నవరత్నాలు NAVARATNALU వీటిని కిరీటాలు, భుజకీర్తుల్లో ఎక్కువగా వాడినట్లు చరిత్ర చెపుతోంది. ఈ క్రింది యూట్యూబ్ వీడియో లింకులు నొక్కినచో (ప్రెస్ చేసినచో) వీడియోల ద్వారా, కోరిన సమాచారం మొత్తం చూడగలరు- వినగలరు. https://www.youtube.com/playlist?list=PLe3Rs4Hh16A2bb0wVPc3QKax8L94OlHWu
కెంపు (మాణిక్యం)
వజ్రం,
నీలం,
పుష్యరాగం,
మరకతం,
ముత్యం,
పగడం, (ప్రవాళం)
గోమేదికం,
వైడూర్యం
వీటిన్నింటిని కలిపి నవరత్నాలు అని వ్యవహరిస్తారు.
ఆదివారము - సూర్యుని కోసము కెంపుల కమ్మలు, హారాలు మొదలగున్నవి.
సోమవారము - చంద్రుని కోసం ముత్యాల హారాలు, గాజులు మొదలగునవి.
మంగళవారం - కుజుని కోసం పగడాల దండలు, ఉంగరాలు మొదలగునవి.
బుధవారం - బుధుని కోసం పచ్చల పతకాలు, గాజులు మొదలగునవి.
గురువారము - బృహస్పతి కోసం పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు మొదలగునవి.
శుక్రవారం - శుక్రుని కోసము వజ్రాల హారాలు, ముక్కుపుడక మొదలగునవి.
శనివారము - శని ప్రభావం పడకుండా ఉండడం కోసం నీలమణి హారాలు మొదలగునవి. మెడలో వేసుకొనే నగలలో అయినా చేతికి ధరించేవి అయినా నవరత్నాలను పొదగడం ఒక చదరపు పద్ధతిలో ఉంటాయి. అయితే తప్పనిసరిగా మధ్యలో రూబీ ఉండాలి. రూబీ సూర్యగ్రహరత్నం. ఈ విశ్వానికి సూర్యుడు కేంద్రం కాబట్తి ఆ గ్రహానికి ప్రాతినిధ్యం వహించే రూబీని మధ్యలో పొదుగుతారు.
శుక్ర గ్రహ రత్నమైన వజ్రాన్ని రూబీకి తూర్పుగా, శని గ్రహరాయి సఫైర్ ని పశ్చిమాన, కేతు గ్రహ రత్నామైన కేట్స్ ఐని ఉత్తరం వైపున, అంగారకుని రత్నమైన పగడాన్ని ఈశాన్య భాగాన, చంద్రుని రత్నమైన ముత్యం ఆగ్నేయ భాగాన, రాగు గ్రహ రత్నమైన జిర్కాన్ ని నైరుతి మూలన, బృహస్పతి గ్రహ రాయి టోపాజ్ ని వాయువ్య మూలన పొదుగుతారు.
నలు చదరంగా, దీర్ఘ చతురస్రాకారంగా కాక ఇతర రూపాలలో కూడా నగలు తయారుచేస్తారు. అయితే సూర్య గ్రహ రత్నమైన రూబీ మాత్రం తప్పనిసరిగా అమధ్యలో ఉండాల్సిందే. బ్రాన్‌లైట్స్ లో నవరత్నాలు వరుసగా ఒకదానిపక్కన మరొకటి ఏర్పాటు చేసినప్పుడు కూడా రూబీ మధ్యలో ఉండేలా చూస్తారు. నవరత్నాల నగలు తయారీకి ఉపయోగించే అన్ని రాళ్ళు ఒకే సైజులో ఉండాలి. అవి కూడా స్వచ్ఛమైనవి కావాలి. నాసిరకం రత్నాలు వాడితే సత్ఫలితాలు రాకపోగా చెడు ఫలితాలను చవిచూడాల్సి ఉంటుంది. మగవారికోసం నవరత్నాలు పొదిగిన ఉంగరాలు తయారుచేస్తుంటారు. పన్నెండు వరుసలలో నవరత్నాలను వాడి 108 రత్నాల ఉంగరాలను తయారుచేసే పద్ధతి దక్షిణాది రాష్ట్రాలలో ఉంది.
