Thursday, June 1, 2023

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం కడప జిల్లా : #బ్రహ్మంగారిమఠం



 కడప జిల్లా : #బ్రహ్మంగారిమఠం

 శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం    కడప జిల్లా : #బ్రహ్మంగారిమఠం


💠తెలుగు రాష్ట్రాలలో వీరబ్రహ్మేంద్రస్వామి గురించి తెలియనివారుండరు. గొప్ప తత్వవేత్త , సంఘసంస్కర్త, మానవతావాది ఈయన. రాబోయే కాలములో జరిగే పరిణామాలను, సంఘటనలను ముందుగానే ఊహించి రాసిన 'కాలజ్ఞానం' అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక అద్భుతంగానే పరిగణించబడుతుంది. కాలజ్ఞానం లో పేర్కొన్న సంఘటనలు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో ఆయన్ను పూజించే వారి సంఖ్య కూడా పెరిగిపోతున్నది.

💠 శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వాముల వారు సామాన్య ప్రజలకు అర్థమగురీతిలో తత్త్వాలు రచించిన విశిష్టతత్త్వాచార్యుడు, ఇంతవరకు ఏ మహానీయుడు చూపని శరీరములోని విష్ణు రుద్రాది దేవతలను కక్కనికి చూపి. కాలజ్ఞానము " రచించి, ప్రతి విషయమునకు ఏనాడో బ్రహ్మంగారు చెప్పారు' అను నానుడి కలిగించి సామాన్య మానవునివలె జీవితం గడిపి, అనేక మహిమలు చూపి అష్టాంగ యోగ సాధనలో నిపుణుడై 'అహంబ్రహ్మాన్ని" అని చెబుతూ పరమాత్మాను భూతిని పొంది క్రీ.శ. 1693లో జీవసమాధి అయ్యాడు. 
ఆ జీవసమాధిపై బ్రహ్మంగారి మఠం వెలసింది.

🔅 బ్రహ్మంగారి చరిత్ర 🔅

💠బ్రహ్మంగారి పూర్తి పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. ఆయన తండ్రి పోతులూరి పరిపూర్ణయాచార్యులు మరియు తల్లి పోతులూరి ప్రకృతాంబలకు
1608 లో జన్మించాడు . ఆయనను పెంచిన తండ్రి పేరు వీర భోజయాచార్యులు మరియు పెంచిన తల్లి పేరు వీరపాపమాంబ. 
ఆయన వీర భోజయాచార్యులు మరణానంతరం స్వయంగా జ్ఞాన సముపార్జన చేయాలని నిశ్చయించి తన ఎనిమిదవ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరాడు.
ఆ సందర్భంలో ఆయన పిండోత్పత్తి, జీవి జన్మ రహస్యాలను ,ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.

💠 బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి అచ్చమ్మ గారి వద్ద  పశువులను కాచే పనికి.కుదిరారు. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన ఆయన అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాసారు.

💠 బ్రహ్మంగారు కందిమల్లయ పల్లి చేరుకొని వడ్రంగిగా జీవితాన్ని ప్రారంభించారు. ఈ ఊరి గ్రామ దేవత పోలేరమ్మ.
ఊరిలో జాతర నిర్వహించటానికి అందరూ చందాలు వేసుకుంటూ బ్రహ్మంగారిని అడుగుతారు. అప్పుడు అయన తాను నిరుపేదనని చందా ఇవ్వలేనని చెబుతారు.
అక్కడే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు కావాలని చుట్టు ఉన్నవారిని అడిగారు. వారు లేదనడంతో "పోలేరమ్మా చుట్టకాల్చుకోవాలి నిప్పుతీసుకురా!" అని పెద్దగా కేకపెట్టారట బ్రహ్మంగారు. వెంటనే మండే ఒక నిప్పుకర్ర స్వామి చెంతకు వచ్చింది. శ్రీ స్వామి వారు చుట్ట కాల్చుకొని "ఇక చాలు తల్లి తీసుకు పో" అనగానే పోలేరమ్మ గుడిలోకి వెళ్లి పోయిందట. ఇప్పటికీ రచ్చబండ, పక్కనే పోలేరమ్మ గుడి కనిపిస్తుంటాయి.

💠 బ్రహ్మంగారు వివిధ ప్రాంతాలను తిరుగుతూ తిరుగుతూ కడప జిల్లా కందిమల్లయపల్లి లో జీవసమాధి చెందారు. కాలక్రమంలో ఇక్కడే ఆయన మఠం కూడా వెలిసింది. ఆయన తిరుగాడిన ఈ నేలను, వస్తువులను, సమాధిని దర్శించటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు.

💠 ఆయన బ్రాహ్మణుడైన అన్నాజయ్యను, రెడ్డికుల స్త్రీ అయిన అచ్చమ్మను, మహమ్మదీయుడైన సిద్ధయ్యను, మాదిగ అయిన కక్కయ్యను శిష్యులుగా స్వీకరించి కులరాహిత్య సమాజము కొరకు, సర్వమానవ సౌభ్రాతృత్వము కొరకు కృషిచేశాడు.

💠 శ్రీ ఈశ్వరమ్మ సమాధి : 
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వాముల వారు వంచించినట్లు ఆయన మనుమరాలయిన శ్రీఈశ్వరీ మాత కూడా అనేక మహిమలు చూపి, బ్రహ్మేంద్రులవారి కాలజ్ఞానమును బోధనలను ప్రచారము చేసి వలెనే జీవసమాధి అయింది.
ఈమె సమాధి కూడా కందిమల్లయపల్లె లో కలదు. నవరత్న మండపం కూడా సందర్శించదగినదే.

💠 వీరనారాయణమ్మ వంశములోని వారు పారంపర్యముగ పీఠాధి పత్యమును, మరాధసత్వమ స్వీకరిస్తున్నారు. 
ప్రస్తుత పీఠాధిపతియైన వీరభోగవసంత వేంకటేశ్వరస్వాముల వారు శ్రీ  వీరనారాయణమ్మ వంశములో ఏడవ తరమునకు చెందినవారు, మఠాధిపతులలో పదకొండవ మఠాధిపతి.

💠 మఠం ఆవరణలో యాత్రికుల కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర సదనం, శ్రీ గోవింద మాంబా సదనం, తిరుమల తిరుపతి దేవస్థానము వారి సౌజన్యంతో 20 గదుల సత్రం నిర్మించబడినవి. మఠములో నిత్యాన్నదానం జరుగుతున్నది. 

💠 శ్రీ వీరభ్రహ్మేంద్రస్వాములవారి జీవసమాధి మందిరము వెండి తొడుగులతో, ద్వారాలు ఇత్తడి తొడుగులతో శోభాయమానంగా తీర్చిదిద్దబడినవి.

💠 ప్రతి మహాశివరాత్రికి శ్రీ వీరబ్రహ్మం గారి దంపతులకు రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశాఖ శుద్ద దశమి రోజున జరిగే శ్రీ స్వామి వారి ఆరాథనోత్సవాలకు వేలాదిగా భక్తులు హాజరవుతారు.

💠కడప నగరం నుండి 70 కి.మీ, మైదుకూరు నుండి 25 కి.మీ దూరంలో వుంది.

© Santosh Kumar

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS