చేతబడి, బాణామతి మరియు ఇతర అనేక రకాల క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకొని వాటిని నిర్మూలించడానికి ఇది చాలా సులభమైన పరిహారం. ఈ పరిహారం చేయడానికి మంత్రాలూ, పూజలు వంటివి ఏవి చేయవలసిన అవసరం లేదు.
మీరు ఈ పరిహారాన్ని అమావాస్య రోజున సాయంత్రం 6 మరియు 7 గంటల మధ్య చేయాలి., ఈ పరిహారం చేయడానికి మీకు కేవలం రెండు వస్తువులు అవసరం అవుతుంది. ఒకటి "గోమాత పంచితము" (ఆవు మూత్రం) మరియు మరొకటి పసుపు కొమ్ము. మీరు మొదట పసుపు కొమ్మును కొద్దిగా నీటి చుక్కలు వేసి, సాన రాయి పై అరగదీసి మెత్తటి పసుపు ముద్దను తయారు చేసుకోవాలి. తరువాత ఈ పసుపు ముద్దను దేశీయ ఆవు మూత్రంలో బాగా కలపాలి.
పసుపు మిశ్రమం కలిపిన గోమూత్రాన్ని మీ ఇంటి వెలుపల మీ ప్రధాన ద్వారం ముందు అలకాలి (బాగా పూయాలి). మిగిలిన మిశ్రమాన్ని ఎర్రటి పువ్వు ఉపయోగించి మీ ఇంటి అన్ని గదుల్లో చల్లుకోవాలి. మీరు ఎర్రటి పువ్వును ఈ మిశ్రమంలో ముంచి అన్ని గదుల్లోని పువ్వు ద్వారా చల్లుకోవాలి.
ఈ పరిహారం చేతబడి, బాణామతి, చిల్లంగి, శాతవాలం మరియు ఇతర అనేక రకాల క్షుద్ర ప్రయోగాల దుష్ట శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకొని, మీ ఇంటి లోని కుటుంబ సభ్యులందరినీ మీకు తెలిసిన మరియు తెలియని శత్రువులు చేసిన అనేక క్షుద్ర మంత్ర విద్యల యొక్క దుష్ట ప్రభావాల నుండి రక్షిస్తుంది.
.jpg)
No comments:
Post a Comment