Monday, June 5, 2023

శ్రీ కృష్ణ కమల మందిరం(ఇస్కాన్ టెంపుల్),తిరుపతి

శ్రీ కృష్ణ కమల మందిరం(ఇస్కాన్ టెంపుల్),తిరుపతి

-------------------------------------------------------------------
తిరుమల , భారతదేశం  లోని పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది...అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని దర్శించుకుని వెలుతుంటారు. అయితే ఈ మహిమాన్విత ప్రదేశంలో మీరు దర్శించాల్సిన ప్రదేశాలు మరెన్నో ఉన్నాయి. 

కలియుగ దైవం చుట్టూ ఎన్నో మరెన్నో దర్శనీయ ప్రదేశాలు, ప్రకృతితో మమేకమయ్యి విశ్వమంతానిండి ఉన్న ఆ మహా రూపానికి దగ్గరగా మనలని తీసుకు వెళ్ళిన అనుభూతినిచ్చే ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి ఇస్కాన్ టెంపుల్ .

 కలియుగంలో శ్రీకృష్ణుని కోసం అనేక దేవాలయాలు నిర్మింపబడ్డాయి. వాటిలో కొన్ని శ్రీకృష్ణ దేవాలయాలు నిత్యం భక్తులతో, యాత్రికులతో కిటకిటలాడుతుంటాయి.
 ప్రతి నిత్యం కొన్ని వేలల్లో భక్తులు శ్రీకృష్ణుని అనుగ్రహం పొందడానికి దేవాలయాలను వెళుతూనే ఉంటారు. 

మనం సాధారణంగా శ్రీకృష్ణుని దేవాలయాలలో శ్రీకృష్ణునితో పాటు రాధ లేదా రుక్మిణి ఉన్నవిగ్రహాలను కొలువుదీరి ఉంటాయి. శ్రీకృష్ణుడు తరచూ వేణువు ఊదుతుంటారు కాబట్టి, వేణుమాధవా అని స్మరిస్తుంటారు. 
మన సృష్టికే మూల పురుషుడైన శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణుడు తన జీవిత చరిత్రతో ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ది. మరి అంతటి ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణుడు కొలువై ప్రసిద్ది చెందిన తిరుపతి ఇస్కాన్ టెంపుల్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం..

తిరుపతి పుణ్య క్షేత్రములో, కపిలతిర్థమ్ జలపాతం ఉన్న ప్రాంతమునకు దగ్గరలో ఇస్కాన్ కృష్ణ దేవాలయము ఉన్నది. ఇక్కడ ఈ ఆలయము ఇస్కాన్ (హరేకృష్ణ )ఆలయముగా ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయమును చాలా శ్రమపడి అందంగా తీర్చి దిద్దారు.

ఆలయము చుట్టూ పచ్చిక బయళ్ళు తయారు చేసి సందర్శకులకు చూడచక్కని ప్రదేశముగా తయారు చేశారు. పండగలు పర్వదినాల్లో ఇస్కాన్ ఆలయాలు సర్వాంగసుందరంగా ముస్తాబు అవుతాయి.

తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన శిల్పకళా సౌందర్యం సందర్శకులను మంచి అనుభూతిని కలిగిస్తాయి.

కిటికీలు కృష్ణుడి లీలల గాజు చిత్రాలతో అలంకరించబడి ఉంటాయి. పైకప్పులు తంజావూరు శైలి కళతో అలంకరించారు. ఆలయ స్తంభాలపై విష్ణుమూర్తి పది అవతారాలూ ఉంటాయి. గర్భగుడిలో చుట్టూ గోపికలతో కృష్ణుడు ఉంటాడు. ఆలయం లోపల అందమైన పూలు, కొలనులు, ఫౌ౦టైన్ లు, కృష్ణ లీల విగ్రహాల తో ఒక అందమైన పార్కు కూడా ఉంటుంది.

తిరుపతి రైల్వే స్టేషను నుండి ఆటోలో ఈ దేవాలయమునకు వెళ్ళవచ్చును. తిరుమల తిరుపతి దేవస్థానము వారు ప్రతి రోజూ ఆలయ దర్శనము యాత్రలో ఈ అలయాన్ని చూపిస్తారు.

దేవాలయం తెరచు వేళల:  ఉదయం 7:30 గంటలనుండి రాత్రి 8:30 వరకు గుడిని తెరచి వుంచెదరు.

No comments:

Post a Comment

RECENT POST

#కుజదోష నివారణకు పరిహారం :

#కుజదోష నివారణకు పరిహారం : కుజు దశ ఏడు సంవత్సరాలు కనుక కుజుడికి అధిపతి అయిన కుమారస్వామి అష్టకం ఏడు సార్లు పారాయణం చేయాలి.  సుబ్రహ్మణ్య ఆలయ స...

POPULAR POSTS