Friday, March 18, 2022

ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?

 ఉదయాన్నే తులసి దగ్గర దీపం పెట్టి ఎవర్నిచూడాలి?




కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? కుమార స్వామిని కార్తికేయుడు అని కూడా అంటారు కదా... ఆయన నుంచి ఈ పేరు వచ్చింది. కృత్తికలు పెంచబడ్డ వాడు కాబట్టే కుమారస్వామి కార్తికేయుడు అయ్యాడు. 


అందుకే.. ఈ నెల దినాలు.. కృత్తికా నక్షత్రాలకు పూజిస్తే.. కుమారస్వామి ఆనందిస్తాడు. కార్తిక మాసం ఉన్నన్ని నాళ్లూ... సూర్యోదయానికి ముందే దీపాలు వెలిగించి తులసిని పూజించాలి. ఆ తర్వాత.. కృత్తికా నక్షత్రాలను పూజించాలి. అలాగే సూర్యాస్తమయం తర్వాత కూడా చేయాలి. అలా చేస్తే కృత్తికా నక్షత్రాలతో పాటు కార్తికేయుడు కూడా చల్లగా చూస్తాడు. 

పసుపు-పరిహారాలు

 పసుపు-పరిహారాలు



పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...

1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క

వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే

పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు అలా కాకుండా 

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి .

1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో దక్షణావృత శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది

తులసి వివాహం , ఈ పండుగ ప్రాముఖ్యత , పూజా విధులు

 తులసి వివాహం , ఈ పండుగ ప్రాముఖ్యత , పూజా విధులు



మన దేశంలో హిందువులకు తులసి పండుగ చాలా పవిత్రమైనది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం ఈ పండుగను కార్తీక మాసంలో శుక్లపక్ష నాడు జరుపుకుంటారు. 


ఈ రోజున హిందూ భక్తులందరూ తులసి చెట్టుకు వివాహం జరిపిస్తారు. ఇంతకీ తులసి చెట్టుకు ఎవరు తాళి కడతారు ? ఎవరితో వివాహం జరిపిస్తారు ? ఎందుకు ఈ పండుగను జరుపుకుంటారో ఈ కథలో తెలుసుకుందాం..


హిందూ పురాణాల ప్రకారం..


హిందూ పురాణాలలో తులసి దేవిని వృందగా పిలుస్తారు. ఈమె కాలనేమి అనే రాక్షసుడికి అందమైన కూతురు. ఈ యువరాణి జలంధర్ అనే రాక్షసుడిని వివాహం చేసుకుంటుంది. శివుడి మూడో కన్ను నుండి పుట్టిన అగ్నిలో నుండి పుట్టడం వల్ల జలంధరుడికి అపారమైన శక్తులు ఉంటాయి. జలంధర్ దేవుళ్లంటే అసహ్యం. కానీ దేవుళ్లను అమితంగా ఆరాధించే వృందను ప్రేమిస్తు ఉంటాడు. ఈమె మహావిష్ణువుకు మహాభక్తురాలు.


పెళ్లి తర్వాత పెరిగిన శక్తి..


ఆ యువరాణితో పెళ్లి తర్వాత ఆమె భక్తి , పవిత్రత వల్ల జలంధరుడికి శక్తి మరింత పెరిగిపోతుంది. అది ఎంతలా అంటే ఆఖరికి ఈశ్వరుడు కూడా జలంధరుడిని ఓడించలేకపోతాడు. అతని మూర్ఖత్వంతో శివుడినే ఓడించి ఈ సమస్త విశ్వానికి అధిపతి కావాలని కలలు గంటాడు. ఈ సమయంలో దేవుళ్లందరూ విష్ణుమూర్తి సహాయం కోరతారు. విష్ణుమూర్తి వృంద తన భక్తురాలు కావటంతో ఆమెకు జరగబోయే అన్యాయం వల్ల సందిగ్ధంలో పడతాడు. కానీ జలంధరుడి వల్ల జరిగే నష్టం వల్ల విష్ణువు ఓ మాయ చేయాలని నిర్ణయించుకుంటాడు.


జలంధరుని రూపంలో విష్ణువు..


పరమ శివునితో జలంధరుడు యుద్ధంలో ఉండగా , విష్ణువు వృంద వద్దకు జలంధర రూపంలో వస్తాడు. ఆమె అతన్ని గుర్తు పట్టలేక అతడే జలంధర్ అని భావిస్తుంది. కానీ అతను ఆమె తాకగానే తన భర్త కాదని గ్రహిస్తుంది. దీంతో ఆమె పతివ్రత నిష్ట భగ్నం అవుతుంది. వెంటనే జలంధరుడు బలహీనుడు అవుతాడు. అంతలోనే నిజం తెలుసుకున్న ఆమె మహావిష్ణువు నిజ రూపాన్ని కోరుతుంది. ఆమె తను పూజించిన దేవుడే తనను మాయ చేశాడని తెలుసుకుని బాధపడుతుంది.


వృందకు శాపం..


శ్రీ మహావిష్ణువు మారు రూపం తెలుసుకుని , తన పవిత్రతపై జరిగిన మోసానికి ఆమె విష్ణువుని రాయిలా మారిపోమని శపిస్తుంది. విష్ణువు ఆమె శాపాన్ని అంగీకరించి గండక నది వద్ద సాలిగ్రామ శిలగా మారతాడు. ఆ తర్వాత జలంధరుడు పరమశివుని చేతిలో హతుడవుతాడు. దీంతో ఆమె బాధపడుతూ , తన జీవితాన్ని కూడా ముగించాలి అనుకుంటుంది.


లక్ష్మీదేవి విజ్ఞప్తి..


మహా విష్ణువు భార్య లక్ష్మీదేవి జలంధరుడి భార్యతో తన మాటలను వెనక్కి తీసుకొని శాపం ప్రభావాన్ని ఆపమని కోరుతుంది. అప్పుడు ఆమె తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అయితే విష్ణువు యొక్క సాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ శాపం అంతమవుతుందని చెబుతుంది. దీని తర్వాత ఆమె సతిగా మారుతుంది. (ప్రాచీన కాలంలో హిందూ వితంతువులు చేసిన స్వీయ - ప్రేరణ చర్య). ఆమె దేహం పూర్తిగా కాలిపోయిన తర్వాత తులసి మొక్క బూడిద నుండి పుట్టిందని పురాణాల ప్రకారం తెలిసింది.


తులసి పూజా విధానం..


తులసి చెట్టును లేదా తులసి మొక్క తీసుకుని చిన్న మండపంలా ఏర్పాటు చేసుకోండి.

మండపం చుట్టూ ఎర్రటి చీరతో కట్టండి. అలాగే తులసి మొక్కను లేదా చెట్టును కూడా ఎర్రటి వస్త్రంతో చుట్టవచ్చు.

ఆ తర్వాత తులసి కొమ్మలకు ఎర్రటి గాజులతో అలంకరించండి.

విఘ్నేశ్వరుడు మరియు ఇతర దేవుళ్లకు ప్రార్థనలు చేయండి. అప్పుడు సాలిగ్రామ్ ను కూడా ఆరాధించండి.

తులసి చెట్టు దగ్గర కొబ్బరికాయ , చక్కెర బొమ్మలు , ఐదు రకాల పండ్లను ఉంచండి. అనంతరం హారతి ఇచ్చి తులసి మరియు లార్డ్ సాలిగ్రామ్ జపిస్తూ ప్రార్థించండి.


పండుగ యొక్క ప్రాముఖ్యత..


తులసి వివాహం చేయడం వల్ల వివాహ జీవితంలో కష్టాల నుండి ప్రయోజనం పొందవచ్చు. అలాగే పెళ్లి చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ తులసి పూజను చేస్తే వారికి పరిష్కారం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ వివాహ సంబంధిత సమ్యలను తొలగిస్తుందని చెబుతారు.


ద్వాదశ దీపాలు..


క్షీరాబ్ది ద్వాదశిగా పిలుచుకునే తులసి పండుగ రోజున సాయంత్రం వేళలో హిందువుల ఇళ్లలో తులసి మొక్క , లేదా తులసి చెట్టు దగ్గర ధాత్రి (ఉసిరి మొక్కను) ఉంచి విష్ణుమూర్తికి పూజలు చేస్తారు. అలాగే 12 లేదా 16 లేదా 21 దీపాలను వెలిగించి మహిళలు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటినే ద్వాదశ దీపాలు అంటారు. ఆ రోజున ప్రతి ఇంటా దీపాల కాంతులతో వెలుగులు విరాజిల్లుతాయి. వైవియస్ఆర్


తులసి మొక్కను గౌరీదేవిగా


తులసి మొక్కను గౌరీదేవిగా , ఉసిరి మొక్కను శ్రీ మహావిష్ణువుగా పూజింపడం వల్ల , గౌరీ పూజ చేయడం వ్లల ఆర్థిక బాధలు తొలగి , సర్వ సంపదలు కలుగుతాయి. ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తిగా భావిస్తారు కాబట్టి , స్వామి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీ…


శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి.

 శివుడిని మూర్తి రూపంలో కంటే లింగరూపంలో ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలు విశేషంగా ఉంటాయి. పరమేశ్వరుడి విగ్రహాన్ని పూజించేవారికంటే, శివలింగారాధన చేసేవరిలో తెజస్సు, శక్తి అధికంగా ఉంటాయని కృష్ణపరమాత్మ మహాభారతంలో చెప్తారు. మనకు లోకంలో చాలా రకాల లింగాలు కనిపిస్తాయి. అందులో ఈ రోజు ఒక 2 లింగాల గురించి చెప్పుకుందాం.


