Monday, January 27, 2025

త్రయోదశి మహా ప్రదోషం

ప్రదోషం ...

ప్రదోషం రోజున సాయంత్రం ప్రదోష వేళలో శివాలయాలలో అభిషేకం చేస్తారు, అప్పుడు శివలింగానికి మరియూ నందీశ్వరునికి ఏక కాలంలో అభిషేకం చేస్తారు, జాతకంలో గోచరించని దోషాలు సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయని శాస్త్ర వచనం ... వీలైతే అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని దర్శించండి, ప్రదోష వేళలో #అరుణాచలశివ నామస్మరణ చేస్తూ ఉండండి, శివానుగ్రహం పొందండి ... 

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల  (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు  ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. 

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు. 

ప్రదోష సమయంలో శివుడు అర్థనారీశ్వర రూపంలో ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్యరత్నావళి లో చెప్పబడింది. ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుడిని అర్చిస్తారని భావిస్తారు. ప్రదోష సమయంలో చేసే శివారాధన ఉత్తమమని చెప్పబడుతుంది. ఈ సమయంలో శివారాధన చేయటాన్ని సమస్త దేవతలను పూజించటంతో సమానంగా భావిస్తారు. 

ప్రదోష  సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు. నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి,  శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు. అందువల్ల  నందీశ్వరుడిని ఆరాధించడం వలన బుద్ధికుశలత, మానసిక ఉల్లాసం లభిస్తాయి. 

త్రయోదశి మహా ప్రదోషం

ఆదివారం రోజు వస్తే దానిని రవి ప్రదోషం అని,
సోమవారం రోజు వస్తే దానిని సోమ ప్రదోషమనీ, 
మంగళవారం రోజు వస్తే దానిని భౌమ ప్రదోషమని, 
బుధవారం రోజు వస్తే దానిని బుధ ప్రదోషమని, 
గురువారం రోజు వస్తే దానిని గురు ప్రదోషమని, 
శుక్రవారం రోజు వస్తే దానిని శుక్ర ప్రదోషమని, 
శనివారం రోజు వస్తే దానిని శని త్రయోదశి అనీ, శని ప్రదోషమని పిలుస్తారు. 

వీటిలో శుక్ల పక్షంలో వచ్చే సోమ ప్రదోషం, కృష్ణపక్షంలో వచ్చే శని ప్రదోషములు విశేషమైనవిగా భావిస్తారు.

అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ

No comments:

Post a Comment

RECENT POST

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు

ఏలినాటి శని ప్రభావం లేకుండా ఉండే రాశులు, లగ్నాలు –  భూమండలంపై గ్రహాల ప్రభావం: జ్యోతిషశాస్త్రంలో శని గ్రహాన్ని కర్మఫలదాతగా భావిస్తారు. శని అన...

POPULAR POSTS