Sunday, January 4, 2026

సొంత వాహనాలు డ్రైవింగ్ రూట్ మార్గదర్శకం ఏకాదశ రుద్రులు

K.K. Mangapathi's  ( Ekadasa rudrulu )

      సొంత వాహనాలు డ్రైవింగ్ రూట్ మార్గదర్శకం
                        ఏకాదశ  రుద్రులు 


రావులపాలెం నుంచి స్వంత వాహనాలు ద్వార  ఏకాదశ  రుద్రులు సందర్శన యాత్ర:  రావులపాలెం నుంచి ముక్కామల చేరుకోవాలి. 

1) ముందుగా ముక్కామల శివాలయ దర్శనం 
(కాలాగ్నిరుద్రాయ).
2) ముక్కామల నుంచి నేదునూరుకు ప్రయాణం. నేదునూరు శివాలయ దర్శనం (త్రికాగ్నికాలయ) తర్వాత వక్కలంకకు (వయా)ముక్కామల మీదగా ప్రయాణం.
3) వక్కలంక శివాలయ దర్శనం (త్రిపురాంతకాయ) పిమ్మట ఇరుసుమండకు ప్రయాణం (వయా) ముక్కామల.
4) ఇరుసుమండ శివాలయ దర్శనం (త్ర్యంబకాయ) పిమ్మట పులేటికుర్రుకు ప్రయాణం.
5) పులేటికుర్రు శివాలయ దర్శనం (శ్రీ మన్మహాదేవాయ)
పిమ్మట వ్యాఘ్రేశ్వరంకు ప్రయాణం.
6) వ్యాఘ్రేశ్వరం శివాలయ దర్శనం (విశ్వేశ్వరాయ) పిమ్మట కె. పెదపూడికు ప్రయాణం.
7) కె. పెదపూడి శివాలయ దర్శనం (మహాదేవాయ) పిమ్మట గంగలకుర్రుకు ప్రయాణం.
8) గంగలకుర్రు శివాలయ దర్శనం (సదాశివాయ) పిమ్మట గంగలకుర్రు అగ్రహారంకు ప్రయాణం.
9) గంగలకుర్రుక అగ్రహారం శివాలయ దర్శనం (సర్వేశ్వరాయ) పిమ్మట పాలగుమ్మి కు ప్రయాణం.
10. పాలగుమ్మి శివాలయ దర్శనం (మృత్యుంజయాయ) పిమ్మట మొసలపల్లి కు ప్రయాణం.
11. మొసలపల్లి శివాలయ దర్శనం (నీలకంఠాయ) పిమ్మట పులేటికుర్రుకు (వయా) జగ్గన్న తోట మీదగా
తిరుగు ప్రయాణం. పులేటికుర్రుకు నుంచి రావులపాలెం  నకు (వయా) ముక్కామల మీదగా ఇంటికి ప్రయాణం.
******

డ్రైవింగ్ రూట్ మార్గదర్శకం:

1) రావులపాలెం నుంచి అమలాపురం (వయా) కొత్తపేట, ముక్కామల, ఇరుసుమండ, పులేటికుర్రు, కె. పెదపూడి, అంబాజీపేట, బండారులంక మీదగా బస్సులు ఉంటాయి. ఇది రాష్ట్రీయ దారి. 

2) రావులపాలెం నుంచి అమలాపురం (వయా) కొత్తపేట, ముక్కామల మీదగా NH-216E  కూడ ఉంది. ముక్కామల బస్ స్టాప్ నుంచి కాలువ గట్టు మీదగా  అమలాపురం (ఈదరపల్లి bypass road) కలదు. ఇది NH-216E Road. 
ఈ bypass road లో దేవి సెంటర్  (మొసలపల్లి), పాలగుమ్మి Road point, గంగలకుర్రుక అగ్రహారం road point ఉంటాయి.  రావులపాలెం నుంచి అమలాపురం bypass road అమలాపురం బస్ స్టాండ్ సెంటర్ చేరుతుంది.

* రాష్ట్రీయ రోడ్డులో ముక్కామల బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడే రాష్ట్రీయ రోడ్డు మరియు NH-216E (bypass road) విడిపోతాయి.  ముక్కామల కాలువ మీద bridge ఉంది. బ్రిడ్టి మీదగా  ముక్కామల శివాలయ చేరవచ్చును.  400 మీటర్లు దూరాన శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి ఆలయం (కాలాగ్నిరుద్రాయ) ఉంది.
 కాలాగ్నిరుద్రాయ దర్శనం పిమ్మట నేదునూరుకు ప్రయాణం.

* ముక్కామల నుంచి నేదునూరుకు ప్రయాణం. ఇది బ్రాంచి రోడ్డు. ముక్కామల గ్రామం నకు ఆగ్నేయం దిశగా సుమారు 5.5 కీ.మీ దూరంలో నేదునూరు గ్రామం ఉంటుంది.  నేదునూరు శివాలయ దర్శనం (త్రికాగ్నికాలయ),  పిమ్మట ముక్కామల ప్రయాణం. తిరిగి ముక్కామల చేరుకోవాలి. ముక్కామల నుంచి వక్కలంక ప్రయాణం. 

* ముక్కామల నుంచి వక్కలంకకు ప్రయాణం. ఇది బ్రాంచి రోడ్డు. ముక్కామల గ్రామం నకు ఉత్తరంగా సుమారు 2.5 కీ.మీ దూరాన వక్కలంక గ్రామం ఉంటుంది. వక్కలంక శివాలయ దర్శనం (త్రిపురాంతకాయ) పిమ్మట ముక్కామల ప్రయాణం.  తిరిగి ముక్కామల చేరుకోవాలి.

* ముక్కామల నుంచి ఇరుసుమండకు ప్రయాణం. 
రాష్ట్రీయ రోడ్డులో Roadకు ప్రక్కనే ఇరుసుమండ శివాలయ ఉంటుంది. త్ర్యంబకాయ దర్శనం పిమ్మట పులేటికుర్రుకు ప్రయాం.

* ఇరుసుమండ నుంచి పులేటికుర్రుకు ప్రయాణం. 
రాష్ట్రీయ రోడ్డులోని పులేటికుర్రు శివాలయ ఉంటుంది.  శ్రీ మన్మహాదేవాయ దర్శనం పిమ్మట వ్యాఘ్రేశ్వరంకు ప్రయాణం.

* పులేటికుర్రు గ్రామంలో వ్యాఘ్రేశ్వరం సెంటర్ (అమలాపురం వైపు) ఉంది. ఇక్కడ నుంచి పశ్చిమ వైపుగా సుమారు 1.5 కీ.మీ దూరంలో వ్యాఘ్రేశ్వరం గ్రామం ఉంటుంది. వ్యాఘ్రేశ్వరం శివాలయ దర్శనం (విశ్వేశ్వరాయ రుద్రుడు). పిమ్మట కె. పెదపూడి (వయా) వ్యాఘ్రేశ్వరం సెంటర్ మీదగా ప్రయాణం.

* వ్యాఘ్రేశ్వరం సెంటర్ నుంచి కె. పెదపూడికు (అమలాపురం వైపు) ప్రయాణం.  రాష్ట్రీయ రోడ్డులో  కె. పెదపూడి ఉంటుంది. రాష్ట్రీయ రోడ్డుకు కొంత లోపలకి (కుడి వైపు) కె. పెదపూడి శివాలయ ఉంటుంది. ఇక్కడ మహాదేవాయ రుద్రుడు దర్శనం. పిమ్మట గంగలకుర్రు గ్రామం నకు ప్రయాణం. 

