Monday, January 31, 2022

సమస్యలు-తంత్ర పరిహారములు

 సమస్యలు-తంత్ర పరిహారములు



దంపతులకు వివాహం జరిగి చాలా కాలం గడచినా సంతానం కలుగకపోవటం, గర్భస్రావాలు జరగడం, ఎన్ని మందులు తీసుకన్నా సంతానం కలుగకపోవడం, సంతానము తమ మాట వినకపోవటం, సంతానం ప్రేమ వ్యవహారాలలో చిక్కుకోవడం, వాటి వలన తల్లిదండ్రులు మానసిక , సామాజిక సమస్యలను ఎదుర్కోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ సంతాన కారక గ్రహములు వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం వలన ఇవన్నీ జరుగుతాయి. దీనికి పరిహారం సంతానేష్టి, నవనాగమండల తంత్ర పరిహారములు. ఏవిద్య సరిగ్గా రాకపోవటం, పై చదువులకు ఆటంకము కలుగటం పోటీ పరీక్షలలో నెగ్గలేకపోవటం, విద్యాలయాలలో వత్తిళ్ళు, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఇతర విషయాల వలన చదువు మందగించటం, తద్వారా తల్లిదండ్రులకు విద్యార్థుల చదువుల రూపములో  ధన నష్టం జరుగుతుంది.12వ భావ వ్యతిరేకత అనుకూలతలను అనుసరించి చంద్ర గురు గ్రహములు ఫలితాలను ఇస్తారు. ఉద్యోగ సమస్య పరిష్కారమునకు తగిన హోమం వలన ఉద్యోగ. విదేశీయాన సమస్యలు తొలగిపోతాయి. 6వస్థానాధిపతి జాతకునిపై వ్యతిరేక ఫలితములను ఇస్తున్నప్పుడు ఊహించని విధముగా అనారోగ్యములు , దీర్ఘ కాలిక వ్యాధుల ప్రభావం ఎక్కువ అవుతుంది. హోమముల ద్వారా ఉపద్రవములను తొలగించుకోవచ్చు. 

ఉదాహరణగా :- 

జౌదుంబరీభి రిధ్మాభిః పశుకామస్య శస్యతే | దధ్నా చైవాన్నకామస్య పయసా శాన్తి మిచ్ఛతః ||

అపామార్గ సమిద్భిశ్చ కామయన్‌ కనకం బహు | కన్యాకామో ఘృతాక్తాని యుగ్మశో గ్రధితాని చ ||

జాతి పుష్పాణి జుహుయాద్గ్రామార్ధీ తిలతండులమ్‌ | వశీకర్మణి శాఖోటవాశాపామార్గ మేవచ ||


మేడి సమిథల యిధ్మములతో జేయుహోమము పశుసమృద్ధి నొసంగును (సమిథలు ఇరువది యొకటి కట్టిన ఇధ్మమం) అన్నకాముడు పెరుగు తోను శాన్తికాముడు పాలతోను హోమము చేయనగును. సువర్ణ సమృద్ధి గోరునాతడు ఉత్తరేణిసమిధల తోను కన్యాకాముడు నేతితో తడిపి రెండేసిజాజిపూలు కలిపి హోమము చేయవలెను. నువ్వులు, బియ్యము గ్రామార్థి (ఒక గ్రామము సొంతము కావలెనని కోరువాడ) హోమము సేయవలెను. వశీకరణ మందు శాఖోటము = బరివెంక సమిధలు వాశా (శీ) బాడిద సమిథలు ఉత్తరేణి సమిథలను వాడవలెను.ఇది గురువులు (ఉపదేశం) చెప్పిన విధముగా చేయుట వలన శీఘ్ర ఫలములు లభించును.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS