మంత్రం తొందరగా సిద్ధించడానికి కొన్ని నియమాలు పాటించాలి.అవి,
1. రోజూ స్నానం చేయాలి.లేదా కాళ్ళూ,చేతులూ కడుక్కోవాలి.ఉతికిన వస్త్రాలు ధరించాలి.స్నానం చేసిన తర్వాత జపం పూర్తయ్యేవరకూ ఎవరినీ ముట్టుకోకూడదు.
2. రోజూ మానకుండా చేయాలి.చుట్టాలొచ్చారని,ఫ్రెండ్స్ వచ్చారని..ఇలా ఏదో వంక పెట్టి జపం మానకూడదు.అయితే ప్రయాణాలు,ఫంక్షన్స్ కు వెళ్ళినప్పుడు మానవలసి వస్తుంది.పరవాలేదు.
3. రోజూ ఒకే టైమ్ కు జపం మొదలుపెడితే వేగంగా సిద్ధిస్తుంది.ఉదయం లేదా సాయంత్రం లేదా రాత్రి మీరు ఎప్పుడు చేసినా ఒకే టైమ్ కు జపం చేయాలి.
4. మీరు చేసే జపమాలను మీరు తప్ప వేరే వాళ్ళు తాకకూడదు.
5. జపం చేస్తున్నప్పుడు మనం నేలను తాకకూడదు.కింద శుభ్రమైన వస్త్రం వేసుకుని దానిపై కూర్చుని చేయాలి.జపమాల కూడా నేలను తాకకూడదు.
6. జపానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి.వాసన రాకూడదు.
7. భోజనం చేసిన 3 గంటల తర్వాత జపం చేయాలి.టిఫిన్ కు ఈ పట్టింపు లేదు.
8. ఎట్టి పరిస్థితి లోనూ ధర్మం తప్పకూడదు.
9. కష్టాలలో ఉన్న వాళ్లకు సహాయం చేయడం,పేదవారికి దానం చేయడం,ఆకలితో ఉన్న మనుషులకు, పశుపక్ష్యాదులకు భోజనం పెట్టడం,పూజ,ధ్యానం చేయడం చేస్తే మన పాపాలు తొందరగా కరిగిపోతాయి.
10. ఇతరులను తిట్టకూడదు.తిట్టడం వల్ల వాళ్ళ పాపాలు మనకు అంటుకుంటాయి.
11. మనం జపం చేసేటప్పుడు జపమాల ఎవ్వరికీ కనిపించకూడదు.దానిపై ఉతికిన గుడ్డ కప్పి చేయాలి లేదా తలుపు గడియపెట్టి చేయాలి.జపమాల కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి కింద కూడా ఒక మంచి గడ్డ పరచుకోవాలి.
12. జపం చేసేటప్పుడు మన చూపుడు వేలు జపమాలకు తగలకూడదు.
13. మీరు తీసుకున్న మంత్రాన్ని ఎవరికీ చెప్పకూడదు.జపం మనసులో చేసుకోవాలి.
14. అప్పుడప్పుడూ గుడిలో,నదీ తీరాల వద్ద,కొండ గుహలలో,పర్వత శిఖరాల వద్ద చేస్తే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది.అన్నిటికన్నా ఎక్కువ శక్తి మహాత్ముల సమాధుల వద్ద చేస్తే వస్తుంది(ఉదా:- మంత్రాలయం రాఘవేంద్ర స్వామి...etc., )
15. గ్రహణం చాలా పవర్ పుల్.గ్రహణం నాడు చేసే మంత్రం లక్షతో సమానం.అయితే విష్ణు,శివ,లలిత వంటి సాత్విక మంత్రాలు గ్రహణం నాడు చేయకూడదు.రాజస,తామస మంత్రాలు మాత్రమే గ్రహణం నాడు చేయాలి.

No comments:
Post a Comment