శ్రీ మహావిష్ణు అనుగ్రహం కోసం ప్రధానమైన స్తోత్రం
*దేవతా అనుగ్రహం కోసం మన సనాతన ధర్మం లో మహర్షులు అందించిన గొప్ప వాటిల్లో ఇది ఒక మణి అని అంటారు విష్ణు భక్తులు శివ భక్తులు దేవీ భక్తులు అందరూ నిత్య పారాయణ లో పాటించవలసిన ముఖ్య స్తోత్రం ఇది*
శ్రీఆపామార్జనకవచమ్
పూర్వే నారాయణః పాతు వారిజాక్ష స్తు దక్షిణే, ప్రద్యుమ్నః పశ్చిమే పాతు వాసుదేవ స్తధోత్తరే||
ఐశాన్యాం రక్షతా ద్విష్ణుః ఆగ్నేయ్యాం చ జనార్దనః, నైఋత్యాం పద్మనాభ న్తు వాయవ్యాం మధుసూధనః||
ఊర్ధ్వే గోవర్ధనోద్ధర్తా హ్యధరాయాం త్రివిక్రమః, ఏతాభ్యో దశ దిగ్భ్య శ్చ సర్వతః పాతు కేశవః||
ఏవం కృత్వాతు దిగ్బంధం విష్ణుం సర్వత్ర సంస్మరన్, అవ్యగ్రచిత్తః కుర్వీత న్యాసకర్మ యధావిధి||
అంగుష్ఠాగ్రే తు గోవిన్దం తర్జన్యాంతు మహీధరం, మధ్యమాయాం హృషీకేశం అనామిక్యాం త్రివిక్రమమ్||
కనిష్ఠాయాం న్యసే ద్విష్ణుం కరపృష్టేతు వామనమ్, ఏవ మేవాంగుళిన్యాసః పశ్చా దంగేఘ విన్యసేత్||
శిఖాయాం కేశవం న్యస్య మూర్త్ని నారాయణం న్యసేత్,
మాధవం చ లలాటే తు గోవిందం తు భ్రువో ర్యసేత్||
చక్షుర్మధ్యే న్యసేద్విష్ణుం కర్ణయో ర్మధుసూదనమ్, త్రివిక్రమం కంఠమూలే వామనంతు కపోలయోః||
నాసారన్ద్రద్వయే చాపి శ్రీధరం కల్పయే ద్బుధః, ఉత్తరోష్టే హృషీకేశం పద్మనాభం తధాధరే||
దామోదరం దంతపంక్తౌ వాకాహం చిబుకే తధా, జిహ్వాయాం వాసుదేవం చ తాల్వోశ్చైవ గదాధరమ్||
వైకుంఠం కంఠమధ్యే తు అనంతం నాసికోపరి, దక్షిణే తు భుజే విప్రో విన్యసే త్పురుషోత్తమమ్||
వామే భుజే మహాయోగం రాఘవం హృది విన్యసేత్, కుక్షౌ పృధ్వీధరం చైవ పార్శ్వయోః కేశవం న్యసేత్||
వక్షస్థలే మాధవం చ కక్షయో శ్శేషశాయినమ్, పీతాంబరం స్తనతటే హరిం నాభ్యాం తు విన్యసేత్||
దక్షిణే తు కరే దేవం తత స్సంకర్షణం న్యసేత్,
వామే రిపు హరం విద్యాత్ కటిమధ్యే జనార్ధనమ్||
పృష్టే క్షితితలం విద్యాత్ అచ్యుతం స్కంధయోరపి, వామకుక్షౌ వారిజాక్షం దక్షిణా జలశాయినమ్||
స్వయం భువం మేడ్రమధ్యే ఊర్వో శ్చైవ గదాధరమ్, జానుమధ్యే చక్రధరం జంఘయో రమృతం న్యసేత్ ||
గుల్ఫయో ర్నారసింహం చ పాదయో రమితత్విషమ్,
అంగులీషు శ్రీధరం చ పద్మాక్షం సర్వసంధిషు||
నఖేషు మాధవం చైవ న్య సేత్పాదతలేచ్యుతమ్, రోమకూపే గుడాకేశం కృష్ణం రక్తాస్థిమజ్జసు||
మనోబుద్ధ్యా రహంకారే చిత్తే న్యస్య జనార్దనమ్, అచ్యుతానంత గోవిందాన్ వాతపిత్తకఫేషుచ||
ఏవం న్యాస విధిం కృత్వా యత్కార్యం ద్విజ తచ్ఛృణు ,
పాదమూలే తు దేవస్య శంఖం చైవ తు విన్యసేత్||
వనమాలాం హృది న్యస్య సర్వదేవాభిపూజితమ్,
గదాం వక్షస్థలే న్యస్య చక్రం చైవ తు పృష్ఠతః ||
