Sunday, November 24, 2024

కొన్ని తెలుసుకుందాము

కొన్ని తెలుసుకుందాము 


1. ఇంట్లో నిమ్మకాయ దీపాలు పెట్టకూడదు, ఒకవేళ రాహుకాలం లో పెట్టాలి అనుకుంటే తులసికోట దగ్గర పెట్టుకోవచ్చు.

2.ఎవరైనా మన ఇంట్లో ఉప్పు దొంగతనం చేసారంటే మనకు పట్టిన దరిద్రం పోయి నట్టే, ఉప్పు దానం గా ఇస్తే మన ఇంటి లక్ష్మీని ఇచ్చినట్టు..

3. శుభాకార్యలకు వెళ్ళినప్పుడు వెండి కానుకలు బహుమతి గా ఇవ్వకూడదు..

4. కుంకుమ చై జారి నెల పైన పడితే ఆపశకునం గా భావించకూడదు భూదేవీ స్వేకరించారు అని నమస్కారం చేసుకోవాలి, నెగటివ్ గా ఆలోచిస్తే నెగటివ్ ఎఫర్ట్ పడుతుంది.. 

5. ఆకండ దీపం కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చు అది దోషం గా భావించకూడదు..

6. న్యూస్ పేపర్ లు పరిచి దేవుడు పటాలు, విగ్రహాలు పెట్టకూడదు..అందులో దుర్వార్థలు కూడా ఉంటాయి..

7. భగవంతుడు దగ్గర నైవేద్యం పెట్టే పాత్రలు పూజ ఐయ్యాక ఆ పాత్ర నుండి విడిగా తీసి గాని లేక గరిటతోగాని ప్రసాదం పంచుకోవాలి అందులోనే తిని భగవంతుడు ప్రసాదం పాత్రలు ఎంగిలి చేయకూడదు ఆలా చేసింది వాడకూడదు. 

8. గురు స్థానం లో ఉన్న వారికి మీరు తినే పల్లాల్లో భోజనం వడ్డీంచకూడదు అది దోషం, విస్తరాకు లో గాని విడిగా కొత్త పల్లెం లో పెట్టాలి..

9. ఇంట్లో తరచూ గోడవలు పిల్లలు చెప్పిన మాట వినకుండా విసిగించడం ఇలా కుటుంబం లో మనశాంతి లేకుంటే.. ఇంట్లో తరచూ సాంబ్రాణి పైన బిర్యానీ ఆకులు తెల్ల ఆవాలు వేసి దూపం వేస్తూ ఉండాలి కాకికి అన్నం పెట్టాలి.. ఇలా చేస్తూ ఉంటే కారణం లేని గోడవలు తగ్గుతుంది.

10. కొందరు భైరవుడికి సమర్పిస్తునట్టు భావించి మధ్యాన్ని కుక్కలకు పోస్తుంటారు అవి తాగడం వల్ల అవి మత్తేక్కి వాహనాలు కింద పడే అవకాశం ఉంటుంది అది మహా పాపం.. ఆలా మధ్యాన్ని ఇవ్వాలి అనుకుంటే ఏ పేద వాళ్ళకైనా భైరవుడి కి ఇస్తునట్టు భావించి ఇవ్వచ్చు.

11. స్నానం చేసుకుని వంటచేయాలి ఆలా వండిన పదార్ధం (అన్నం )పాత్ర తో సహా భగవంతుడు దగ్గర నివేదన చేసి తింటే ప్రసాదం అవుతుంది..

12. చీకటి పడ్డాక తల వెంట్రుకలు చిక్కు తియ్యకూడదు.. ఆడపిల్లలు తల స్నానం చేసినప్పుడు సాంబ్రాణి అప్పుడప్పుడు అయినా సాంబ్రాణి వేస్తుంటే దిష్టి పోతుంది ఆరోగ్యం గా ఉంటారు..

13. జాతకం చూపించకుండా వజ్రాలు
, నీలి రత్నాలు, ధరించకూడదు...

14.. దేవతలు విగ్రహం లాంటి ఉంగరాలు ధరించి నప్పుడు భగవంతుడు పాదాలు నెల వైపు ఉండాలి భూ దేవీ ఆ భారాన్ని బరిస్తుంది మన వైపు ఉండకూడదు..

15. ఆడవాళ్లు దంపతులు కలిసినప్పుడు రోజూ తలస్నానం అవసరం లేదు ఆడవాళ్ళకి పాపటి లో గంగమ్మ ఉంటుంది పాపటిలో కుంకుమ దరిస్తే చాలు, మగవాళ్ళు మటుకు భార్య తో కలిస్తే తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు.

16. ఇంట్లో ఆడవాళ్లు మైలు తో ఉంటే వారికి దూరం గా ఉంది నిత్య పూజ కుటుంబం సుభ్యులు చేయవచ్చు..

17. కాలం చేసిన పెద్దలు తరచుగా కలలోకి వస్తే మంచిదే, ఇంట్లో అన్నశాంతి చేయిస్తే వారికి ఆ పుణ్యం దక్కుతుంది.

18. తీర్తయాత్రలకు వెళ్లి ఇంటికి రాగానే స్నానాలు చేసి మీరు తెచ్చిన ప్రసాదం తో పాటు ఇంట్లో నైవేద్యం వండి భగవంతుడు కి సమర్పించాలి.. యాత్ర ఫలితం దక్కుతుంది.. అదే కాశీ క్షేత్రం గాని వేలి వస్తే వడలు దంట కుట్టి వీధి కుక్క గాని ఇంట్లో ఉండే పెంపుడు కుక్క అయినా వాటి మేడలో వేయాలి అందులో ఉప్పు వేయకూడదు ఇది వరకు కాలం లో ఇలా చేసే వారు..

19. నోటితో తరచూ, చావు అనే మాట, దరిద్రం అనే మాట, కష్టం అనే మాటలు వాడకూడదు ఆలా అంటూ ఉంటే.. అవి ఎంత దూరం లో ఉన్నా పిలుస్తున్నారు అని దగ్గరవుతాయి..
తధాస్తు దేవతలు భుజాలు పైనే ఉంటారు.. కారణం లేకుండా ఏడవటం శాపనార్ధాలు పెట్టడం ఆలా పెట్టే వాళ్ళు ఇంట్లో ఉన్నా కలిసి రాదు.

20. స్త్రీ శాపాలు, పితృ దోషాలు ఉన్న వారికి ఏ పని కలిసి రాదు రావాల్సింది చేతికి అందదు.. అసంతృప్తి జీవితం గడుపుతూ విలువైన జీవితం కోల్పోతారు.. అటువంటి పరిస్థితి లో ఉన్నవారు ఒడ్లు నువ్వులుతో రుద్ర హోమం చేయాలి, ఉపశమనం లభిస్తుంది.

21.కొబ్బరికాయ పాతవిగా ఉంటే కుళ్ళిపోతాయి ఆలా ఉంటే ఇంకో టంకాయ కొడితే సరిపోతుంది ఆపశకునం గా బాధ పడకూడదు దోషం పోయింది అనుకోవాలి.

21. జపం చేసే మాల మేడలో వేసుకోకూడదు, మేడలో వేసుకునే మాలను జపానికి వాడ కూడదు.. స్నానం చేయకుండా జప మాల ముట్టుకోకూడదు.

22.పాలు, పెరుగు, నైయ్యి, నీరు, ఇవి ఎక్కడైనా స్వేకరించవచ్చు అందులో లక్ష్మి నివాసం ఉంటుంది.

23. ఎంగిలి గిన్నెలు ఎదురు చూడకూడదు తిన్న వెంటనే కంచాలు కడిగేయాలి..

24. ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే సంవత్సరం వరకు పూజ చేయకుండా దీపం పెట్టకుండా ఉండకూడదు.. అది చాలా దోషం 11 రోజులు కార్యక్రమం తర్వాత పూజలు చేసుకోవచ్చు.
25. వారంలో ఏ రోజు అయితే జన్మిస్తామో ఆ రోజు క్షుర సంస్కారాలు చేయకూడదు..

శ్రీ వెంకటేశాయ నమః 🙏

No comments:

Post a Comment

RECENT POST

స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల

నిజమైన స్యయంభూ ఏకరూప దత్తాత్రేయ స్వామి  మన పల్నాడు ప్రాంత ఎత్తిపోతల లో తప్పితే ఎక్కడా ప్రపంచంలో లేరు..ప్రపంచంలో ఎన్ని దత్తాత్రేయ ఆలయాలు ఉన్న...

POPULAR POSTS