నవరత్నాలలో మేలు ఉన్నప్పటికీ వాటిని ధరించటంలో కొన్ని నియమాలు, జాగ్రత్తలు వహించాలంటుంది శాస్త్రం. నవరత్న శాస్త్రాన్ని నమ్మితే ఆ పద్ధతులను పాటించాల్సిందే. నవరత్న ఎంపిక దగ్గర నిపుణులను సంప్రదించాలి. ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పద్ధతిలో ధారణకు సిద్ధం చేస్తారు.
పూజ ముగించిన తరువాత ఖగోళ శాస్త్రాన్ని చదివిన పండితులు సూచించిన సమయంలో మాత్రమే నగల తయారీకి ఇవ్వాలి. ఒక్కొక్క తరహా రత్నానికి ఒక్కొక్క ముహూర్త సమయముంటుంది. అదే విధంగా తయారైన నగను తిరిగి ఒక శుభ ముహూర్త సమయంలో మాత్రమే తిరిగి వేసుకోవాలి. నవరత్నాల మీద నమ్మకం మహారాజులనుండి సామాన్యుల వరకు అన్ని వర్గాల వారికీ ఉంది. మానవ జీవితంలో జ్యోతిషం చాల ప్రాముఖ్యం వహిస్తున్నది, ప్రపంచములోని అన్ని దేశాల ప్రజలు తమ తమ జాతకాలకు సంభందించిన మంచి, చెడుల గురించి తెలుసుకోవడానికి, తగిన దోష నివారణ మార్గాలు గుర్తించి ఆచరించడానికి జ్యోతిష శాస్త్రం మీదనే ఆధార పడుచున్నారు. దేశములూ, జాతులూ, భాషల భేదాలను బట్టి స్వల్ప తేడాలున్నప్పటికీ ప్రపంచములోని జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా నవగ్రహాలు మరియు వాటి చలనాల ఆధిపత్యములను అనుసరించే ఫలితాలను తెలుపుతున్నాయి.
నవగ్రహములు సౌరకుతుమ్బమునకు చెందినవి. భారతీయులు, ముఖ్యంగా హిందువులు ఈ నవగ్రహములను దేవతతలుగా విశ్వసిస్తారు. ఈ నవగ్రహములను రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు శుక్రుడు, శని, రాహువు, కేతువు, లను పేర్లతో గుర్తిస్తారు. ఈ నవగ్రహముల సంచారము మానవుని వ్యక్తిగత జాతకముపై చూపే ప్రభావాన్ని బట్టి ఆ జాతకుని జీవన విధానం నడుస్తూ వుంటుంది. ఏది ప్రపంచదేశాల జ్యోతిష శాస్త్రజ్ఞులు, పండితులందరూ అంగీకరించిన సత్యం.
జ్యోతిష శాస్త్రాన్ని అనుసరించి మానవజాతి వారి వారి జనన కాలాన్ని బట్టి 27 నక్షత్రాలకు చెందినా వారుగా విభజించారు. ఈ 27 నక్షత్రాలకీ, మళ్ళీ ఒక్కూక్క నక్షత్రానికి 4 పాదాలను అంటే మొత్తం 27 నక్ష్ట్రాలకీ 108 పాదాలను నిర్ణయించారు. ఈ 108 పాదాలల్లో జన్మించిన వారిని తొమ్మిది పదాలకు ఒకరాశి చొప్పున మొత్తం 12 రాశులుగా ఏర్పరిచారు. ఈ 12 రాశులు వరుసగా మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనము అనే పేర్లతో పిలవబడుతున్నాయి.
మనకి నవగ్రహాలు ఉన్నట్లే నవరత్నాలు వున్నాయి. ఈ నవరత్నాలు వాటి వాటి ప్రభావాలను బట్టి కొన్ని గ్రహదోషాల తీవ్రతలను నివారిచి ఉపద్రవాలను నిలువరిస్తాయి. ఈ నవరత్నాలు కెంపు, ముత్యం, పగడం, పచ్చ, పుష్యరాగం, వజ్రం, నీలం, గోమేధికం, వైడూర్యం. ఈ నవరత్నాలు ఏ ఏ దోషాలను నివారిస్తాయో, ఏయే జాతకులకు ఎలా మేలు చేస్తాయో తెలుసుకుందాం.
No comments:
Post a Comment