'శ్రీనీలకంఠాయ నమశ్శివాయ', 'కేదారనాథాయ నమశ్శివాయ' అనే వాక్యాలతో రెండు అష్టక స్తోత్రాలున్నాయి. పంచాక్షరీ మహామంత్రంతో కలిపిన చతుర్థ్యంత శివనామాలను పలుకుతుంటే కలిగే ఆనందానుభూతితో.... ఇష్టంగా మరి కొన్ని శంభు నామాలను కలిపి పూజించాలనిపించింది.
ఆ సంకల్పంతో స్వామికృపతో భక్తిగా సమకూర్చుకున్న నామావళి ఇది. సహృదయులు దీనిని వినియోగించుకోవచ్చని.... శివప్రీతికరమైన కార్తికమాస సందర్భంగా శివచరణాలకు సమర్పించుకుంటున్నాను.
శ్రీ విశ్వనాథాయ నమశ్శివాయ
కాశీస్వరూపాయ నమశ్శివాయ
కాశీనివాసాయ నమశ్శివాయ
కేదారనాథాయ నమశ్శివాయ
కైలాసనాథాయ నమశ్శివాయ
కైవల్యరూపాయ నమశ్శివాయ
శ్రీ శైలనాథాయ నమశ్శివాయ
శ్రీ బ్రామరీశాయ నమశ్శివాయ
ఏకామ్రనాథాయ నమశ్శివాయ
శ్రీ జంబుకేశాయ నమశ్శివాయ 10
అరుణాచలేశాయ నమశ్శివాయ
శ్రీ కాళహస్తీశాయ నమశ్శివాయ
శ్రీ చిత్సభేశాయ నమశ్శివాయ
శ్రీ మన్నటేశాయ నమశ్శివాయ
శ్రీ రామనాథాయ నమశ్శివాయ
శ్రీ తారకేశాయ నమశ్శివాయ
శ్రీ సోమనాథాయ నమశ్శివాయ
శ్రీ మహాకాలాయ నమశ్శివాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ
శ్రీ ఓషధీశాయ నమశ్శివాయ
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
శ్రీ దాతృరూపాయ నమశ్శివాయ
గౌరీసనాథాయ నమశ్శివాయ
మృత్యుంజయాయ తే నమశ్శివాయ
శ్రీ నాగనాథాయ నమశ్శివాయ
శ్రీ పశుపతీశాయ నమశ్శివాయ
శ్రీ అంబికేశాయ నమశ్శివాయ
ఓంకారనాథాయ నమశ్శివాయ
శ్రీ తాణ్డవేశాయ నమశ్శివాయ
శ్రీ మూలనాథాయ నమశ్శివాయ 30
కాలాగ్నికాలాయ నమశ్శివాయ
శ్రీ నీలకంఠాయ నమశ్శివాయ
సచ్చిదానన్దాయ నమశ్శివాయ
యోగీశ్వరేశాయ నమశ్శివాయ
శ్రీ త్ర్యంబకేశాయ నమశ్శివాయ
తపఃస్వరూపాయ నమశ్శివాయ
శ్రీ యోగనాథాయ నమశ్శివాయ
దేవాదిదేవాయ నమశ్శివాయ
శ్రీ మహాదేవాయ నమశ్శివాయ
సర్వలోకేశాయ నమశ్శివాయ 40
అమృతేశ్వరాయ తే నమశ్శివాయ
కాలస్వరూపాయ నమశ్శివాయ
శ్రీ కాలకాలాయ నమశ్శివాయ
శ్రీ పంచవక్త్రాయ నమశ్శివాయ
పంచాక్షరీశాయ నమశ్శివాయ
పంచభూతేశాయ నమశ్శివాయ
యోగిహృద్వేద్యాయ నమశ్శివాయ
గుణత్రయేశాయ నమశ్శివాయ
గుణాద్యతీశాయ నమశ్శివాయ
వేదాన్త వేద్యాయ నమశ్శివాయ 50
వేదస్వరూపాయ నమశ్శివాయ
సర్వమత్రేశాయ నమశ్శివాయ
మనస్వరూపాయ నమశ్శివాయ
యన్త్రతన్త్రాత్మనే నమశ్శివాయ
సారస్వరూపాయ నమశ్శివాయ
రవిమండలస్థాయ నమశ్శివాయ
చన్ద్రార్ధధారిణే నమశ్శివాయ
సోమస్వరూపాయ నమశ్శివాయ
అష్టమూర్త్యాత్మనే నమశ్శివాయ
అర్ధనారీశాయ నమశ్శివాయ 60
భవాయ దేవాయ నమశ్శివాయ
శర్వాయ దేవాయ నమశ్శివాయ
ఈశానాయ దేవాయ నమశ్శివాయ
ఉగ్రాయ దేవాయ నమశ్శివాయ
రుద్రాయ దేవాయ నమశ్శివాయ
మహతే దేవాయ నమశ్శివాయ
పశుపాశనాథాయ నమశ్శివాయ
పశుపాశనాశాయ నమశ్శివాయ
భగవతే రుద్రాయ నమశ్శివాయ
తారస్వరూపాయ నమశ్శివాయ 70
శ్రీ తారకేశాయ నమశ్శివాయ
విద్యాధివాసాయ నమశ్శివాయ
గురుస్వరూపాయ నమశ్శివాయ
శుద్ధచైతన్యాయ నమశ్శివాయ
మోక్షస్వరూపాయ నమశ్శివాయ
శ్రీ ఆదినాథాయ నమశ్శివాయ
ఆద్యన్తరహితాయ నమశ్శివాయ
శ్రీ కాలనాథాయ నమశ్శివాయ
మృడాయదేవాయ నమశ్శివాయ
త్రిపురాన్తకాయ తే నమశ్శివాయ 80
జ్యోతిర్లింగాయ నమశ్శివాయ
దహరాభ్రవాసాయ నమశ్శివాయ
వృషభధ్వజాయ తే నమశ్శివాయ
వృషభేశవాహాయ నమశ్శివాయ
అమృతస్వరూపాయ నమశ్శివాయ
అమృతాంశుమౌళయే నమశ్శివాయ
శ్రీ పరంజ్యోతిషే నమశ్శివాయ
పరమాత్మనే తే నమశ్శివాయ
శ్రీ సాంబదేవాయ నమశ్శివాయ
వాగర్థాత్మనే నమశ్శివాయ 90
షడధ్వాతీతాయ నమశ్శివాయ
అగ్నీషోమాత్మనే నమశ్శివాయ
యజ్ఞస్వరూపాయ నమశ్శివాయ
భక్తాంతరంగాయ నమశ్శివాయ
శాంతస్వరూపాయ నమశ్శివాయ
పినాకహస్తాయ నమశ్శివాయ
చిద్వ్యోమవాసాయ నమశ్శివాయ
దక్షిణామూర్తయే నమశ్శివాయ
శ్రీ మహాలింగాయ నమశ్శివాయ
భువనైకనాథాయ నమశ్శివాయ 100
సనాతనేశాయ నమశ్శివాయ
శ్రీ సున్దరేశాయ నమశ్శివాయ
శ్రీ శాస్త్రయోనయే నమశ్శివాయ
ప్రణవతత్త్వార్థాయ నమశ్శివాయ
శ్రీ శంభుదేవాయ నమశ్శివాయ
శ్రీ మన్మహేశాయ నమశ్శివాయ
శ్రీ సిద్ధలింగాయ నమశ్శివాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ. 108
- బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు