Thursday, January 11, 2024

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం : అయినవిల్లి

శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం : అయినవిల్లి


💠 స్వయంభూ గణపతి క్షేత్రాలలో 'అయినవిల్లి' ఒకటి.
కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. పవిత్రకోనసీమలో అయినవిల్లి గ్రామంలో స్వయంభువుగా నెలకొనియున్నది శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవాలయం. దక్షప్రజాపతి దక్షయజ్ఞం నిర్వర్తించేముందు విఘ్న వినాయకుడైన ఈ వినాయకుని పూజించి, పునీతుడైనట్లు క్షేత్రపురాణం తెలుపుతోంది. వ్యాసమహర్షి దక్షిణ దేశయాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ప్రతిష్టించాడని మరొక కథ వ్యాప్తిలో ఉంది.

💠 అమలాపురానికి 12 కి.మీ దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలపి ఉన్న సిద్ధివినాయకస్వామి గురించి ఆంధ్రప్రదేశ్‌లో తెలియని వారుండరు.

💠 ఈ సిద్ధివినాయకుని భక్తిగా తలచుకుని ఏ కార్యం తలపెట్టినా జయప్రదంగా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ఈ అయినవిల్లి గణపతికి గరిక పూజలన్నా, కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. అందుకే ఈ క్షేత్రం గరిక పూజలకు, కొబ్బరికాయ మొక్కులకు పెట్టిన పేరయింది. ఏటా ఇక్కడకొచ్చే భక్తులు తమ మొక్కుల రూపంలో స్వామికి సమర్పించే కొబ్బరికాయల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటే ఉంటుందంటే నమ్మబుద్ధి కాదు. కానీ ఇది నిజం అని ఈ సిద్ధివినాయకుడు తన కృపాకటాక్షాలతో భక్తుల కోరికలు తీరుస్తూ ప్రతి సంవత్సరం నిరూపిస్తూనే ఉన్నాడు.

💠 దక్షిణాంధ్రలో 'కాణిపాకం' ప్రసిద్ధి చెందినట్లు ఉత్తరాంధ్రలో అయినవిల్లి ప్రసిద్ధి చెందింది. కృతయుగం నుండే నెలకొని ఉన్నట్లుగా చెప్పబడుతున్న ఈ స్వయంభూ గణపతి అత్యంత మహిమాన్వితుడు. అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది.

💠 ఇక్కడ నిత్యం లక్ష్మీగణపతి హోమం చాలా ఏళ్లుగా జరుగుతూ ఉంది. అదే విధంగా ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో స్వామివారికి పెన్నులతో అభిషేకం చేయించి వాటిని విద్యార్థులకు అందజేస్తారు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS