Sunday, January 26, 2025

కార్యసిద్ధికి_వినాయక_శ్లోకం

కార్యసిద్ధికి_వినాయక_శ్లోకం

ఏదయినా ఒక కార్యం మొదలు పెట్టేపుడు.... లేదా చేస్తున్న పనిలో.... ఏవయినా అనుకొని అవాంతరాలు ఎదురయ్యి పని మధ్యలోనే నిలిచిపోకుండా..... సజావుగా పూర్తికావడానికి వినాయకుని_108_రూపాల్లో ఒకటైన #కార్యసిద్ధి_గణపతి ని ధ్యానం చేసి కార్యం ప్రారంభిస్తే తలపెట్టిన కార్యం ఆటంకం లేకుండా పూర్తి అవుతుంది.
ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన పని కూడా ముందుకు కదులుతుంది.

ఎవరు చేయాలి : 
అన్ని వయస్సుల వారు ఈ శ్లోకం పఠించవచ్చు. ముఖ్యంగా చిన్న పిల్లలకు, విద్యార్థులకు ఈ శ్లోకం నేర్పితే వారికి మంచి విద్యా బుద్దులు వస్తాయి.

ఎలా చేయాలి :
ప్రతి రోజూ శుచిగా స్నానం చేసి..... ఇంట్లో నిత్య పూజ చేసిన అనంతరం వినాయకునికి అటుకులు, బెల్లం నైవేద్యంగా సమర్పించి ఈ కింది శ్లోకం చదవాలి. 

యతోబుద్ధి రజ్ఞాననాశో ముముక్షో: |
యత స్సంపదోభక్త సంతోషదాస్సు: ||
యతో విష్నునాశయత: కార్యసిద్ధి: |
సదాతం గణేశం నమామో భజామ: ||

ఈ శ్లోకాన్ని భక్తితో 21 సార్లు పఠించి కార్యసిద్ధి అనుగ్రహించమని ప్రార్ధించాలి.
చవితి_తిథి_మరియు_బుధవారం రోజు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని పఠించి గణనాథుని అనుగ్రహం పొందవచ్చు.

ఫలితం:
చేపట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి.
ఉమా సుతుని అనుగ్రహంతో మనలోని బుద్ధి చైతన్యం పొంది కార్య అనుకూలత కోసం కావలసిన ఆలోచన ఆయనే మనకు పుట్టిస్తాడు. మనకు కనిపించని విఘ్నాలను తొలగించి కార్యసిద్ధి ఫలం ఇస్తాడు.
అంతే కాకుండా మంచి ఆరోగ్యం, బలం, తెలివితేటలు, విజయం, శత్రువుల నుండి విముక్తి, విశ్వాసం, సానుకూలత,  వినయం, ప్రశాంతత, వ్యాపారంలో విజయం మరియు అభివృద్ధి, ఎక్కువ లాభాలు,  ఏ రంగంలో అయిన, ఎలాంటి సందర్భం లో అయినా విజయం సాధిస్తాడు.

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS