Tuesday, January 7, 2025

దగ్ధ యోగం.. ఈ ముహూర్తం లో వివాహం జరుగదు అని శాస్త్రం చెబుతోంది

ఇది దగ్ధ యోగం.. ఈ ముహూర్తం లో వివాహం జరుగదు అని శాస్త్రం చెబుతోంది అంటారు మాయాబజార్ లో శంఖు తీర్థుల వారు. 


మామూలుగా త్రయోదశి యా అని పంచాంగం చూసే కొందరు పెద్దలు పెదవి విరవడం చూస్తాము గానీ మన లెక్క ప్రకారము అది విజయమే చేకూరుస్తుంది.

పాశ్చాత్యులు ప్రకారం పదమూడు సంఖ్య అచ్చిరాదు అంటారు. అసలు దగ్ధ యోగం అంటే వారానికి మరియు ఆనాటి తిథి కలిపితే పదమూడు వస్తే అది దగ్ధ యోగము.

ఆదివారం      1  నాడు ద్వాదశి వస్తే అది దగ్ధ యోగం

సోమవారం    2 నాడు ఏకాదశి వస్తే అది దగ్ధ యోగము

మంగళవారం 3 నాడు దశమి వస్తే అది దగ్ధ యోగము

బుధవారం.    4 నాడు నవమి వస్తే అది దగ్ధ యోగము

గురువారం.    5 నాడు అష్టమి వస్తే అది దగ్ద యోగము

శుక్రవారం.      6 నాడు సప్తమి వస్తే అది దగ్ధ యోగము

శనివారం.       7 నాడు షష్ఠి  వస్తే అది దగ్ధ యోగము

మాయాబజార్ చిత్రాన్ని ఎంతో విద్వత్తు ఉన్నవారు తీశారు కాబట్టి అన్నీ కూలంకషంగా చర్చించి పాటించారు అందులో..ఈ కాలం వారికి ఏం పాండిత్యం ఉందని..నాలుగు అల్లరి మాటలు, చిల్లర.పదాలు వ్రాసేసి ఇదే సర్వం అనుకునే పిదపకాలం

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS