Friday, March 18, 2022

అపార్ట్‌మెంట్స్‌- వాస్తు

 అపార్ట్‌మెంట్స్‌- వాస్తు 



పట్టణాల్లో, నగరాల్లో అధిక మొత్తములో కనిపించేవి అపార్టుమెంట్సే. ఇటీవల అపార్టుమెంట్స్ నిర్మాణం మరింతా పెరిగింది. భుమి మీద ప్రతి నిర్మాణానికి వాస్తు పనిచేస్తూ వుంటుంది. కాబట్టి అపార్టుమెంట్స్ కు కూడా వాస్తు పని చేస్తుందని చెప్పవచ్చు. మొదట అపార్టుమెంటు కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టాలి. అపార్టుమెంట్స్ - కాంప్లెక్సు వాస్తుకు సరిపెట్టడంలో విడిగృహలకు ఏ విధమైన వాస్తు విషయాలు వర్తిస్తామో అవే విషయాలు వర్తిస్తాయి. తరువాత కాంప్లెక్సులోని ప్రతి అపార్టుమెంట్ ను వాస్తుకు సరిపెట్టాలి. 


అపార్టుమెంట్ వాస్తు  ఎత్తు-పల్లాలు, ద్వారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి. సింహద్వారపు నడక ఖచ్చితంగా ఉచ్చములో వుండలేగాని.. నీచములో వుండకూడదు. అపార్టుమెంట్ ప్లాన్సును అనుసరించి కొన్నిటిని సింహద్వారాము ఉచ్చములో వుంటే వాటిపక్క వాటికో, ఎదుటి వాటికో, నీచములో సింహద్వారము ఉంటూ వుంటుంది. ఈ విధంగా కాకుండా అన్ని అపార్టుమెంట్స్ కు ఉచ్చములో సింహద్వారము వుండునట్లు ఏర్పాటు చేయాలి. ఈ విధంగా ఏర్పాటు చేయడానికి స్థలాభావం, సాంకేతిక కారణాలు అడ్డురావచ్చు. అయితే ఇంజనీరు, వాస్తుశాస్ర్తవేత్త కలిసి ప్లాను తయారుచేస్తే పై సమస్యలు సులభంగా సరిచేయవచ్చు.


ఒక్కో అపార్టుమెంట్ కాంప్లక్సు ఒక్కో విధంగా వుంటుంది. కాబట్టి అన్నింటిని గురించి వివరించి చెప్పడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. అపార్టుమెంట్ ఎన్నో అంతస్తులో వున్నా ప్రతి గదికి ఉచ్చములో ద్వారాలు వుండాలి. కాంప్లెక్సుకు దక్షిణ, పశ్చిమాలలో తిరగడానికి వీలైనంత క్యాబిన్ వదలటం జరుగుతూ వుంది. ఈ స్థలం దక్షణం, పశ్చిమం ఖాళీ స్థలంగా పనిచేస్తూ వుంటుంది. అంతే కాకుండా ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండునట్లు ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణ, పశ్చిమాల క్యాబిన్ లు పల్లంగా కాకుండా ఇంటిఫ్లోరింగ్ తో సమానంగా గాని, అంతకన్నా ఎత్తుగా గాని వుండాలి. 

కాంప్లెక్సులోని ఉత్తర, తూర్పు భాగాల అంపార్టుమెంట్స్ తూర్పు ఉత్తరాలలో క్యాబిన్ వసతి వుండటం లాభదాయకం. ఈ క్యాబిన్ అపార్టుమెంట్ ఫ్లోరింగ్ లెవెల్ కన్నా పల్లంగా వుండాలే గాని ఎత్తుగా వుండకూడదు. ఈ క్యాబిన్ ఈశాన్యం తగ్గటంకాని, తెగిపోవటంకాని జరుగకూడదు. 


ప్రతి అపార్టుమెంట్ కాంప్లెక్సులోని గ్రౌండ్ ఫ్లోర్ ను పార్కింగ్ స్థలంగా ఉపయోగించడం ఉత్తమమైనదే. అపార్టుమెంటు కాంప్లెక్సు గ్రౌండ్ ఫ్లోర్ లో దక్షిణ భాగంలో గాని, పశ్చిమ భాగంలోగాని ఏవైనా నిర్మాణాలుచేసి ఉత్తర, తూర్పు భాగాలను పార్కింగ్ స్ధలంగా వాడుకోవటం సర్వోత్తమమైనది. వాస్తు శాస్ర్తరీత్య అపార్టుమెంట్స్ నిర్మించుకొంటే.. విడిగృహములలో ఏ విధమైన వాస్తు ఫలితాలు అనుభవిస్తారో.. వాటికి తీసిపోకుండా ఫలితాలు పొందే అవకాశమున్నది.

No comments:

Post a Comment

RECENT POST

నవ విధ శాంతులు

నవ విధ శాంతులు కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు. 1. తైలావలోకనం:  కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పో...

POPULAR POSTS