కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు.
1. తైలావలోకనం:
కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పోసి అందులో పగడం ముత్యం ఉంచాలి. ఒకచోట ఉప్పు గుట్టగా పోసి ఈ పాత్రని దానిపై ఉంచి పూజించాలి. ఆతర్వాత ఆ తైలం లో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి.
2. రుద్రాభిషేకం:
నక్షత్రం యొక్క దోషాన్ని బట్టి అవసరం. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసి తదుపరి బ్రహ్మణుడికి భోజన, తాంబూల, దక్షిణలచే సంతోషింపచేసి వారి ఆశీస్సుని పొందాలి.
3. సూర్య నమస్కారాలు:
ఒంటికాలిపై నిలచి అరుణమంత్రాన్ని 108 పర్యాయాలు జపించుచు చేయు ప్రార్ధనలకు సూర్య నమస్కారాలు అని పేరు. ఇందుకై ఒకరు లేదా ముగ్గురు లేదా అయిదుగురు ఇలా చేస్తూ ఉంటారు సమయాన్ని బట్టి.
4: మృత్యుంజయ జపం:
ఇదే అపమృత్యువుహరం. యధా శక్తి బ్రహ్మణులని పెట్టి లక్ష మృత్యుంజయ జపం చేయడం తద్వారా గండములు తొలగి దోషాలు తొలగిపోతాయి.
5. నక్షత్ర జపం:
27 మంది బ్రహ్మణులతో ఒక్కొక్క నక్షత్రానికి 108 నుండి 1008 పర్యాయాలు శాంతి మంత్రం జపించుట.
6. నవగ్రహ జపం:
తొమ్మిది మంది విప్రులు ఆయా శాంతి మంత్రములని చేయుట. ఆపై అది, ప్రత్యధి దేవతలకు జప సంఖ్యలో దశమం జపం చేయుట, ఆపై తర్పణం చేయుట.
7. హోమం:
అగ్నిపూర్వకంగా ఆయా సమీదలు, ద్రవ్యములు, ధాన్యాలతో హోమం చేయుట.
8. సువాసినీ పూజ:
శక్తిని అనుసరించి 9 మంది ముత్తైదువులు వాయునాలని ఇచ్చి పూజించుట. ఆశీస్సులు పొందుట.
9. సమారాధనం:
ఈ ఎనిమిది శాంతుల అనంతరం బ్రాహ్మణులకు సంతర్పణ చేయుట.
......
తొమ్మిది అంగములతో చేసేదే శాంతి యనబడును. తద్వారా అన్ని గ్రహ, అపమృత్యు, ఇతర దోషాలు తొలగును.
No comments:
Post a Comment