ఏదైనా శుక్లపక్షంలోని బుధవారం రాత్రి సమయంలో 8 గంటల నుండి 10 గంటల మధ్యలో ఈ తాంత్రిక సాధన చెయ్యాలి , ఇందుకోసం సాధకులు ,108 కమల పూసలు తీసుకు వచ్చి ఆపై వాటిని ఆవు నెయ్యి , తేనే , పంచదార మూడు పదార్దాలు కలిపిన మిశ్రమంలో వెయ్యాలి . ఆ తరువాత పైన చెప్పిన సమయంలో తూర్పువైపుకి ముఖం పెట్టి ఎదురు గుండా చిన్న యజ్ఞ గుండాన్ని లేదా రాగితో చేసిన చిన్న యజ్ఞ గుండాన్ని ఏర్పాటు చేసుకోవాలి . తరువాత మంత్రాన్ని చదువుతూ మిశ్రమ పదార్దాన్ని కొయ్య గరిటెతో ఎదురుగా ఉన్న యజ్ఞగుండంలో వేస్తూ మంత్రాన్నిపఠించాలి . మొత్తం 1008 సార్లు మంత్రాన్ని జపిస్తూ హోమాన్ని చెయ్యాలి . ఈ హోమాన్ని చెయ్యటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది .
మంత్రం : " ఓం ఐం శ్రీమ్ సర్వకార్య సిద్ధాయక నమః "
.jpg)
No comments:
Post a Comment