క్రొత్తగా ఉజ్జయినీ వెళ్ళే వారు చీరాల,ఒంగోలు, విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలి ఏట్టైన్ కి వెళ్ళాలి,రూమ్,మరియు దర్శనం వివరాలు నాకు తెలిసిన మేరకు ఆకురాతి వెంకట అశ్వని అనే నేను ఈ పోస్ట్ లో వ్రాస్తున్నాను.చాలా కష్టపడి వ్రాసా ,దయచేసి పోస్ట్ కాపీ పేస్ట్ చేయెుద్దు, షేర్ చేయండి.నా కష్టానిక్ ప్రతిఫలం ఉంటుంది. మరి కొన్ని క్షేత్రాల వివరాలు వ్రాయటాని నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది.
1.అహల్యనగర్ ట్రైన్ ఆదివారం ఉదయం 4 గంటలకు చీరాలలో ప్రారంభమై మరుసటి రోజు ఉదయం ఉజ్జయినీ చేరుతుంది.
2.రైల్వే స్టేషన్ నుంచి రూం కి తీసుకెళ్ళమంటే ఆటో వాళ్ళు తీసుకువెళ్తారు.లేదా ఆన్లైన్లో ఐన బుక్ చేసుకోవచ్చు.హోటల్ రూం లు నాన్ AC 700/- నుంచి 1500/-వరకు ఉంటుంది.AC 3500/-ఉంటుంది.గుడి దగ్గరలో రేట్లు ఎక్కువగా ఉంటుంది.గుడికి దగ్గరలో నాన్ AC 2000/- ,AC 4000/- వరకు ఉంటుంది.
3.దేవస్తానం రూం లు బుక్ చేసుకోవచ్చు.ప్రస్తుతం దేవస్థానం సైట్ పనిచేయటం లేదు.
4.అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నుంచి ఐతే ప్రైవేటు బస్సులు ఉజ్జయినీ కి డైరెక్ట్ బస్లు ఉంటాయి.ఒక్కొక్కరికి 220/- రూపాయలు వసూలు చేస్తారు.
5.బస్స్టాండ్ నుంచి రూం కి చేరుకోవచ్చు.ఆటోకి రూం దూరం బట్టి ఒక్కొక్కరికి 20/- వసూలు చేస్తారు.
6.ఉజ్జయునీ మహకాళేశ్వర్ దర్శనానికి 2 రకాలుగా వెళ్ళొచ్చు.అందులో మొదటిది 250/- దర్శనం ,మహకాళేశ్వర్ని కొద్దిగా దగ్గర గా చూడొచ్చు.
రెండవది ప్రీ దర్శనం.
7.మహకాళేశ్వర్ జ్యోతిర్లింగం లో భస్మ హరతి దర్ళనం 3నెలల ముందే ఆనెలైన్ లో బుక్ చేసుకోవాలి.లేదా ఆఫ్లైన్ లో ఐతే ప్రతి రోజూ రాత్రి11 గంటల నుంచి త్రివేణి సంగమం దగ్గర జనాలు క్యూ లో ఉంటారు.ఉదయం 8 గంటలకి 500 మందికి మాత్రమే టోకెన్ ఇస్తారు.ముందుగా ఫాం ఫిల్ చేసి ఆ లైన్లో ఇస్తే అదే రోజు రాత్రి మన ఫోన్కి మెసేజ్ వస్తుంది.ఆ మెసేజ్ని కౌంటర్ లో ఆ రోజు సాయంత్రం చూపిస్తే మరుసటి రోజు ఉదయం భస్మ హారతికి టికెట్స్ ఇస్తారు.టికెట్ ధర ఒక్కొక్కరికి 100/- ఉంటుంది.
8.దర్శనం ఐపోయాక ఆలయ ప్రాంగణంలో ఉన్న వివిధ రకాల గుడులు అందులోని దేవతా మూర్తుల ను దర్శించండి.
9.దర్శనం ఐపోయాక బయటకి వచ్చేప్పుడు EXIT గేట్ ప్రక్కనే మహకాళేశ్వర అన్నప్రసాదానికి టోకెన్లు ఇస్తారు.
10.బయటకి వచ్చి భారత మాత టెంపుల్ మరియు గుడి కారిడార్ ,మహంకాళి వన్ ,లేజర్ షో, మ్యూజియం మొదలైనవి చూడవచ్చు.
11.గుడి నుంచి బయటకు వచ్చాక అన్నఅప్రసాదానికి
2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళవచ్చు.
12.లోకల్ టెంపుల్ కోసం ఆటో మాట్లాడుకుని మెుదట మంగళ్ధామ్ (అంగారకుడి గుడి - బుధుడు MARS) దర్శనం చేసుకోవచ్చు. ఈ గుడికి పైనే అంతరిక్షంలో అంగారక గ్రహం ఉంటుంది.ఇక్కడ వివిధ రకాల శాంతి పూజలు కూడా జరుగుతాయి. (షేర్ ఆటో ఐతే ఒక్కొక్కరికి 150/ - వసూలు చేస్తారు.)
13.తర్వాత అదే ఆటోలో సాందీపని ఆశ్రమం చేరుకోవచ్చు.శ్రీ కృష్ణ భగవానుడు తన గురువు ఐన సాందీపని ముని దగ్గర 64 కళలు విధ్యాభ్యాసం చేసింది ఈ ప్రదేశం లోనే.ఇక్కడ సాందీపని గుడి, కృష్ణ భగవానుడు గుడి, మ్యూజియం, కృష్ణడి 64 కళలకి సంబంధించిన ఫోటోలు చూడవచ్చు.ఇక్కడ గోముఖ కుండ్ ఉంటుంది.శ్రీకృష్ణుడు తన గురువు సాందీపని కోసం సకల పుణ్య తీర్థాలలో జలాన్ని ఇక్కడికి తెచ్చారంట.
14.తర్వాత అదే ఆటోలో ఉజ్జయినీ క్షేత్ర పాలకుడైన కాళభైరవుని దర్శనం కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు.
15.ఆ తర్వాత అదే ఆటోలో ఘడ్ కాళీ మాత (శక్తి పీఠాలలో ఒకటైన ఉజ్జయినీ మహంకాళి అమ్మ) దర్శనం చేసుకోవచ్చు.మహాకవి కాళిదాసు నాలుక మీద భీజాక్షరాలు ఖాళీ అమ్మ ఇక్కడే వ్రాసారు .
16.ఆ తర్వాత అదే ఆటోలో ముక్తిధాం గుడి చూడవచ్చు.
17.ఆ తర్వాత అదే ఆటోలో చింతా హర్ గణేష్ దర్శనం చేసుకోవచ్చు. ఈ గణేషుడి దర్శనం మాత్రానే మనలో ఉన్న చింతలు తొలగిపోతాయి అంటారు.
18.అక్కడ నుంచి మధ్యాహ్నం రూం కి చేరుకొని భోజనం చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.
19.సాయంత్రం 4 గంటలకు మళ్ళీ మహకాళేశ్వర్ దర్శనం చేసుకొని హర్సిద్ధి మాతా గుడికి నడుచుకుంటూ వెళ్ళవచ్చు.
20.దర్శనానంతరం సాయంత్రం 6:30 కి హరతి సేవా ఉంటుంది. ఈ సేవలో బయట ఉన్న 2 ధ్వజస్తంభాలో దీపాలు వెలిగిస్తారు?చూడటానికి చాల బాగుంటుంది.
21.ఆ తర్వాత అతి పురాతనమైన రాం ఘాట్ చూడవచ్చు.దశరధ మహారాజు కాలం చేశాక రాముల వారు ఆయన శ్రద్దాకర్మలు నిర్వహించిన తర్వాత ఇక్కడకి వచ్చి స్నానం చేశారట.అందుకేదీన్ని రాంఘాట్ అంటారు.
22.ప్రతి 12 సంవత్సరాలకొక సారి మహ కుంభమేళా నిర్వహించే 4 ప్రదేశాలలో ఇది ఒకటి.ఇక్కడ షిప్రానది ప్రవహిస్తుంటుంది.
23. ఆ తరువాత మహకాళ్ లోక్ ఎంట్రస్ చేరుకోవచ్చు.
ఇది 2 కిలోమీటర్లు ఉంటుంది.నడవలేని వారు బ్యాటరీ వెహికల్ ఉంటుంది.ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం.
Written by
Akurati venkata aswani
Kruthi Founation founder&chairman

No comments:
Post a Comment