శ్రీవత్స మురసి న్యస్య పంచాంగం కవచం న్యసేత్, ఆపాదమస్తకం చైవ విన్యసే త్పురుషోత్తమమ్||
ఏవం న్యాస విధిం కృత్వా సాక్షా న్నారాయణో భవేత్ ,
తను ర్విష్ణుమయీ తస్య యత్కించన న సంశయః||
అపామార్జనకో న్యాసః సర్వవ్యాధి వినాశనః,
ఆత్మనశ్చ పరస్యాపి విధి రేషసనాతనః||
వైష్ణవే న తు కర్తవ్యః సర్వసిద్ధి ప్రదాయకః
విష్ణు సదూర్థ్వం రక్షేత్తు వైకుంఠ విదిశో దిశః ,
పాతు మాం సర్వతో రామో ధన్వీ చక్రీ చ కేశవః ||ఏత త్సమస్తం విన్యస్య పశ్చా న్మoత్రాన్ ప్రయోజయేత్ ||
*అథమూలమన్త్ర:*
*ఓంనమోభగవతే క్లేశాపహర్తే నమః*
పూజాకాలే తు దేవస్య జపకాలే తధైవ చ, హోమకాలే చ కర్తవ్యం త్రిసంధ్యాసు చ నిత్యశః||
ఆయురారోగ్య మైశ్వర్యం జ్ఞానం విత్తం ఫలం లభేత్, యద్య త్సుఖతరం లోకే తత్సర్వం ప్రాప్నుయా న్నరః ఏవం భక్త్యా సమభ్యర్చ్య హరిం సర్వార్థదాయకమ్||
హితద స్సర్వభూతేభ్యో విష్ణులోకం సగవిచ్ఛతి |
శ్రీవిష్ణు లోకం సగచ్ఛత్యోంనమ ఇతి ఇతి||
*శ్రీవిష్ణుధర్మోత్తరాంతర్గతే ఆపామార్జన కవచం సంపూర్ణమ్*
విష్ణులోకప్రాప్తి
అపామార్జన స్తోత్రం యొక్క ప్రధాన విశేషం ఏంటంటే, ఇది శరీర మరియు మానసిక ప్రక్షాళనకు (శుద్ధికి), అలాగే సమస్త రోగాలు, దుష్ట గ్రహాల ప్రభావాలు మ రియు చెడు శక్తుల నుండి విముక్తి పొందడానికి ఉద్దేశించిన శక్తివంతమైన ప్రార్థన.
ప్రధాన ఉద్దేశం శుద్ధి మరియు రక్షణ (Cleansing and Protection). 'అపమార్జనం' అంటేనే శుభ్రపరచడం లేదా ప్రక్షాళన చేయడం.
ఈ స్తోత్రం ప్రధానంగా శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ రూపాలను ముఖ్యంగా వరాహ, నరసింహ, వామన అవతారాలు మరియు సుదర్శన
చక్ర శక్తులు రక్షణ ఫలిత దిశగా అభ్యర్థించడం , అలానే *సమస్త రోగ నివారణ* కూడా ,నయం కాని వ్యాధుల నుండి ఉపశమనం లభించడం కోసం ,
*దుష్ట గ్రహ బాధల నుండి విముక్తి * కోసం అశుభ గ్రహ సంచారాల వల్ల కలిగే చెడు ప్రభావాలు తొలగిపోతాయి
*మానసిక ప్రశాంతత* మనస్సును శుద్ధి చేసి, శాంతిని ఇస్తుంది.
శత్రు బాధలు, విష ప్రభావాలు, అభిచారిక కృత్యాల (చేతబడి) నుండి రక్షణ.
ఇది విష్ణు ధర్మోత్తర పురాణం మరియు పద్మ పురాణం లలో ప్రస్తావించబడింది.
ఈ స్తోత్రం దాల్భ్య మహర్షి అగస్త్య (లేదా పులస్త్య) మహర్షిని లోకంలోని జీవులకు రోగాలు మరియు బాధల నుండి విముక్తి లభించే మార్గాన్ని ఉపదేశించమని కోరగా, మహర్షి ఈ గొప్ప స్తోత్రాన్ని బోధించినట్లుగా చెప్పబడింది.
కోరికల కోసం పై ఫలితాలు ముఖ్యంగా విష్ణు లోక ప్రాప్తి అని ప్రసిద్ధి
శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏
*రాళ్ళబండి శర్మ*

No comments:
Post a Comment