 


లింగం అంటే గుర్తు, ప్రతిరూపం (Symbol) అని అర్దం. అన్నిటియందు ఆ పరమశివుడు అంతర్యామిగా ఉన్నాడు. ఈ సృష్టి అంతా లింగమే. అందుకే రుద్రం ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్న శివతత్వాన్ని ప్రకటించింది.


కొండలు, పర్వతాలు, నదులు, శిలలు, మొక్కలు, చెట్లు ..... ఇలా కదలనివాటిని స్థావరములు అంటారు. ఈ స్థావరములన్నీ #శివస్వరూపం అంటున్నది శివ పురాణం. అందుకే ఇవన్నీ స్థావర లింగాలు అంటున్నది శివ పురాణం. మనం మొక్కలకు నీరు పోస్తే (ఏ చెట్టైనా కావచ్చు), అది కూడా శివార్చనగా భావించి అనుగ్రహం ప్రసాదిస్తాడు పరమశివుడు. అట్లాగే ప్రకృతి వనరులను విచ్చలవీడిగా దోచుకోవడం స్థావర లింగ రూపంలో ఉన్న శివుడికి చేసే అపచారం అయితే ప్రకృతి వనరులను సంరక్షించుకోవడం, అవసరమైనంత మేర, వృధా చేయకుండా వాడుకోవడం శివుడికి ఇచ్చే గౌరవం. ఇంకా చెప్పాలంటే నీరు వృధా చేయడం కూడా శివుడికి అపచారమే. ఇది దీని కిందే వస్తుంది. 


రెండవది జంగమ #లింగం. జంగమాలంటే కదిలేవి అని అర్దం. జంతువులు, మనుష్యులు, పక్షులు, క్రిమికీటకాలు లాంటివి. ఇవి కూడా శివుడి స్వరూపాలే. వీటిని జంగమ లింగాలు / లింగం అంటారు. ఆపదలో ఉన్నవారికి పవిత్ర భావనతో, ఏ ఉపకారం ఆశించకుండా చేసే సాయం, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, దైవభావంతో పెద్దలకు, దీనులకు సేవ చేయడం జంగం లింగానికి చేసే అర్చన. ఇక ఇది చలికాలం, అనేకమంది చలికి వణుకుతూ రోడలపై పడుకుంటారు. అటువంటి వారికి దుప్పట్లు పంచడం, ముష్టివారికి కాసింత అన్నం పెట్టడం, చదువు యందు ఆసక్తి ఉన్న పేద విద్యార్ధులకు పుస్తకాలు పంచిపెట్టడం, పీజు కట్టడం కూడా ఈ జంగమ లింగానికి అర్చన క్రిందే వస్తుంది. 


మనకు శివ పూజ చేయాలన్న తపన ఉండాలి కానీ, అందుకు అనేక మార్గాలు చూపించాడు మహాశివుడు.


ఓం నమః శివాయ

బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం

 బ్రాహ్మీముహూర్తంలో లేస్తే ఏంటట అనేవారికి సమాధానం 




ఉదయాన్నే నిద్రలేవాలని మన పెద్దవాళ్లు తెగ పోరేవారు. అలా చెప్పీ చెప్పీ చాలా తరాలు వెళ్లిపోయాయి. తరం మారుతున్న కొద్దీ జీవవనశైలి మారిపోతోంది. నిద్రలేచే సమయాలూ, పనిచేసే వేళలూ మారిపోతున్నాయి. కొన్నాళ్ల తరువాత పని చేయడానికీ, నిద్రపోవడానికీ రాత్రీపగలుతో సంబంధమే లేకపోవచ్చు. కానీ ఇప్పటికీ బ్రాహ్మీముహూర్తం` అన్న మాట అక్కడక్కడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ఆ బ్రాహ్మీముహూర్తం అంటే ఖచ్చితంగా ఏ సమయంలో వస్తుంది. ఆ సమయంలో నిద్రలేవడం వల్ల ప్రయోజనం ఏంటి!


సూర్యోదయానికి 96 నిమిషాల ముందున్న కాలాన్ని బ్రాహ్మీముహూర్తం అంటారు. అయితే రుతువుని బట్టి సూర్యోదయ వేళలు మారిపోతూ ఉంటాయి కాబట్టి, 4:00 -4:30 a.mని బ్రాహ్మీముహూర్తంగా అనుకోవచ్చు. బ్రాహ్మీ అంటేనే సరస్వతి అని అర్థం. మన పెద్దలు చాలా ఆలోచించే ఆ పేరు పెట్టారేమో అనిపిస్తుంది. ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడిగే ప్రశ్నకు చాలానే జవాబులు వినిపిస్తాయి.


ఆ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా, నిద్రలోని ఆఖరి జామును గడుపుతూ ఉంటుంది. సూర్యుని వేడి భూమిని కాస్త తాకుతూ ఉంటుంది, కానీ వెలుతురు ఇంకా మనల్ని చేరుకోదు. అంటే రాత్రివేళ చల్లదనాన్నీ, పగటివేళ చురుకుదనాన్నీ ఏకైక కాలంలో కలిగిఉండే సమయం ఇదన్నమాట! అందుకే ఈ సమయంలో మనుషులు సత్వగుణం ప్రధానంగా ఉంటారట. లేలేత కిరణాలు శరీరాన్ని తాకడం చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యనమస్కారాలు చేయడమో, వ్యాహ్యాళికి వెళ్లడమో చేస్తే ఆరోగ్యానికి మంచిది.


మనలో జీవగడియారం అనేది ఒకటి ఉంటుంది. అది మనం ఏర్పరుచుకున్న అలవాట్లను బట్టీ, ప్రకృతిని బట్టీ నడుచుకుంటూ ఉంటుంది. నిద్రపోవడం, లేవడం, కాలకృత్యాలు తీర్చుకోవడం… ఇవన్నీ సమయానికి అనుకూలంగా చేస్తేనే ఆరోగ్యంగా ఉంటాం. సాక్షాత్తూ ఆయుర్వేదమే `తన ఆరోగ్యాన్నీ, ఆయుష్షునూ కాపాడుకోవాలని అనుకునేవాడు బ్రాహ్మీముహూర్తంలో లేవాలి` అని చెబుతోంది.


 పైగా ఆయుర్వేదం ప్రకారం ఈ సమయం `వాత` ప్రధానంగా ఉంటుంది. శరీరంలో కదలికలనీ, ఆలోచనలనీ, రక్తప్రసరణనీ ప్రభావితం చేసేది ఈ `వాత` లక్షణం. ఈ లక్షణం మన శరీరంలో ప్రముఖంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పనినైనా చురుగ్గా చేయగలం; ప్రశాంతంగా ఉండగలం; మంచి ఆలోచనలు చేయగలం; చదివినదానిని ఆకళించు చేసుకుని దీర్ఘకాలం జ్ఞప్తికి ఉంచుకోగలం.


ధ్యానం చేయాలనుకునేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలమని యోగశాస్త్రం చెబుతోంది. మన శరీరంలో ఇడ, పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయిని యోగుల నమ్మకం. బ్రాహ్మీముహూర్తంలో సుషుమ్న నాడి చాలా ఉత్తేజితంగా ఉండి… ధ్యానం చాలా సులువుగానూ, ప్రభావవంతంగానూ సాగే అవకాశం ఉంటుందట.


ఉదయాన్నే మన శరీరంలోనూ, చుట్టూ ఉన్న ప్రకృతిలోనూ ఉండే ప్రశాంతత వల్ల యోగా, ధ్యానం, చదువు… చాలా తేలికగా ప్రభావవంతంగా సాగుతాయి. రోజువారీ చేయాల్సిన విధులకు (ఉద్యోగం, కాలేజ్‌, వంటావార్పూ…) ముందు కాస్త సమయం చేజిక్కుతుంది. అలా కాకుండా ఆలస్యంగా లేచి ఒక్కసారిగా మన పనులలో చేరేందుకు పరిగెత్తడం వల్ల… మన మనసు, శరీరం విపరీతమైన ఒత్తిడికి లోనవుతాయి.


గుండెజబ్బులు ఉన్నవారికి తెల్లవారుజామునే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనీ, పైగా అలా వచ్చే గుండెపోటు చాలా తీవ్రంగా ఉంటుందనీ వైద్య గణాంకాలన్నీ సూచిస్తున్నాయి. గుండెల్లో రక్తనాళాలను గడ్డకట్టించే `థ్రోంబస్‌` అనే సమస్య ఉదయం వేళల్లోనే ఎక్కువగా ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి ఖచ్చితమైన కారణాలు ఏవీ చెప్పలేకపోతున్నారు వైద్యులు. పైగా ఇదే సమయంలో మనం హడావుడిగా లేచి విధుల్లోకి చేరాలనే టెన్షన్‌లో మనలోని రక్తపోటు మరింత ఎక్కువై అది గుండెపోటుకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


 అయితే బ్రాహ్మీముహూర్తంలోనే నిద్రలేచి, వీలైతే కాసేపు ధ్యానం చేసుకుని… స్థిమితంగా రోజువారీ పనులకి సిద్ధపడితే మన రక్తపోటు కూడా సాధారణంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్ని చదివిని తరువాత బ్రాహ్మీముహూర్తంలో లేవడాన్ని ఛాదస్తం అని ఎలా అనుకోగలం చెప్పండి! 


సర్వ్ జనాః సుఖినోభవంతు..


ఓం నమః శివాయ

అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?

 అంత్యక్రియలు అప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?



     వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం.. మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు. కానీ... ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.

    ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే... శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు.

    బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో... శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా... ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి... తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది.

    పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని

(డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే.. శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద.. తన వాళ్ళ మీద.. ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే... ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే.. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ... తిరిగి మొదటి నుండి లెక్కించాలి.

   శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే... కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో... నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండను కింద పడేసి పగలగొడతాం అంటే.. ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో.. అని ఆత్మకు మనమిచ్చే సంకేతం.


హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది. కానీ తెలిసిన వారు, తెలియని వాళ్లకు చెప్పరు. అదే మన ఖర్మ...

ఇలా ఎందుకు చేస్తున్నారు, అంటే...

ఏమో నాకు తెలియదు మా తాత ఇలాగే చేసాడు నేను ఇలాగే చేస్తున్నాను

కానీ.. ఎందుకు చేస్తున్నానో తెలియదు.


దయచేసి భారత ఆచార, సాంప్రదాయాల గురించి తక్కువ అంచనా వేయకండి. అందులో నిగూఢ అర్థం దాగి ఉంటుంది....

ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?

 ఏ వారం.. ఏ పూజ... ఏ ఫలితం?



కొంతమంది భక్తులు ఎప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తే ఎలాంటి పుణ్యఫలితం దక్కుతుందో తెలిస్తే కచ్చితంగా ఆ పూజ మాత్రమే చేసుకుని త్వరగా ఫలితాన్ని పొందాలనుకుంటుంటారు. అలాంటి వారికోసమేనన్నట్టు శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో దీనికి సంబంధించిన విషయాలున్నాయి. దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది. 


మంత్రాలతో జపం, హోమం, దానం, తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు. సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది. పూజలు మనకున్న ఏడు వారాలలో ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు చెయ్యాల్సి ఉంటుంది.


ఆదివారం: ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.


సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.


మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.


బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.


గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.


శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.


శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి నువ్వులను దానం ఇచ్చి నువ్వులు కలిపిన అన్నంతో పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.


ఇలా ఏడు రోజులతో ఏ దేవతకు పూజ చేసినా ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది. ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు. పాపం చేయటం లేదా పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. 


చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి ఎవరు ఏ ఫలితం కావాలనుకొంటే ఆ రోజున ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన

భోజనం - సదాచార నియమాలు............!

 భోజనం - సదాచార నియమాలు............!!


1. భోజనానికి ముందు,తరువాత తప్పక కాళ్ళు, చేతులు  కడుక్కోవాలి.  తడికాళ్ళను తుడుచుకుని భోజనానికి కూర్చోవాలి.

2. తూర్పు, ఉత్తరం వైపు కూర్చుని భోజనం చేయడం మంచిది.

3. ఆహార పదార్థాలు(కూర, పప్పు, పచ్చళ్ళు, మొ.) తినే పళ్ళానికి తాకించరాదు.  అలా చేస్తే అవి ఎంగిలి  అవుతాయి. 

ఎంగిలి పదార్థాలు ఎవ్వరికీ పెట్టరాదు. చాలా దోషం.  

4. అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి కాచడం చేయరాదు. మెతుకులు నేతిలో పడరాదు.

5. భోజనం చేస్తున్నప్పుడు మధ్యలో లేవకూడదు.

6. ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించరాదు. తాకరాదు.  

7. ఎడమచేతితో తినే కంచాన్ని ముట్టుకోకూడదు.  ఒకవేళ కంచాన్ని ముట్టుకుంటే ..వెంటనే ఎడమచేతితో నీటిని ముట్టుకోవాలి.  

8. సొట్టలు ఉన్న కంచం, విరిగిన కంచం భోజనానికి పనికిరాదు.  

9. నిలబడి అన్నం తింటూ ఉంటే క్రమంగా దరిద్రులు అవుతారు.

10. ఉపనయనం అయినవారు తప్పక ఆపోశనము పట్టి గాయత్రీ మంత్రంతో ప్రోక్షణ చేసుకుని భోజనం చేయాలి. ఉపనయనం కాని వారు భగవన్నామము ఉచ్చరించి భోజనం చేయాలి.

11. అన్నం తింటున్నప్పుడు వంట బాగాలేదని దూషించడం, కోపముతో అన్నం పెట్టేవారిని తిట్టడం చేయరాదు.

12.  ఆపోశనము అయ్యాక ఉప్పు వడ్డించుకోరాదు. ఏవైనా పదార్థాలలో ఉప్పు తక్కువైతే  ఆ పదార్థాలు ఉన్న గిన్నెలలో ఉప్పు వేసుకుని వడ్డించుకోవాలి.

13. కంచం ఒడిలో పెట్టుకుని భోజనం చేయరాదు. పడుకునే  మంచం మీద భోజనం చేయరాదు.  (ఇది వృద్ధులకు, అనారోగ్యం ఉన్నవారికి వర్తించదు.)

14. మాడిన అన్నాన్ని నివేదించరాదు.  అతిథులకు పెట్టరాదు.

15. భోజనం అయ్యాక క్షురకర్మ చేసుకోరాదు. (వెంట్రుకలు కత్తిరించడం)

16. గురువులు లేదా మహాత్ములు ఇంటికి వస్తే  మనం తినగా మిగిలినవి పెట్టరాదు. మళ్ళీ ప్రత్యేకంగా వంటచేయాలి. 

17. భోజనం వడ్డించేటప్పుడు పంక్తిబేధం చూపరాదు. అనగా ఒకరికి ఎక్కువ వడ్డించడం మరొకరికి తక్కువ వడ్డించడం చేయరాదు. 

18. భోజనం చేస్తున్నప్పుడు తింటున్న పదార్థాలలో వెంట్రుకలు, పురుగులు వస్తే తక్షణం విడిచిపెట్టాలి.

19. వడ్డన పూర్తి అయ్యాక విస్తరిలో లేదా కంచంలో ఆవునెయ్యి వేసుకుంటే ఆహారం శుద్ధి అవుతుంది. 

20. భగవన్నామము తలుచుకుంటూ లేదా భగవత్ కథలు వింటూ  వంట వండడం, భోజనం చేయడం చాలా ఉత్తమం. 

21. ఉపాసకులను, ఏదైనా దీక్షలో ఉన్నవారిని ఎక్కువ తినమని బలవంతపెట్టరాదు. ( అతిగా ఆహారం స్వీకరిచడం వారి అనుష్ఠానానకి  ఇబ్బంది అవ్వచ్చు) 

22. భోజనం చేస్తున్నవారు (అనగా భోజనం మధ్యలో తింటూ) వేదం చదువరాదు.  

23. గిన్నె మొత్తం ఊడ్చుకుని తినరాదు. ఆహార పదార్థాలను కాళ్ళతో తాకరాదు.

24. భోజనం చేస్తున్నప్పుడు నీళ్ళ పాత్రను కుడివైపు ఉంచుకోవాలి.

25. స్త్రీలు బహిష్టు కాలంలో వంట వండరాదు, వడ్డించరాదు. వారు ఆ 4 రోజులు ఎవరినీ తాకరాదు. వడ్డన సమయంలో అక్కడ ఉండరాదు.

26. అరటిఆకుల వంటి వాటిలో   భోజనం చేసిన వ్యక్తి  వాటిని మడవకూడదు  (తిన్న విస్తరిని మడవడం అనాచారం).   తన ఇంటిలో ఒక్కడు ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు.

27. ఎంగిలి విస్తరాకులను తీసేవాడికి వచ్చే పుణ్యం అన్నదాత కు కూడా రాదని శాస్త్రం. (జగద్గురువైన శ్రీ కృష్ణుడు కూడా ధర్మరాజు చేసిన రాజసూయయాగం లో లక్షలాది మంది తిన్న ఎంగిలి ఆకులు ఎత్తాడని మహాభారతం చెబుతోంది.)    

28.  భోజనం అయ్యాక రెండుచేతులూ,కాళ్ళూ కడుక్కోవాలి.  అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి.  నోరు నీటితో పుక్కిలించుకోవాలి.

29.  భోజనం అయ్యాక నేలను లేదా బల్లను శుద్ధి(మెతుకులు తీసేసి,తిన్న చోట తడిగుడ్డతో శుభ్రం) చేసి   మాత్రమే అక్కడ వేరేవారికి భోజనం వడ్డించాలి.(ఇప్పటికీ సదాచారాలు పాటించే కొందరి ఇళ్ళల్లో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు.)  

30.  స్నానం చేసి మాత్రమే వంట వండాలని కఠోర నియమము.  పెద్దలు,సదాచారపరులు హోటళ్ళలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం  చేయకపోవడానికి ఇదే ముఖ్యకారణం.  అక్కడ వంట చేసే వారు స్నానం చేసారో లేదో తెలియదు,

పాచిముఖంతో వంట చేసినా, రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంటచేసినా దోషం.  అవి తిన్న వారికి మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది. పుణ్యం క్షీణిస్తుంది.

31. ఒకసారి వండాక అన్నము, కూర, పప్పు వంటి ఇతర ఆహార పదార్థాలను మళ్ళీ వేడి చేసి తినరాదు. ద్విపాక దోషం వస్తుంది. 

32. ఆడవారు గాజులు ధరించకుండా భోజనం చేయరాదు. వడ్డించరాదు.

గ్రహాలు - వ్యాధులు

గ్రహాలు - వ్యాధులు  : గ్రహాల యొక్క స్థితి,యుతి, వీక్షణ ఆధారంగా వాటి స్వభావం ద్వారా   రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఏ గ్రహం కారణంగా ఈ వ్యాధులు వస్తాయి అనేది తెలుసుకోవచ్చు.కానీ ఆరోగ్య నియమాలు,గ్రహాలకు సరైన పరిహారం పాటిస్తే ఆరోగ్యానికి ఎలాటి లోపం ఉండదు. ఉన్నంతకాలం ఆరోగ్యంగా ఉంటారు. దీనికి నిశితమైన పరిశీలన అవసరం.



రవి : ఎముకలు, తల, నేత్రములు, గుండె, రక్తప్రసరణ, ఊపిరితిత్తులు, చేతులు, దంత, కంఠ, ఎడమ కన్ను వ్యాధులుటాంయి. అర్షమొలలు, తలనొప్పులు, బోన్స్‌ వీక్‌నెస్‌, పిత్యాధిక్యత, పిరికితనం ఉంటాయి. అగ్ని, విద్యుత్తు, శస్త్ర చికిత్సలెక్కువ. చర్మ సంబంధ వ్యాధులుటాంయి.


చంద్ర : దగ్గు, దమ్ము, ఆస్త్మా, పైత్యం, ఉదరవ్యాధులు, ద్రవసంబంధవ్యాధులు, ఇస్నోఫీలియా, కఫరోగం, నేత్రవ్యాధులు, మస్తిష్కవ్యాధులు, మూర్ఛలు, ఉన్మాదం, షుగరు, స్వప్నదోష వ్యాధులు, యక్ష్మ, వీర్యం, టాన్సిల్స్‌, గండమాల, ఊపిరితిత్తుల వ్యాధి, శ్వాసరోగం, మర్మావయం, క్షయ, నీటిగండం, జలదరింపులు, భూత ప్రేత భయాలు, మూఢ విశ్వాసాలు, నస, గులుగుడు, ఏకాంతం, శాడిజం ఉంటాయి.


కుజ : నుదురు, శిరస్సు, ముక్కు, కండరాలు, జననేంద్రియాలు, అర్శమొలలు, రక్తస్రారం, గాయాలు, వేడివల్ల వచ్చే అనారోగ్యాలు, అగ్ని, విద్యుత్తు ప్రమాదాలు, అస్త్ర, శస్త్ర భయం, చర్మవ్యాధులు, క్యాన్సర్‌ పుండు, యాక్సిడెంట్లు, కండరాల నొప్పులు, బి.పి. అతిదాహం, పిత్తాధిక్యం, అజీర్తి, నిద్రలేమి, రక్తహీనత ఉంటాయి.


బుధ : నరములు, ఊపిరితిత్తులు, చేతులు, దంత, నాలుక, కంఠం, దురద, నోటికి సంబంధించినవి. మూర్ఛ, ఫిట్స్ వంటి రుగ్మతలు, గాయాలు, చర్మవ్యాధులు, సన్నిపాతం, జ్వరం, దేనిక్రిందనైనా పడి నలగడం వంటివి ఉండవచ్చు. చేతులకు భుజాలకు ప్రమాదాలెక్కువ, అస్పష్టవాక్కు.


గురువు : కాలేయం, మధుమేహం, రక్తనాళాలు, కుడిచెవి, తొడలు, నితంబములు, అతిమూత్రవ్యాధి, బి.పి. (రక్తవికారం) హృదయరోగం, నడుము, కాళ్ళనొప్పులు, పక్షవాతం, సన్నిపాతం, మాట పడిపోవడం, వంటి వ్యాధులు లేదా వాటికి సంబంధించిన వ్యాధులు రావచ్చు.


శుక్ర : జననేంద్రియ వ్యాధులు, కఫం, వీర్యం, అతిమూత్రవ్యాధి, గుప్తరోగాలు, జలగండాలు, ముక్కు,  చెవులు, శిరస్సు సంబంధించిన వ్యాధులు, కంఠ సంబంధ వ్యాధి ఏదో ఒకి తప్పక ఉంటుంది. శరీర ఆయాసం, నీరసముంటుంది. స్త్రీలైన ప్రసవవేదన, ఋతుదోషం లేదా మరే ఇతర స్త్రీ సంబంధ వ్యాధులుండవచ్చు.


శని : కీళ్ళు, మోకాళ్ళు, దంతాలు, ఎముకలు, చర్మవ్యాధులుటాంయి. నరాల బలహీనత, బోన్స్‌ వీక్‌నెస్‌, వాత సంబంధ గ్యాస్‌ (వాయు) వికారాలు, దీర్ఘ వ్యాధులు, పక్షవాతం, అంగములు, కాళ్ళు, చేతులు పీలబడుట, కాళ్ళు ఉబ్బుట, మచ్చలు లేచుట వంటి వ్యాధులకు గురి కావచ్చు. వీరికి ప్రమాదాలు (యాక్సిడెంట్లు) ఎక్కువగా అవుతాయి. మానసిక పైత్య, ఉదర (అజీర్తి) వ్యాధులు కూడా ఉంటాయి.


రాహు : నేత్రవ్యాధులు, మశూచి వంటి చర్మవ్యాధులు, అపస్మారకం వంటి మానసిక వ్యాధులు, హృదయరోగాలుటాంయి.

కేతువు : 

చర్మ, ఉదర, పైత్య, హృదయ సంబంధ వ్యాధులుంటాయి. వీరికి చెమట విపరీతంగా ఉంటుంది.

కాలసర్ప దోషము

 కాలసర్ప దోషము



మానవ జాతకంలోని జన్మ కుండలిలో రాహు కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే.. దానిని 'కాలసర్ప యోగం' అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయించబడింది. దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయించబడుతుంది.

సవ్య కాలసర్ప దోషం ఫలితాలు: కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు. 

అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం.

గుళిక కాల సర్ప దోషం: మాములుగా ఇది జాతక చక్రంలో మొదటి ఇంట ప్రారంభం అయి 9వ ఇంట సమాప్తం అవుతుంది.

ఫలితాలు: ఆర్ధిక సమస్యలు, కుటుంబ ఇబ్బందులు.

వాస్తుకి కాలసర్ప దోషం: 2వ ఇంట మొదలయి 10వ ఇంట సమాప్తం.

ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు.

సంకాపాల కాలసర్ప దోషం: 3వ ఇంట మొదలై 11వ ఇంట సమాప్తం.

ఫలితాలు: తల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గండం, నివాస స్థల సమస్యలు.

పద్మ కాలసర్ప దోషం: 4వ ఇంట ప్రారంభమై 12వ ఇంట సమాప్తం.

ఫలితాలు: జీవిత భాగస్వామితో కాని పిల్లలతో కాని సమస్యలు.

మహా పద్మ కాలసర్ప దోషం: 5వ ఇంట ప్రారంభం అయి 1వ ఇంట సమాప్తం.

ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ.

తక్షక కాలసర్ప దోషం: ఆరవ ఇంట  ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.

ఫలితాలు: వ్యాపార నష్టాలు, వివాహ జీవతంలో ఇబ్బందులు.

కర్కటక కాలసర్ప దోషం: 7వ ఇంట ప్రారంభం 3వ ఇంట సమాప్తం.

ఫలితాలు: భార్యతో ఇబ్బందులు, అనుకోని సంఘటనలు.

శంఖ చూడ కాలసర్ప దోషం: 8వ ఇంట ప్రారంభం 4 వ ఇంట సమాప్తం.

ఫలితాలు: తండ్రి వాళ్ళ ఇబ్బందులు, అత్యంత దురదృష్ట  స్థితి.

ఘటక కాలసర్ప దోషం: 9 వ ఇంట ప్రారంభం 5వ ఇంట సమాప్తం.

ఫలితాలు: వ్యాపార, ఉద్యోగ సమస్యలు.

విషార కాలసర్ప దోషం: 10వ ఇంట  ప్రారంభం 6వ ఇంట సమాప్తం.

ఫలితాలు: ఆర్ధిక, వ్యాపార కష్టాలు.

శేషనాగ కాలసర్ప దోషం: 11వ  ఇంట  ప్రారంభం 7వ  ఇంట సమాప్తం.

ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు.

అపసవ్య కాలసర్ప దోషం: 12వ  ఇంట  ప్రారంభం 8వ  ఇంట సమాప్తం.

ఫలితాలు: ఆలస్య వివాహం.

కాల సర్ప దోషం ఇవి మొత్తం 12 రకాలు : 

 అనంత కాల సర్ప యోగము ,

 గుళిక కాల సర్ప యోగము,

వాసుకి  కాల సర్ప యోగము,

శంఖ పాల  కాల సర్ప యోగము,

పద్మ కాల  సర్ప యోగము,

మహా  పద్మ కాల  సర్ప యోగము,

తక్షక లేక షట్  కాల  సర్ప యోగము,

కర్కోటక  కాల  సర్ప యోగము,

శంఖ చూడ లేక శంఖ నంద  కాల  సర్ప యోగము,

ఘటక లేక పాతక   కాల  సర్ప యోగము,

విషక్త లేక విషదావ   కాల  సర్ప యోగము,

 శేష  నాగ   కాల  సర్ప యోగము,

కాలసర్ప యోగ ఫలితాలు 

 జన్మించిన సంతానమునకు బుద్ధి మాంద్యం కలుగట 

గర్భం   శిశువు మరణించుట ,

 వైవాహిక జీవతంలో అసంతృప్తి, భార్తభర్తల మధ్య సమన్వయం లేక పోవుట 

 మరణించన శిశువును ప్రసవించుట,

 గర్భం నిలవక పోవుట, 

 అంగ వైకల్యంతో సంతానం కలుగుట,

దీర్ఘకాలిక వ్యాధులు  ఏర్పడుట, చికిత్స విఫలమై మరణించుట 

మొండి పట్టుదలశత్రువు వలన మృతి చెందుట, 

మానసిక ప్రశాంత లేక పోవుట ప్రమాదాలు అవమానాలు,  పర స్త్రీ సంపర్కం లాంటి ఫలితాలు కాలసర్ప దోషాలు.


 జాతక చక్రంలో రాహుకేతువుల మధ్య గ్రహములుండుటను కాలసర్ప దోషముగా భావింతురు. వ్యక్తీ గతం కాదనీ, సామూహిక విలక్షనాంశమని రాహు,కేతువులు ఇతర గ్రహములతో కూడి యుండుటను యోగమని కొందరి అభిమతము , ఏది ఏమైనా అశుభ యోగమని భావించుటను బట్టి, అన్ని గ్రహములు రాహు కేతువుల మధ్య యుండుటను నిష్ప్రయోజనాంశముగా నెంచి కాల సర్ప దోష శాంతి విధానములనుసరించుటయే శ్రేయస్కరం.

అపార్ట్‌మెంట్స్‌- వాస్తు

 అపార్ట్‌మెంట్స్‌- వాస్తు 



పట్టణాల్లో, నగరాల్లో అధిక మొత్తములో కనిపించేవి అపార్టుమెంట్సే. ఇటీవల అపార్టుమెంట్స్ నిర్మాణం మరింతా పెరిగింది. భుమి మీద ప్రతి నిర్మాణానికి వాస్తు పనిచేస్తూ వుంటుంది. కాబట్టి అపార్టుమెంట్స్ కు కూడా వాస్తు పని చేస్తుందని చెప్పవచ్చు. మొదట అపార్టుమెంటు కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టాలి. అపార్టుమెంట్స్ - కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టడంలో విడిగృహలకు ఏ విధమైన వాస్తు విషయాలు వర్తిస్తామో అవే విషయాలు వర్తిస్తాయి. తరువాత కాంప్లెక్సులోని ప్రతి అపార్టుమెంట్ ను వాస్తుకు సరిపెట్టాలి. 


అపార్టుమెంట్ వాస్తు  ఎత్తు-పల్లాలు, ద్వారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. సింహద్వారపు నడక ఖచ్చితంగా ఉచ్చములో వుండలేగాని.. నీచములో వుండకూడదు. అపార్టుమెంట్ ప్లాన్సును అనుసరించి కొన్నిటిని సింహద్వారాము ఉచ్చములో వుంటే వాటిపక్క వాటికో, ఎదుటి వాటికో, నీచములో సింహద్వారము ఉంటూ వుంటుంది. ఈ విధంగా కాకుండా అన్ని అపార్టుమెంట్స్ కు ఉచ్చములో సింహద్వారము వుండునట్లు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి స్థలాభావం, సాంకేతిక కారణాలు అడ్డురావచ్చు. అయితే ఇంజనీరు, వాస్తుశాస్ర్తవేత్త కలిసి ప్లాను తయారుచేస్తే పై సమస్యలు సులభంగా సరిచేయవచ్చు.


ఒక్కో అపార్టుమెంట్ కాంప్లక్సు ఒక్కో విధంగా వుంటుంది. కాబట్టి అన్నింటిని గురించి వివరించి చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అపార్టుమెంట్ ఎన్నో అంతస్తులో వున్నా ప్రతి గదికి ఉచ్చములో ద్వారాలు వుండాలి. కాంప్లెక్సుకు దక్షిణ, పశ్చిమాలలో తిరగడానికి వీలైనంత క్యాబిన్ వదలటం జరుగుతూ వుంది. ఈ స్థలం దక్షణం, పశ్చిమం ఖాళీ స్థలంగా పనిచేస్తూ వుంటుంది. అంతే కాకుండా ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండునట్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ, పశ్చిమాల క్యాబిన్ లు పల్లంగా కాకుండా ఇంటిఫ్లోరింగ్ తో సమానంగా గాని, అంతకన్నా ఎత్తుగా గాని వుండాలి. 

కాంప్లెక్సులోని ఉత్తర, తూర్పు భాగాల అంపార్టుమెంట్స్ తూర్పు ఉత్తరాలలో క్యాబిన్ వసతి వుండటం లాభదాయకం. ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండాలే గాని ఎత్తుగా వుండకూడదు. ఈ క్యాబిన్ ఈశాన్యం తగ్గటంకాని, తెగిపోవటంకాని జరుగకూడదు. 


ప్రతి అపార్టుమెంట్ కాంప్లెక్సులోని గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ స్థలంగా ఉపయోగించడం ఉత్తమమైనదే. అపార్టుమెంటు కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్ లో దక్షిణ భాగంలో గాని, పశ్చిమ భాగంలోగాని ఏవైనా నిర్మాణాలుచేసి ఉత్తర, తూర్పు భాగాలను పార్కింగ్ స్ధలంగా వాడుకోవటం సర్వోత్తమమైనది. వాస్తు శాస్ర్తరీత్య అపార్టుమెంట్స్ నిర్మించుకొంటే.. విడిగృహములలో ఏ విధమైన వాస్తు ఫలితాలు అనుభవిస్తారో.. వాటికి తీసిపోకుండా ఫలితాలు పొందే అవకాశమున్నది.

కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా..?

 కార్తీకమాసంలో దీపాలు వెలిగించేందుకు ఉత్తమ సమయమేదో తెలుసా..?



'దీపం జ్యోతిః పరబ్రహ్మ.. దీపం జ్యోతిః నమో నమః దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః' దీపం పరబ్రహ్మస్వరూపం.. పరాయణత్వం కలిగినది. పాప ప్రక్షాళన చేసే శక్తి కలది. అంతేకాదు మన ఇంట్లో సిరులు తెచ్చేది కూడా దీప జ్యోతియే! దీపం లేని ఇల్లు ప్రాణం శరీరం లాంటిదే.


సాధారణంగా దీపాలను మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ఇలాంటి సాధారణంగా దీపం ఉభయ సంధ్యల్లో పెడతారు.


ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే కార్తీకమాసంలో దీపానికి అత్యధిక ప్రాధాన్యమిస్తారు. ఈ మాసంలో అగ్ని ఆరాధాన, హోమాలు వంటివి చేయడం ఎంతో విశిష్టత కలిగి ఉంటాయి. ఈ సందర్భంగా పవిత్రమైన కార్తీక మాసంలో దీపాలను ఏ సమయంలో వెలిగిస్తే ఫలితం ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


దీపారాధన.. మనలో చాలా మంది దీపారాధన చేసే సమయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ముఖ్యంగా ఎక్కువమంది దీపరాధన చేసే ముందు వత్తి వేసి తర్వాత నూనెను పోస్తుంటారు. అయితే అలా చేయకూడదంట. దీపారాధన చేసే సమయంలో ముందుగా నూనె వేసి ఆ తర్వాత వత్తులను అందులో వేయాలి. అలాగే స్టీల్ కందుల్లో దీపారాధన చేయకూడదు..


ఇందులోనే చేయాలి.. దీపారాధనను వెండి కుందులు, పంచలోహ కందులు, ఇత్తడి కందులు మరియు మట్టి కందులలో మాత్రమే చేయాలి. అలాగే కందులను కూడా ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎట్టి పరిస్థితుల్లో వాటిని శుభ్రపరచకుండా వత్తులను అస్సలు వేయకూడదు.


నేరుగా వెలిగించకూడదు.. దీపారాధన చేసే సమయంలో అగ్గిపుల్ల తీసుకుని నేరుగా కందులలోని దీపాన్ని వెలిగించకూడదు. మరొక దీపం ద్వారా లేదా ఏకహారతి ద్వరా ప్రత్యేకంగా ముందుగా వెలిగించి పెట్టుకున్న దీపం నుండే దీపారాధన చేయాలి.


స్త్రీలే స్వయంగా.. దీపారాధనను ఎక్కువగా స్త్రీలే వెలిగించాలి. దీపారాధన కందిలో అయిదు వత్తులను వేసి స్త్రీలు తామే స్వయంగా వెలిగించాలి. మొదటి వత్తి భర్త, సంతానం క్షేమం కోసం.. రెండో వత్తి అత్తమామల సంక్షేమం కోసం.. మూడో వత్తి సోదరసోదరీమణులు, నాలుగో వత్తి గౌరవ, ధర్మాలకు ప్రతీకగా.. అయిదో వత్తి వంశం అభివ్రుద్ధికి ప్రతీకగా పండితులు చెబుతారు.


రెండు వత్తులు.. మరో విషయమేమిటంటే.. దీపారాధన ఎవరు చేసినప్పటికీ, తప్పనిసరిగా రెండు వత్తులు అనేవి ఉండాలి. దీపారాధనకు ఉద్దేశించిన దీపాల నుండి నేరుగా అగరవత్తులు, ఏకహారతి, కర్పూర హారతులు వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు.


పసుపు రంగు బట్టలతో.. జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీగణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది. అలాగే పసుపు రంగు బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వల్ల జఠర, ఉదరవ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.


సూర్యోదయానికి ముందు.. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేమిటంటే.. స్త్రీలందరూ ఉదయం సూర్యోదయం సమయానికి దీపారాధన చేయడం శ్రేయస్కరం. అయితే అందరికీ ఆ సమయానికి అవకాశం ఉండటం లేదు. కానీ అందరికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కావడం లేదు. కాబట్టి మీరు సంకల్పంతో సూర్యోదయం తర్వాత కూడా చేయొచ్చు. అయితే మరీ 10 గంటలు లేదా 11 గంటల తర్వాత మాత్రం చేయకూడదు.


సంధ్య సమయంలో.. అలాగే సూర్యుడి అస్తమించే సమయంలో దీపారాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత సుమారు 5 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో దీపారాధన చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో భూత, ప్రేతాలు తిరుగుతుంటాయని చెబుతారు. అందుకే సాయంత్రం 5:30 నుండి 6 గంటలు దాటిన తర్వాత దీపారాధన చేయాలి.

లక్ష్మీప్రియం...ఐశ్వర్య ప్రదం

 లక్ష్మీప్రియం...ఐశ్వర్య ప్రదం



నిత్యం హారతి పాటలు, శంఖం, ఘంటానాదాలు వినిపించే ఇంట్లోనూ, పరిశుభ్రంగానూ, అందంగానూ కనిపించే ఇంటిలోనూ, గోవులు, గోశాలలు, పుష్పగుచ్ఛాలు, వజ్రవైఢూర్యాలు, సుగంధ ద్రవ్యాలు, సమస్త శుభప్రద, మంగళకర ద్రవ్యాలలోనూ, వేదఘోష వినిపించే ప్రదేశాలలోనూ, స్త్రీ సుఖశాంతులతో తులతూగే చోట, శ్రీమన్నారాయణుని, తులసి ని పూజించే ఇంట లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని శాస్త్రోక్తి.. 


చీకటిపై వెలుతురు విజయం సాధించినందుకు, చెడుపై మంచి గెలిచినందుకు గుర్తుగా జరుపుకునే పర్వదినమే దీపావళి. 


లోకాన్నంతటినీ పట్టి పీడిస్తున్న నరకాసురుడనే దుష్ట దానవుని అంతమొందించిన వెలుగుల పండుగ దీపావళి. 


సాధారణంగా అమావాస్యనాడు చిక్కటి చీకట్లు అలముకుని ఉంటాయి.


 అయితే దీపావళి అమావాస్యనాడు మాత్రం అంతటా వెలుగుపూలు విరగపూస్తాయి. 


చిన్న, పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా అందరి ఇంట ఉల్లాసం, ఉత్సాహం వెల్లివిరుస్తాయి. 


ముంగిళ్లన్నీ దీపకాంతులతో కళకళలాడతాయి. ఈ పర్వదినం ప్రాముఖ్యత, ఆచార సంప్రదాయాలను తెలుసుకుని ఆచరిద్దాం...


రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని తన గోళ్లతో చీల్చి చంపి, హరి భక్తుల కష్టాలను తొలగించినందుకు కృతజ్ఞతగానూ – ఇలా దీపావళికి సంబంధించి అనేక కథలు ఉన్నాయి.


 అయితే శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై... లోకకంటకుడైన నరకాసురుని వధించిన సందర్భంగా మాత్రమే దీపావళి జరుపుకుంటున్నామనే కథే బహుళ ప్రాచుర్యంలో ఉంది. 


నరకుడు చస్తే పండుగ ఎందుకు?


నరకుడు అంటే హింసించేవాడు అని అర్థం. ప్రాగ్జ్యోతిషపురమనే రాజ్యాన్ని పాలించేరాజై ఉండి కూడా అసూయతో దేవతల తల్లి అదితి కర్ణకుండలాలను, వరుణుడి ఛత్రాన్ని అపహరించాడు.


 దేవతలను, మానవులను, మునులను హింసించేవాడు. దేవతల మీదికి పదేపదే దండెత్తేవాడు. 


వాడు పెట్టే హింసలు భరించలేక అందరూ కలసి శ్రీకృష్ణుని దగ్గర మొరపెట్టుకోగా, కృష్ణుడు వాడిని సంహరిస్తానని మాట ఇచ్చి, యుద్ధానికి బయలుదేరాడు. 


ప్రియసఖి సత్యభామ తాను కూడా వస్తానంటే వెంటబెట్టుకెళ్లాడు.


 యుద్ధంలో అలసిన కృష్ణుడు ఆదమరచి, అలసట తీర్చుకుంటుండగా అదను చూసి సంహరించబోతాడు నరకుడు. 


అది గమనించిన సత్యభామ తానే స్వయంగా విల్లందుకుని వాడితో యుద్ధం చేస్తుంది. 


ఈలోగా తేరుకున్న శ్రీకృష్ణుడు సుదర్శనచక్రాన్ని ప్రయోగించి, వాడిని సంహరిస్తాడు. 


లోక కంటకుడైన నరకాసురుని వధ జరిగిన వెంటనే ఆ దుష్టరాక్షసుడి పీడ వదిలిందన్న సంతోషంతో దేవతలు, మానవులు అందరూ వారి వారి లోకాలలో దీపాలను వెలిగించి, బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. 


అప్పటినుంచి ప్రతి ఏటా దీపావళి పండగ జరుపుకోవడం ఆచారంగా మారింది.


దీపావళి నాడు ఏం చేయాలి?


ఈ రోజున తెల్లవారు జామునే తలకి నువ్వుల నూనె పెట్టుకొని, తలంటు స్నానం చేయాలి. 


స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు చెట్ల మండలను వేసి, ఆ నీటితో స్నానం చేయడం ఆరోగ్యకరం, మంగళప్రదం. 


ఈ రోజు చేసే అభ్యంగన స్నానం సర్వ పాపాలను హరింపజేయడమే గాక గంగా స్నానంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. 


దీపావళి నాడు విధివిధానంగా లక్ష్మీపూజ చేయాలి. ఎందుకంటే, దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి దిగివచ్చి, ప్రతి ఇల్లు తిరుగుతూ శుభ్రంగా, మంగళకరంగా వున్న ఇళ్లలో తన కళను ఉంచి వెళుతుందట.


 అందుకే దీపావళి నాటికి ఇంటిలోని పనికిరాని వస్తువులను బయట పారవేసి ఇంటిని శుభ్రం చేసి, వీలైనంత అందంగా అలంకరించాలి.


దీపాలు ఎక్కడెక్కడ పెట్టాలి?


దీపావళి నాడు 5 ప్రదేశాల్లో దీపాలు తప్పక వెలిగించాలని శాస్త్రం చెప్పింది.


 వంట గదిలో, ఇంటి గడపకు ఇరువైపులా, ధాన్యాగారంలో (బియ్యం, పప్పులు మొదలైనవి నిలువ ఉంచే ప్రదేశంలో), తులసి కోటలో లేదా తులసిమొక్క దగ్గర, రావి చెట్టు కిందా దీపారాధన చేయాలి.


అంతేకాదు, పెద్ద వయసు వారు నివసిస్తున్న ఇళ్ళ దగ్గర, దేవాలయాలు, మఠాలు, గోశాలల్లో, పెద్ద వయసున్న చెట్ల వద్ద, ప్రతి గదిలోనూ, ప్రతి మూలలోనూ దీపం వెలిగించాలి.


 అలాగే నాలుగు వీధుల కూడలిలో (నాలుగు రోడ్లు కలిసే ప్రదేశంలో) దీపం వెలిగించాలి. 


నువ్వుల నూనె దీపాలనే వెలిగించడం, మట్టి ప్రమిదలనే వాడడం శ్రేష్ఠం. దీపావళి పితృదేవతలకు సంబంధించిన పండుగ కూడా.


 దీపావళినాటి సాయంత్రం గోగు కాడల మీద దివిటీలు వెలిగించి తిప్పుతారు.


 ఇవి పితృదేవతలకు దారిని చూపిస్తాయని, తద్వారా పితృదేవతలు సంతోషిస్తారని, వారి దీవెనలు ఉంటే వంశం నిలబడుతుందనీ విశ్వాసం. 


తరువాత అలక్ష్మి (దరిద్రం) తొలగడానికి లక్ష్మీ పూజ చేయాలి.


 దీపావళీ అర్ధరాత్రి 12 గంటలకు చీపురుతో ఇల్లు చిమ్మి, చేటలపై కర్రలతో కొడుతూ, తప్పెట్ల చప్పుళ తోనూ, డిండిమం అనే వాద్యాన్ని వాయిస్తూ జ్యేష్ఠాలక్ష్మిని (దరిద్ర దేవతను) సాగనంపాలని శాస్త్రవచనం.


లక్ష్మీపూజ ఇలా చేయాలి...


ఇంటిగుమ్మాలను మామిడి లేదా అశోకచెట్టు ఆకుల తోరణాలతోనూ, ముంగిళ్లను రంగవల్లులతోనూ తీర్చిదిద్దాలి. 


అనంతరం... ఒక పీటను శుభ్రంగా కడిగి, పసుపు కుంకుమలతో అలంకరించి దానిమీద కొత్త కండువా పరిచి, బియ్యం పోసి లక్ష్మీదేవి, గణపతి ప్రతిమలను ఉంచాలి. 


కలశం పెట్టే అలవాటున్న వారు ఆనవాయితీ తప్పకూడదు. 


ఆ ఆచారం లేనివారు అమ్మవారిని ధ్యానావాహనాది షోడశోపచారాలతో పూజించాలి. 


వ్యాపారస్తులైతే పూజలో కొత్త పద్దు పుస్తకాలను ఉంచాలి. 


మిగిలినవారు నాణాలను, నూతన వస్త్రాభరణాలను, గంధ పుష్పాక్షతలను, మంగళకరమైన వస్తువులను ఉంచి యథాశక్తి పూజించాలి. 


లక్ష్మీ అమ్మవారిని అష్టోత్తర శతనామాలతోనూ, ఇంద్రకృత మహాలక్ష్యష్టకంతోనూ పూజించడం సత్ఫలితాలను ఇస్తుంది. 


లక్ష్మీపూజలో చెరకు, దానిమ్మ, గులాబీలు, తామరపువ్వులు, వెండి వస్తువులు ఉంచి, ఆవునేతితో చేసిన తీపి వంటకాలను నివేదించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ప్రతీతి.  


ఎన్నో కథలు... మరెన్నో కారణాలు..


లోకంలోని చీకట్లను పారదోలి వెలుగు పూలతో నింపే సుదినం ఇది.


 భగవంతుడు పరంజ్యోతి స్వరూపుడు. జ్ఞానప్రదాత. మహాలక్ష్మి దీపకాంతులలో జ్యోతి తేజస్సుతో విరాజిల్లుతుంటుంది. 


అందుకే దీపావళి రోజున గృహాన్నంతటినీ దీపతోరణాలతో అలంకరిస్తారు. 


దీపాలు వెలిగించి చీకట్లను పారద్రోలే వేడుక స్త్రీదైతే, ఉన్నంతలో దానధర్మాలు చేసే బాధ్యత పురుషులది, పరిసరాలను వెలుగులతో నింపే ఉత్సాహం పిల్లలది. 


