుశీతుల పూజితే 
పూజ్యం దేహి ధనం దేహి భవనం దేహిమే సదా 
ఓం హ్రీం శ్రీం హ్రీం జగత్ లక్ష్మ్యై నమః

88.  చతుర్భుజాలక్ష్మి నమస్తుభ్యం త్రికాలం యః పటేన్నిత్యం 
రమ్యం దేహి రత్నం దేహి సర్వ దుష్ట భయంకరి
ఓం హ్రీం శ్రీం హ్రీం చతుర్భుజాలక్ష్మ్యై నమః

89.  హరివల్లభలక్ష్మి నమస్తుభ్యం వసుధారిణ్యలహరీ 
శ్వేతం దేహి పద్మం దేహి జగత్స్థితే జగన్మాతే 
ఓం హ్రీం శ్రీం హ్రీం  హరివల్లభలక్ష్మ్యై నమః

90.  సురభలక్ష్మి నమస్తుభ్యం  మహా శక్తే మహొధరే   
జ్ఞానం దేహి లౌక్యం దేహి మహా రౌద్రే   
ఓం హ్రీం శ్రీం హ్రీం  సురభలక్ష్మ్యై నమః

91. సర్వభూతహితలక్ష్మి నమస్తుభ్యం మంత్ర మూర్తే సదా దేవి
సుహృదయం దేహి ఆనందం దేహి పరమాత్మికాయైనే   
ఓం హ్రీం శ్రీం హ్రీం  సర్వభూతహితలక్ష్మ్యై నమః

92. శక్తిలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే 
శక్తిం దేహి యుక్తిం దేహి నానాలంకార భూషితే    
ఓం హ్రీం శ్రీం హ్రీం శక్తిలక్ష్మ్యై నమః

93. సుధాలక్ష్మి నమస్తుభ్యం మహా శక్తే మహొధరే 
ప్రేమం దేహి ఇష్టం దేహి హిరణ్మయ్యై సదా  
ఓం హ్రీం శ్రీం హ్రీం సుధాలక్ష్మ్యై నమః

94.  కామాక్ష్యైలక్ష్మి నమస్తుభ్యం శ్వేతాంబరధారే  
మోక్షం దేహి సుచలం దేహి యోగజ్ఞే యోగ సంభూతే    
ఓం హ్రీం శ్రీం హ్రీం కామాక్ష్యైలక్ష్మ్యై నమః

95. అనుగ్రహలక్ష్మి నమస్తుభ్యం సర్వసంతోషదాయినీ
ఆరోగ్యం దేహి సులోచనం దేహి పద్మాసన స్థితే      
ఓం హ్రీం శ్రీం హ్రీం అనుగ్రహలక్ష్మ్యై నమః

96. త్రిలోకలక్ష్మి నమస్తుభ్యం త్రిలోకశోక వినాశినీ 
భక్తిం దేహి శ్లోకం దేహి ధర్మనిలయాధాత్రీ         
ఓం హ్రీం శ్రీం హ్రీం అనుగ్రహలక్ష్మ్యై నమః

97. పద్మహస్తాలక్ష్మి నమస్తుభ్యం ధన ధాన్య సమన్వితే  
ధరణీం దేహి పవనం దేహి మహాలక్ష్మీ ర్నమోస్తుతే        
ఓం హ్రీం శ్రీం హ్రీం పద్మహస్తాలక్ష్మ్యై నమః

98. పుణ్యలక్ష్మి నమస్తుభ్యం సర్వభూత హితప్రదాయినే  
పుణ్యం దేహి వరం దేహి భుక్తి ముక్తి ప్రదాయిని       
ఓం హ్రీం శ్రీం హ్రీం పుణ్యలక్ష్మ్యై నమః

99. శ్రీపీఠలక్ష్మి నమస్తుభ్యం సర్వఙ్ఞే సర్వవరదే   
సిరిం దేహి సుకరం దేహి ఆహ్లోదజనన్యై     
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీపీఠలక్ష్మ్యై నమః

100. సకలభోగసౌభాగ్యలక్ష్మి నమస్తుభ్యం మాతా సర్విష్టే  
సకలం దేహి సౌభాగ్యం  దేహి నారాయణ ప్రణయినీ   
ఓం హ్రీం శ్రీం హ్రీం శ్రీపీఠలక్ష్మ్యై నమః

101. గంధలక్ష్మి నమస్తుభ్యం గంధమాల్యశోభితే 
సుగంధం దేహి సుశీలం  దేహి హేమాంబుజ పీఠే  
ఓం హ్రీం శ్రీం హ్రీం గంధలక్ష్మ్యై నమః

102.పుష్కరలక్ష్మి నమస్తుభ్యం కమలాక్ష వల్లభే
పుణ్యం దేహి మోక్షం దేహి జగదీశ్వరి లోకమాతః 
ఓం హ్రీం శ్రీం హ్రీం పుష్కరలక్ష్మ్యై నమః

103.యుక్తిలక్ష్మి నమస్తుభ్యం గుణాధికా గురుతుర భాగ్యే 
ప్రాణం దేహి యోగం దేహి హరినీలమయీ విభాతే 
ఓం హ్రీం శ్రీం హ్రీం యుక్తిలక్ష్మ్యై నమః

104.ఆశ్రయలక్ష్మి నమస్తుభ్యం మధుమాథిని మన్మథే
ఆశ్రయం దేహి ఆరోగ్యం దేహి ఆనందకందమని 
ఓం హ్రీం శ్రీం హ్రీం ఆశ్రయలక్ష్మ్యై నమః

105.నిత్యానందలక్ష్మి నమస్తుభ్యం కథమపి సహస్రేణ శిరసాం
ఆనందం దేహి ఐశ్వర్యం దేహి మకరంద శ్రుతిఝరీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం నిత్యానందలక్ష్మ్యై నమః

106.కౌమారలక్ష్మి నమస్తుభ్యం  ధర్మైక్య నిష్ఠాకరీ
రక్షం దేహి సురక్షితం  దేహి బ్రహ్మాండ భాండోదరీ 
ఓం హ్రీం శ్రీం హ్రీం కౌమారలక్ష్మ్యై నమః

107.వైకుంఠలక్ష్మి నమస్తుభ్యం దాక్షాయిణీ సుందరీ 
క్షీరం దేహి ఆమృతం  దేహి సౌభాగ్యమాహేశ్వరీ  
ఓం హ్రీం శ్రీం హ్రీం వైకుంఠలక్ష్మ్యై నమః

108.దృశ్యాదృశ్యదీపాంకృతలక్ష్మి నమస్తుభ్యం ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ
దీపం దేహి ధీరం దేహి ప్రజ్వలీ కృపాసాగరీ    
ఓం హ్రీం శ్రీం హ్రీం దృశ్యాదృశ్యదీపాంకృతలక్ష్మ్యై నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం ప్రాం ప్రీం ప్రౌo సః..
ఓం శనైశ్చరాయనమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS