నవగ్రహాలకు ప్రదక్షణ, దానాదులు!!
జాతకం లో ఏ గ్రహం అనుకూలంగా లేదో ఆయా గ్రహాలకు ఆయా రోజుల్లో ప్రదక్షిణ చేయడం ఉత్తమం. ప్రతికూలత అధికంగా వున్నప్పుడు దానాదులు చేయాలి.
1) మాములుగా అయితే ప్రతిరోజూ నవగ్రహాలకు ఒక్క ప్రదక్షిణ మాత్రమే చేయాలి.
2) నవగ్రహాలకు సాష్టాంగ నమస్కారం చేయకూడదు.
3) ఇతరులు ముట్టించిన దీపం తో మనదీపాన్ని వెలిగించరాదు.
4) శని గ్రహానికి శనివారం మాత్రమే 9 ప్రదక్షిణలు చేయాలి.
5) మాములు రోజుల్లో నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయకూడదు.
6)శని గ్రహానికి ఎదురుగ నిలబడి నమస్కరించ కూడదు.
7) గ్రహాల పై మాములు సమయాల్లో పసుపు కుంకుమలు, నవధాన్యాలు వేయకూడదు.
8) నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు విగ్రహాలను తాకకూడదు.
9) నవగ్రహ ప్రదక్షిణ అనంతరం కాళ్ళు కడగడం చేయరాదు.
10) ఒక్క శని గ్రహానికి అభిషేకం తర్వాత మాత్రం స్నానము చేయాలి.
11) ఏ గ్రహానికి మనము గ్రహ ధాన్యాన్ని దానము చేస్తామో ఆ ధాన్యాన్ని ఆరు నెలల వరకు తినకూడదు. ( ముక్యంగా కుజ, శని, రాహు, కేతు, బుధ గ్రహాలకు )
12) నవగ్రహాలలో పాటుగా మిగితా దేవతలకు కలిపి ఒకేసారి ప్రదక్షిణ చేయకూడదు.
13) ఇతరులతో మాట్లాడుతూ, ఇతరులను చూస్తూ గ్రహ ప్రదక్షిణ చేయరాదు.
14) నవగ్రహ ప్రదక్షిణ సమయం లో నవగ్రహ స్తోత్రం చదవడం ఉత్తమం.
' ఆదిత్యాయచ సోమాయ
మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ
రాహవే కేతవే నమః '.
15) నవగ్రహాలకు ఇచ్చే దానం లో పూర్ణ ధాన్యాన్ని మాత్రమే దానంగా ఇవ్వాలి కండించిన ధాన్యం ( పప్పులు, పిండి ) ఇవ్వరాదు.
16) బ్రాహ్మణ సహాయం లేకుండా గ్రహ పూజలు చేయరాదు.
17) గ్రహానుకూలం కోసం చేసే దానము కూడా తప్పకుండ సద్బ్రాహ్మణులకు మాత్రమే చేయాలి, అన్యులకు గ్రహదానం చేయకూడదు.
ఓం నమః శివాయ
సర్వేజనా సుఖినోభావంతు
No comments:
Post a Comment