దీపాలను మన ఇంటిలోనే కాదు, ఇరుగు పొరుగు ఇళ్లలోనూ, దేవాలయాలలోనూ కూడా ఉంచి, పరహితంలో పాలు పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.


ఈ దీపావళి అందరికీ భోగభాగ్యాలను ప్రసాదించి, సుఖసంతోషాలు కలిగించాలని కోరుకుందాం.

ధన్వంతరి జయంతి

 ధన్వంతరి జయంతి



శ్రీమహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని , ధన్వంతరి దేవవైద్యుడని భాగవత పురాణం చెబుతోంది. బ్రహ్మాండ పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , హరివంశంలోనూ ధన్వంతరికి సంబంధించిన ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి.   దేవతలు , దానవులు క్షీరసాగర మథనం చేశారు. అందులో నుంచి మొదట హాలాహలం ఉద్భవించగా , దాన్ని పరమశివుడు కంఠంలో నిలిపి గరళకంఠుడయ్యాడు. అనంతరం కల్పవృక్షం , కామధేనువు , ఐరావతం , చంద్రుడు , శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆ తరవాత అమృతకలశం , ఔషధులు , ఆయుర్వేద గ్రంథం ధరించి ధన్వంతరి ఆవిర్భవించాడు. ‘దృఢమైన శరీరంతో పెద్ద బాహువులతో , ఎర్రని కళ్లతో నల్లని దేహచ్ఛాయ కలిగి యుక్తవయస్కుడై పీతాంబరాలు , ముత్యాల హారాలు ధరించి నల్లగా నిగనిగలాడుతున్న కురులతో , విశాలమైన వక్షస్థలంతో , సింహంవలె శక్తిని కలిగి అమృతభాండంతో అవతరించాడు’ అని ధన్వంతరి ఉద్భవాన్ని భాగవతం పేర్కొంది.

ధన్వంతరిని విష్ణువు ‘అబ్జుడు’గా పేరు పొందమని చెప్పాడు. తనకు యజ్ఞభాగం ప్రసాదించమని ధన్వంతరి కోరాడు. అప్పటికే యజ్ఞ భాగాలకు ఏర్పాటు జరిగిపోయిందని , కొత్తగా అతడికి అందులో భాగం కల్పించడం తగదని ద్వాపరయుగంలో ఆ గౌరవం కలుగుతుందని ధన్వంతరికి విష్ణువు చెప్పాడు. ధన్వంతరి సాక్షాత్తు సూర్యభగవానుడి శిష్యుడని , అతడి నుంచి ఆయుర్వేద విద్యను గ్రహించాడని బ్రహ్మవైవర్తం పేర్కొంది.

సుహోత్రుడు కాశీరాజుగా ఉండేవాడు. అతడి వంశంలోని దీర్ఘతపుడు సంతానం కోసం అబ్జదేవుడి గురించి తపస్సు చేశాడు. అబ్జదేవుడు ధన్వంతరిగా జన్మించి భరద్వాజుడికి శిష్యుడై ఆయుర్వేదం నేర్చుకుని ప్రచారం చేశాడని హరివంశ కథనం. అనంతర కాలంలో ఈ ధన్వంతరే కాశీరాజై దివోదాసుడిగా ప్రసిద్ధికెక్కాడని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అగ్నిదేవుడికి అజీర్ణం కలిగితే ధన్వంతరి వైద్యం చేసినట్లు పురాణ కథనం.

బ్రహ్మవైవర్త పురాణంలోని కృష్ణజన్మ ఖండంలో ధన్వంతరి , మానసాదేవి వృత్తాంతం ఉంది. ఒకసారి ధన్వంతరి , అతడి శిష్యులు కైలాసానికి వెళ్తుండగా తక్షకుడనే సర్పం వారిపై విషం చిమ్మగా ఒక శిష్యుడికి స్పృహతప్పింది. ధన్వంతరి వనస్పతి ఔషధంతో అతణ్ని తేరుకునేట్లు చేశాడు. మరో శిష్యుడు తక్షకుడి తలపై ఉన్న మణిని లాగి నేలకు కొట్టాడు. అది తెలిసిన సర్పరాజు వాసుకి , ద్రోణ , పుండరీక , ధనంజయులనే సర్ప ప్రముఖుల నాయకత్వంలో వేలాది సర్పాల్ని ధన్వంతరి బృందంపైకి పంపించాడు. ఆ సర్పాలు వెలువరించిన విషానికి తన శిష్యులు మూర్ఛపోయినా తన ఔషధంతో వారికి ధన్వంతరి స్వస్థత చేకూర్చాడు. శివుడి భక్తురాలైన మానసాదేవి అనే స్త్రీ సర్పాన్ని వాసుకి వారిపైకి పంపించాడు. ఆమె కూడా ధన్వంతరి శిష్యుల్ని ఏమీ చేయలేకపోయింది. ఆగ్రహించిన మానసాదేవి త్రిశూలాన్ని ధన్వంతరిపై ప్రయోగించబోగా శివుడు , బ్రహ్మ ప్రత్యక్షమై ఆమెను శాంతింపజేస్తారు.

అధర్వణ వేదంలో భాగమైన ఆయుర్వేదాన్ని ధన్వంతరి ప్రచారంచేసి సకల జనులకు ఆరోగ్యం ప్రసాదించాడని విశ్వాసం. ఆయుర్వేదం సనాతన భారతీయ వైద్యం. ఇందులో కాయ , బాల , గ్రహ చికిత్సల గురించి , శలాక్య , శల్య , విష , రసాయన , వాజీకరణ మంత్రాల గురించిన వివరణ ఉంది. విశ్వవైద్య విజ్ఞానమంతా ఈ విభాగాల్లోనే ఉందని , అందుకే ఆయుర్వేదం అష్టాంగ సంగ్రహమని విజ్ఞులు భావిస్తారు.

చంద్రగుప్త విక్రమాదిత్యుడి ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకరు ధన్వంతరి. అతడు కూడా వైద్యుడే కావడం విశేషం. తమిళనాడులోని శ్రీరంగం రంగనాథుడి ఆలయంలో ధన్వంతరి మందిరం ఉంది. కేరళలో కాలికట్‌ సమీపంలో ‘ధన్వంతరి క్షేత్రం’ ఉంది.


ధన త్రయోదశి


ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం.  క్షీరసాగర మథనం సమయంలో శ్రీమహా విష్ణువు యొక్క అంశావతారంగా అమృత కలశహస్తుడై సమస్త ప్రజలకు రోగనివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి ఆవిర్భవించాడు. అలా ధన్వంతరి జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.


వెలుగు దివ్వెల పండుగైన దీపావళి పర్వదినానికి రెండురోజుల ముందు జరుపుకొనే ఉత్సవ విశేషం - ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా , యమ త్రయోదశిగా మనం జరుపుకొంటాం. దీపావళి వేడుకల్లో భాగమే ఈ పండుగ. ఉత్తర భారతదేశంలో దీపావళి సంబరాలు ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. దీపావళి గుజరాతీయు లకు సంవత్సరాది. ధన త్రయోదశి , నరక చతుర్దశి , దీపావళి , బలిపాడ్యమి , యమద్వితీయ పేరిట ఈ వేడుకల్ని , అత్యంత సంరంభంగా జరుపుతారు. 'చతుర్వర్గ చింతామణి' గ్రంథం ప్రకారం ధన త్రయోదశినాడు గోత్రిరాత్ర వత్రాన్ని చేసుకుంటారు. 'ఆమాదేర్ జ్యోతిషీ' గ్రంథం ధన త్రయోదశి గురించి విశేషంగా వివరించింది. 'ధన్ తేరస్' పేరిట ఉత్తర భారతీయులు ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా భావిస్తారు.

ధన త్రయోదశి నుంచి ఇంటి ముంగిట దీపాల్ని వెలిగించడం ప్రారంభిస్తారు. ఈ దీపారాధనం కార్తీక మాసం చివరివరకూ కొనసాగుతుంది. అపమృత్యు నివారణార్థం దీపాన్ని వెలిగించి , పుష్పగంధాదులతో దాన్ని పూజించి ఇంటిముందు ఉంచుతారు. దీనినే యమదీపమంటారు. యమతర్పణం చేసి దీపదానం చేస్తారు. పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారనే విశ్వాసం ఉత్తర భారతీయుల్లో ఉంది. అందుకే ధన్ తేరస్ సాయంకాలాన తమ ఇంటిముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని ఉంచుతారు. పితృ దేవతలకు ఈ దీపం దారి చూపుతుందని వారి విశ్వాసం.

ధన త్రయోదశిని దక్షిణ భారతంలో ఐశ్వర్య , సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకునే ఆచారం ఉంది. దీనికి సంబంధించి ఎన్నో పౌరాణిక గాథలు ప్రచారంలో ఉన్నాయి. నరకుడి హస్తగతమైన ధనలక్ష్మిని శ్రీహరి విడిపించి , తన పాంచజన్య శంఖంతో , కామధేను క్షీరంతో , చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన సంకేతంగా ఈ వేడుకను పాటించడం ఆరంభమైందంటారు. అలాగే , శ్రీహరి బలిచక్రవర్తికి వరాన్ని అనుగ్రహించిన రోజు కూడా ఇదేనని చెబుతారు. తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా ఉండాలని దామోదరుణ్ని బలిచక్రవర్తి ప్రార్థించాడు. ఆయన కోరికను మన్నించి దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశినాడు లక్ష్మీపతి వరప్రదానం చేశాడని చెబుతారు.

