Sunday, January 16, 2022

ఎటు చూసినా మనకి సమస్యలే ! కారణం ?

 ఎటు చూసినా మనకి సమస్యలే ! కారణం ?



ఇంటిలోని సమస్యలకి ముఖ్యకారణం కులదైవం, గ్రామదేవత, తల్లితండ్రులను విస్మరించడమే.


మరి, ఏమి చేయాలి?


ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే, సూర్యుని ఎదుట లేదా పూజగదిలో కులదేవత, గ్రామదేవతా నామస్మరణ చేసి ఒక్క రూపాయిని ఇంట్లో హుండిలో వేసి, అలా పోగుచేసిన మొత్తాన్ని, మాసాంతంలో వచ్చే శనివారం సాయంత్రం మీ ఊరిలోని పురాతన దేవస్థానంలో దీపారాధన, ప్రదక్షిణ చేసి గుడిలో "పరమేశ్వరార్పణం" అని మనసులో చెప్పుకుని సమర్పించండి. దీనివలన వ్యక్తిగతంగా దోషనివృత్తి అవ్వడమే కాకుండా, ఆ దేవాలయ ధూప, దీప, నైవేద్యాలని పోషించిన వారై, అక్కడ చేసిన  నామస్మరణ చేత పరమాత్మ కృప, ఎంతో పుణ్యం కలిగి సుఖ సంతోషాలు లభిస్తాయి.


సనాతన సంప్రదాయాలు వదిలేసి, చేతిలో పరిష్కారం ఉండగా, "అపస్మారకాసుర" మాయలో పడి,  మూడవ వ్యక్తి పాదాలు పట్టుకోవడం అవివేకం. ఎక్కడో ఎవరికో వేలల్లో, లక్షల్లో ధారాదత్తం చేసేకంటే మన ఊరి దేవుడిని ఇంటిపెద్దగా భావించి మనమే స్వయంగా ఇక్కడే భక్తితో సులభంగా ఆరాధిస్తే, ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటుంది. ఆ ప్రాంతం శుభిక్షంగా ఉంటుంది. ఇది ధర్మసూక్ష్మం 

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS