Tuesday, July 29, 2025

కాశీ - కర్కోటక నాగుడు-కర్కోటేశ్వర లింగం

కాశీ - కర్కోటక నాగుడు-కర్కోటేశ్వర లింగం 


స్కంద పురాణంలోని కాశీ ఖండంలో ఈ కర్కోటక నాగుని మహిమ మరియు కర్కోటేశ్వర లింగం యొక్క వర్ణన జ్యేష్ఠేశ్వర లింగం చుట్టూ ఉన్న వివిధ తీర్థాల గురించి” విశదంగా పరిచయం చేస్తుంది.

కర్కోటకుడు అనే నాగుడు నవనాగల్లో (అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, పింగళ, పద్మ, మహాపద్మ, కంబల) ఒకరు 

బ్రహ్మదేవుని ఆజ్ఞతో, కర్కోటకుడు మహామాయా సమక్షంలో ఉన్న శివలింగాన్ని స్తుతించాడు.

శివుడు ఆనందించి ప్రీతిచెంది “ధర్మనిష్ఠులై ధర్మాలను ఆచరిస్తున్న నాగులను ఎవరూ నాశనం చేయలేరు " అని వరం ఇచ్చాడు.

ఆ తర్వాత కర్కోటకుడు మహాశివుని సేవించి ఆ లింగంలో లయమయ్యాడు, 

అందుకే ఆ లింగాన్ని “కర్కోటేశ్వర” అంటారు.
ఆ యొక్క లింగ మహిమ స్తోత్రాలలో 

కర్కోటనామా నాగోస్తి గంధర్వేశ్వరపూర్వతః।
తత్ర కర్కోటవాపీ చ లింగం కర్కోటకేశ్వరమ్॥
తస్యాం వాప్యాం నరః స్నాత్వా కర్కోటశం సమర్థ్య చ।
కర్కోటనాగమారాధ్య నాగలోకే మహీయతే॥

గంధర్వేశ్వర లింగం తూర్పున ఉన్న కర్కోటక అనే నాగుడు నివసించు ప్రదేశములో కర్కోట వాపీ అనే పవిత్ర బావి ఉంది. అక్కడ స్నానం చేసి, కర్కోటేశ్వరుని పూజించినవాడు నాగ లోకంలో మహత్యాన్ని పొందతాడు.

కర్కోటనాగో యైర్దృష్టస్తద్వాప్యాం విహితోదకైః।
క్రమతే న విషం తేషాం దేహే స్థావరజంగమమ్॥

ఎవరు కర్కోటక నాగుని దర్శించాక ఆ బావి నీటితో స్నానం చేస్తారో, వారి శరీరానికి స్థావర జంగమ విషాలు (జంతువుల లేదా వృక్ష మూలక విషాలు) సమీపించవు.

ఇంద్రేశాద్దక్షిణే భాగే శుభా కర్కోటవాపికా।
తత్ర వాపీజలే స్నాత్వా దృష్ట్వా కర్కోటకేశ్వరం॥
నాగానామాధిపత్యం తు జాయతే నాత్ర సందేహః।।

అక్కడ బావిలో స్నానం చేసి కర్కోటేశ్వరుని దర్శించినవారు సందేహమేమీ లేకుండా నాగాధిపతులు అవుతారు.

సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఈ కర్కోటక వాపిని తెరుస్తారు 

శ్రావణ మాసంలో వచ్చే ఈ పవిత్ర నాగ పంచమి రోజు కోసం భక్తులు ఒక తపస్సుగా ఎదురు చూస్తారు 

ఆరోజున ఈ కర్కోటక వాపి (బావి) లోని నీటిని తీసి ఈ బావి లోతులలోని కర్కోటకేశ్వర శివలింగాన్ని దర్శనార్థం భక్తులు దిగి కర్కోటేశ్వర లింగ దర్శనాన్ని  చేసుకుంటారు.

కర్కోటకేశ్వర (నాగ్ కువా) బావిలోని నీటిని నాగ పంచమి రోజు మాత్రమే పరిమితంగా వదిలి, అందరికీ పూజా నిమిత్తం ఆ నీటిని తీసుకునేందుకు అనుమతిస్తారు. ఆదిత్యయోగీ.

ఈ నీరు శరీర శుద్ధికి మాత్రమే కాదు, విషనాశక శక్తి కలిగి ఉందని భక్తుల విశ్వాసం

ఆ పవిత్రమైన రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో కర్కోటలింగాన్ని అభిషేకిస్తారు  

ఎంతటి భాగ్యమో కదా!

భక్తులు పంచామృత అభిషేకం, కర్పూర హారతి, నాగశ్లోక పారాయణలు తన్మయత్వం తో చేస్తారు.

కర్కోట లింగ దర్శనం వల్ల:

నాగదోష నివారణ,
విషజంతు భయం లేకపోవడం,
శరీరక మానసిక శాంతి లభిస్తాయని చెబుతారు.

ఈ కర్కోటక వాపి అని పిలవబడే బావిలో ఒక చైతన్య స్థలం ఉందని ఇది పతంజలి మహర్షి ధ్యాన స్థలమని కూడా చెబుతారు.

జ్యేష్ఠేశ్వర లింగాన్ని చుట్టూ వివిధ నాగ దేవతలు ఏర్పరిచిన శివలింగాలు 
వాసుకేశ్వరలింగం 
తక్షకేశ్వర లింగం , 
కర్కోటేశ్వర లింగం 
పింగళేశ్వర లింగం 
గంధర్వేశ్వర, 
ధుందుమరీశ్వర,
తదితర లింగాలు కూడా వున్నాయి.

ఓం కర్కోటేశ్వర లింగాయ నమః।
ఓం నాగశక్త్యవిషహరాయ నమః।
ఓం శివరూపధారిణే కర్కోటనాథాయ నమః॥
ఓం కర్కోటేశ్వరాయ నమః।
ఓం నమః శివాయ
 ఓం కర్కోటనాగేశ్వరాయ నమః 

కర్కోటకేశ్వర మహాదేవ ఆలయం (నాగ్ కువాన్, జైత్‌పురా, వారణాసి)..*
.

No comments:

Post a Comment

RECENT POST

ఆంజనేయస్వామి_అవతారాలు

ఆంజనేయస్వామి_అవతారాలు 🚩ఆంజనేయస్వామి కూడా విష్ణుమూర్తిలా అవతారాలెత్తారు.శ్రీమహావిష్ణువు దశావతారంధరిస్తే..ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ...

POPULAR POSTS