యమత్రయోదశిగా కూడా వ్యవహరించే ఈ శుభదినానికి ముడివడిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. హిమవంతుడనే రాజుకు లేకలేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట , వివాహమైన నాలుగో రోజున పాముకాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో ఆ యువరాజు భార్య , తన భర్త ప్రాణాల్ని కాపాడుకునేందుకు వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం , వెండి , రత్నాల్ని రాశులుగా పోసి , ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథా రూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతికీ , బంగారం , వెండి ధగధగలకూ కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోయి , వచ్చిన పని మరచి తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. అందుకే స్త్రీల సౌభాగ్యానికీ , ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి , బంగారాల్ని కొని ధన లక్ష్మీపూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి - ధన త్రయోదశి.

ఈ చతుర్దశినాటి అభ్యంగన స్నానం వల్ల , దీపదానం వల్ల , యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరకచతుర్దశి అని పేరని కొందరు అంటారు.

'చతర్దశ్యాంతుయే దీపాన్నరకాయ దదంతి చ

తషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ:' అని శాస్త్ర వచనం.

'చతుర్దశి నాడు ఎవరు నరక లోక వాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరక లోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం.


దంతేరాస్ పూజా విశిష్టత , ప్రాముఖ్యత..!

  

భారత దేశంలో ఎన్నో పండుగలుంటాయి వాటిలో కొన్ని ఒకరోజు కంటే ఎక్కువే జరుపుకుంటారు. నవరాత్రి , దీపావళి లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ పండుగలని అందరూ ఎంతో ఉత్సాహంగా సంతోషంతో జరుపుకుంటారు. ఆ సంవత్సరంలో పడ్డ బాధలూ , కష్టాలూ అన్నీ మర్చిపోయి బంధుమిత్రులతో ఈ పండుగలని సంతోషంగా జరుపుకుంటారు.  ధన త్రయోదశితో మొదలయ్యే హిందువుల ముఖ్య పండుగ అయిన దీపావళి ఐదు రోజుల పండుగ.

కృష్ణ పక్షంలో పదమూడవరోజున అక్టోబరు - నవంబరు లో వచ్చే కార్తీక మాసం వచ్చే ఈ త్రయోదశి దీపావళి మొదలవుతుంది. పదిహేనవ రోజు అమావాశ్య రోజున దీపావళి జరుపుకుంటారు. ఈ త్రయోదశి రోజున మీరందరూ కొత్త నగలూ లేదా ఏమైనా లోహాలూ కొనుక్కుంటారు కదా.  ముఖ్యంగా ఈరోజున బంగారం లేదా వెండి కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తారు. అసలు ఈరోజున బంగారం ఎందుకు కొనాలని ఎప్పుడైనా ఆలోచించారా ?  అసలు ఈ త్రయోదశి విశిష్టత తెలుసా?  ప్రతీ పండగ వెనుక ఉన్న పరమార్ధాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలము.  ఇక ఈ త్రయోదశి విశిష్టత తెలుసుకుందామా ? దీపావళి షాపింగుకి బయలుదేరేముందు ధన త్రయోదశి విశిష్టత తెలుసుకోండి.


1. ధన్‌తేరస్ అని కూడా వ్యవహరిస్తారు ధన త్రయోదశిని. అనగా సంపద అని అర్ధం. చాలా మంది ఈరోజున తమ కుటుంబం సుఖ సంతోషాలూ , అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీ దేవినీ , గణపతినీ పూజిస్తారు. బంగారం , వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోహాలని కూడా పూజిస్తారు.


2. లక్ష్మీ దేవికి స్వాగతం - సంపదకి గుర్తు లక్ష్మీ దేవి. అందుకే ఈరోజున అందరూ కొత్త వస్తువులనీ , నగలనీ , వెండి వస్తువులనీ కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీ దేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు.


3. యమ దీపం కధ - హీమ రాజు కుమారుడు పెళ్లయ్యిన నాలుగో రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసి పెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవటానికి ఆ యువరాజు భార్య ఆరోజు భర్తని నిద్ర పోనీయకుండా మెలకువతో ఉంచి , గది నిండా బంగారం , వెండి నాణాలు కుప్ప పోసి , మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతూ ఉంది. యువరాజు ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమ ధర్మ రాజుకి నాణేల కాంతి , దీపాల కాంతిలో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగివెళ్ళిపోతాడు. తెలివైన ఆ యువరాజు భార్య అలా ధన త్రయోదశి రోజున తన భర్త ప్రాణాలని కాపాడుగోగలిగింది. అందువల్ల ఆరోజు నుండీ ధన త్రయోదశిరోజున రాత్రంతా యమ ధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు.


4. అమృత మధనం కథ -


దేవ దానవులు క్షీర సాగర మధనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీర సాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధన త్రయోదశి నిష్టతో జరుపుకుంటే దీర్ఘాయుష్షు లభిస్తుంది.


5.  కుబేరుని   పూజ - యక్షుడైన కుబేరుడు సంపదకి అధిపతి.  ఈ రోజున కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా మీ సంపద కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా.


6. పార్వతీ దేవి కధ - ధన త్రయోదశిని అల్లుకుని ఉన్న మరోక కదేమిటంటే తన పతితో పాచికలాడిన పార్వతీ దేవి మీద పరమ శివుడు విజయం సాధించాడు. ఈరోజున కనుక పాచికలూ , జూదం లాంటివి ఆడితే మీ సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం.

ఇప్పుడు తెలిసిందా ధన త్రయోదశి యొక్క విశిష్టత ?  దీపావళి ముందు వచ్చే ఈ పండుగ భారత దేశంలో చాలా ముఖ్యమయినది. ఈరోజున కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒక వేళ అవి కొనలేక పోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీ దేవినీ, గణపతినీ పూజిస్తారు.

సంప్రదాయం అనుసరించే వారికోసం......,

 సంప్రదాయం అనుసరించే వారికోసం......,



పెద్దలు ఊరికే కారణం లేకుండా ఏదీ చెప్పలేరు కనుక అందరం ఆచరించవలసిందే....

1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు


2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.


3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.


4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.


5) నూనె, ఉప్పు, చేతికి ఇవ్వరాదు.


6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.


7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.


8) మంచం మీద కూర్చుని తినకూడదు.


9) తలుపుల మీద బట్టలు వేయకూడదు."


10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి. (మనదేశ సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుంది.)


11) నుదుట కుంకుమ తప్పక ధరించవలెను


12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.


13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.


14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.


15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.


16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.


17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.


18) మధ్యాహ్న సమయంలో ఎవరు వచ్చినా తప్పకుండా భోజనం చేయించవలెను.


19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.


20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.


21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.


22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.


23) ఆడవాళ్లు శిరోజాలు విరబోసుకోరాదు


24) ఆదివారం అన్నదమ్ములు ఉన్నటువంటి అక్కా-చెల్లెలు తలస్నానం చేయరాదు


25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను


26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.


27) సంధ్య (సాయంకాల) సమయం లో పడుకోకూడదు.


 ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు.


చెప్పడం చెయ్యడం మన విధి. ఆ పైన వారి ఇష్టం 


ఇది మన భారతీయుల  సత్సాంప్రదాయాలు

నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!

 నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!



జాతకం లో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రతికూలత అధికంగా వున్నప్పుడు దానాదులు చేయాలి. 


1) మాములుగా అయితే ప్రతిరోజూ నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేయాలి. 


2) నవగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. 


3) ఇతరులు ముట్టించిన దీపం తో మనదీపాన్ని వెలిగించరాదు. 


4) శని గ్రహానికి శనివారం మాత్రమే 9 ప్రదక్షిణలు చేయాలి. 


5) మాములు రోజుల్లో నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయకూడదు. 


6)శని గ్రహానికి ఎదురుగ నిలబడి నమస్కరించ కూడదు. 


7) గ్రహాల పై మాములు సమయాల్లో పసుపు కుంకుమలు, నవధాన్యాలు వేయకూడదు.


8) నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విగ్రహాలను తాకకూడదు. 


9) నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్ళు కడగడం చేయరాదు. 


10) ఒక్క శని గ్రహానికి అభిషేకం తర్వాత మాత్రం స్నానము చేయాలి. 


11) ఏ గ్రహానికి మనము గ్రహ ధాన్యాన్ని దానము చేస్తామో ఆ ధాన్యాన్ని ఆరు నెలల వరకు తినకూడదు. ( ముక్యంగా కుజ, శని, రాహు, కేతు, బుధ గ్రహాలకు ) 


12) నవగ్రహాలలో పాటుగా మిగితా దేవతలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయకూడదు. 


13) ఇతరులతో మాట్లాడుతూ, ఇతరులను చూస్తూ గ్రహ ప్రదక్షిణ చేయరాదు. 


14) నవగ్రహ ప్రదక్షిణ సమయం లో నవగ్రహ స్తోత్రం చదవడం ఉత్తమం. 


' ఆదిత్యాయచ సోమాయ 

మంగళాయ బుధాయచ 

గురు శుక్ర శనిభ్యశ్చ 

రాహవే కేతవే నమః '.


15) నవగ్రహాలకు ఇచ్చే దానం లో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి కండించిన ధాన్యం ( పప్పులు, పిండి ) ఇవ్వరాదు. 


16) బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయరాదు. 


17) గ్రహానుకూలం కోసం చేసే దానము కూడా తప్పకుండ సద్బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి, అన్యులకు గ్రహదానం చేయకూడదు.


ఓం నమః శివాయ 

సర్వేజనా సుఖినోభావంతు

RECENT POST

జాతకంలో 12 రకాల కాలసర్ప యోగాలు - పోరాటాలను అధిగమించి విజయం సాధించే సూత్రం............!! ​మనలో చాలా మంది 'కాలసర్ప దోషం' అనే పదాన్ని వ...

POPULAR POSTS