* కె. పెదపూడి రాష్ట్రీయ రోడ్డులో  ఎడమ వైపున Veera vari street ఉంటుంది. ఈ వీర వారి వీధి నుంచి గంగలకుర్రు చేరవచ్చును. స్ధానికులు సహాయం తీసుకోండి.  శివాలయం పెద్ద వీధిలోని Post office ఉంటుంది. ఆదే వీధిలో గంగలకుర్రు శివాలయ (సదాశివాయ రుద్రుడు) దర్శనం అవుతుంది. పిమ్మట గంగలకుర్రు అగ్రహారం నకు ప్రయాణం.

* గంగలకుర్రు నుంచి గంగలకుర్రు అగ్రహారం నకు రాచపాలెం రోడ్డు మీదగా ప్రయాణం. స్ధానికులు సహాయం తీసుకోండి. గంగలకుర్రుక అగ్రహారంలో శివాలయ దర్శనం (సర్వేశ్వరాయ). పిమ్మట పాలగుమ్మి గ్రామం నకు ప్రయాణం.

* గంగలకుర్రుక అగ్రహారం నుంచి పాలగుమ్మి పాఠశాలకు పోవు రోడ్డు మీదగా పాలగుమ్మి శివాలయం నకు ప్రయాణం. వీటి మధ్య దూరం సుమారు ఒక కీ.మీ. స్ధానికులు సహాయం తీసుకోండి. పాలగుమ్మి శివాలయ దర్శనం (మృత్యుంజయాయ). పిమ్మట మొసలపల్లికి ప్రయాణం.

* పాలగుమ్మి శివాలయం నుంచి పాలగుమ్మి శివాలయం సెంటర్ (Road point) చేరుకోవాలి. ఇది అమలాపురం (ఈదరపల్లి bypass road) నుంచి ముక్కామల పోవు NH-216E Road లో ఉంటుంది. వీటి మధ్య దూరం సుమారు ఒక కీ.మీ. ఇక్కడ నుంచి దేవి సెంటర్  (మొసలపల్లి) ప్రయాణం. వీటి మధ్య దూరం సుమారు 1.7 కీ.మీ. దూరం. NH-216E Road లో గల దేవి సెంటర్  (మొసలపల్లి) నుంచి మొసలపల్లి శివాలయం నకు ప్రయాణం. వీటి మధ్య దూరం సుమారు ఒక కీ.మీ. మొసలపల్లి శివాలయ దర్శనం (నీలకంఠాయ). దీనితో ఏగాదశ రుద్రులు దర్శనం పూర్తి అయింది.

Return journey:

మొసలపల్లి నుంచి పులేటికుర్రు (జగ్గన్న తోట సెంటర్) Road point కు (వయా) జగ్గన్న తోట మీదగా తిరుగు ప్రయాణం. వీటి మధ్య దూరం సుమారు 3.2 కీ.మీ. దూరం. 

పులేటికుర్రు (జగ్గన్న తోట సెంటర్) Road point నుంచి ముక్కామల బస్ స్టాండ్ దూరం 1.8 Kms. ముక్కామల నుంచి రావులపాలెం మీదగా ఇంటికి ప్రయాణం. 

(2) మొసలపల్లి నుంచి దేవి సెంటర్ & దేవి సెంటర్ నుంచి ముక్కామల కు (వయా) NH-216E మీదగా చేరాలి. వీటి మధ్య దూరం సుమారు 3.2 కీ.మీ. దూరం. 
అమలాపురం (ఈదరపల్లి bypass road) నుంచి ముక్కామల పోవు NH-216E Road లో దేవి సెంటర్ ఉంటుంది.
*****

No comments:

Post a Comment

RECENT POST

దానాలు - శుభ ఫలితాలు*

దానాలు - శుభ ఫలితాలు*  ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగ పడుతుంది.. అనే మాటలు మనం వింటూ ఉంటాము. పురాణాలు కూడా దానం చ...

POPULAR POSTS