Friday, June 2, 2023

పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావన

కాశి,మధురై,త్రిపురాంతకంలో మాత్రమే
ఉన్న కదంబ వృక్షాలు..ఎర్ర రంగు పువ్వులతో ఉంటాయి..ఇది మరి ఎక్కడ మనము చూడము..కాలక్రమేన ఈ వృక్షాలు క్షీణించినాయి..


ఈ పువ్వుల్ని మనము చెట్టు నుండి కోయరాదు..కింద రాలినవి మాత్రమే పూజించుకోవాలి..అవి చాలా సుకుమారంగా ఉంటాయంట..

అంతే కాదు ఈ కాదంబ చెట్టు కింద కూర్చుని అమ్మ నామాన్ని గాని సహస్రనామాలు కానీ లేదా గురువు దగ్గర నుంచి తీసుకున్న మంత్ర ఉపదేశం మంత్రాన్ని జపిస్తే చాలా త్వరగా సిద్ధిస్తుంది అంట..పౌర్ణమి రోజు రాత్రి ఆ చెట్టు కింద కూర్చొని మనసుని అమ్మ పై పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషించి మణిద్వీపానికి చేరుకోవడానికి మనము ముందు అడుగులో ఉంటాము అంట..

నిన్న అమ్మకి కదంబ పుష్పాలు పెట్టానే కాని మనసులో ఎందుకో తెలియని ఆలోచనలు..ఈ పువ్వుల్ని అమ్మ ఎందుకు ఇష్టపడుతుంది అని..అవి చూస్తే ఏంటో జిగురు జిగురుగా అనిపించాయి..సరే అని ఊరుకున్నాను..

ఇంతలో ఈ రోజు పొద్దున్న ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక తమ్ముడు ఇలా మన కాదంబ చెట్టు గురించి పార్వతమ్మ ఇష్టపడే ఈ కదంబ పువ్వులు గురించి ఫోటోలు తో సహా నాకు పెట్టాడు మీరు కూడా చూసి దర్శించుకోండి..

పురాణాల్లో కదంబ వృక్షం ప్రస్తావన :
ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతం లో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతం లో పార్వతీవృక్షమనీ అంటారు.

ఈ వృక్షానికి కృష్ణుడికీ మంచి అనుబంధం ఉంది. రాధాకృష్ణుల ముచ్చట్లు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షం అంటారని పురాణాలు చెబుతున్నాయి
* దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’ అంటారు. కదంబ వృక్షానికి ‘ఓం శక్తిరూపిణ్యై నమః’ అనే మంత్రంతో పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు

గ్రహదోషాలు తొలగించు కోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబవృక్షానికి పసుపు, కుంకుమలు, పూలతో అర్చన చేయాలని, అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి

హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం..అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం.
దక్షిణాదిలో అమ్మవారిని ‘కదంబవనవాసిని’..అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

From Pilladi Rudrayya

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS