Monday, January 1, 2024

51శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నయ్

51శక్తిపీఠాలు ఎక్కడెక్కడున్నయ్


పురాణ కథ..
ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు, 
ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.
ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు.                                        .                                                                                                                                                                                                                                                                                                        
సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి  విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.
ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.
ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:

1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్ 
బ్రహ్మరంథ్రము (శిరోభాగము)
కొత్తారి (శక్తి రూపం)
భీమలోచనుడు (శివ రూపం)

2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్
కన్నులు 
మహిషమర్దిని (శక్తి రూపం)
క్రోధీశుడు (శివ రూపం)

3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున
ముక్కు 
సునంద (శక్తి రూపం)
త్ర్యంబకేశ్వరుడు (శివ రూపం)

4. అమరనాధ్  శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్ 
గొంతు 
మహామాయ (శక్తి రూపం)
-త్రిసంధ్యేశ్వరుడు (శివ రూపం)

5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద 
నాలుక 
సిద్ధిద / అంబిక (శక్తి రూపం)
ఉత్తమ భైరవుడు (శివ రూపం)

6. జలంధర్ (దేవీ తాలాబ్)
ఎడమ స్తనము
త్రిపురమాలినిv(శక్తి రూపం)
భీషణుడు (శివ రూపం)

7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్ 
గుండె 
జయదుర్గ (శక్తి రూపం)
వైద్యనాథుడు (శివ రూపం)

8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్ 
మోకాళ్ళు 
మహాశిర (శక్తి రూపం)
కపాలి (శివ రూపం)

9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల
కుడి చేయి 
దాక్షాయిని (శక్తి రూపం)
అమరుడు (శివ రూపం)

10.  బిరాజా, ఒడిషా 
నాభి 
విమల (శక్తి రూపం)
జగన్నాథుడు (శివ రూపం)

11.  ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్ 
నుదురు 
గండకీ చండి (శక్తి రూపం)
చక్రపాణి (శివ రూపం)

12.  బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్ 
ఎడమ చేయి 
బహుళా మాత (శక్తి రూపం)
భిరుకుడు (శివ రూపం)

13.  ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్  
కుడి మణికట్టు 
మంగళ చండిక (శక్తి రూపం)
కపిలాంబరుడు (శివ రూపం)

14.  ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం 
కుడి కాలు 
త్రిపురసుందరి (శక్తి రూపం)
త్రిపురేశుడు (శివ రూపం)

15.  ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్ 
కుడి చేయి 
భవాని (శక్తి రూపం)
చంద్రశేఖరుడు (శివ రూపం)

16.  త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్ 
ఎడమ కాలు 
భ్రామరి (శక్తి రూపం)
అంబరుడుb(శివ రూపం)

17.  కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం 
యోని 
కామాఖ్య (శక్తి రూపం)
ఉమానందుడు (శివ రూపం)

18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్
కుడి పాదము 
జుగాద్య (శక్తి రూపం)
క్షీర ఖండకుడు (శివ రూపం)

19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా 
కుడి బొటనవేలు 
కాళిక (శక్తి రూపం)
నకులీషుడు (శివ రూపం)

20.  ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్ 
కుడి వేళ్ళు 
లలిత (శక్తి రూపం)
భవుడు (శివ రూపం)

21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్ 
ఎడమ తొడ
జయంతి (శక్తి రూపం)
క్రమదీశ్వరుడు (శివ రూపం)

22.  కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 
కిరీటము 
విమల (శక్తి రూపం)
సంవర్తుడు (శివ రూపం)

23.  వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్
చెవిపోగు 
విశాలాక్షి / మణికర్ణి (శక్తి రూపం)
కాలభైరవుడు (శివ రూపం)

24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు 
వీపు 
శర్వాణి (శక్తి రూపం)
నిమీశుడు (శివ రూపం)

25.  కురుక్షేత్రం, హర్యానా
మడమ ఎముక 
సావిత్రి (శక్తి రూపం)
స్థాణువు (శివ రూపం)

26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్ 
రెండు చేతి కడియాలు
గాయత్రి (శక్తి రూపం)
సర్వానందుడు (శివ రూపం)

27.  శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్ 
మెడ 
మహాలక్ష్మి (శక్తి రూపం)
సంబరానందుడు (శివ రూపం)

28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్ 
ఎముక 
దేవగర్భ (శక్తి రూపం)
రురుడు (శివ రూపం)

29.  కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్ 
ఎడమ పిరుదు 
కాళి (శక్తి రూపం)
అసితాంగుడు (శివ రూపం)

30.  షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్ 
కుడి పిరుదు 
నర్మద (శక్తి రూపం)
భద్రసేనుడు (శివ రూపం)

31.  రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్ 
కుడి స్తనం 
శివాణి (శక్తి రూపం)
చందుడు (శివ రూపం)

32.  వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్
కేశాభరణం 
ఉమ (శక్తి రూపం)
భూతేశ్ (శివ రూపం)

33.  శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు
పై దవడ పండ్లు 
నారాయణి (శక్తి రూపం)
సంహరుడు (శివ రూపం)

34.  పంచసాగరం (స్థలం తెలియదు) 
క్రింది దవడ పండ్లు
వారాహి (శక్తి రూపం)
మహారుద్రుడు (శివ రూపం)

35.  కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్
ఎడమకాలి పట్టీ 
అర్పణ (శక్తి రూపం)
వమనుడు (శివ రూపం)

36.  శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)
కుడికాలి పట్టీ 
శ్రీ సుందరి (శక్తి రూపం)
సుందరానందుడు (శివ రూపం)

37.  విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 
ఎడమ కాలి మణికట్టు
కపాలిని /భీమరూప (శక్తి రూపం)
సర్వానందుడు (శివ రూపం)

38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్
ఉదరం 
చంద్రభాగo (శక్తి రూపం)
వక్రతుండుడు (శివ రూపం)

39.  భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 
పై పెదవి పైభాగం 
అవంతి (శక్తి రూపం)
లంబ కర్ణుడుb(శివ రూపం)

40.  జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర
చుబుకం 
భ్రామరి (శక్తి రూపం)
వికృతాక్షుడు (శివ రూపం)

41.  సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్ 
బుగ్గలు 
రాకిణి / విశ్వేశ్వరి (శక్తి రూపం)
వత్సనాభుడు / దండపాణి (శివ రూపం)

42. బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్ 
ఎడమ కాలి వేళ్ళు 
అంబిక (శక్తి రూపం)
అమృతేశ్వరుడు (శివ రూపం)

43.  రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్
కుడి భుజం 
కుమారి (శక్తి రూపం)
శివుడు (శివ రూపం)

44.  మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో
ఎడమ భుజం 
ఉమ (శక్తి రూపం)
మహోదరుడు (శివ రూపం)

45.  నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్
కాలి పిక్క ఎముకలు
కాళికా దేవి (శక్తి రూపం)
యోగేశుడుb(శివ రూపం)

46.  కర్ణాట్ (స్థలం తెలియదు) 
చెవులు 
జయదుర్గ (శక్తి రూపం)
అభీరుడు (శివ రూపం)

47. వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 
కనుబొమల మధ్య భాగము
మహిష మర్దిని (శక్తి రూపం)
వక్రనాథుడు (శివ రూపం)

48.  జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్ 
చేతులు, కాళ్ళు 
యశోరేశ్వరి (శక్తి రూపం)
చందుడు (శివ రూపం)

49.  అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 
పెదవులు 
ఫుల్లార (శక్తి రూపం)
విశ్వేశుడు (శివ రూపం)

50.  నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 
మెడలో హారం 
నందిని (శక్తి రూపం)
నందికేశ్వరుడు (శివ రూపం)

51. శ్రీలంక (ట్రింకోమలి లో, హిందూమహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ) 
కాలి పట్టీలు 
ఇంద్రాక్షి (శక్తి రూపం)
రాక్షసేశ్వరుడు (శివ రూపం)
(సేకరణ)

🚩సర్వేజనా సుఖినోభవంత్🚩

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS